పాల్వంచ: మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసం అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మంగళవారం పట్టణంలోని నటరాజ్ సెంటర్ జమ మసీద్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపవాస దీక్ష విరమించిన ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ఇఫ్తార్ విందు కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతా భావాన్ని పెంచుతాయన్నారు. ఉపవాస దీక్షలు కుటుంబంతో పాటు సమాజంలో శాంతి, ప్రేమ, సోదరభావం, దాతృత్వం పెంపునకు దోహాదపడతాయని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్ పాషా, కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, నాయకులు ముత్యాల విశ్వనాథం, మైనార్టీ నాయకులు నయీమ్ ఖురేషి, ఫయాజ్, అభీద్, అక్బర్, మస్తాన్, గౌస్, కుర్షీద్ తదితరులు పాల్గొన్నారు.


