సీఎం సువేందు అధికారి వెల్లడి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ పేరును ‘పశ్చిమ్ బంగ’గా మార్చాలని కోరుతూ డిసెంబర్ నాలుగు నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెడతామని సీఎం సువేందు అధికారి వెల్లడించారు. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. డిసెంబర్ 9వ తేదీన ప్రవేశపెట్టిన తీర్మానం అసెంబ్లీ ఆమోదం పొందాక కేంద్రానికి పంపుతామన్నారు.
హోం శాఖ ఆమోదముద్రతో రాష్ట్రం పేరు ఇంగ్లిష్లో వెస్ట్ బెంగాల్ నుంచి ‘పశ్చిమ్ బంగ’గా మారుతుందన్నారు. ఇతర అధికారిక పత్రాల్లోనూ ఇదే అమల్లోకి రానుందని సీఎం వివరించారు. రాష్ట్రం పేరును మార్చాలంటూ గతంలో పలుమార్లు వామపక్ష ప్రభుత్వంతోపాటు మమతా బెనర్జీ సారథ్యంలోని ప్రభుత్వం తీర్మానాలు చేసి పంపించాయి. అయితే, కేంద్రంలోని గత యూపీఏ ప్రభుత్వం, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తూ వచ్చాయి. ఇప్పుడు కేంద్రంతోపాటు రాష్ట్రంలో ఒకే రాజకీయపార్టీ అధికారంలో ఉండటంతో పేరు మార్పునకు ఎటువంటి అడ్డంకులు ఉండవన్నది పరిశీలకుల అభిప్రాయం.


