గుండాల: మండలంలోని యాపలగడ్డ మెట్టినింట్లో కొలువైన సమ్మక్క, ఆమె పతిదేవుడు పగిడిద్దరాజుతో పాటు రోళ్లగడ్డలో దూలుగొండ ముసలమ్మ తల్లికి భక్తులు శుక్రవారం మొక్కులు సమర్పించారు. గురువారం రాత్రి గంగా స్నానం చేయించి గద్దెనెక్కించారు. ఆపై శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఆలయ పూజారులు, వడ్డెలు అర్రెం వంశీయులు ఆచార సంప్రదాయాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, సెలపయ్యను నైవేద్యంగా సమర్పించగా, పెద్దసంఖ్యలో భక్తులు దర్శించకుని మొక్కులు చెల్లించుకున్నారు. సీఐ తిరుపతి, ఎస్‌ఐ సైదా రవూఫ్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. అరెం, ఈసం వంశీయులు పాల్గొన్నారు.


