అయ్యో మ‌ల్ల‌య్యా.. ఎంత పని జ‌రిగింద‌య్యా! | Karimnagar Road Accident Video Viral, Nitizes Fire on Inhumanity | Sakshi
Sakshi News home page

పాపం మ‌ల్ల‌య్య‌.. ప్రాణాలు కోల్పోయాడు

Nov 2 2026 6:59 PM | Updated on Nov 2 2026 7:17 PM

Karimnagar Road Accident Video Viral, Nitizes Fire on Inhumanity

మ‌నుషుల్లో స్పందించే గుణం అంత‌కంత‌కు అడుగంటిపోతోంది. క‌ళ్లెదుటే సాటి మ‌నిషి ప్రాణాపాయంలో ఉన్నా ప‌ట్టించుకోవ‌డం లేదు. చిన్న‌పాటి సాయం చేయ‌డానికి కూడా మ‌నుషులు ముందుకు రావ‌పోక‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. భ‌య‌మో, త‌ర్వాత ఎలాంటి ప‌రిణామాలు ఎదుర్కొవ‌లసి వ‌స్తుంద‌నే సాకుతో ఆప‌న్న‌హ‌స్తం అందించ‌డానికి వెనుకాడుతున్నారు. మ‌న‌కెందులే అని చూసిచూడ‌న‌ట్టు వెళ్లిపోతున్నారు. కొన్ని సంద‌ర్భాల్లో ఇలాంటి వ్యవ‌హార‌శైలి మ‌నుషుల ప్రాణాలు తీస్తోంది. తాజాగా ఇటువంటి ఘ‌ట‌న తెలంగాణ‌లోని క‌రీంన‌గ‌ర్‌ జిల్లాలో వెలుగులోకి వ‌చ్చింది.

రోడ్డు ప్ర‌మాదానికి గురై గాయాల‌తో ప‌డివున్న వ్య‌క్తికి అటుగా వెళుతున్న వారు స‌హాయం అందించ‌క‌పోవ‌డంతో అత‌డు ప్రాణాలు విడిచాడు. ప్ర‌మాద స‌మ‌యంలో బాధితుడి ప‌రిస్థితిని గ‌మ‌నించిన వారు వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌డానికి స‌హాయం చేసుంటే అత‌డు బ‌తికేవాడన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఆల‌స్యంగా ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌డంతో ప‌రిస్థితి విష‌మించి బాధితుడు చ‌నిపోయాడు. ప్ర‌మాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డైయ్యాయి. యాక్సిడెంట్ జ‌రిగి బాధితుడు కింద‌పోయిన త‌ర్వాత ముగ్గురు వ్య‌క్తులు రెండే వేర్వేరు బైకుల‌పై  అటుగా వెళ్లారు. బాధితుడిని ఏమాత్రం ప‌ట్టించుకోలేదు.

నెటిజ‌నుల స్పంద‌న‌
ఈ వీడియో వైర‌ల్ కావ‌డంతో సోష‌ల్ మీడియాలో నెటిజ‌నులు త‌మ అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. క‌ళ్లెదుటే ప్రాణాల‌తో కొట్టుమిట్టాడుతున్న మ‌నిషికి సాయం చేయ‌క‌పోవ‌డాన్ని చాలా మంది త‌ప్పుబ‌ట్టారు. ప్ర‌మాదానికి బాధితుడే కార‌ణ‌మ‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డ్డారు. ఢీకొట్టిన డ్రైవ‌ర్‌దే త‌ప్పు అని మ‌రి కొంద‌రు వాదించారు. త‌ప్పు ఎవ‌రిదైనా ఆప‌ద‌లో ఉన్నవారిని ఆదుకోవ‌డం క‌నీస ధ‌ర్మ‌మ‌ని నెటిజ‌నులు వ్యాఖ్యానించారు.

ఇదీ చ‌ద‌వండి: సిరిసిల్లలో వేధింపుల బాగోతం!

ప్ర‌మాదం జ‌రిగిందిలా.. 
క‌రీంన‌గ‌ర్‌ జిల్లా గంగాధర మండలంలోని మధురానగర్‌ చౌరస్తా నుంచి బోయినిపల్లి వెళ్లే దారిలో పిట్టలపల్లి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంకటి మల్లయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం ప్రకారం మల్లయ్య తన ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతుండగా బోయినిపల్లి వైపు నుంచి మధురానగర్‌ వైపు వస్తున్న కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో వాహనదారుడి కాలు తెగిపోయి రక్త స్రావమైంది. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మల్లయ్య మృతి చెందాడు. ప్రమాదంలో కారు బోల్తా పడగా అందులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement