గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా తెలంగాణను రూపుదిద్దుతాం
2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగం 250 బిలియన్ డాలర్లకు..
ఆస్ బయోటెక్ 2025 సదస్సులో మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో 2030 నాటికి కొత్తగా రూ.లక్ష కోట్ల పెట్టుబడులను రప్పించడం ద్వారా 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగ ఆర్థిక వ్యవస్థ విలువ ప్రస్తుతం 80 బిలియన్ డాలర్లు కాగా, 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా త్వరలో ‘కాంప్రహెన్సివ్ లైఫ్ సైన్సెస్ పాలసీ’ని అమలు చేస్తామని ప్రకటించారు.
గడిచిన 20 నెలల్లో రాష్ట్రానికి రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, అందులో లైఫ్ సైన్సెస్ రంగంలోనే రూ.63 వేల కోట్లుగా ఉందన్నారు. తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు.
ఆస్ట్రేలియా లైఫ్ సైన్సెస్ సంస్థ ‘ఆస్ బయో టెక్’, విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం మెల్‌బోర్న్‌లో సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఆస్ బయోటెక్ ఇంటర్నేష నల్ కాన్ఫరెన్స్ 2025’లో మంత్రి శ్రీధర్‌బాబు గురు వారం కీలకోపన్యాసం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో గడిచిన రెండేళ్లలో తెలంగాణ సాధించిన పురోగతి, భవిష్యత్ ప్రణాళికలు, అవకాశాలు, పెట్టు బడులకు ఉన్న అనుకూల తలను మంత్రి వివరించారు.
అత్యుత్తమ లైఫ్‌సైన్సెస్ క్లస్టర్లలో హైదరాబాద్
‘ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్‌ఈ రూపొందించిన ’గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ 2025’లో ప్రపంచంలోని అత్యుత్తమ లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో హైదరాబాద్‌కు చోటు దక్కి ంది. బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, కేంబ్రిడ్జ్, బీజింగ్, టోక్యో సరసన హైదరాబాద్ నిలిచింది. లైఫ్ సైన్సెస్ ఆఫీస్ లీజింగ్ 2022లో 0.6 మిలియన్ చదరపు అడుగులు కాగా, 2024 నాటికి నాలుగు రెట్లు పెరిగి 2.4 మిలియన్ చదరపు అడుగు లకు చేరింది.
లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ, యంగ్‌ఇండియా స్కిల్క్స్ యూనివర్సిటీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్, ఇతర అంతర్జాతీయ దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో భవిష్యత్ బయో –డిజిటల్ యుగానికి కావాల్సిన అత్యుత్తమ నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసు కుంది. ఆస్ బయోటెక్ ఇంటర్నేషనల్ సద స్సు ‘విక్టోరియా తెల ంగాణ ఇన్నోవేషన్ కారిడార్’కు నాంది పలకాలి’అని శ్రీధర్ బాబు ఆకాంక్షించారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదరా బాద్‌లో జరిగే బయో ఏషియా సదస్సు కు హాజరు కావాలని దిగ్గజ లైఫ్ సైన్సెస్ పరిశ్రమలను మంత్రి ఆహ్వానించారు. సదస్సులో విక్టోరియా మంత్రులు రోస్ స్పెన్స్, డానీ పియ ర్సన్, ఆస్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ జేమ్స్ క్యాంప్‌బెల్, తెల ంగాణ ఇన్వెస్ట్‌మెంట్ సెల్ డైరెక్టర్ మధుసూదన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్ పాల్గొన్నారు.


