న్యూఢిల్లీ: అంధుల టి20 ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టు సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఫైనల్ గెలిచిన రోజు ‘ఎక్స్’ వేదికగా అభినందించిన మోదీ... గురువారం విజేత జట్టు సభ్యుల్ని ఆతీ్మయంగా పలకరించారు. ‘చరిత్ర సృష్టించిన భారత అంధుల జట్టుకు అభినందనలు. ఆరంభ మెగా ఈవెంట్‌లో టోర్నీ మొత్తం అజేయంగా నిలిచారు. మీ కఠోర శ్రమకు, జట్టు సమష్టి కష్టానికి ఈ ట్రోఫీ ఓ నిదర్శనం. ప్రతీ ఒక్కరు అంకితభావంతో ఆడారు.
మైదానంలో నిబద్ధతను చూపారు’ అని మోదీ ఈ సందర్భంగా క్రికెటర్ల ప్రతిభను కొనియాడారు. యువతరానికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అది్వతీయ విజయాలెన్నో సాధించాలని ఆకాంక్షించారు. ఇటీవల కొలంబో వేదికగా ఆరు జట్లతో జరిగిన ఈ మెగా ఈవెంట్ ఫైనల్లో భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో నేపాల్‌పై గెలిచింది.


