
ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ నటనలో ప్రతిభ కనబరచడంతోపాటు పెట్టుబడులపై ఆసక్తి ఉన్న తెలివైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందుతున్నారు. వెండితెర ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించిపెట్టినప్పటికీ, అతడి ఆర్థిక చతురత, వ్యూహాత్మక పెట్టుబడులు వ్యాపార మొఘల్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేశాయి. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా..
డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్‌మెంట్స్
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు అతీతంగా ఆకట్టుకునే ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను నిర్మించారు. హైదరాబాద్, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సుమారు రూ.25 కోట్ల విలువైన విలాసవంతమైన భవనం సహా ఆయన ఆస్తులు విభిన్న రంగాల్లో విస్తరించాయి. ఎన్టీఆర్ విలాసవంతమైన జీవనశైలికి, ఆర్థిక విజయానికి నిదర్శనంగా రూ.80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉంది. రేంజ్ రోవర్, బీఎండబ్ల్యూ, పోర్షే, లంబోర్ఘిని ఉరుస్ వంటి హై-ఎండ్ బ్రాండ్ కార్లను కలిగి ఉన్నారు.
సంపదను పెంచుకోవాలని, వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టాలని చూస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎన్టీఆర్ వ్యాపార మనస్తత్వం ఎన్నో విలువైన పాఠాలను నేర్పుతుంది. రియల్ ఎస్టేట్, ప్రొడక్షన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, లగ్జరీ అసెట్స్‌లో ఎన్టీఆర్ విజయవంతంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్టర్లు తమ వనరులన్నింటినీ ఒకే రంగంలో పెట్టుబడి పెట్టడం మానుకోవాలి. అందుకు బదులుగా స్థిరమైన ఆర్థిక వృద్ధి కోసం బహుళ పరిశ్రమల్లో ఇన్వెస్ట్ చేయాలనే అందులో దాగిఉంది.
ఇదీ చదవండి: మెహుల్ చోక్సీకి రూ.2 కోట్ల డిమాండ్ నోటీసు
జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లలో కొన్ని..
మలబార్ గోల్డ్ & డైమండ్స్
అప్పీ ఫిజ్
బోరో ప్లస్ పౌడర్
జాండు బామ్
నవరత్న ఆయిల్