గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి | - | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి

Feb 27 2026 7:32 AM | Updated on Feb 27 2026 7:32 AM

గ్రామాల అభివృద్ధికి  పాటుపడాలి

గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి

పీఆర్‌ డిప్యూటీ కమిషనర్‌ విద్యాలత

చింతకాని: నూతనంగా ఎన్నికై న వార్డుసభ్యులు గ్రామాల అభివృద్ధిలో పాలుపంచుకోవాలని పంచాయతీరాజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఎం.విద్యాలత సూచించారు. మండల పరిఽషత్‌ కార్యాలయంలో వార్డుసభ్యుల శిక్షణ శిబిరాన్ని గురువారం సందర్శించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. వార్డుల్లో సమస్యలను గుర్తిస్తూ పరిష్కారంలో వార్డుసభ్యుల పాత్ర కీలకమైందన్నారు. అలాగే, విధులు, బాధ్యతలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు, ఎంపీడీఓ చుంచు శ్రీనివాసరావు, ఎంపీఓ పర్వీన్‌ ఖైసర్‌ పాల్గొన్నారు.

చెల్లని చెక్కు కేసులో

ఏడాది జైలుశిక్ష

ఖమ్మం లీగల్‌: అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో ఓ వ్యక్తికి ఏడాది జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందుప్రియ గురువారం తీర్పు చెప్పారు. ఖమ్మం రోటరీనగర్‌కు చెందిన తేజావత్‌ రవికుమార్‌ వద్ద పెనుబల్లి మండలం లింగగూడెంకు చెందిన చీకటి వెంకటేశ్వరనాథ్‌ బెనర్జీ 2019 అక్టోబర్‌లో రూ.25లక్షల అప్పు తీసుకున్నాడు. ఆ తర్వాత 2021 ఏప్రిల్‌లో రూ.27లక్షలకు గాను మూడు చెక్కులు ఇచ్చిన ఆయన ఖాతాలో నగదు లేక తిరస్కరణకు గురయ్యాడు. దీంతో రవికుమార్‌ తన న్యాయవాది ద్వారా లీగల్‌ నోటీస్‌ జారీ చేసి కోర్టులో ప్రైవేట్‌ కేసు దాఖలు చేశాడు. విచారణ అనంతరం వెంకటేశ్వరనాథ్‌కు జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.27లక్షలు చెల్లించాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు.

బిల్డర్‌ అదృశ్యంపై ఫిర్యాదు

ఖమ్మం అర్బన్‌: ఇంటి నుంచి వెళ్లిన ఓ బిల్డర్‌ తిరిగి రాకపోవడంతో గురువారం ఖమ్మం అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఖమ్మం విద్యానగర్‌ కాలనీకి చెందిన కొండపర్తి సురేష్‌ బిల్డర్‌గా వ్యవహరిస్తున్నాడు.బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోగా, ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆయన తండ్రి నారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ భానుప్రకాశ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement