నవంబర్‌ హాలిడేస్.. ఈ రోజుల్లో బ్యాంకులు క్లోజ్! | Bank Holidays in November 2026 Check Diwali and Guru Nanak Jayanti and More | Sakshi
Sakshi News home page

నవంబర్‌ హాలిడేస్.. ఈ రోజుల్లో బ్యాంకులు క్లోజ్!

Oct 30 2026 3:17 PM | Updated on Oct 30 2026 3:28 PM

Bank Holidays in November 2026 Check Diwali and Guru Nanak Jayanti and More

నవంబర్ నెలలో బ్యాంకుకు వెళ్లి చేయాల్సిన పనులు ఏవైనా ఉంటే.. తప్పకుండా సెలవుల గురించి తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే.. వివిధ పండుగలు, ప్రాంతీయ వేడుకలతో పాటు.. రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతో కలిపి వచ్చే నెలలో దాదాపు సగం కంటే ఎక్కువ రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.

ముఖ్యంగా దీపావళి, లక్ష్మీ పూజ, ఛత్ పూజ, గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి, కన్నడ రాజ్యోత్సవం వంటి పండుగల కారణంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అయితే.. అన్ని రాష్ట్రాల్లో ఒకే రోజు సెలవు ఉండదు. ఆయా ప్రాంతాల్లో జరుపుకునే పండుగలను బట్టి సెలవులు మారుతుంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల క్యాలెండర్ ప్రకారం నవంబర్ నెలలో బ్యాంకులకు సెలవులు ఇలా..

➤నవంబర్ 1, ఆదివారం: దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది.
➤నవంబర్ 8, ఆదివారం: అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.
➤నవంబర్ 9, సోమవారం: దీపావళి, లక్ష్మీ పూజ, గోవర్ధన పూజ, విశ్వకర్మ దినోత్సవం సందర్భంగా త్రిపుర, మధ్యప్రదేశ్, చండీగఢ్, సిక్కిం, మణిపూర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల్లో సెలవు ఉంటుంది.
➤నవంబర్ 10, మంగళవారం: దీపావళి వేడుకలు, లక్ష్మీ పూజ, విక్రమ సంవత్ నూతన సంవత్సరం సందర్భంగా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్, సిక్కిం రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
➤నవంబర్ 11, బుధవారం: లక్ష్మీ పూజ, నింగోల్ చకౌబా, భాయ్ దూజ్, చిత్రగుప్త జయంతి సందర్భంగా సిక్కిం, మణిపూర్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో సెలవు ఉంటుంది.
➤నవంబర్ 13, శుక్రవారం: వంగాల పండుగ సందర్భంగా మేఘాలయలో బ్యాంకులకు సెలవు.
➤నవంబర్ 14, శనివారం: రెండో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
➤నవంబర్ 15, ఆదివారం: దేశవ్యాప్తంగా సాధారణ సెలవు.
➤నవంబర్ 16, సోమవారం: ఛత్ పూజ సందర్భంగా బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
➤నవంబర్ 20, శుక్రవారం: ఇగాస్ బగ్వాల్ పండుగ సందర్భంగా ఉత్తరాఖండ్‌లో బ్యాంకులు పనిచేయవు.
➤నవంబర్ 22, ఆదివారం: దేశవ్యాప్తంగా సాధారణ సెలవు.
➤నవంబర్ 23, సోమవారం: సెంగ్ కుట్ స్నెమ్ పండుగ సందర్భంగా.. మేఘాలయలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
➤నవంబర్ 24, మంగళవారం: గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి, రాస్ పౌర్ణిమ సందర్భంగా.. తెలంగాణతో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
➤నవంబర్ 27, శుక్రవారం: కనకదాస జయంతి సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులు మూసి ఉంటాయి.
➤నవంబర్ 28, శనివారం: నాలుగో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
➤నవంబర్ 29, ఆదివారం: అన్ని రాష్ట్రాల్లో సాధారణ సెలవు ఉంటుంది.

బ్యాంకు శాఖలు మూసి ఉన్నప్పటికీ ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యాప్స్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. అలాగే మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు బదిలీ చేసుకోవచ్చు. నగదు అవసరమైనవారు ATMల ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.

అయితే.. చెక్కుల క్లియరెన్స్, క్యాష్ డిపాజిట్, ఇతర బ్యాంకు శాఖలకు సంబంధించిన పనుల కోసం నేరుగా వెళ్లాల్సి వస్తే ముందుగానే సెలవుల వివరాలు తెలుసుకోవడం మంచిది. ముఖ్యంగా ఒక రాష్ట్రంలో ఉన్న సెలవు మరో రాష్ట్రంలోని బ్యాంకులకు వర్తించకపోవచ్చు. కాబట్టి మీ ప్రాంతంలోని బ్యాంకు సెలవులను ముందుగా పరిశీలించి, అవసరమైన పనులను బ్యాంకులు పనిచేసే రోజుల్లోనే పూర్తి చేసుకోవడం ద్వారా చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ఉండవచ్చు.

ఇదీ చదవండి: పని vs బిజినెస్.. రాబర్ట్ కియోసాకి టిప్స్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement