నేడు ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ
పణాజి: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన 77 అడుగుల ఎత్తయిన శ్రీరాముడి కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ శుక్రవారం గోవాలో ఆవిష్కరించనున్నారు. దక్షిణ గోవా జిల్లాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠ్ ప్రాంగణంలో దీనిని ఏర్పాటు చేశారు.
మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరిస్తారని మఠం కమిటీ చైర్మన్ శ్రీనివాస్ డెంపో చెప్పారు. గుజరాత్‌లో స్టాట్యూ ఆఫ్ యూనిటీ రూపశిల్పి రామ్ సుతార్ ఈ విగ్రహాన్ని మలిచారని తెలిపారు. మఠం ఏర్పాటై 550 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభిస్తారన్నారు.


