వచ్చేవారం సెలవులు: ఈ రోజుల్లో బ్యాంకులు బంద్! | Bank Holiday Next Week SBI, HDFC Bank, Other Lenders | Sakshi
Sakshi News home page

వచ్చేవారం సెలవులు: ఈ రోజుల్లో బ్యాంకులు బంద్!

Oct 24 2026 3:46 PM | Updated on Oct 24 2026 3:59 PM

Bank Holiday Next Week SBI, HDFC Bank, Other Lenders

అక్టోబర్ నెల చివరి వారం వచ్చేసింది. 2026 అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు బ్యాంకులలో ఏదైనా పనులు ఉంటే.. ముందుగా సెలవుల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే.. లక్ష్మీ పూజ, యాక్సెషన్ డే, మహర్షి వాల్మీకి జయంతి, కర్వా చౌత్, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి వంటి సందర్భాల్లో ఈ సెలవులు ఉన్నాయి. అయితే, ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవు. ఆయా నగరాలు, రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి.

➤అక్టోబర్ 26న సోమవారం లక్ష్మీపూజ / మహర్షి వాల్మీకి జయంతి / యాక్సెసిబిలిటీ డే సందర్భంగా.. అగర్తల, బెంగళూరు, చండీగఢ్, జమ్మూ, సిమ్లా, శ్రీనగర్‌లో బ్యాంకులు పనిచేయవు.
➤అక్టోబర్ 29న కర్వా చౌత్ సందర్భంగా సిమ్లాలో బ్యాంకు శాఖలకు సెలవు ఉంటుంది.
➤అక్టోబర్ 31న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా అహ్మదాబాద్‌లో బ్యాంకులు మూసివేస్తారు.
➤నవంబర్ 1 ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ వారాంతపు సెలవు ఉంటుంది.

అయితే.. అక్టోబర్ 27, 28, 30 తేదీల్లో ప్రత్యేక స్థానిక సెలవులు లేని ప్రాంతాల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. అందువల్ల బ్యాంకులో ముఖ్యమైన పనులు ఉన్నవారు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా.. ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిది. వెళ్లే ముందు మీ ప్రాంతంలోని బ్యాంకు సెలవుల వివరాలను కూడా ఒకసారి తనిఖీ చేసుకోండి.

ఈ సెలవుల కారణంగా బ్యాంక్ బ్రాంచ్ సేవలు అందుబాటులో ఉండకపోయినా, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం కొనసాగుతాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులు, అలాగే ఏటీఎం సేవలు సాధారణంగా పనిచేస్తాయి. కాబట్టి తప్పకుండా బ్యాంకుకు వెళ్లి చేయాల్సిన పనులు మాత్రమే వాయిదా పడతాయి.

ఇదీ చదవండి: కుంగ్‌ఫూ ఫైటర్‌లా చైనా రోబోట్‌.. వీడియో చూస్తే షాకే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement