శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 308.49 పాయింట్లు లేదా 0.42 శాతం లాభంతో 74,459.53 వద్ద, నిఫ్టీ 116.35 పాయింట్లు లేదా 0.51 శాతం లాభంతో 23,053.10 వద్ద నిలిచాయి.
వేదాంత పవర్ లిమిటెడ్, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ లిమిటెడ్, లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఇంటెలెక్ట్ డిజైన్ ఎరీనా లిమిటెడ్, రెడింగ్టన్ లిమిటెడ్, సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


