breaking news
madan mithra
-
మమతా బెనర్జీకి మరో దెబ్బ.. మదన్ మిత్రా రాజీనామా
కోల్‌కతా: బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి దెబ్బమీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే ఆమె నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ టీఎంసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబాటు గళం ఎగురవేశారు. తాజాగా టీఎంసీ సీనియర్ నాయకుడు మదన్ మిత్రా సైతం ఆ జాబితాలో చేరారు. టీఎంసీకి గుడ్‌బై చెప్పి రితాబ్రతా క్యాంపులో చేరారు. మదన్ మిత్రాను తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించిన రెండు వారాల తర్వాత మదన్ మిత్రా రాజీనామా చేయడంతో మమతకు మింగుడుపడడం లేదు.ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మమత బెనర్జీకి దెబ్బమీద దెబ్బతగులుతుంది. ఓవైపేమో ఏసీబీ తృణముల్ నేతలపై పెద్దఎత్తున దాడులు జరుగుతుంటే మరోవైపేమో స్వంత పార్టీనేతలే అసమ్మతి గళం వినిపిస్తూ వేరు కుంపటి పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సందర్భంగా మదన్ మిత్రా మాట్లాడుతూ "అసెంబ్లీలో నా గది మాత్రేమే మార్చాను ఇంటిని కాదు. తృణముల్ ఒక విచ్ఛిన్నమైన పార్టీగా మారింది. నేను పూర్తిగా టీఎంసీలోనే ఉంటాను" అని అన్నారు.కాగా ప్రస్తుతం పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో ఎమ్మెల్యే రితాబ్రతా వర్గానికే ప్రతిపక్ష హోదా లభించింది. టీఎంసీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో 58 మంది కంటే ఎక్కువ ఎమ్మెల్యేలు రితాబ్రతా వర్గంలో చేరారు. దీంతో మూడింట రెండు వంతుల (2/3) కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు రితాబ్రతాకు ఉండటంతో, స్పీకర్ ఆయనను అసెంబ్లీలో అధికారికంగా విపక్ష నేతగా గుర్తించారు. -
మదన్ మిత్రా రాజీనామా
కోల్‌కతా: శారదా కుంభకోణం కేసులో నిందితుడు పశ్చిమ బెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత మదన్ మిత్రా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఈ కేసులో బెయిల్‌పై విడుదలైన ఆయన బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. మదన్ మిత్రాకు కిందిస్థాయి కోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో మరో రోజులో కోర్టు నిర్ణయం వెలువడనుండగా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.


