సేవాలాల్‌ బోధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

సేవాలాల్‌ బోధనలు పాటించాలి

Mar 1 2026 7:48 AM | Updated on Mar 1 2026 7:48 AM

సేవాలాల్‌ బోధనలు పాటించాలి

సేవాలాల్‌ బోధనలు పాటించాలి

ఇల్లెందు: సంత్‌శ్రీ సేవాలాల్‌ మహరాజ్‌ బోధనలు పాటించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ అన్నారు. శనివారం సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి వేడుకల ముగింపు సందర్భంగా ఇల్లెందులో ర్యాలీ, సభ, భోగ్‌ భండారో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. జేకే సింగరేణి హైస్కూల్‌ గ్రౌండ్‌లో మహరాజ్‌కు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎస్పీ రోహిత్‌రాజుతో కలిసి ఆయన జ్యోతిప్రజ్వలన చేసిన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవాలాల్‌ మార్గం మానవాళి పురోభివృద్ధికి దహదపడుతుందని తెలిపారు. ఎమ్మెల్యే కనకయ్య మాట్లాడుతూ గిరిజనుల జీవన విధానం మెరుగు పర్చేందుకు సేవాలాల్‌ కృషి చేశాడని కొనియాడారు. ఎస్పీ రోహిత్‌రాజు మాట్లాడుతూ సేవాలాల్‌ను ఆదర్శంగా తీసుకుని గిరిజనులు అభివృద్ధి వైపు పయనించాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, మున్సిపల్‌ చైర్మన్‌ దొడ్డ కిరణ్‌ మిత్ర, వైస్‌ చైర్మన్‌ మార్కెట్‌ రాజు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బానోత్‌ రాంబాబు, భూక్యా నాగేశ్వరరావు, దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, సేవాలాల్‌ సేన నాయకులు ప్రేమ్‌ చంద్‌ నాయక్‌, రాజ్‌కుమార్‌, కున్సోత్‌ రాము, నాగార్జున్‌, బానోతు శారద, రోజా, బానోతు రవి నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఐటీడీఏ పీఓ రాహుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement