
సాక్షి, తాడేపల్లి: కొప్పర్తిలో టెక్నోడోమ్, టెక్సానా సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించటంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తమ హయాంలో కొప్పర్తి పారిశ్రామికవాడలో అనేక సంస్థలు పెట్టుబడులు పెట్టాయని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. 2019 ఆగస్టులో కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్‌ను ప్రతిపాదించగా.. 2021 మార్చిలో STPI అనుమతి పొందిన ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటయ్యాయి. కొప్పర్తిలో ఏర్పాటయిన పరిశ్రమలు జిల్లాకే పేరు ప్రఖ్యాతలను తెచ్చాయి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
‘‘టెక్నోడోమ్, టెక్సానా సంస్థలు 2022–2023లో నిర్మాణ పనులను ప్రారంభించి చాలా త్వరగా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించటం హర్షణీయం. ఈ సందర్భంగా ఆ రెండు సంస్థల యాజమాన్యాలకు, ఉద్యోగులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నా. మా హయాంలో రాష్ట్రానికి స్థిరమైన అభివృద్ధిని సాధించాం.
..ముఖ్యంగా తయారీ రంగం ఎంతో కీలకమని నమ్ముతూ దానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం. అందుకే 2019–2024 మధ్య ఏపీలో తయారీ రంగం GSDP 11.12% వార్షిక వృద్ధి రేటుని సాధించింది. దేశ సగటు వృద్ధిరేటు 6.9% మాత్రమే ఉన్నప్పటికీ రాష్ట్ర వృద్ధిరేటు ఎక్కువగా సాధించగలిగాం’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు
I am very pleased to learn of the commencement of operations in the manufacturing facilities established by Teknodome and Texana in Kopparthy. The Mega Industrial Hub at Kopparthy was proposed in August 2019, the EMC at Kopparthy could secure approval from STPI in March 2021, and… pic.twitter.com/EjaN09Kmgu
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2025