గిరిజన యువతకు శిక్షణతో ఉపాధి | - | Sakshi
Sakshi News home page

గిరిజన యువతకు శిక్షణతో ఉపాధి

Feb 28 2026 7:26 AM | Updated on Feb 28 2026 7:26 AM

గిరిజన యువతకు శిక్షణతో ఉపాధి

గిరిజన యువతకు శిక్షణతో ఉపాధి

భద్రాచలం: నిరుద్యోగ గిరిజన యువత ఐటీడీఏ ద్వారా అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాలని ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి బి.రాహుల్‌ అన్నారు. ఐటీడీఏలోని వైటీసీ ద్వారా నిరుద్యోగ గిరిజన యువతకు 60 రోజులపాటు డ్రోన్‌ సర్వీస్‌, ఎలక్ట్రీషియన్‌, డేటా ఎంట్రీపై శిక్షణఇచ్చారు. శిక్షణ పూర్తి కాగా, గురువారం పీఓ తన చాంబర్‌లో సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ అధునాతన ట్రెండ్‌కు తగినట్లుగా డ్రోన్లను వ్యవసాయ రంగంలో సైతం ఉపయోగించొచ్చని సూచించారు. డ్రోన్‌, డాటా ఎంట్రీ శిక్షణ పొందిన 15 మందికి భువనగిరి ఆరాధ్య ప్రైవేట్‌ లిమిటెడ్‌, గుంటూరు ఎడిలిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, హైదరాబాద్‌లోని రైట్‌ ఇన్ఫర్మేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ఉపాధి అవకాశాలు రాగా, పీఓ అభినందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు డేవిడ్‌ రాజ్‌, సైదులు, రాంబాబు, హరికృష్ణ, గోపీనాథ్‌, సులోచన, అరుణ, రాహుల్‌, సమ్మయ్య పాల్గొన్నారు.

ఐటీడీఏ పీఓ రాహుల్‌

Advertisement
 
Advertisement
Advertisement