ఈయన కొత్తగూడెం కార్పొరేషన్ 25వ వార్డు గాజులరాజం బస్తీకి చెందిన వృద్ధ దివ్యాంగుడు రామనబోయిన అశోక్. దివ్యాంగ పింఛన్ కోసం మూడేళ్లుగా ప్రజావాణిలో వినతులు ఇస్తూనే ఉన్నాడు. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో కొత్త కలెక్టర్ అయినా తన గోడు ఆలకిస్తారేమోననే ఆశతో సోమవారం మరోసారి వచ్చాడు. గతంలో ఏడుసార్లు దరఖాస్తు చేశానని, ఇప్పుడు ఎనిమిదోసారి అని చెప్పాడు. కాగా, అశోక్‌కు ఒక కాలు లేకపోవడంతో అతి కష్టంగా కలెక్టరేట్ మెట్లు ఎక్కాడు. ఇప్పటికై నా విచారణ జరిపి తనకు పెన్షన్ మంజూరు చేయాలని వేడుకుంటున్నాడు.


