breaking news
blind T20 World Cup
-
అంధుల మహిళల క్రికెట్ జట్టుకు సచిన్ అభినందన
ముంబై: అంధుల మహిళల టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టును క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభినందించాడు. తొలిసారి నిర్వహించిన ఈ మెగాటోర్నీలో భారత జట్టు అజేయంగా ట్రోఫీ చేజిక్కించుకుంది. తాజాగా వరల్డ్‌కప్ నెగ్గిన భారత జట్టు... మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సచిన్‌ను కలిసింది. ఈ సందర్భంగా ప్రపంచకప్‌లో మన అమ్మాయిలు చూపిన ప్రతిభాపాటవాలను మాస్టర్ బ్లాస్టర్ కొనియాడాడని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ‘కఠోర శ్రమ, అకుంఠిత దీక్షతోనే మన జట్టు ప్రపంచకప్ గెలిచింది. ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు కూడా ఇదే నిలకడ కొనసాగిస్తూ... మరిన్ని విజయాలు సాధించాలి. ఈ విజయం అందరి బాధ్యతను మరింత పెంచింది. ప్రపంచ కప్ ట్రోఫీ ఎంతో మందిలో స్ఫూర్తి నింపింది’ అని సచిన్ పేర్కొన్నాడని నిర్వాహకులు తెలిపారు.వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టు కెపె్టన్ దీపిక మాట్లాడుతూ... ‘సచిన్ మాటలు మాకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. మేము మైదానంలోకి దిగిన ప్రతిసారీ ఎంతో అంకితభావం, ఆత్మవిశ్వాసంతో ఆడాం. దానికి తగ్గ ప్రతిఫలం వరల్డ్ కప్ రూపంలో దక్కింది. సచిన్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వినడంతో మా మనసు ఉప్పొంగుతోంది’ అని దీపిక పేర్కొంది. -
ఆ చూపు ప్రపంచంకప్పు దాకా..
కూతురు అంధురాలుగా పుడితే వదిలి వెళ్లిపోయే తండ్రి ఉండొచ్చుగాని తల్లి ఉండదు. అస్సాం అంధ క్రికెటర్ సిము దాస్‌ని తల్లి అంజు దాస్ ఒక్కతే ఎన్నో కష్టాలతో పెంచింది. ఫలితంగా ఇవాళ కూతురు భారత జట్టు తరఫున ప్రపంచ కప్పు సాధించిన విజేతగా నిలిచింది. ఆమెకు అస్సాం ప్రభుత్వం 10 లక్షల నగదు బహుమతి, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది. ఇదంతా ఆ తల్లి ఓర్పుకు దొరికిన ప్రతిఫలం.నవంబర్ 23, ఆదివారం రోజు అంజు దాస్ ఎప్పట్లాగే పని ముగించుకుని ఇంటికి బయలుదేరింది. ఆమె అస్సాంలోని నగావ్ జిల్లా కొతియటోలి అనే పల్లెలో వంట మనిషిగా, పని మనిషిగా జీవిస్తోంది. ఇల్లు మరికాస్త దూరంలో ఉందనగా ఊళ్లో ఉన్న కుర్రాళ్లంతా చప్పట్లతో, కేరింతలతో ఆమెకు ఎదురు వచ్చారు. ‘అక్కా. నీ కూతురు సాధించింది. మనం వరల్డ్ కప్ గెలిచాం’ అని మెచ్చుకోలుగా వాళ్లు మాట్లాడుతుంటే అంజుదాస్ కళ్ల నుంచి ధారాపాతంగా ఆనందబాష్పాలు రాలిపడ్డాయి.→ ఆమె కూతురు విజేతఅంధ మహిళా క్రికెటర్లను ప్రోత్సహించడానికి మొట్ట మొదటిసారి ‘టి 20 వరల్డ్ కప్ ఫర్ బ్లైండ్ విమెన్’ను కొలంబోలో నవంబర్ 11 నుంచి 23 తేదీల మధ్య నిర్వహించారు. అమెరికా, ఆస్ట్రేలియా సహా మన పొరుగున ఉన్న దేశాలతో కలిపి మొత్తం ఆరు దేశాలు పాల్గొన్న ఈ పోటీలో ఇండియా జట్టు అప్రతిహతంగా సాగి ఫైనల్స్‌లో నేపాల్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ జట్టులో అంజుదాస్ కూతురు సిము దాస్ ఉంది. ఇండియా గెలవడానికి టోర్నమెంట్లో మొత్తం 68 విలువైన పరుగులు చేసింది. అస్సాం మారుమూల పల్లెలో నిలువ నీడ లేని కుటుంబం నుంచి కేవలం తల్లి అందించిన ప్రోత్సాహంతో సిము దాస్ ఈ అద్భుతం సాధించింది. ఆ ప్రయాణం అంతా గుర్తుకొచ్చి అంజుదాస్ కళ్లు వర్షించాయి.→ ప్రధానే స్పందించారుఅంధ మహిళల జట్టు సభ్యులు వరల్డ్ కప్‌తో ఢిల్లీలో ప్రధానిని కలిశారు. ఆ తర్వాత అస్సాంకు సిము దాస్ చేరుకుంటే ఆమెకు ఘన స్వాగతం లభించింది. అయితే ఆ వెంటనే ఒక తెల్లవారు జామున ప్రధాని నుంచి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు ఫోన్ వచ్చింది. ‘నువ్వు సిము దాస్‌ను కలిశావా’ అని ప్రధాని అడిగారు. ‘వెంటనే కలిసి ఆమెకు కావాల్సిన సాయం చేయి’ అన్నారు. అప్పటికి బిశ్వ శర్మకు సిము దాస్ గురించి తెలియదు. ఆగమేఘాల మీద తెలుసుకుని ఆమెకు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పారు. అస్సాం గవర్నర్ ఆమెను తన నివాసానికి ఆహ్వానించి మరో లక్ష రూపాయల నజరానా ఇచ్చారు. ఇన్ని ప్రశంసలు సిము దాస్ గెలుపుకు. కాదు కాదు ఆమె తల్లి గెలుపునకు.→ తండ్రి పారిపోతే...అంజుదాస్కు వివాహం అయ్యాక మొదట కొడుకు పుట్టాడు. ఆ కొడుకు అంధుడే కాదు బధిరుడు కూడా. రెండవసారి కుమార్తె పూర్తి అంధత్వంతో పుట్టింది. కూతురు అంధత్వ వార్త విన్న వెంటనే భర్త మొత్తం కుటుంబాన్ని వదిలేసి పారిపోయాడు. వాళ్లకు ఇల్లు కూడా లేదు. ఊరిపెద్ద తన పొలంలో చిన్న గుడిసె వేసుకోమన్నాడు. ఆరోజు నుంచి నేటి వరకూ వాళ్లు ఆ గుడిసెలోనే ఉన్నారు. ఊరి ఉపాధ్యాయుడు సిమును చదివించమని సూచించడంతో తల్లి ధైర్యం చేసి గువహతిలో అంధ బాలికల స్కూల్లో చేర్చించింది. అక్కణ్ణుంచి సిము ఢిల్లీ వరకూ వెళ్లి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది. 2022లో క్రికెట్లో ప్రవేశించిన వెంటనే ప్రతిభ చూపుతూ జాతీయ జట్టుకు ఎంపికై ట్వంటీ ట్వంటీ కప్ గెలుపులో కీలకపాత్ర పోషించింది.→ అమ్మ లేకపోతే...‘అమ్మ లేకపోతే నేను లేను. ఆమె తన జీవితం మొత్తం పోరాడుతూనే ఉంది. నేటికీ మా అన్నయ్యకు ఆమె సేవలు చేస్తోంది. మా కోసమే ఆమె బతికింది. నేను ఆమె కోసమే గెలిచాను. ఇంకా ఆడతాను. మా అమ్మను సంతోషంగా ఉంచాలనేదే నా కోరిక’ అంది సిము దాస్. -
అంధుల మహిళల ప్రపంచకప్ విజేతలకు ప్రధాని మోదీ ప్రశంస
న్యూఢిల్లీ: అంధుల టి20 ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టు సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఫైనల్ గెలిచిన రోజు ‘ఎక్స్’ వేదికగా అభినందించిన మోదీ... గురువారం విజేత జట్టు సభ్యుల్ని ఆతీ్మయంగా పలకరించారు. ‘చరిత్ర సృష్టించిన భారత అంధుల జట్టుకు అభినందనలు. ఆరంభ మెగా ఈవెంట్లో టోర్నీ మొత్తం అజేయంగా నిలిచారు. మీ కఠోర శ్రమకు, జట్టు సమష్టి కష్టానికి ఈ ట్రోఫీ ఓ నిదర్శనం. ప్రతీ ఒక్కరు అంకితభావంతో ఆడారు. మైదానంలో నిబద్ధతను చూపారు’ అని మోదీ ఈ సందర్భంగా క్రికెటర్ల ప్రతిభను కొనియాడారు. యువతరానికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అది్వతీయ విజయాలెన్నో సాధించాలని ఆకాంక్షించారు. ఇటీవల కొలంబో వేదికగా ఆరు జట్లతో జరిగిన ఈ మెగా ఈవెంట్ ఫైనల్లో భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో నేపాల్‌పై గెలిచింది. -
మన ఖాతాలో మరో ప్రపంచకప్
కొలంబో: ఈ ఏడాది అంతర్జాతీయస్థాయిలో భారత క్రికెట్ హవా నడుస్తోంది. విభాగం ఏదైనా... వేదిక ఎక్కడైనా... ప్రత్యర్థుల ఎవరైనా... అదరగొట్టే ఆటతీరుతో భారత జట్లు జయభేరి మోగిస్తున్నాయి. ఇటీవల హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు వన్డే వరల్డ్‌కప్‌ను తొలిసారి సొంతం చేసుకోగా... తొలిసారి నిర్వహించిన మహిళల అంధుల టి20 ప్రపంచకప్‌లోనూ భారత జట్టు జగజ్జేతగా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో దీపిక సారథ్యంలోని భారత జట్టు 7 వికెట్ల తేడాతో నేపాల్‌ను ఓడించి ట్రోఫీ కైవసం చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జమున రాణి, అను కుమారి చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 12.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసి గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పాంగి కరుణ కుమారి (27 బంతుల్లో 42) రాణించింది. ఫూలా సరేన్ (27 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు)తో కలిసి కరుణ కుమారి మూడో వికెట్‌కు 51 పరుగులు జోడించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం వంట్ల మామిడికి చెందిన 15 ఏళ్ల కరుణ ప్రస్తుతం విశాఖపట్నం అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీలో మొత్తం ఆరు (భారత్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, ఆ్రస్టేలియా, అమెరికా) దేశాల జట్లు పాల్గొన్నాయి. ఈ ఏడాది భారత పురుషుల జట్టు ఆసియా కప్ టి20 టోర్నీలో, చాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీలో టైటిల్స్ సాధించగా... భారత మహిళల జట్టు వన్డే వరల్డ్‌కప్‌ను దక్కించుకుంది. -
టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా పాకిస్తాన్
పాకిస్తాన్ అంధుల క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఇవాళ (డిసెంబర్ 3) జరిగిన ఫైనల్లో పాక్ బంగ్లాదేశ్‌పై 10 వికెట్ల తేడాతో గెలుపొంది, తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది. ముల్తాన్ (పాకిస్తాన్) వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఆరిఫ్ హుస్సేన్ (54) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాక్ బౌలర్లలో బాబర్ అలీ రెండు వికెట్లు పడగొట్టగా.. మొహమ్మద్ సల్మాన్, మతివుల్లా తలో వికెట్ దక్కించుకున్నారు.140 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్.. కేవలం 11 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ఓపెనర్ నిసార్ అలీ అజేయమై అర్ద సెంచరీతో (72) సత్తా చాటగా.. మరో ఓపెనర్ మొహమ్మద్ సఫ్దార్ అజేయమైన 47 పరుగులు చేసి తన జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. 12 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో పాక్ టైటిల్ గెలవడం ఇదే మొదటిసారి. ఈ టోర్నీ జరిగిన మూడు ఎడిషన్లలో (2012, 2017, 2022) టీమిండియా విజేతగా నిలిచింది.టోర్నీ తొలి ఎడిషన్ ఫైనల్లో పాకిస్తాన్‌పై 29 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్.. రెండో ఎడిషన్ ఫైనల్లోనూ పాక్‌పై 9 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. 2022 ఎడిషన్ ఫైనల్లో భారత్ బంగ్లాదేశ్‌ను ఓడించి హ్యాట్రిక్ టైటిళ్లు సొంతం చేసుకుంది. ఎట్టకేలకు పాక్ నాలుగో ప్రయత్నంలో సొంతగడ్డపై టైటిల్ సాధించింది. ఈ ఎడిషన్‌లో భారత్ పాల్గొనలేదు. భద్రతా కారణాల దృష్ట్యా భారత ప్రభుత్వం టీమిండియాను పాక్‌కు పంపలేదు. -
టీ20 వరల్డ్‌కప్-2022 గెలిచిన టీమిండియా.. ఫైనల్లో బంగ్లాదేశ్‌పై విజయం
T20 World Cup For Blind: భారత అంధుల క్రికెట్ టీమ్ వరుసగా మూడసారి టీ20 వరల్డ్‌కప్ కైవసం చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ (డిసెంబర్ 17) జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్.. బంగ్లాదేశ్‌ను 120 తేడాతో ఓడించి జగజ్జేతగా అవతరించింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్ ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. సునీల్ రమేశ్ (63 బంతుల్లో 136), అర్జున్ కుమార్ రెడ్డి (50 బంతుల్లో 100 నాటౌట్) సెంచరీలతో రెచ్చిపోవడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 277 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 278 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. భారత బౌలర్లలో లలిత్ మీనా, అజయ్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు. Many congratulations to team India for winning the T20 World Cup for blind. pic.twitter.com/fbLge7UQVi — Mufaddal Vohra (@mufaddal_vohra) December 17, 2022 కాగా, టీ20 వరల్డ్‌కప్‌ను భారత్ గెలవడం ఇది వరుసగా మూడసారి. 2012లో జరిగిన ఇనాగురల్ టోర్నీలో భారత్ పాకిస్తాన్‌ను ఖంగుతినిపించి, తొలిసారి ఈ ఫార్మాట్లో ఛాంపియన్‌గా నిలిచింది. అనంతరం 2017లో జరిగిన రెండో ఎడిషన్‌లోనూ భారత్ ఫైనల్లో పాకిస్తాన్ ఓడించి రెండోసారి జగజ్జేతగా అవతరించింది. తాజాగా జరిగిన టోర్నీలో గెలవడం ద్వారా భారత్ హ్యాట్రిక్ వరల్డ్‌కప్‌లు సాధించింది. హ్యాట్రిక్ వరల్డ్‌కప్‌లు సాధించిన టీమిండియా వన్డే ఫార్మాట్లో జరిగే వరల్డ్‌కప్‌లను కూడా రెండుసార్లు (2014, 2018) కైవసం చేసుకుంది. ఈ రెండుసార్లు కూడా భారత్.. ఫైనల్లో పాకిస్తాన్‌పైనే విజయం సాధించింది. -
టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్.. సెమీస్‌లో దక్షిణాఫ్రికా చిత్తు
బెంగళూరు: అంధుల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికాతో గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 207 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అజయ్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. గుంటూరు జిల్లాకు చెందిన అజయ్ 81 పరుగులు సాధించడంతోపాటు 13 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మరో ప్లేయర్ సునీల్ రమేశ్ (110) సెంచరీ చేశాడు. ముందుగా భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 337 పరుగులు సాధించగా... దక్షిణాఫ్రికా 19.5 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. శనివారం జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్ ఆడుతుంది. చదవండి: IND Vs BAN: కోహ్లి సైగ చేశాడు.. సిరాజ్ అనుకరించాడు; ఒళ్లు మండినట్టుంది -
Blind T20 World Cup 2022: భారత జట్టు కెప్టెన్‌గా అజయ్
స్వదేశంలో ఈ ఏడాది డిసెంబర్ 6 నుంచి 17 వరకు జరిగే అంధుల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును శుక్రవారం ప్రకటించారు. 17 మంది సభ్యులుగల టీమిండియాకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అజయ్ కుమార్ రెడ్డి కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన వెంకటేశ్వర రావును వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ మెగా ఈవెంట్‌కు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. గతంలో భారత జట్టు రెండుసార్లు (2012, 2017) ప్రపంచకప్ టైటిల్‌ను సాధించింది. భారత జట్టు: అజయ్ కుమార్ రెడ్డి (కెప్టెన్), వెంకటేశ్వర రావు (వైస్ కెప్టెన్), దుర్గా రావు, ఎ.రవి (ఆంధ్రప్రదేశ్), లలిత్ మీనా (రాజస్తాన్), ప్రవీణ్, దీపక్ (హరియాణా), సుజీత్ (జార్ఖండ్), నీలేశ్ యాదవ్, , ఇర్ఫాన్ (ఢిల్లీ), సోనూ (మధ్యప్రదేశ్), సొవేందు (బెంగాల్), నకులా (ఒడిశా), లోకేశ, సునీల్, ప్రకాశ్ (కర్ణాటక), దినగర్ (పాండిచ్చేరి). -
ఎదురులేని భారత్
అంధుల టి20 ప్రపంచకప్ అహ్మదాబాద్: డిఫెండింగ్ చాంపియన్ భారత్ అంధుల టి20 ప్రపంచకప్‌లో తమ జోరు కొనసాగిస్తోంది. శ్రీలంకతో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్‌కిది ఐదో విజయం కావడం విశేషం. మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 186 పరుగులు చేసింది. చందన దేశప్రియ (62; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా... భారత బౌలర్లలో సునీల్ మూడు, కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు తీశారు. 187 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ 13.3 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి అధిగమించింది. ఓపెనర్ ప్రకాశ్ (99 నాటౌట్; 20 ఫోర్లు) సెంచరీకి పరుగు దూరంలో నిలువగా... కేతన్ (56 నాటౌట్) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 142 పరుగులు జోడించారు. పది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న భారత్ 15 పాయింట్లతో పాక్, బంగ్లాదేశ్ జట్లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది.


