breaking news
cylindar blast
-
గోవాలో అగ్ని ప్రమాదం: 25 మంది సజీవదహనం
పనాజీ: దేశ విదేశీ పర్యాటకులతో నిత్యం కళకళలాడే గోవాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం అర్ధరాత్రి తర్వాత నైట్‌క్లబ్‌లో మంటలు చెలరేగడంతో 25 మంది సజీవదహనమయ్యారు. ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో 20 మంది నైట్‌క్లబ్ సిబ్బంది, ఐదుగురు పర్యాటకులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన ఐదుగురు పర్యాటకుల్లో నలుగురు ఢిల్లీ నుంచి వచ్చారు. వీరిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారే. ఐదో పర్యాటకుడు కర్ణాటకవాసి. క్లబ్లో గ్యాస్ సిలిండర్ పేలిందని పోలీసులు చెబుతుండగా, ఎలక్ట్రిక్ బాణాసంచా కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉత్తర గోవాలో అర్పోరాలోని ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వారాంతపు సరదా తీవ్ర విషాదంగా మారిపోయింది. ఎక్కువ మంది దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక మృతి చెందినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. గోవాలో అగ్ని ప్రమాదం పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రధాని మోదీ గోవా ప్రభుత్వాన్ని ఆదేశించారు. దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేశాం: ప్రమోద్ నైట్‌క్లబ్ నుంచి బయటకు వెళ్లే మార్గం చాలా ఇరుకుగా ఉండడంతో పర్యాటకులు తప్పించుకోవడం కష్టంగా మారిందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చెప్పారు. అక్కడ సరైన భద్రతా చర్యలు లేవని, నిబంధనలను ఉల్లంఘించారని తెలిపారు. చట్టవిరుద్ధంగా నిర్మించిన ఈ నైట్‌క్లబ్‌లో కార్యకలాపాలకు అనుమతులు ఇచి్చన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.ఈ ఘటనకు బాధ్యులుగా గుర్తిస్తూ ముగ్గురు అధికారులను గోవా ప్రభుత్వం సస్పెండ్‌చేసింది. క్లబ్ చీఫ్ జనరల్ మేనేజర్, ముగ్గురు సిబ్బందిని అరెస్టు చేశారు. గోవాకు టూరిస్టులు అధికంగా తరలివచ్చే సీజన్లో ఈ ప్రమాదం జరిగింది. దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారంలోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించామన్నారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడినవారికి రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు సీఎం ప్రమోద్ సావంత్ ప్రకటించారు. బాణాసంచా కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు.యజమానులపై కేసు నమోదు ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్ యజమానులైన సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాపై కేసు నమోదు చేసినట్లు గోవా పోలీసులు తెలిపారు. క్లబ్ మేనేజర్‌తోపాటు ఈవెంట్ నిర్వాహకులపై కేసు పెట్టినట్లు చెప్పారు. సంబంధీకులను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. ఈ క్లబ్‌కు ట్రేడ్ లైసెన్స్ జారీ చేసిన అర్పోరా–నగోవా గ్రామ పంచాయతీ సర్పంచ్ రోషన్ రెడ్కార్ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. చట్టవిరుద్ధంగా నిర్మించిన ఈ క్లబ్‌ను కూలి్చవేయాలంటూ తాము గతంలోనే నోటీసు ఇచ్చామని సర్పంచ్ రోషన్ రెడ్కార్ చెప్పారు. కానీ, కూలి్చవేతను ప్రభుత్వ ఉన్నతాధికారులు అడ్డుకున్నారని రోషన్ ఆరోపించారు.రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన పీఎంఓ అగ్ని ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) వెల్లడించింది. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సీఎం ప్రమోద్ రాజీనామా చేయాలి: కాంగ్రెస్ గోవా ప్రమాదం పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. సీఎం ప్రమోద్ వెంటనే రాజీనామా చేయాలని గోవా కాంగ్రెస్ నేత మాణిక్‌రావు థకారే డిమాండ్ చేశారు. గోవా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రమోద్ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని తేలి్చచెప్పింది. 25 మంది మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిశీ ప్రశ్నించారు. క్షణాల్లోనే మృత్యుఘోషఅర్మోరా నది బ్యాక్‌వాటర్‌లోనే క్లబ్‌ను నిర్మించారు. లోపలికి వెళ్లడానికి, బయటకు రావడానికి ఇరుకైన మార్గమే ఉంది. లోపల కొబ్బరి మట్టలతో తాత్కాలిక గదులు నిర్మించారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో క్లబ్‌లోని మొదటి అంతçస్తులో ఉన్న డ్యాన్స్ఫ్లోర్పై కనీసం 100 మంది పర్యాటకులు ఉన్నట్లు హైదరాబాద్‌కు చెందిన ఫాతిమా షేక్ చెప్పారు. గ్రౌండ్ ఫ్లోర్లో వంటగది ఉంది. మొదటి అంతస్థులో పేలుడు జరగ్గానే బయటకు వెళ్లే మార్గం కనిపించక పర్యాటకులు, ఇతర సిబ్బంది వెంటనే గ్రౌండ్‌ఫ్లోర్‌లోని వంట గదికి చేరుకున్నారు. క్లబ్‌ను మంటలు చుట్టుముట్టాయి. క్షణాల్లోనే దట్టమైన పొగ అలుముకుంది. సిబ్బంది, పర్యాటకులు వంట గదిలోనే చిక్కుకుపోయారు. పొగ కారణంగా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు కోల్పోయారు. చిన్నపాటి సందులో నైట్‌క్లబ్ ఉండడంతో మంటలను అదుపు చేయడం సాధ్యపడలేదు. 400 మీటర్ల దూరంలోనే అగి్నమాపక యంత్రాలు ఆగిపోవాల్సి వచి్చంది. వారాంతం కావడంతో పెద్ద సంఖ్యలో టూరిస్టులు నైట్‌క్లబ్‌కు వచి్చనట్లు తెలుస్తోంది. మృతి చెందిన సిబ్బంది ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారని సమాచారం. షోలే చిత్రంలోని ‘మెహబూబా ఓ మెహబూబా’ అనే పాటకు ఓ డ్యాన్సర్ నృత్యం చేస్తుండగా, హఠాత్తుగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సంబంధిత ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. बड़ी खबर👇गोवा में धमाके से आग लगने पर 23 लोगों की मौत।उत्तरी गोवा में स्थित अर्पोरा गांव के एक नाइटक्लब में सिलिंडर ब्लास्ट से भीषण आग लग गई, जिसमें कम से कम 23 लोगों की मौत हो गई। pic.twitter.com/7R76b3o50E— INC TV (@INC_Television) December 6, 2025 -
సిలిండర్ పేలుడు: 4 ఇళ్లు దగ్ధం
రెబ్బన: ఆదిలాబాద్ జిల్లా రెబ్బన మండలంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మండలంలోని గంగాపురంలో మంగళవారం ప్రమాదవశాత్తూ 4 ఇండ్లు దగ్ధమయ్యాయి. ఓ ఇంట్లో సిలిండర్ పేలడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 తులాల బంగారం, రూ.లక్ష నగదుతో పాటు మొత్తం రూ.5 లక్షల ఆస్తి నష్టం సంభవించింది.


