కన్నీరుమున్నీరుగా రోదించిన కుటుంబీకులు
మణుగూరు టౌన్: మల్లేపల్లి ఇన్‌టేక్‌వెల్ ప్రాంతంలో గల్లంతైన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు బుధవారం లభ్యమయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం... సింగరేణి పునరావాస గ్రామమైన పద్మగూడేనికి చెందిన పద్దం ప్రసాద్(35) కొత్తగూడెం పీవీ కే–5 గనిలో జనరల్ అసిస్టెంట్‌గా, గుండ్ల సింగారం గ్రామానికి చెందిన గుండి నాగేశ్వరరావు(40) వాల్వో ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరు మరి కొందరు స్నేహితులతో కలిసి మంగళవారం హోలీ ఆడాక స్నానం చేసేందుకు వెళ్లారు. వారిలో ఇద్దరు యువకులు నీటిలో మునిగిపోతుండగా, వారిని కాపాడే ప్రయత్నంలో ప్రసాద్, నాగేశ్వరరావు గల్లంతయ్యారు. గాలింపు చేపట్టగా మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో ప్రసాద్‌కు భార్య, ముగ్గురు పిల్లలు, నాగేశ్వరరావుకు భార్య, పిల్లలు ఉన్నారు. మృతదేహాల వద్ద కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టాటా ఏస్ వాహనం బోల్తా
దుమ్ముగూడెం: సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లోని చంద్రుగూడెంలో మిర్చి కూలీలతో మండలానికి వస్తున్న టాటా ఏస్ వాహనం బోల్తా పడి పలువురికి గాయాలయ్యాయి. బుధవారం ఛత్తీస్‌గఢ్ నుంచి 20 మంది కూలీలతో వస్తున్న వాహనం చంద్రుగూడెం దగ్గర బోల్తా పడింది. దీంతో గాయపడ్డ వారిని ములకపాడు వైద్యశాలకు తరలించారు. డాక్టర్ రుక్మాకర్ రెడ్డి క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. తీవ్ర గాయాలపాలైన ముగ్గురిని 108 ద్వారా భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు.
నాటుసారా స్వాధీనం
భద్రాచలంటౌన్: అక్రమంగా తరలిస్తున్న నాటుసారాతోపాటు ఓ వ్యక్తిని జిల్లా ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఎకై ్సజ్ ఎస్సై గౌతమ్ కథనం ప్రకారం.. బుధవారం భద్రాచలం పట్టణంలోని కొత్త మార్కెట్, భగవాన్ దాస్ కాలనీ ఏరియాలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బైక్‌పై తరలిస్తున్న 16 లీటర్ల నాటుసారాను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సారా తరలిస్తున్న భగవాన్ దాస్ కాలనీకి చెందిన వేముల వెంకన్నపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.


