పదేళ్లలో 500 గిగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం  | PM Narendra Modi Inaugurates Bharat Renewable Energy Summit 2026 | Sakshi
Sakshi News home page

పదేళ్లలో 500 గిగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం 

Nov 3 2026 6:17 AM | Updated on Nov 3 2026 6:17 AM

PM Narendra Modi Inaugurates Bharat Renewable Energy Summit 2026

ప్రధాని మోదీ వెల్లడి

న్యూఢిల్లీ: రానున్న 10, 11 ఏళ్లలో అదనంగా 500 గిగావాట్ల పర్యావరణహిత విద్యుదుత్పత్తిని సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. పర్యావరణానికి హానికలుగని రీతిలో సౌర, పవన, జల, అణు మార్గాల్లో విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం కాస్తంత కష్టమే అయినప్పటికీ, సాధ్యమేనన్నారు. 

పశ్చిమాసియా, రష్యా–ఉక్రెయిన్‌ సంక్షోభాల కారణంగా ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం కలగడం, దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపిన నేపథ్యంలో పెట్రోలియం, సహజ వాయువు వంటి వాటిపై ఆధార పడరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. భారత్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ సమ్మిట్, ఎక్స్‌పోలో సోమవారం ఆయన ప్రసంగించారు. ఈ రంగంలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశముందని వివరించారు. ఈ సమ్మిట్‌కు 130 దేశాలకు చెందిన 40 మంది మంత్రులతోపాటు విధాన నిర్ణేతలు, పెట్టుబడి దారులు, ఆర్థిక సంస్థలు, పరిశ్రమల అధిపతులు హాజరయ్యారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement