అశ్వారావుపేటరూరల్: అగ్ని ప్రమాదంలో పూరిల్లు కాలిపోయిన ఘటన మండలంలోని కోయరంగాపురంలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కారం మల్లయ్య, ఆయన భార్య కూలీ పనులకు వెళ్లాక విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. దీంతో ఇంట్లోని సామగ్రితో పాటు నిత్యావసరాలు, బీరువా, పట్టాదారు పాసుపుస్తకాలు, కుమార్తె సర్టిఫికెట్లు కాలిబూడిదయ్యాయి. సమచారం అందుకున్న అశ్వారావుపేట అగ్నిమాపకశాఖ సిబ్బంది వెళ్లి మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే రూ.3లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు రూ.30వేల విలువైన నిత్యావసరాలు, దుస్తులు, వంట సామగ్రి అందించారు. మాజీ జెడ్పీటీసీ సభ్యురాలి భర్త చిన్నంశెట్టి నరసింహారావు రూ.5వేలు, మాజీ జెడ్పీటీసీ జేకేవీ రమణారావు రూ.5వేలు అందజేశారు.


