దుమ్ముగూడెం:మండల పరిధిలోని గౌ రారం గ్రామపంచాయతీలో మద్యం విక్రయించొద్దని గ్రామసభలో తీర్మానించారు. ఎవరైనా మద్యం విక్రయిస్తే రూ. లక్ష జరిమానా విధించాలని నిర్ణయించారు. శనివారం సర్పంచ్ శ్యామల రవి వర్మ అధ్యక్షతన ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. మూడు అంశాలు విద్యపై అవగాహన, మత్తు పదార్థాల నిరోధంపై అవగాహన, మద్యపాన నిషేధంపై చర్చించారు. గ్రామ మహిళలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకు న్న తర్వాత మద్యపాన నిషేధం పాటించాలని నిర్ణయించినట్లు పాలకవర్గ సభ్యులు తెలి పారు. గ్రామసభకు ముఖ్య అతిథిగా హాజరైన సీఐ వెంకట ప్పయ్య మత్తు పదార్థాలవల్ల కలిగే నష్టాలపై అవగాహ న కల్పించారు. అనంతరం సీఐని పంచాయతీ పాలకవర్గం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సున్నం రమేష్, పంచాయతీ కార్యదర్శి స్రవంతి, సోడె శ్రీనివాసరావు, ముర్రం వీరభద్రం, కల్లూరి ఆదినారాయణ, సోందె నర్సింహారావు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం


