పాల్వంచ: నిత్యం విధుల్లో నిమగ్నమయ్యే ఉద్యోగులకు క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని కేటీపీఎస్ 5, 6 దశల సీఈ ఎం.ప్రభాకర్ రావు అన్నారు. గురువారం స్థానిక కేటీపీఎస్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడా మైదానంలో టీజీ జెన్‌కో ఇంటర్ ప్రాజెక్ట్ టేబుల్ టెన్నిస్, బాల్ బ్యాడ్మింటర్ టోర్నీని ఆయన ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలకు కేటీపీఎస్ 5, 6, 7 దశలతో పాటు బీటీపీఎస్, శ్రీశైలం, పులిచింతల, కేటీపీపీ, విద్యుత్‌సౌధ, వైటీపీఎస్‌లకు చెందిన క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్న సీఈ మాట్లాడుతూ.. క్రీడలతో ఉద్యోగుల మధ్య ఐకమత్యం పెరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌ఈలు ఎస్.యుగపతి, జి.రాజ్‌కుమార్, డివైసీసీఏ నాగరాజు, స్పోర్ట్స్ ఆఫీసర్ లోహిత్ ఆనంద్, సెక్రటరీలు టి.మహేష్, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.


