ఉద్యోగులకు పీఎంఈ పరీక్షలు నిర్వహించాలి
కొత్తగూడెంఅర్బన్: అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రమాణాలను అనుసరించి సింగరేణిలోని ఉద్యోగులకు పీఎంఈ పరీక్షలు నిర్వహించాలని సింగరేణి డైరెక్టర్ (పీపీ) కె.వెంకటేశ్వర్లు తెలిపారు. డీజీఎంఎస్ (డైరెక్టరేట్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ) సహకారంతో శుక్రవారం రెండో రోజు జోనల్ వర్క్‌షాప్‌లో భాగంగా ఓహెచ్‌ఎస్ వైద్యులకు బొగ్గు గనుల్లో పనిచేసే ఉద్యోగులకు చేసే రేడియోగ్రాఫ్ క్లాసిఫికేషన్‌పై ఇల్లెందు క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమం ముగిసింది. సీఎంఓ ఆర్.కిరణ్‌రాజ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కె.వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఉద్యోగులందరికీ పీఎంఈ పరీక్షలు నిర్వహించడమే కాకుండా పని ప్రదేశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాలని చెప్పారు. అనంతరం శిక్షణలో పాల్గొన్న వైద్యులకు సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో కౌశిక్‌సర్కార్, కె.సాయిబాబు, గోపాల్‌తివారి, ఎం.ఉష, పి.రమేశ్‌బాబు పాల్గొన్నారు.


