చండ్రుగొండ: చండ్రుగొండలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ఉదంతం ఆలస్యంగా బుధవారం వెలుగుచూసింది. రైతులు, సోదరులు మరకాల దుర్గారెడ్డి, మరకాల కృష్ణారెడ్డి తమ చేలో పత్తి సాగు చేశారు. పంట చేను మధ్యలో వేపచెట్టు కింద కాలభైరవ విగ్రహం ఉంది. విగ్రహాన్ని పక్కకు జరిపిన గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద ఎత్తున తవ్వకాలు చేశా రు. అనంతరం గోతిని పూడ్చేశారు. కొంతకా లం క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కాలభైవుడి విగ్రహాన్ని వెలి కిల పడేశారు. క్షుద్రపూజలు జరిపిన ఆనవాళ్లు ఉన్నాయి. ఇది గమనించిన రైతులు భయంకంపితులయ్యారు. శ్రీనగర్‌కాలనీకి (ఉత్తరపంటు కాలనీ) సమీపంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి నిందితులను శిక్షించాలని బాధిత రైతులు కోరుతున్నారు.
ఇసుక ట్రాక్టర్లు సీజ్
దుమ్ముగూడెం : మండలంలో అక్రమంగా ఇసుక తోలుతున్న ఆరు ట్రాక్టర్లను బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీతారాంపురం వద్ద గోదావరి నది నుంచి ఇసుక తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని, స్టేషన్‌కు తరలించి సీజ్ చేశారు.
బోనకల్ లో..
బోనకల్: మండలంలోని బ్రాహ్మణపల్లి సమీపాన వైరా నది నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు బుధవారం సీజ్ చేశారు. చిన్నమండవకు చెందిన రెండు ఇసుక ట్రాక్టర్లతో బ్రాహ్మణపల్లి వద్ద వైరా నదిలోకి దిగి ఇసుకను లోడ్ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సిబ్బంది అక్కడకు చేరుకుని రెండు ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఈమేరకు రెండింటి యజమానులు, డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పొదిల వెంకన్న తెలిపారు.
రోడ్డుప్రమాదంలో
గుర్తుతెలియని వ్యక్తి మృతి
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలం తాళ్లమడలో బుధవారం తెల్లవారుజామున రహదారి వెంట నడిచి వెళ్తున్న గుర్తుతెలియని వ్యక్తిని వాహనం ఢీకొట్టడంతో అక్కడి డికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వచ్చేసరికి సదరు వ్యక్తి మృతదేహం నుజ్జునుజ్జయిందని గుర్తించారు. దీంతో పోలీసులు మరో వాహనంలో మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతుడి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఉరి వేసుకుని
వ్యక్తి ఆత్మహత్య
సత్తుపల్లిరూరల్: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సత్తుపల్లి వెంగళరావునగర్ కాలనీకి చెందిన కొల్లిపర మల్లికార్జున్(25) లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా కుటుంబ కలహాలతో మనస్థాపం చెందిన ఆయన బుధవారం ఇంట్లో ఎవరురూలేని సమయాన ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మల్లికార్జున్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉండగా, కుటుంబీకుల ఫిర్యాదుతో సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
మనస్తాపంతో మహిళ..
కొణిజర్ల: భర్త, కుమారుడు మద్యానికి బానిసలై చెప్పినా వినడం లేదన్న మనస్తాపంతో ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుది. కొణిజర్ల ఎస్సై జి.సూరజ్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తనికెళ్లకు చెందిన నంద్యాల లక్ష్మి(50) పెద్ద కుమారుడు ఎనిమిది నెలల క్రితం మృతి చెందాడు. ఆమె భర్త వెంకటేశ్వర్లు, చిన్నకుమారుడు మద్యానికి బానిసలై ఎంత చెప్పినా మానడం లేదు. దీంతో మనస్తాపంతో ఉంటున్న లక్ష్మి మంగళవారం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. ఈక్రమాన బుధవారం ఓ వెంచర్ విగతజీవిగా కనిపించడం, పక్కనే పురుగుల మందు డబ్బా ఉండడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చరీకి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
వైన్ షాపులో
బీరు సీసాతో దాడి
పాల్వంచ: వైన్‌షాపులో మద్యం తాగి గోల చేస్తున్నవారిని వారించినందుకు గొడవ పడి బీరు సీసాతో తలపగుల గొట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పాత సురారానికి చెందిన కేటీపీఎస్ ఆర్టిజన్ బోడా అశోక్‌కుమార్ బుధవారం రాత్రి అంబేద్కర్ సెంటర్‌లోని విజయదుర్గ వైన్స్‌లో మద్యం తాగుతున్నాడు. అక్కడ నలుగురు వ్యక్తులు బీరు సీసాలు పగులగొట్టి గోల చేస్తున్నారు. ఈ క్రమంలో ఎందుకు గోల చేస్తున్నారని ప్రశ్నించగా.. అసభ్యపదజాలంతో దూషించి బీరు సీసాతో తలపై కొట్టి పరారయ్యారు. దీంతో అశోక్ కుమార్‌కు గాయమైంది. దాడి చేసిన వెంగళరావు కాలనీ, రేగళ్ల ప్రాంతాలకు చెందిన లకావత్ సోమన్న, బానోత్ హరి, పవన్, సోనులపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


