సేంద్రియం.. సత్ఫలితం
కలెక్టర్, ఎమ్మెల్యే సందర్శన..
మూడేళ్లుగా ఆర్గానిక్ మిర్చి సాగు నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్న ఆదర్శ రైతు మంత్రులు, కలెక్టర్‌ల నుంచి ప్రశంసలు
సామాజిక స్పృహతో..
బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు యారం లక్ష్మీరెడ్డి గత 30 ఏళ్లుగా పత్తి, వరి సాగు చేస్తున్నాడు. పంటల సాగులో రసాయనిక ఎరువులు, పురుగుమందులను ఎక్కువగా వినియోగిస్తున్న నేపథ్యాన వరిలో ఐదారు సార్లు కొట్టిన పురుగు మందు బియ్యాన్ని ఎలా తినాలని ఏడేళ్ల క్రితమే పత్తి, వరి సాగు తగ్గించి బొప్పాయి సాగు ప్రారంభించాడు. తొలుత ఇబ్బందులు ఎదురైనా సేంద్రియ విధానాలతో బొప్పాయి కాయ సైజులో పెద్దదిగా, రుచిలో మేటిగా అందరినీ ఆకర్షించింది. దీంతో ముంబై, పుణే నుంచి వ్యాపారస్తులు స్వయంగా ఇక్కడకు వచ్చి కొనుగోలు చేస్తుండడం విశేషం. ఈ క్రమంలోనే పుచ్చసాగు చేపట్టగా.. అది కూడా సత్ఫలితాలను ఇచ్చింది. దీంతో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లక్ష్మీరెడ్డికి ఫోన్ చేసి సాగు విధానాలపై ఆరా తీశారు.
మిర్చి సవాల్..
మూడేళ్లుగా మిర్చిసాగు రైతులకు సవాల్‌గా మారింది. పంటను నల్లి తామర ఆశించగా.. పురుగుమందులు వినియోగం పెంచినా ఫలితం లేక మార్కెట్‌లో ధరలు కూడా పతనమవుతుండడంతో చాలామంది మిర్చి సాగు మానేశారు. ఈ తరుణాన రైతు లక్ష్మీరెడ్డి సేంద్రియ పద్ధతిలో చీడపీడల నివారణకు వేపనూనె, జీవామృతంతో పాటు పొన్నుస్వామి ఆర్గానిక్ మందులను వినియోగించి మిర్చి సాగు చేపట్టాడు. మిగతా రైతుల తోటలు నల్లితామరతో ఎండిపోయినా లక్ష్మీరెడ్డి మిర్చి తోట పచ్చగా ఆరోగ్యంగా ఉండడంతో నాలుగెకరాల్లో పండిన మిర్చిని స్థానికులే కొనుగోలు చేశారు. ఏటా సాగు చేస్తుండగా మండల వాసులు మార్కెట్ ధర కంటే ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేశారు.
ఇటీవల వరకు పనిచేసిన కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మిర్చి తోటలను పరిశీలించి అభినందించారు. లక్ష్మీరెడ్డిని ఆదర్శంగా తీసుకుని మిగతా రైతులు కూడా సేంద్రియ విధానాలను పాటించాలని సూచించారు. ఆర్గానిక్ మందులు ఇచ్చిన తమిళనాడుకు చెందిన పొన్నుస్వామి కూడా లక్ష్మీరెడ్డి తోటను పరిశీలించి అభినందించారు. అదే గ్రామానికి చెందిన రైతులు దారం వెంకటేశ్వరరెడ్డి, పోతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఉపేందర్ కూడా సేంద్రియ సాగు విధానాలే పాటిస్తున్నారు.
అధిక దిగుబడి సాధించాలంటే పంటల సాగులో రసాయనిక ఎరువులు, పురుగు మందులను విపరీతంగా వినియోగించాల్సి వస్తోంది. దీంతో ఒకింత దిగుబడి పెరిగినా.. పెట్టుబడి భారం అదేరీతిలో ఉంటుంది. ఈక్రమాన వ్యవసాయ ఉత్పత్తులపై విషప్రభావం పెరిగి ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. ఈ నేపథ్యాన ఓ రైతు సేంద్రియ సాగుపై దృష్టి సారించి సత్ఫలితాలు పొందడంతో మరికొందరు రైతులు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
– బూర్గంపాడు
సాగులో కొత్త ఒరవడి..


