breaking news
Off the field
-
ఛీ.. ఇదేం పద్ధతి?: టీమిండియా మాజీ క్రికెటర్ భార్య ఆగ్రహం
ఐపీఎల్-2008 (IPL 2008) నాటి వీడియో తాజాగా విడుదల చేయడంపై టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సతీమణి భువనేశ్వరి కుమారి (Bhuvaneshwari Kumari) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీకు అసలు మానవత్వం ఉందా?’ అంటూ ఐపీఎల్ తొలి చైర్మన్ లలిత్ మోదీ (Lalit Modi), ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్‌పై మండిపడ్డారు.ఛీ.. ఇదేం పద్ధతి?ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా భువనేశ్వరి కుమారి సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘‘లలిత్ మోదీ, మైకేల్ క్లార్క్.. మీరు చేసిన పనికి సిగ్గు పడండి. 2008లొ జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను ప్రదర్శిస్తూ వ్యూస్ కోసం చీప్‌గా ప్రవర్తించారు.దీని కారణంగా మీరు కేవలం ఇద్దరు వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేసినట్లు కాదు.. వారి కుటుంబాలు, పిల్లలపై కూడా దీని ప్రభావం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. శ్రీశాంత్, హర్భజన్ సింగ్ ఇద్దరూ ఎప్పుడో ఆ ఘటన గురించి మర్చిపోయారు.వారిప్పుడు కేవలం ఆటగాళ్లు కాదు.. తండ్రులయ్యారు. వారికి స్కూల్‌కు వెళ్లే వయసున్న పిల్లలు ఉన్నారు. కానీ మీరు మాత్రం ఆ పాత గాయాన్ని మళ్లీ రేపుతున్నారు. ఛీ.. ఇదేం పద్ధతి? మీకసలు హృదయం ఉందా? మానవత్వం అన్నది మచ్చుకైనా మీలో ఉందా?మీరు కాస్తైనా ఊహించగలరా?శ్రీశాంత్ ఎంతగానో శ్రమించి మళ్లీ తన కెరీర్‌ను నిర్మించుకున్నాడు. చేదు అనుభవాలను అధిగమించి తనను తాను నిరూపించుకున్నాడు. అతడి భార్యగా.. అతడి పిల్లల తల్లిగా.. ఈ పాత వీడియో చూడటం ద్వారా నా మనసు ఎంత బాధపడుతుందో మీరు కాస్తైనా ఊహించగలరా?ఇరు కుటుంబాలను ట్రామాలోకి నెట్టేసిన ఆ ఘటన గురించి మళ్లీ ఇప్పుడెందుకు? మీకు వ్యూస్ మాత్రమే ముఖ్యమా? చిన్నారి పిల్లల మనసులపై గతం తాలుకు మచ్చలు పడేలా చేయాలనుకుంటున్నారా? మీకు కాస్తైనా సిగ్గుందా?.. చేయని తప్పులకు వారు శిక్ష అనుభవించాలా?మానవత్వం లేని పనులుఇలాంటి చెత్త, మానవత్వం లేని పనులు చేసినందుకు మీపై దావా వేయాలి. శ్రీశాంత్ పట్టుదల, మానసిక దృఢత్వం ఉన్న వ్యక్తి. ఇలాంటి చెత్త వీడియోలు అతడి హుందాతనాన్ని ఏమాత్రం తగ్గించలేవు. మీ స్వార్థం కోసం ఇతరుల కుటుంబాలను, వారి పిల్లల మనసులను బాధపెట్టడం ఎంత మాత్రం సరికాదు’’ అంటూ భువనేశ్వరి కుమారి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.అసలేం జరిగిందంటే..2008లో ఐపీఎల్ మొదలైన విషయం తెలిసిందే. అరంగేట్ర సీజన్లో భారత క్రికెటర్లు హర్భజన్ సింగ్ ముంబై ఇండియన్స్‌కు.. శ్రీశాంత్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఆడారు. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య మ్యాచ్ సమయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు జట్లు ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటున్న సమయంలో శ్రీశాంత్‌ను భజ్జీ చెంపదెబ్బ కొట్టాడు. ఈ క్రమంలో తదుపరి మ్యాచ్‌లు ఆడకుండా భజ్జీపై నిషేధం పడింది.పెద్ద తప్పు చేశాఈ ఘటన గురించి ఇటీవల హర్భజన్ సింగ్ మాట్లాడుతూ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తాను పెద్ద తప్పు చేశానని.. ఇప్పటికే 200 సార్లు శ్రీశాంత్‌కు క్షమాపణ చెప్పి ఉంటానని పేర్కొన్నాడు. అయితే, శ్రీశాంత్ కుమార్తెతో మాట్లాడుతున్న సమయంలో.. ఆమె తనను తన తండ్రిని కొట్టిన వ్యక్తిగా గుర్తించడాన్ని తట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. చిన్నారి మనసులో తనపై ఇలాంటి ముద్ర పడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నా.. ఆరోజు అలా చేయకుండా ఉండాల్సింది అని మరోసారి తన తప్పును ఒప్పుకొన్నాడు.వీడియో చూపించిన లలిత్ మోదీఅయితే, ఇటీవల క్లార్క్ ఇంటర్వ్యూకు హాజరైన లలిత్ మోదీ.. భజ్జీ శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టిన వీడియోను లైవ్‌లో చూపించాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో కేరళ మాజీ పేసర్ శ్రీశాంత్ భార్య భువనేశ్వరి కుమారి పైవిధంగా ఘాటుగా స్పందించారు.చదవండి: ‘టీమిండియా బెస్ట్ కెప్టెన్ అతడే.. సాధారణ జట్టుతో అద్భుత విజయాలు’ View this post on Instagram A post shared by Beyond23 Cricket Podcast (@beyond23cricketpod) -
ఐపీఎల్ ‘ముడేసిన బంధం’.. అప్పుడే ప్రేమ బయటపడింది!
ఇద్దరూ క్లాస్మేట్స్.. ఆ అబ్బాయేమో గుంభనంగా ఉంటాడు.. పుస్తకాల పురుగు.. ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతాడు.. ఆ అమ్మాయి మాత్రం చలాకీ.. హుషారైన పిల్ల.. చుట్టూ ఉన్నవాళ్లతో ఇట్టే కలిసిపోతుంది.. మూడీగా ఉన్నవాళ్ల ముఖంలో చిరునవ్వులు తెప్పించగలదు..ఇలా భిన్నమైన మనస్తత్వాలు ఉన్న ఆ ఇద్దరు.. పెద్దయ్యాక ప్రేమలో పడ్డారు.. చిన్ననాటి నుంచి అతడు ఆమెపై పెంచుకున్న ఇష్టాన్ని తెలిపేందుకు ‘ఐపీఎల్’ అవకాశాన్ని ఇచ్చింది. ఇద్దరూ కలిసి ఒకే జట్టుకు పనిచేశారు.. అతడేమో ఆటగాడు.. ఆమె ఆ జట్టు సోషల్ మీడియా అకౌంట్ మేనేజర్.మాటలు, మనసులు కలిశాయి.. పెళ్లి బంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు.. ఇద్దరు చక్కటి, ముత్యాల్లాంటి పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.. ఇప్పుడతడు ఆటకు వీడ్కోలు పలికాడు.. ఐపీఎల్ నుంచీ వైదొలిగాడు.. ఇక అతడి సమయమంతా మాతోనే అని ఆమె సంబరపడిపోలేదు.‘‘లవ్ యూ.. నువ్వు నీ కొత్త ప్రయాణంలో మరింత గొప్పగా ముందుకు సాగాలి.. శిఖరాగ్రాలను అధిరోహించాలి’’ అని భర్తను ప్రోత్సహించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానంటూ ప్రేమను చాటుకుంది. టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin)- ప్రీతి నారాయణన్ (Priti Narayanan) గురించే ఈ ఉపోద్ఘాతమంతా!చెన్నైకి చెందిన అశ్విన్- ప్రీతి క్లాస్మేట్స్. ఒకే స్కూళ్లో చదివారు. అయితే, క్రికెట్లో రాణించే క్రమంలో అశూ స్కూల్ మారినా.. ప్రీతితో మాత్రం టచ్‌లోనే ఉన్నాడు. ఆమె ఈవెంట్ మేనేజర్‌గా కెరీర్ నిర్మించుకుంటే.. అశూ టీమిండియా కీలక స్పిన్నర్‌గా ఎదిగాడు.ఈ క్రమంలోనే అశ్విన్ ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో చేరగా.. ప్రీతి అదే జట్టు సోషల్ మీడియా అకౌంట్ మేనేజర్‌గా వచ్చింది. అప్పుడే ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా రూపాంతరం చెందింది. ప్రీతిని కలిసిన పదేళ్ల తర్వాత అశూ తన ప్రేమను తెలపగా.. అందుకు ఆమె సమ్మతించింది.కపుల్గోల్స్పెద్దల అంగీకారంతో ఆ జంట 2011లో పెళ్లిపీటలు ఎక్కింది. అశూ- ప్రీతిలకు కుమార్తెలు అకీరా, ఆధ్య సంతానం. పద్నాలుగేళ్లుగా ఒకరికొకరు అండగా ఉంటూ కలిసి అడుగులు వేస్తున్న ఈ జంట కపుల్గోల్స్ సెట్ చేయడంలో ముందుంటారు. ఇక అశ్విన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా.. ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పేశాడు. తదుపరి విదేశీ లీగ్‌లలో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో అతడిని చీర్ చేస్తూ ప్రీతి ఉద్వేగపూరిత పోస్ట్ పెట్టగా.. వీరి ప్రేమకథ మరోసారి తెరమీదకు వచ్చింది.అందుకే ఐపీఎల్‌కూ వీడ్కోలుకాగా గతేడాది చివర్లో టెస్టు రిటైర్మెంట్ తర్వాత 2025 సీజన్ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగాడు. తన సొంత టీమ్వంటి సీఎస్కేతో మరికొంత కాలం లీగ్‌లో సాగాలని అతను భావించాడు. అయితే పరిస్థితులు మారిపోవడంతో లీగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వేలంలో రూ.9.75 కోట్లతో చెన్నై అశ్విన్‌ను ఎంచుకోగా 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అతను పూర్తిగా విఫలమయ్యాడు. ఏకంగా 9.12 ఎకానమీతో 7 వికెట్లు మాత్రమే తీశాడు.సీఎస్కే యాజమాన్యం కూడా యువకులతో జట్టును పునర్నిర్మించే ప్రయత్నంలో భాగంగా అశ్విన్‌ను కొనసాగించే ఉద్దేశం లేదని పరోక్షంగా చెప్పేసింది. 39 ఏళ్ల వయసులో కొత్త ఫ్రాంచైజీ ఎంచుకునే అవకాశాలు కూడా తక్కువగా ఉండటంతో అతను లీగ్ నుంచి రిటైర్ అయ్యాడు. 2009లో తొలిసారి లీగ్‌లోకి అడుగు పెట్టిన అతను వరుసగా ఏడు సీజన్ల పాటు సీఎస్కే తరఫునే బరిలోకి దిగాడు.ఆ విదేశీ లీగ్‌లలో కనిపించే అవకాశంఆ తర్వాత పుణే సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ టీమ్‌ల తరఫున కూడా ఆడాడు. 221 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 7.20 ఎకానమీతో 187 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలో అతను ఐదో స్థానంలో నిలిచాడు. అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటన చేయడంతో ఇకపై అశ్విన్ ఇతర విదేశీ లీగ్‌లలో ఆడేందుకు బీసీసీఐ అనుమతిస్తుంది. మున్ముందు బిగ్‌బాష్, ఎస్ఏటి20, సీపీఎల్, హండ్రెడ్ తదితర టోర్నీలలో అతను కనిపించే అవకాశం ఉంది. చదవండి: ఆమెతో పెళ్లి, విడాకులు.. తొలిసారి స్పందించిన షమీ -
ఆమెతో పెళ్లి, విడాకులు.. తొలిసారి స్పందించిన షమీ
టీమిండియా ఉత్తమ ఫాస్ట్బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు మహ్మద్ షమీ (Mohammed Shami). ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ కుడిచేతివాటం పేసర్ దేశీ క్రికెట్లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ జాతీయ జట్టులోకి వచ్చాడు. అంచెలంచెలుగా ఎదిగి భారత పేస్ విభాగంలో కీలక ఆటగాడిగా మారాడు.అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 64 టెస్టులు, 108 వన్డేలు, 25 టీ20 మ్యాచ్‌లు ఆడిన షమీ.. ఆయా ఫార్మాట్లలో 229చ 206, 27 వికెట్లు కూల్చాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా టీమిండియాకు చివరగా ఆడిన షమీ.. ప్రస్తుతం దులిప్ ట్రోఫీ-2025 టోర్నీతో బిజీగా ఉన్నాడు.సాఫీగా సాగని వ్యక్తిగత జీవితంఆట పరంగా ఉన్నత శిఖరాలకు చేరుకున్న 34 ఏళ్ల షమీ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్లో చీర్ లీడర్‌గా పనిచేసిన హసీన్ జహాన్ (Hasin Jahan)ను ప్రేమించిన షమీ 2014లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది.అయితే, కొన్నేళ్ల క్రితం వీరి బంధం బీటలు వారగా.. హసీన్ జహాన్ షమీపై సంచలన ఆరోపణలు చేసింది. షమీ స్త్రీలోలుడని, మ్యాచ్ ఫిక్సింగ్‌లు చేస్తాడని.. తనపై గృహహింసకు పాల్పడ్డాడంటూ తీవ్ర ఆరోపణలతో అతడిని కోర్టు మెట్లు ఎక్కించింది. అంతేకాదు.. భరణంగా నెలకు రూ. 10 లక్షలు చెల్లించేలా తీర్పునివ్వాలని న్యాయస్థానానికి విన్నవించుకుంది.తొలిసారి స్పందించిన షమీఈ క్రమంలో ఇటీవలే కోల్‌కతా కోర్టు ఈ విషయంలో తీర్పునిచ్చింది. నెలకు రూ. 4 లక్షలు భరణంగా చెల్లించాలని షమీని ఆదేశించింది. ఈ పరిణామాల గురించి షమీ తొలిసారి స్పందించాడు. ‘‘ఆ విషయాన్ని వదిలేయడమే మంచిది. గతం గురించి నేనెప్పుడూ ఆలోచించను.జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయంలో ఎవరినీ నిందించాలని అనుకోవడం లేదు. నన్ను నేను కూడా నిందించుకోను. ప్రస్తుతం నా దృష్టి మొత్తం కేవలం క్రికెట్ మీద మాత్రమే ఉంది. నాకు వివాదాల్లో తలదూర్చడం ఏమాత్రం ఇష్టం లేదు’’ అని షమీ పేర్కొన్నాడు.వివాదాలకు నేను దూరంఈ సందర్భంగా.. భార్య ధనశ్రీ వర్మతో ఇటీవల విడాకులు తీసుకున్న టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ గురించి షమీకి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘దాని గురించి విచారణ చేయడం మీ పని. మమ్మల్ని చావు అంచులదాకా తీసుకువెళ్లాలని మీరు ఎందుకు అనుకుంటారు? నాణేనికి మరోవైపు కూడా చూడండి. ముందుగానే చెప్పాను.. నా దృష్టంతా ఆట మీదనే.. వివాదాలకు నేను దూరం’’ అని షమీ కుండబద్దలు కొట్టాడు. చదవండి: టాలీవుడ్ హీరోయిన్‌తో పృథ్వీ షా ప్రేమాయణం..! -
భార్యతో కలిసి జహీర్ గణేశ్ చతుర్థి సెలబ్రేషన్స్.. బుడ్డోడి ఫొటో వైరల్
దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు అంబరాన్నంటాయి. గణేశ్ చతుర్థిని పురస్కరించుకుని వాడవాడలా గణనాయకుడి విగ్రహాలు కొలువుదీరాయి. ఇక సెలబ్రిటీలు సైతం తమ ఇళ్లలోనే గణపతి పూజ చేసి తరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీరిలో టీమిండియా స్టార్లు కూడా ఉన్నారు.సతీమణితో సూర్య పూజటీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన సతీమణి దేవిశా శెట్టితో కలిసి ఇంట్లో వినాయకుడి విగ్రహం ప్రతిష్టించి పూజ చేశాడు. మరోవైపు.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కూడా కుటుంబంతో కలిసి గణేశ్ చతుర్థిని సెలబ్రేట్ చేసుకున్నాడు. టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తన నివాసంలోనే విఘ్నేశ్వరుడికి పూజలు చేశాడు.ఇక టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ సైతం భార్య సాగరిక ఘట్కేతో కలిసి ఇంట్లోనే గణేశ్ చతుర్థి సెలబ్రేట్ చేసుకున్నాడు. వినాయకుడికి ఇష్టమైన మోదకాలను నైవేద్యంగా సమర్పించిన సాగరిక- జహీర్ దంపతులు.. తమ నాలుగు నెలల చిన్నారి కుమారుడితో గణేశుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా తమ కుమారుడి ఫొటోను పూర్తిగా రివీల్ చేయగా.. నెట్టింట వైరల్‌గా మారింది.ఫతేసిన్హ్ ఖాన్‌గా నామకరణంకాగా బాలీవుడ్ నటి సాగరిక ఘట్కేతో ప్రేమలో పడిన జహీర్ ఖాన్.. 2017లో ఇరు కుటుంబాల అంగీకారంతో ఆమెను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన ఎనిమిదేళ్ల తర్వాత ఈ జంటకు తొలి సంతానంగా కుమారుడు జన్మించాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జహీర్- సాగరిక ఈ విషయాన్ని వెల్లడించారు.తమ కుమారుడికి ఫతేసిన్హ్ ఖాన్‌గా నామకరణం చేసినట్లు జహీర్- సాగరిక తెలిపారు. కాగా మహారాష్ట్రకు చెందిన జహీర్ ఖాన్ లెఫ్టార్మ్ మీడియం పేసర్‌గా సేవలు అందించాడు. అంతర్జాతీయ స్థాయిలో పద్నాలుగేళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన 46 ఏళ్ల జహీర్.. 92 టెస్టుల్లో 311, 200 వన్డేల్లో 282, 17 టీ20 మ్యాచ్‌లలో 17 వికెట్లు పడగొట్టాడు.ఇక ఐపీఎల్ కూడా ఆడిన జహీర్ ఖాన్.. క్యాష్ రిచ్ లీగ్‌లో 100 మ్యాచ్‌లలో కలిపి 102 వికెట్లు కూల్చాడు. 2025లో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా విధులు నిర్వర్తించిన జహీర్‌కు.. ఈ ఫ్రాంఛైజీ కటీఫ్ చెప్పినట్లు సమాచారం.చదవండి: DPL: బౌలర్లు ఇక కాస్కోండి.. జూనియర్ సెహ్వాగ్ వచ్చేస్తున్నాడు! వీడియో -
మౌనం వీడిన ఆర్సీబీ.. బిగ్ అప్డేట్.. పోస్ట్ వైరల్
పదిహేడేళ్ల సుదీర్ఘ కలను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఈ ఏడాది నెరవేర్చుకుంది. అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ (IPL 2025) ట్రోఫీని ఎట్టకేలకు ముద్దాడింది. దీంతో ఆటగాళ్లతో పాటు అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. ఆర్సీబీ ఫ్రాంఛైజీ సైతం పట్టరాని సంతోషంలో మునిగిపోయింది. విజయయాత్రను ఘనంగా చేసుకోవాలని భావించింది.తీవ్ర విషాదంఅయితే, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయకపోవడంతో తీరని విషాదం నెలకొంది. టైటిల్ గెలిచి తిరిగివచ్చిన ఆర్సీబీ ప్లేయర్లను స్వాగతించే క్రమంలో చిన్నస్వామి స్టేడియానికి అభిమానులు పోటెత్తారు. దీంతో తొక్కిసలాట జరుగగా.. పదకొండు మంది మృత్యువాత పడగా.. యాభై మందికి పైగా గాయాలపాలయ్యారు.తప్పంతా ఆర్సీబీదేఈ విషాదకర ఘటన విచారణలో భాగంగా.. తప్పంతా ఆర్సీబీదేనని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (CAT) తేల్చింది. పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోకుండా.. సోషల్ మీడియా వేదికగా విజయోత్సవం గురించి పోస్ట్ పెట్టి.. దుర్ఘటనకు కారణమయ్యారని ఆర్సీబీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను జూన్‌లో అరెస్టు చేశారు.అయితే, విజయోత్సవం సందర్భంగా చోటు చేసుకున్న ఘటనపై స్పందిస్తూ ఆర్సీబీ జూన్ 5న ఓ పోస్టు పెట్టింది. ‘ఆర్సీబీ కేర్స్’ ద్వారా గాయపడిన అభిమానులకు అండగా నిలుస్తామని ప్రకటించింది. ఆ తర్వాత మిన్నకుండిపోయిన ఆర్సీబీ సోషల్ మీడియా అకౌంట్లో తాజాగా ఓ పోస్టు ప్రత్యక్షమైంది.నిశ్శబ్దంగా ఉన్నంతమాత్రాన.. ‘‘ప్రియమైన 12th మ్యాన్ ఆర్మీ (ఆర్సీబీ అభిమానులు).. ఈ హృదయపూర్వక లేఖ మీ కోసమే. దాదాపు మూడు నెలలుగా మేము ఇక్కడ ఎలాంటి పోస్టు చేయలేదు. మేమిలా నిశ్శబ్దంగా ఉన్నంతమాత్రాన.. ఇది మా గైర్హాజరీ మాత్రమే అనుకోవద్దు.నిజానికి మేము విషాదం నుంచి కోలుకోలేకపోయాము. ఇక్కడ ఒకప్పుడు మన శక్తి, అందమైన జ్ఞాపకాలు, అద్భుతమైన ఘటనల గురించి మాత్రమే పోస్టులు ఉండేవి. మనమంతా కలిసి ఇక్కడ ఎన్నో సంతోషాలు పంచుకున్నాము. ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాము.అంతా తలకిందులుకానీ జూన్ 4.. మొత్తం అంతా తలకిందులు చేసింది. ఆ రోజు మన హృదయాల్ని ముక్కలు చేసింది. అప్పటి నుంచి మేము మౌనంగా ఉండిపోయాము. బాధలో కూరుకుపోయాము. అంతా నిశ్శబ్దంగా వింటూ ఉన్నాము. ఏం చేయాలో ఆలోచించాము.కేవలం స్పందన కంటే.. ఇంకా గొప్పగా ఏదో చేయాలనుకున్నాము. అందుకే ‘RCB CARES’ను తీసుకువచ్చాము. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా మన వాళ్లకు అండగా నిలుస్తాము.ఈరోజు సెలబ్రేషన్‌తో కాకుండా మనవాళ్ల కోసం మేమిలా తిరిగి వచ్చాము. మీతో మేమున్నాం. మనమంతా కలిసి అడుగేద్దాం. కర్ణాటక గౌరవాన్ని కలిసి కట్టుగా ముందుకు తీసుకువెళ్దాం. ఇది నిజం.. RCB CARES..’’ అంటూ ఉద్వేగపూరిత నోట్‌ను ఆర్సీబీ ఫ్రాంఛైజీ షేర్ చేసింది.చదవండి: DPL: బౌలర్లు ఇక కాస్కోండి.. జూనియర్ సెహ్వాగ్ వచ్చేస్తున్నాడు! వీడియో -
టాలీవుడ్ హీరోయిన్‌తో పృథ్వీ షా ప్రేమాయణం..! ఎవరీ అకృతి?
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ అకృతి అగర్వాల్‌తో కలిసి బుధవారం గణేశ్ చతుర్థిని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను అకృతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో షేర్ చేసింది. ఇందుకు మీకు, మీ కుటంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.గణపతి బప్పా మోర్యా" అని క్యాప్షన్‌గా ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇందుకు నెటిజన్లు మీ జంట చాలా బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. పృథ్వీ భాయ్ నీ కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాను అంటూ మరో యూజర్ కామెంట్ చేస్తున్నాడు.కాగా పృథ్వీ షా తన పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నాడు. ప్రథ్వీ షా ముంబై క్రికెట్ అసోషియేషన్‌తో తెగదింపులు చేసుకున్న పృథ్వీ.. తన మకాంను మహారాష్ట్రకు మార్చాడు. ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ ప్రస్తుతం బుచ్చిబాబు టోర్నీలో ఆడుతున్నాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో ఛత్తీస్ఘడ్పై సెంచరీతో మెరిసిన పృథ్వీ.. అనంతరం రెండో మ్యాచ్‌లో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌పై సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు.ఇదే జోరును ఈ ముంబైకర్ కొనసాగిస్తే తిరిగి ఐపీఎల్‌తో పాటు టీమిండియాలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. షా చివరిసారిగా జూలై 2021లో తరపున ఆడాడు. అదేవిధంగా తన కెరీర్లో మొదటి సారిగా ఐపీఎల్ వేలంలో పృథ్వీ అమ్ముడుపోలేదు. ఐపీఎల్-2025లో వేలంలో అతడిని కొనుగొలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. దీంతో తన ఫిట్నెస్, బ్యాటింగ్‌పై దృష్టి సారించిన పృథ్వీ షా ఎలాగైనా స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నాడు. View this post on Instagram A post shared by AKRITI AGARWAL (@akritiagarwal7) ఎవరీ అకృతి అగర్వాల్?22 ఏళ్ల అకృతి అగర్వాల్.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 3.3 మిలియన్ల మంది ఫాలోవర్ల ఉన్నారు. అంతేకాకుండా ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన త్రిముఖ అనే టాలీవుడ్ మూవీలో ఆకృతి హీరోయిన్గా నటించింది. లక్నోలో జన్మించిన ఆకృతి.. ముంబైలోని నిర్మలా మెమోరియల్ కళాశాలలో విద్యను అభ్యసించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఆమె తన కెరీర్‌ను కంటెంట్ క్రియేటర్‌గా ప్రారంభించింది. . ఆమె యూట్యూబ్ ఛానెల్‌కు 88.8 వేలమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. పృథ్వీ ,అకృతి ఇద్దరూ ముంబైలో చాలాసార్లు జంటగా కనిపించారు. ఈ ముంబై క్రికెటర్ నటి నిధి తపారియాతో బ్రేకప్ తర్వాత అకృతితో ప్రేమలో పడ్డాడు.చదవండి: DPL: బౌలర్లు ఇక కాస్కోండి.. జూనియర్ సెహ్వాగ్ వచ్చేస్తున్నాడు! వీడియో -
సానియాతో అర్జున్ నిశ్చితార్థం జరిగిందా?.. స్పందించిన సచిన్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) ఇంట త్వరలోనే శుభకార్యం జరుగనుంది. సచిన్- అంజలిల కుమారుడు అర్జున్ టెండుల్కర్ (Arjun Tendulkar) పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యాడు. ముంబైలోని ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనుమరాలు సానియా చందోక్‌తో అర్జున్ వివాహ నిశ్చితార్థం జరిగింది.అయితే, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుక గురించి ఇరు కుటుంబాల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా సచిన్ టెండుల్కర్ కుమారుడి నిశ్చితార్థం గురించి వస్తున్న వార్తలపై స్పందించాడు.అర్జున్ ఎంగేజ్మెంట్ నిజంగానే జరిగిందా?సోషల్ మీడియా వేదికగా ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్ నిర్వహించిన సచిన్ టెండుల్కర్‌ను అభిమానులు ప్రశ్నలు అడిగారు. ఇందులో ఓ ఫ్యాన్.. ‘‘అర్జున్ ఎంగేజ్మెంట్ నిజంగానే జరిగిందా?’’ అని ప్రశ్నించారు. ఇందుకు బదులుగా.. ‘‘అవును. నిశ్చితార్థం జరిగింది. అర్జున్ జీవితంలోని కొత్త దశను చూసేందుకు మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని సచిన్ సమాధానమిచ్చాడు.సారా కంటే ముందే అర్జున్ పెళ్లి?సచిన్- అంజలిల మొదటి సంతానంగా కుమార్తె సారా టెండుల్కర్ జన్మించింది. 27 ఏళ్ల సారా మోడల్‌గా, న్యూట్రీషనిస్టుగా రాణిస్తూనే.. ఇటీవలే పైలైట్స్ అకాడమీ (వెల్నెస్ సెంటర్) నెలకొల్పింది. కెరీర్ పరంగా బిజీగా ఉన్న ఆమెకు.. పెళ్లి గురించి ప్రస్తుతం ఆలోచన లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తమ్ముడు అర్జున్ టెండుల్కర్ అక్క సారా కంటే ముందే వివాహ బంధంలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.ఏడాది వ్యత్యాసంఇక సారా ప్రాణ స్నేహితుల్లో సానియా ఒకరు. అన్నట్లు సానియా అర్జున్ కంటే వయసులో ఏడాది పెద్ద. ఇక సారాతో పాటు సచిన్ కుటుంబంతోనూ సానియాకు చాలా ఏళ్లుగా సాన్నిహిత్యం ఉంది. ఇటీవల సారా పైలైట్స్ అకాడమీ ఓపెనింగ్‌లోనూ సచిన్- అంజలిలతో కలిసి పూజలో పాల్గొన్న సానియా.. కాబోయే వదిన సారాతో కలిసి రిబ్బన్ కూడా కట్ చేసింది.క్రికెటర్‌గా పడుతూ.. లేస్తూ..తండ్రి బాటలో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న పాతికేళ్ల అర్జున్ టెండుల్కర్ పెద్దగా రాణించలేకపోతున్నాడు. ఆల్‌రౌండర్ అయిన అర్జున్.. దేశవాళీ క్రికెట్లో గోవా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ గోవా తరఫున 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 532 పరుగులు సాధించడంతో పాటు.. 37 వికెట్లు కూల్చాడు.అదే విధంగా.. 24 టీ20 మ్యాచ్‌లలో కలిపి 27 వికెట్లు తీయడంతో పాటు 119 పరుగులు చేశాడు. లిస్ట్-ఎ క్రికెట్లో 102 పరుగులు సాధించడంతో పాటు.. 25 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఐపీఎల్లో సచిన్ మెంటార్‌గా ఉన్న ముంబై ఇండియన్స్ తరఫున అర్జున్ టెండుల్కర్ 2023లో అరంగేట్రం చేశాడు. ఇప్పటికి క్యాష్ రిచ్ లీగ్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన అర్జున్ టెండుల్కర్.. మూడు వికెట్లు తీయడంతో పాటు ఒక ఇన్నింగ్స్ ఆడి 13 పరుగులు చేశాడు. చదవండి: ఫ్లాట్ కొన్న సచిన్ టెండుల్కర్ సతీమణి.. ‘కేవలం’ రూ. 32 లక్షలు! -
ఛతేశ్వర్ పుజారా నెట్‌వర్త్ ఎంతో తెలుసా?
టీమిండియా అత్యుత్తమ టెస్టు క్రికెటర్లలో ఛతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) ఒకడు. రాహుల్ ద్రవిడ్ తర్వాత మోస్ట్ డిపెండబుల్ బ్యాటర్‌గా ఈ సౌరాష్ట్ర ఆటగాడు పేరొందాడు. 2005లో ప్రొఫెషనల్ ప్లేయర్‌గా తన ప్రయాణం మొదలుపెట్టిన పుజారా.. ఆదివారం (ఆగష్టు 24) అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.దేశీ క్రికెట్లో సౌరాష్ట్రకు ఆడిన పుజారా.. విదర్భతో మ్యాచ్ సందర్భంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. రోజురోజుకూ తన ఆటను మెరుగపరచుకుని దేశీ క్రికెట్ రన్ మెషీన్‌గా మారిపోయిన పుజ్జీ.. 2025లో గుజరాత్‌తో పోరు సందర్భంగా తన చివరి మ్యాచ్ ఆడేశాడు.పుజారా నెట్‌వర్త్ ఎంతో తెలుసా?ఇక 2010లో టీమిండియాలో ఎంట్రీ ఇచ్చిన పుజారా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC)-2023 ఫైనల్ సందర్భంగా తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. కాగా భారత టెస్టు క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పుటలు లిఖించుకున్నాడు పుజారా. ఆట పరంగా ఉన్నత శిఖరాలకు చేరుకున్న 37 ఏళ్ల పుజారా నెట్‌వర్త్ (Networth) ఎంతో తెలుసా?!వివిధ మీడియా రిపోర్టుల ప్రకారం పుజారా నికర ఆస్తుల విలువ రూ. 24 కోట్లు అని అంచనా. బీసీసీఐ కాంట్రాక్టులో ‘బి’ కేటగిరిలో ఉన్న ఆటగాడిగా అప్పట్లో రూ. 3 కోట్ల వార్షిక వేతనం పొందిన పుజ్జీ.. మ్యాచ్ ఫీజుల ద్వారా కూడా మంచి మొత్తమే అందుకున్నాడు.నెల సంపాదన రూ. 15 లక్షలు!ఇక జాతీయ జట్టుకు దూరమైన తర్వాత దేశీ క్రికెట్ ఆడటం ద్వారా కూడా ఆర్జించిన పుజారా.. పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తున్నాడు. కామెంటేటర్‌గానూ సేవలు అందిస్తున్నాడు. తాజా రిపోర్టుల సమాచారం ప్రకారం.. అతడి నెల సంపాదన రూ. 15 లక్షలు అని అంచనా.తన కెరీర్లో టీమిండియా తరఫున 103 టెస్టులు ఆడిన పుజారా.. ఏడు వేలకు పైగా పరుగులు సాధించాడు. సంప్రదాయ క్రికెట్లో మేటి బ్యాటర్‌గా ఎదిగినప్పటికీ టీ20 ఫార్మాట్లో పెద్దగా రాణించలేకపోయాడు. అందుకే.. ఐపీఎల్లో అతడికి ఎక్కువగా ఆడే అవకాశం రాలేదు.మిగతా వారితో పోలిస్తే కాస్త తక్కువే!అందుకే తన సమకాలీన ఆటగాళ్లతో పోలిస్తే పుజారా సంపాదన తక్కువగానే అనిపించవచ్చు. నిరాడంబర జీవితానికి పెద్ద పీట వేసే పుజారా గ్యారేజీలో కొన్ని విలాసవంతమైన కార్లు కూడా ఉండటం విశేషం. ఆడి ఏ6, ఫోర్డ్, బీఎండబ్ల్యూ 5- సిరీస్, మెర్సిడెజ్ బెంజ్‌లు పుజ్జీ వద్ద ఉన్నాయి.పెన్షన్ ఎంతంటే?రిటైర్ అయిన మాజీ క్రికెటర్లు, అంపైర్లకు బీసీసీఐ ప్రతినెలా పెన్షన్ ఇస్తుందన్న విషయం తెలిసిందే. ఆటకు వీడ్కోలు చెప్పిన తమ ప్లేయర్లకు ఆర్థిక చేయూతను ఇవ్వడంతో పాటు.. వారి సేవలకు గుర్తింపుగా బీసీసీఐ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. 2022లో పలు మార్పుల అనంతరం.. మాజీ ఆటగాళ్లకు ఇచ్చే పెన్షన్ భారీగానే పెరిగింది.టీమిండియా తరఫున ఆడిన మ్యాచ్‌ల సంఖ్య, ఎంతకాలం జట్టులో ఉన్నారన్న అంశాలతో పాటు అంతర్జాతీయ టెస్టులు ఆడారా? లేదా? అని పరిశీలించి మూడు కేటగిరీల్లో పెన్షన్ ఇస్తారు. ఉన్నత శ్రేణిలో ఉన్న వారికి రూ. 70 వేలు, దిగువ శ్రేణి ఆటగాళ్లకు రూ. 60 వేలు, ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడిన మాజీ ఆటగాళ్లకు రూ. 30 వేల చొప్పున బీసీసీఐ పెన్షన్ అందిస్తోంది. దీని ప్రకారం పుజారాకు రూ. 60 వేల మేర పెన్షన్ లభించవచ్చు.చదవండి: AUS vs SA: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా.. -
ప్రియాతో నా ప్రేమకథ అలా మొదలైంది: రింకూ సింగ్
క్రికెటర్ రింకూ సింగ్ (Rinku Singh) ఆసియా కప్-2025 టోర్నమెంట్‌తో టీమిండియాలో పునరాగమనం చేయనున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో టీ20 సందర్భంగా జాతీయ జట్టు తరఫున చివరి మ్యాచ్ ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రీమియర్ లీగ్ (UPT20)తో బిజీగా ఉన్నాడు.ఇదిలా ఉంటే.. రింకూ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. లోక్‌సభ ఎంపీ ప్రియా సరోజ్ (Priya Saroj)తో జూన్ 8న అతడి నిశ్చితార్థం జరిగింది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ప్రియా సరోజ్ మచ్లిషెహర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎంపికయ్యారు.మూడేళ్లుగా..ఇక ఎంగేజ్మెంట్ ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘మూడేళ్లుగా ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నాం’’ అంటూ రింకూ- ప్రియా క్యాప్షన్ జతచేశారు. దీనిని బట్టి తామిద్దరం చాలాకాలంగా ప్రేమలో ఉన్నట్లు చెప్పకనే చెప్పారు. అయితే, క్రికెటర్ అయిన రింకూకు.. ప్రియాతో పరిచయం ఎలా ఏర్పడింది?.. వీరి లవ్‌స్టోరీ ఎలా మొదలైంది?.. అన్న విషయాలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించాయి.చూడగానే నచ్చేసిందిఈ నేపథ్యంలో తమ ప్రేమకథ గురించి రింకూ సింగ్ తాజాగా వెల్లడించాడు. ‘‘2002లో.. కోవిడ్ సమయంలో మా మధ్య ప్రేమ మొదలైంది. అప్పుడు ముంబైలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. నాకున్న ఫ్యాన్ పేజీలో.. ప్రియా ఓ గ్రామంలో ప్రచారం చేస్తున్న ఫొటో కనబడింది.సాధారణంగా ప్రియ వాళ్ల సోదరి.. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీస్తారు. ఆవిడే వారి ఫొటోలు నా ఫ్యాన్ పేజీలో పెట్టమని అడిగినట్లున్నారు. ప్రియా ఫొటో చూడగానే నాకు నచ్చింది.నాకు తనే పర్ఫెక్ట్ జోడీ అనిపించింది. ఆమెకు మెసేజ్ చేయాలని అనుకున్నాను. కానీ అలా చేయడం సరికాదని ఊరుకున్నాను. అయితే, నా ఫొటోలు కొన్నింటికి ప్రియా లైక్ కొట్టింది. వెంటనే ఇన్స్టాగ్రామ్ ద్వారా తనకు మెసేజ్ చేశాను. అలా స్నేహం మొదలైంది.తను చాలా బిజీ..ఆ తర్వాత కాల్స్ మాట్లాడుకునేవాళ్లం. వారంలో కనీసం రెండు రోజులు తప్పకుండా మాట్లాడుకునేవాళ్లం. ముఖ్యంగా నా మ్యాచ్‌కు ముందు తనతో మాట్లాడేవాడిని. అలా 2022 నుంచి మా మధ్య ప్రేమ మొదలైంది’’ అని రింకూ తన లవ్‌స్టోరీ గురించి చెప్పాడు.అదే విధంగా.. ‘‘తను ఎంపీ అయిన తర్వాత కూడా మా ప్రేమలో ఎలాంటి మార్పూ రాలేదు. అయితే, మొదట్లో మాట్లాడుకునేందుకు ఎక్కువ సమయం దొరికేది. కానీ తర్వాత తను నాకోసం కేటాయించే సమయం కాస్త తగ్గిపోయింది.తను చాలా బిజీగా ఉంటుంది. గ్రామాలకు వెళ్తుంది. ప్రజల సమస్యలు తెలుసుకుని.. వారికి సాయం చేస్తూ ఉంటుంది. అంతేకాదు.. పార్లమెంట్స్ సెషన్స్‌కు కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఏదేమైనా ఓ రాజకీయ నాయకురాలిగా తను గ్రౌండ్‌వర్క్ ఎక్కువగానే చేయాల్సి ఉంటుంది.తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన ఫొటోలే మీకు ఎక్కువగా కనిపిస్తాయి. పొద్దున వెళితే.. రాత్రికి ఎప్పుడో ఇల్లు చేరుకుంటుంది. కాబట్టి మాకు మాట్లాడుకునేందుకు ఎక్కువ సమయం దొరకదు’’ అని రింకూ సింగ్ తనకు కాబోయే భార్య.. ప్రజాప్రతినిధిగా విధులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని తెలిపాడు.చదవండి: నేనెప్పుడూ అలా అనుకోలేదు.. తమ్ముడికి ఇష్టమే: సారా టెండుల్కర్ -
ఫ్లాట్ కొన్న సచిన్ టెండుల్కర్ సతీమణి.. ‘జస్ట్’ రూ. 32 లక్షలు!
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) సతీమణి అంజలి టెండుల్కర్ ఫ్లాట్ కొన్నారు. ముంబైకి సమీపంలోని వివర్ ఏరియాలో చవకైన ధరకే ఫ్లాట్‌ను సొంతం చేసుకున్నారు. ఇందుకు గానూ ఆమె రూ. 32 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది.ఈ ఫ్లాట్ విస్తీర్ణం కేవలం 391 చదరపు అడుగులు మాత్రమే. గతేడాది మే 30న అంజలి (Anjali) ఈ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఆమె రూ. 1.92 లక్షలు మేర స్టాంపు డ్యూటీ.. రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. 30 వేలు చెల్లించినట్లు జాప్కీ.కామ్ వెల్లడించింది.కాగా మహిళలు ఫ్లాట్లు కొనుగోలు చేస్తే స్టాంపు డ్యూటీ కింద ఒక శాతం రాయితీ ఉంటుంది. అంతేకాదు.. మహారాష్ట్రలో మహిళలు ఇంటి యజమానులుగా ఉంటే.. పట్టణాలు, జిల్లాలను బట్టి ఈ రాయితీ 5 నుంచి 7 శాతం వరకు ఉంటుంది.సచిన్ ఆస్తి ఎంతంటే?ఇరవై నాలుగేళ్లపాటు టీమిండియా క్రికెటర్‌గా కొనసాగిన సచిన్ టెండుల్కర్ తన సుదీర్ఘ కెరీర్లో లెక్కలేనన్ని రికార్డులు సాధించాడు. అదే రేంజ్లో సంపదనూ పోగేసుకున్నాడు. ఓవైపు.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్‌గా వార్షిక జీతం, మ్యాచ్ ఫీజులు.. మరోవైపు బ్రాండ్ ఎండార్స్మెంట్లు, సదరు బ్రాండ్లకు వ్యాపార భాగస్వామిగా ఉండటం ద్వారా రెండు చేతులా సంపాదించాడు.ఆటకు వీడ్కోలు పలికి పుష్కరం గడుస్తున్నా సచిన్ సంపాదన పెరుగుతూనే ఉంది. వివిధ నివేదికల ప్రకారం.. సచిన్ నికర ఆస్తుల విలువ రూ. 1250 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఇక సచిన్ కుటుంబం నివసించేందుకు బాంద్రాలో తన కలల సౌధాన్ని నిర్మించాడు. దీని విలువ రూ. 80 కోట్లకు పైమాటే!అలాంటిది సచిన్ భార్య అంజలి మాత్రం ఇంత చవగ్గా ఫ్లాట్ కొనడం పట్ల అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వివర్లో ఇంతటి చిన్న విస్తీర్ణంలో ఉండే ఫ్లాట్లను అద్దెల కోసం కొనుగోలు చేస్తారు చాలా మంది. స్టూడియోలు, సింగిల్ బెడ్రూమ్ రెంటల్స్ కోసం వినియోగిస్తారు.క్రికెటర్‌గా ఎదుగుతున్న సమయంలోనే..క్రికెటర్‌గా ఎదుగుతున్న సమయంలోనే తనకంటే ఐదేళ్లు పెద్దదైన అంజలి మెహతాను ప్రేమించిన సచిన్ టెండుల్కర్.. 1995లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె సారా, కుమారుడు అర్జున్ టెండుల్కర్ సంతానం.ఇక ఇటీవల సచిన్- అంజలి దంపతుల కుమారుడు అర్జున్ టెండుల్కర్ వివాహ నిశ్చితార్థం జరిగింది. వ్యాపార దిగ్గజం రవి ఘామ్ మనుమరాలు సానియా చందోక్ మెడలో అర్జున్ మూడుముళ్లు వేయబోతున్నాడు. అర్జున్ అక్క సారాకు సానియా బెస్ట్ ఫ్రెండ్.ఇదిలా ఉంటే.. అర్జున్ క్రికెటర్‌గా అదృష్టం పరీక్షించుకుంటుండగా.. సారా మోడల్, న్యూట్రీషనిస్ట్గా రాణిస్తోంది. ఇటీవలే ఆమె పైలైట్స్ స్టూడియో (వెల్నెస్ సెంటర్)ను ఆరంభించింది కూడా!.. అంతా ఆట వల్లేఅతి సాధారణ కుటుంబంలో జన్మించిన సచిన్ ఈ స్థాయికి చేరడానికి ఏకైక కారణం క్రికెట్. తన నైపుణ్యాలతో శతక శతకాల ధీరుడిగా ఈ ముంబైకర్ ప్రపంచ క్రికెట్లో ఆల్‌టైమ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. అలాగే ఆర్థికంగానూ ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు.చదవండి: నేనెప్పుడూ అలా అనుకోలేదు.. తమ్ముడికి ఇష్టమే: సారా టెండుల్కర్ -
నేనెప్పుడూ అలా అనుకోలేదు.. తమ్ముడికి ఇష్టమే: సారా టెండుల్కర్
సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar).. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రపంచ క్రికెట్లో ఎవరికీ సాధ్యం కాని ఎన్నో రికార్డులు సాధించాడు ఈ బ్యాటింగ్ దిగ్గజం. వీటిలో రెండు మాత్రం భారత్‌తో పాటు సచిన్‌కు ఎంతో ప్రత్యేకం.శతక శతకాల ధీరుడుఅంతర్జాతీయ క్రికెట్లో టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి 34,357 పరుగులు సాధించిన సచిన్ టెండుల్కర్.. అత్యధిక పరుగుల వీరుడిగా ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేశాడు. అదే విధంగా.. ఇంటర్నేషనల్ క్రికెట్లో వంద శతకాలు (51 టెస్టు, 49 వన్డే) బాదిన ఏకైక క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. తండ్రి అడుగుజాడల్లో అర్జున్అయితే, సచిన్ టెండుల్కర్ సంతానంలో కుమారుడు అర్జున్ టెండుల్కర్ మాత్రమే క్రికెట్ వైపు మొగ్గు చూపాడు. కానీ నైపుణ్యాల పరంగా తండ్రికి దరిదాపుల్లో కూడా అతడు లేడు. పాతికేళ్ల అర్జున్ ఆల్‌రౌండర్. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో గోవా తరఫున ఆడుతున్నాడు.సారా మాత్రం భిన్నంమరోవైపు.. సచిన్- అంజలిల మొదటి సంతానమైన సారా టెండుల్కర్ మాత్రం భిన్నమైన కెరీర్‌ను ఎంచుకుంది. మోడల్‌గా, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా, న్యూట్రీషనిస్టుగా తనకు నచ్చిన బాటలో పయనిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన సారాకు.. తండ్రిలా క్రికెట్‌ను ఎందుకు కెరీర్‌లా ఎంచుకోలేదనే ప్రశ్న ఎదురైంది.నేనెప్పుడూ అలా అనుకోలేదు.. తమ్ముడికి ఇష్టమేఇందుకు బదులిస్తూ.. ‘‘నేనెప్పుడూ క్రికెటర్ కావాలని అనుకోలేదు. అయితే, మా తమ్ముడికి మాత్రం క్రికెట్ అంటే ఇష్టం. నేను చిన్నపుడు గల్లీ క్రికెట్ ఆడాను. కానీ దానినే కెరీర్‌గా మలచుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు’’ అని ఇండియా టుడేతో సారా టెండుల్కర్ పేర్కొంది.అదే విధంగా.. చిన్నపుడు తండ్రి మ్యాచ్‌లు చూసేందుకు స్టేడియానికి వెళ్లేదానినన్న సారా.. ఇప్పుడు కూడా టీమిండియా మ్యాచ్‌లు ప్రత్యక్షంగా వీక్షిస్తానని తెలిపింది. తండ్రి రిటైర్మెంట్ మ్యాచ్ తనకింకా గుర్తుందని.. ఆ సమయంలో ఆయన భావోద్వేగాలను అర్థం చేసుకోగల పరిణతి మాత్రం అప్పుడు తనకు లేదని పేర్కొంది.కాగా 1989 నుంచి 2013 వరకు టీమిండియా తరఫున క్రికెట్ ఆడిన సచిన్ టెండుల్కర్.. 200 టెస్టుల్లో 15921, 463 వన్డేల్లో 18426, ఒక టీ20లో పది పరుగులు సాధించాడు. ఐపీఎల్లో 78 మ్యాచ్‌లు ఆడిన సచిన్.. 2334 పరుగులు చేశాడు.త్వరలోనే సచిన్ ఇంట శుభకార్యంఇక సచిన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. డాక్టర్ అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి సంతానమే సారా, అర్జున్. కాగా త్వరలోనే సచిన్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. అతడి కుమారుడు అర్జున్ టెండుల్కర్- సానియా చందోక్‌తో వివాహ బంధంలో అడుగుపెట్టనున్నాడు. ఇటీవలే ఈ జంట నిశ్చితార్థం జరిగింది. ముంబైలోని బడా వ్యాపారవేత్త రవి ఘాయ్ మనుమరాలే సానియా. ఇదిలా ఉంటే.. అక్క సారా కంటే ముందే తమ్ముడు అర్జున్ పెళ్లి పీటలు ఎక్కనుండటం విశేషం. చదవండి: హ్యాట్సాఫ్ ధనశ్రీ: రోహిత్ భార్య రితికా అలా.. సూర్య సతీమణి దేవిశా ఇలా -
హ్యాట్సాఫ్: రోహిత్ భార్య రితికా అలా.. సూర్య సతీమణి దేవిశా ఇలా
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సతీమణి దేవిశా శెట్టి (Devisha Shetty)ఇన్‌స్టా స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత స్పిన్నర్ యజువేంద్ర చహల్ (Yuzuvendra Chahal) మాజీ భార్య ధనశ్రీ వర్మకు మద్దతు తెలుపుతూ ఓ షార్ట్ వీడియోను దేవిశా షేర్ చేసింది. ఈ నేపథ్యంలో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.ఈ ఏడాది విడాకులు మంజూరుఅసలేం జరిగిందంటే.. కొరియోగ్రాఫర్, నటి అయిన ధనశ్రీ వర్మను ప్రేమించిన చహల్ 2020లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత కొన్నాళ్లకే వైవాహిక బంధంలో పొరపొచ్చాలు వచ్చాయి. దీంతో దాదాపు రెండేళ్లుగా దూరంగా ఉంటున్న ఈ జంటకు.. ఈ ఏడాది మార్చిలో అధికారికంగా విడాకులు మంజూరు అయ్యాయి.చహల్ స్పందన ఇదిఈ విషయం గురించి చహల్ స్పందిస్తూ.. తన జీవిత భాగస్వామిని మనస్ఫూర్తిగా ప్రేమించినా.. విడిపోక తప్పలేదంటూ ధనశ్రీని పరోక్షంగా విమర్శించాడు. ఇక విడాకులకు ముందే ఆర్జే మహ్వశ్తో కలిసి ట్రిప్పులకు వెళ్లిన చహల్.. ఆమె తనకు స్నేహితురాలు మాత్రమేనని.. తమ మధ్య ప్రేమ లేదని చెప్పాడు.ఇదిలా ఉంటే.. బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకుల తీర్పు కోసం వెళ్లిన సమయంలో చహల్.. ‘బీ యువర్ ఓన్ షుగర్ డాడీ’ అనే కొటేషన్ ఉన్న కస్టమైజ్డ్ టీ షర్టు వేసుకున్నాడు. దీనర్థం.. ‘ఆర్థికంగా స్వతంత్రంగా ఉండండి.. మీ బాగోగులు మీరే చూసుకోండి.. ఆర్థిక సాయం, బహుమతుల కోసం ఇతరులపై ఆధారపడకండి’. దీనిని బట్టి ధనశ్రీ భరణం అడుగుతున్న కారణంగానే చహల్ ఇలా చేశాడని నెటిజన్లు కామెంట్లు చేశారు.‘గోల్డ్ డిగ్గర్’ పోస్టుకు లైక్ కొట్టిన రితికామరోవైపు.. చహల్ ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న ఆర్జే మహ్వశ్ సైతం.. ధనశ్రీని నిందించేలా ఆర్థిక స్వాతంత్ర్యం గురించి అదే సమయంలో పోస్ట్ పెట్టింది. ఇంకోవైపు.. జర్నలిస్టు శుభంకర్ మిశ్రా ధనశ్రీని ‘గోల్డ్ డిగ్గర్ (డబ్బు కోసం సంబంధం పెట్టుకునే మహిళ)’ అంటూ అసభ్యకర రీతిలో విమర్శించాడు.ఇందుకు.. టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే లైక్ కొట్టి.. పరోక్షంగా ధనశ్రీపై ఆ జర్నలిస్టులాగే నిందలు వేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ధనశ్రీ వర్మ తన విడాకుల గురించి తొలిసారిగా మాట్లాడింది.గట్టిగా ఏడ్చేశాతన జీవిత భాగస్వామి కోసం చేయాల్సినవన్నీ చేశానని.. అయితే, అతడే ముందుగా వైవాహిక బంధం నుంచి వైదొలిగాడని ధనశ్రీ తెలిపింది. అంతేకాదు.. తనపై నిందలు మోపేలా చహల్ అలాంటి టీ షర్టు ధరిస్తాడని ముందుగానే తనకు తెలుసునంది. తన పార్ట్నర్ను ఎంతో ప్రేమించానని.. అందుకే విడాకుల తీర్పు వినగానే కోర్టులోనే గట్టిగా ఏడ్చేశానంటూ ఆవేదనను పంచుకుంది.విడాకుల నేపథ్యంలో తనపై విపరీతమైన నెగటివిటీ వచ్చిందని.. అయితే, తన తల్లిదండ్రుల కోసం స్ట్రాంగ్‌గా ఉన్నట్లు నటిస్తున్నానని ధనశ్రీ చెప్పుకొచ్చింది. సున్నితమైన ఈ అంశంలో తన గోప్యతకు భంగం కలిగించేలా ఎంతో మంది ఎన్నో విధాలుగా పిచ్చి కూతలు కూశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.అత్యంత గౌరవం, ప్రేమ.. హ్యాట్సాఫ్ఇందుకు సంబంధించిన షార్ట్ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన దేవిశా శెట్టి.. ‘‘నీ పట్ల అత్యంత గౌరవం, ప్రేమ ఉన్నాయి’’ అంటూ ధనశ్రీ వర్మకు మద్దతుగా నిలిచింది. ఈ నేపథ్యంలో ధనశ్రీ పట్ల టీమిండియా కెప్టెన్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌ల సతీమణులు.. రితికా సజ్దే, దేవిశా శెట్టి వైఖరిని పోలుస్తూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. తొలుత తప్పంతా ధనశ్రీ వర్మదే అని భావించినా.. కొత్త మహిళ రాక (మహ్వశ్)తో అంతా అర్థమైపోయిందంటూ కొందరు వ్యాఖ్యానిస్తుండగా.. మరి కొందరు మాత్రం ఎప్పటిలాగే ధనశ్రీనే నిందిస్తున్నారు.ఇదిలా ఉంటే.. సూర్యకుమార్ యాదవ్ తదుపరి ఆసియా కప్-2025 టోర్నీతో బిజీ కానున్నాడు. మరోవైపు.. టీ20, టెస్టులకు గుడ్‌బై చెప్పిన రోహిత్ శర్మ వన్డే రీఎంట్రీ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇక చహల్ చాలా కాలంగా టీమిండియాకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. చదవండి: అక్కకు బెస్ట్ ఫ్రెండ్.. అర్జున్ టెండుల్కర్- సానియా చందోక్ ఏజ్ గ్యాప్ ఎంతంటే? -
సచిన్ కంటే వినోద్ కాంబ్లీ బెటర్?.. నేనెప్పుడూ వినలేదు.. ఇద్దరూ సమానమే
సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar).. వినోద్ కాంబ్లీ (Vinod Kambli)... ఈ ఇద్దరు ముంబై తరఫున దాదాపు ఒకేసారి క్రికెట్లో అడుగుపెట్టారు. ఇద్దరూ కలిసి దేశవాళీ క్రికెట్ ఆడుతూ తమను తాము నిరూపించుకున్నారు. ఈ క్రమంలో దేశానికి ప్రాతినిథ్యం వహించే స్థాయికి చేరుకున్నారు.ఇక ముందూ ఎవరికీ సాధ్యం కాని ప్రపంచ రికార్డుఅయితే, సచిన్ టెండుల్కర్ వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ.. ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ రికార్డులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు, శతక శతకాలు సాధించిన ఏకైక ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.మద్యానికి బానిసై..మరోవైపు.. వినోద్ కాంబ్లీ మాత్రం తన ప్రతిభను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. క్రమశిక్షణారాహిత్యం, వివాదాల కారణంగా కెరీర్‌నే కోల్పోయాడని అతడి గురించి తరచూ విమర్శలు వస్తుంటాయి. అంతేకాదు.. మద్యానికి బానిసై ఇటు వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం విషయంలోనూ అశ్రద్ధ కారణంగా అయినవాళ్లకూ దూరమయ్యాడు కాంబ్లీ.సచిన్ కంటే నేనే గొప్ప?అయితే, భార్య ఆండ్రియా కారణంగా తిరిగి మామూలు మనిషినైన వినోద్ కాంబ్లీ.. 1983 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులోని సభ్యుల సాయంతో కోలుకుంటున్నాడు. ఇక కాంబ్లీని చుట్టుముట్టిన ఎన్నో వివాదాల్లో.. తాను సచిన్ కంటే గొప్ప ఆటగాడినని చెప్పినట్లు వచ్చిన వార్త ఒకటి.నేనైతే ఎప్పుడూ వినలేదు.. ఇద్దరూ సమానమేఈ విషయంపై వినోద్ కాంబ్లీ సోదరుడు వీరేంద్ర తాజాగా స్పందించాడు. ‘‘వారిద్దరు ప్రతిభ ఉన్న ఆటగాళ్లు. నైపుణ్యాల విషయంలో ఇద్దరూ సమానమే. సచిన్ కంటే నా సోదరుడు బెటర్ అని ఎవరూ చెప్పరు. అలాగే.. కాంబ్లీ కంటే సచిన్ మెరుగైన ఆటగాడు అని కూడా అనలేరు.వాళ్లిద్దరు సేమ్. తాను సచిన్ కంటే బెటర్ ప్లేయర్ అని నా సోదరుడు చెప్పడాన్ని నేనైతే ఎప్పుడూ వినలేదు. అంతేకాదు.. వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలు కూడా అబద్ధం. సచిన్ దాదా వినోద్‌కు ఎల్లప్పుడూ అండగా ఉన్నాడు.సచిన్ దాదా వినోద్ ఆరోగ్యం గురించి ఆరా తీస్తారువారి స్నేహ బంధం గొప్పది. ఆండ్రియాకు ఫోన్ చేసి వినోద్ ఆరోగ్య సమాచారం గురించి సచిన్ దాదా ఆరా తీస్తుంటారు. సచిన్ దాదా వినోద్‌కు క్లోజ్ ఫ్రెండ్. రంజీ మ్యాచ్‌లు ఆడేపుడు నేను వినోద్‌తో కలిసి డ్రెసింగ్‌రూమ్‌కు వెళ్లినపుడు.. సరదాగా ముచ్చట్లు పెట్టుకునే వాళ్లం. వారిద్దరు మంచి స్నేహితులు’’ అంటూ కాంబ్లీ- సచిన్‌ల గురించి విక్కీ లల్వాణీ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.అదే విధంగా.. క్రికెట్ ఆడే యువకులు సక్సెస్ వచ్చిన తర్వాత కూడా నిరాండబరంగా ఉండాలని వీరేంద్ర కాంబ్లీ ఈ సందర్భంగా సూచించాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా సచిన్ దాదా మాదిరి ఒదిగి ఉంటే.. సుదీర్ఘకాలం కెరీర్ కొనసాగించవచ్చని చెప్పాడు. సచిన్, వినోద్ చిన్ననాటి నుంచే ఎంతో కష్టపడి ఆటగాళ్లుగా ఈ స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నాడు. ఏదేమైనా కాళ్లు నేల మీదే ఉండాలని.. అప్పుడే విజయం ఎల్లప్పుడు మన వెంటే ఉంటుందని వీరేంద్ర కాంబ్లీ చెప్పుకొచ్చాడు.చదవండి: నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు.. నేనేంటో నాకు తెలుసు: పృథ్వీ షా -
‘ఆ మాట వినగానే గట్టిగా ఏడ్చేశా.. అతడే ముందుగా వెళ్లిపోయాడు’
టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ (Yuzuvendra Chahal) గత కొన్నాళ్లుగా వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. భార్య ధనశ్రీ వర్మ (Dhanashree Verma)తో విడాకుల నేపథ్యంలో ఆర్జే మహ్వశ్ (RJ Mahvash)తో అతడు తరచూ కలిసి కనిపించడం డేటింగ్ వదంతులకు ఊతమిచ్చింది. ధనశ్రీతో విడిపోయే ముందు నుంచే వీరిద్దరు చెట్టాపట్టాలు వేసుకుని జంటగా కనిపించడంతో చహల్‌పై ట్రోల్స్ వచ్చాయి.మానసికంగా కుంగిపోయా..ఇటీవల ఈ విషయంపై స్పందిస్తూ.. మహ్వశ్ తనకు స్నేహితురాలు మాత్రమే అని చెప్పిన చహల్.. తన వైవాహిక జీవితం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను మనస్ఫూర్తిగా ధనశ్రీని ప్రేమించానని.. అయినప్పటికీ పరిస్థితి విడాకుల దాకా వచ్చిందని పేర్కొన్నాడు. మానసికంగా తీవ్రంగా కుంగిపోయి ఆత్మహత్య ఆలోచనలు కూడా చేశానని వెల్లడించాడు.ఆ మాట వినగానే ఏడ్చేశాఈ నేపథ్యంలో చహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ తాజాగా విడాకుల అంశంపై స్పందించింది. హ్యూమన్స్ బాంబేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘విడాకుల కోసం మేము మానసికంగా పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాము. కానీ.. ఆరోజు జడ్జిగారు తీర్పు ఇస్తున్నపుడు నేను భావోద్వేగాలను అదుపుచేసుకోలేకపోయాను.అందరి ముందే గట్టిగా ఏడవడం నాకింకా గుర్తుంది. అసలు అప్పుడు నా మనసులో ఎలాంటి అలజడి చెలరేగుతుందో వేరెవరూ అర్థం చేసుకోలేరు. నేను అలా ఏడుస్తూ ఉండిపోయానంతే. అయినా ఇది జరిగిపోయిన విషయం.అతడే వదిలేశాడుఅతడే (చహల్) ముందుగా వైవాహిక జీవితం నుంచి బయటకు వెళ్లిపోయాడు’’ అంటూ ధనశ్రీ వర్మ తన ఆవేదనను పంచుకుంది. ఇక విడాకుల మంజూరు సందర్భంగా చహల్.. ‘బీ యువర్ ఓన్ షుగర్ డాడీ’ అనే కోట్ రాసి ఉన్న టీ షర్టు ధరించడం గురించి ధనశ్రీకి ప్రశ్న ఎదురైంది.డ్రామాలు అవసరమా?ఇందుకు బదులిస్తూ.. ‘‘కచ్చితంగా ఇలాంటి విషయాల్లో ఎదుటి వాళ్లు మనల్ని నిందిస్తారు. ఇలాంటి టీ- షర్టు స్టంట్ ఉంటుందని నాకు ముందుగానే తెలుసు. ఈ విషయంలో తప్పంతా నాదేనని చిత్రీకరించేందుకు వాళ్లు సిద్ధంగా ఉంటారనీ తెలుసు.అయినా.. వాట్సాప్‌లో నాకు ఆ మెసేజ్ పెట్టి ఉంటే సరిపోయేది కదా!.. ఈ టీ-షర్టు డ్రామా ఎందుకు?’’ అంటూ ధనశ్రీ చహల్‌కు కౌంటర్ ఇచ్చింది. ఇక తన వైవాహిక జీవితంలో భాగస్వామికి ఎల్లవేళలా మద్దతుగా ఉన్నానని ధనశ్రీ స్పష్టం చేసింది.‘‘నా జీవిత భాగస్వామికి ఎల్లప్పుడూ అండగా ఉన్నాను. ప్రతీ చిన్న, పెద్ద విషయంలో అతడికి తోడుగా ఉన్నాను. మా అన్యోన్యత గురించి అందరికీ తెలుసు. అందుకే విడిపోతున్నామని తెలిసినపుడు నా మనసు అంతగా వేదనకు గురైంది’’ అని ధనశ్రీ తాను చహల్ పట్ల ప్రేమ, అంకితభావంతో మెలిగానని పేర్కొంది.కాగా కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మను 2020లో చహల్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, పెళ్లైన రెండేళ్లకే విభేదాలు తలెత్తగా ఈ ఏడాది మార్చిలో అధికారికంగా విడిపోయారు. భరణంగా రూ. 4 కోట్ల 75 లక్షలుఈ క్రమంలో కోర్టుకు హాజరైన చహల్.. ‘‘ఆర్థికంగా స్వతంత్రంగా ఉండండి.. మీ బాగోగులు మీరే చూసుకోండి.. ఆర్థిక సాయం, బహుమతుల కోసం ఇతరులపై ఆధారపడకండి’’ అన్న కొటేషన్ ఉన్న నలుపు రంగు టీ- షర్టు ధరించాడు. భరణంగా మాజీ భార్యకు రూ. 4 కోట్ల మేర చెల్లించేందుకు అంగీకరించిన చహల్ ఈ చర్య ద్వారా పరోక్షంగా ధనశ్రీకి కౌంటర్ ఇచ్చాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.చదవండి: అక్కకు బెస్ట్ ఫ్రెండ్.. అర్జున్ టెండుల్కర్- సానియా చందోక్ ఏజ్ గ్యాప్ ఎంతంటే? -
సారాకు సానియా సలహా.. అర్జున్ టెండుల్కర్ రియాక్షన్ వైరల్!
కుమారుడి నిశ్చితార్థ వేడుకతో టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) కుటుంబం ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోంది. సచిన్ కొడుకు అర్జున్ టెండుల్కర్‌కు.. ముంబైకి చెందిన బడా వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్ (Saaniya Chandhok)తో ఆగష్టు 13న ఎంగేజ్మెంట్ అయినట్లు సమాచారం.ఆతిథ్య రంగం, ఫుడ్ ఇండస్ట్రీస్‌లో ప్రసిద్ధి చెందిన ఘాయ్ కుటుంబం.. పాపులర్ ఐస్‌క్రీమ్ బ్రాండ్ బ్రూక్లిన్ క్రీమెరీతోనూ పేరుగాంచింది. మరోవైపు.. జంతు ప్రేమికురాలైన సానియా.. ‘మిస్టర్ పాస్ పెట్ స్పా’ స్టోర్‌కు డైరెక్టర్‌గా, భాగస్వామిగా ఉంది. కాబోయే మరదలితో సారాఇక టెండుల్కర్ కుటుంబానికి కాబోయే కోడలిగా సానియా పేరు బయటకు రాగానే.. సచిన్ ఫ్యామిలీతో ముఖ్యంగా.. సారా టెండుల్కర్ (Sara Tendulkar)తో ఆమె ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.సారా టెండుల్కర్ ఇటీవల పైలేట్స్ స్టూడియో (వెల్నెస్ సెంటర్) ప్రారంభించగా.. పూజా కార్యక్రమాల్లో కాబోయే అత్తమామలతో కలిసి సానియా పాల్గొంది. అలాగే.. అంతకుముందు సారాతో కలిసి విదేశీ ట్రిపులకు వెళ్లింది సానియా. ఇక కాబోయే మరదలితో కలిసి దిగిన ఫొటోలను సారా గతంలో షేర్ చేయగా.. ఇప్పుడు అవి తెరమీదకు వచ్చాయి.అర్జున్ కంటే వయసులో పెద్దా?వీటిని బట్టి సానియా.. సారా బెస్ట్ఫ్రెండ్స్లో ఒకరిగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అర్జున్ టెండుల్కర్- సానియా చందోక్ వయసు వ్యత్యాసం గురించి కూడా చర్చ నడుస్తోంది. కాగా సచిన్- అంజలిలకు మొదటి సంతానంగా సారా జన్మించగా.. ఆ తర్వాత రెండేళ్లకు అంటే.. సెప్టెంబరు 24, 1999లో కుమారుడు అర్జున్ జన్మించాడు. ప్రస్తుతం అతడి వయసు 25 ఏళ్లు.మరోవైపు.. సానియా జూన్ 23, 1998లో జన్మించింది. ఆమె ప్రస్తుత వయసు 26 ఏళ్లు. అంటే.. సానియా అర్జున్ కంటే దాదాపు ఏడాది పెద్దది. కాగా సచిన్ కంటే తన భార్య అంజలి వయసులో ఐదేళ్లు పెద్దావిడ అన్న సంగతి తెలిసిందే.సారాకు సానియా సలహా.. అర్జున్ రియాక్షన్ ఇదేఇదిలా ఉంటే.. గతేడాది సారా టెండుల్కర్ తన బర్త్‌డే (అక్టోబరు 12, 1997)కు ముందు.. ‘‘బెస్ట్ అడ్వైస్’’ కావాలంటూ తమ ఆప్తులను అడిగింది. ఇందులో సానియా కూడా ఉంది. ‘‘ఒత్తిడిలో కూరుకుపోకుండా.. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించు’’ అంటూ సానియా సారాకు సలహా ఇచ్చింది.అయితే, అర్జున్ టెండుల్కర్ మాత్రం.. ‘‘27 ఏళ్ల వయసున్న వ్యక్తిలా అస్సలు ప్రవర్తించకు’’ అంటూ అక్కకు అడ్వైస్ ఇచ్చేశాడు. అర్జున్- సానియా ఎంగేజ్మెంట్ నేపథ్యంలో ఈ వీడియో మరోసారి వైరల్ అవుతోంది. సానియా కంటే.. అర్జున్ సలహా బాగుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.తల్లిదండ్రులు ఏమన్నారంటే..మరోవైపు.. సచిన్ టెండుల్కర్.. ‘‘నువ్వెప్పుడూ ఇలాగే సింపుల్‌గా, నిరాడంబరంగా.. గౌరవప్రదనీయురాలిగా ఉండు’’ అంటూ కూతురికి సూచించగా.. తల్లి అంజలి.. ‘‘సంతోషం, బాధ.. కన్ఫ్యూజన్.. ఏదైనా.. ఆఖర్లో అన్నీ వర్కౌట్ అవుతాయనే సానుకూల దృక్పథంతో ఉండాలి’’ అంటూ సారాకు విలువైన సలహా ఇచ్చింది. View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) -
‘చెత్త ప్రవర్తన.. పద్ధతి లేనివాడు.. నా గురించి తప్పుగా మాట్లాడాడు’
పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది (Shahid Afridi)కి పద్ధతులు తెలియవని టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) అన్నాడు. ఎదుటి వ్యక్తులను కించపరిచే సంకుచిత స్వభావం కలవాడంటూ ఘాటు విమర్శలు చేశాడు. తనకైతే షాహిద్ ఆఫ్రిది పట్ల సదభిప్రాయం లేదని.. ఇందుకు అతడి చెత్త ప్రవర్తనే కారణమంటూ కుండబద్దలు కొట్టాడు.కాగా ఆల్‌రౌండర్‌గా షాహిద్ మెరుగ్గా రాణించినా.. మైదానంలో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో ముఖ్యంగా టీమిండియా ప్లేయర్లతో అతడి ప్రవర్తన ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా ప్రస్తుత హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)తో అతడికి క్షణం పడేది కాదు. వీలు చిక్కినప్పుడల్లా భారత ఆటగాళ్లను రెచ్చగొడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడేవాడు షాహిద్.నా గురించి తప్పుగా మాట్లాడాడుఈ క్రమంలోనే ఓసారి మైదానం వెలుపల కూడా తనను కించపరిచేలా షాహిద్ ఆఫ్రిది వ్యాఖ్యలు చేశాడని ఇర్ఫాన్ పఠాన్ తాజాగా వెల్లడించాడు. లలన్‌టాప్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్లో షాహిద్ ఆఫ్రిదిని 11 సార్లు అవుట్ చేశాను. ఓసారి హర్షా భోగ్లేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు నా గురించి తప్పుగా మాట్లాడాడు.తనకు తాను నిజమైన పఠాన్‌గా చెప్పుకొన్న షాహిద్.. నేను రియల్ పఠాన్ కాదంటూ చెత్తగా మాట్లాడాడు. అక్కడ అతడు కేవలం నన్ను మాత్రమే కాదు.. నా తల్లిదండ్రులను కూడా కించపరిచాడు. నిజానికి అతడు అలా మాట్లాడి ఉండకపోతే.. తనతో నాకసలు ఎలాంటి గొడవా లేదు.చెత్త ప్రవర్తనకానీ ఎప్పుడైతే వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తూ తప్పుగా మాట్లాడాడో అప్పుడే.. అతడిని ఎప్పుడైనా, ఎక్కడైనా అవుట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. సిరీస్ విజేతను తేల్చే కీలక మ్యాచ్‌లలో.. వరల్డ్‌కప్ ఫైనల్లో.. ఇలా మేజర్ ఈవెంట్లలో అతడి వికెట్ తీశాను.అయితే, అతడితో నేరుగా మాట్లాడేందుకు నాకు ఒక్క అవకాశం కూడా రాలేదు. అతడి వికెట్ ఎంత త్వరగా.. వీలైతే అంత త్వరగా తీయడం మాత్రమే నాకు తెలుసు. అయితే, ఓసారి కరాచి నుంచి లాహోర్‌కు వెళ్తున్న విమానంలో అతడు నాతో వ్యక్తిగతంగా మాట్లాడాడు.అప్పుడు కూడా నా వెనుక నుంచి వచ్చి.. నా జట్టులోకి వేళ్లు పోనిచ్చి.. ‘ఎలా ఉన్నావు పిల్లోడా’ అంటూ పలకరించాడు. అప్పుడు కూడా షాహిద్‌కు హుందాగా మాట్లాడటం చేతకాలేదు’’ అంటూ ఇర్ఫాన్ పఠాన్ షాహిద్ ఆఫ్రిది ప్రవర్తనను విమర్శించాడు.బరోడా ఆల్‌రౌండర్‌కాగా 40 ఏళ్ల ఇర్ఫాన్ పఠాన్ లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్. అదే విధంగా.. ఎడమచేతి వాటం బ్యాటర్. టీమిండియా తరఫున అంతర్జాతీయ స్థాయిలో 2003- 2012 వరకు క్రికెట్ ఆడాడు. తన కెరీర్లో మొత్తంగా 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఇర్ఫాన్ పఠాన్.. ఆయా ఫార్మాట్లలో 100, 173, 28 వికెట్లు తీశాడు. అదే విధంగా.. టెస్టుల్లో 1105, వన్డేల్లో 1544, టీ20లలో 172 పరుగులు సాధించాడు.వన్డేల్లో అత్యుత్తమంగామరోవైపు.. షాహిద్ ఆఫ్రిది 1996- 2018 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ తన కెరీర్లో 27 టెస్టుల్లో 48 వికెట్లు, 1716 పరుగులు చేశాడు. 99 టీ20 మ్యాచ్‌లలో 98 వికెట్లు తీయడంతో పాటు 91 పరుగులు సాధించాడు.అయితే, వన్డేల్లో మాత్రం ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అత్యుత్తమంగా రాణించాడు. తన కెరీర్లో 398 వన్డేలు ఆడిన షాహిద్ ఆఫ్రిది.. 395 వికెట్లు పడగొట్టడంతో పాటు.. 8064 పరుగులు సాధించాడు.చదవండి: టీమిండియాకు మరో సెహ్వాగ్ దొరికేశాడు..? -
కాబోయే కోడలితో పూజలో సచిన్- అంజలి.. సారా ఫొటోలు వైరల్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ (Sara Tendulkar) వ్యాపార రంగంలో అడుగుపెట్టింది. ఇప్పటికే మోడల్‌గా గుర్తింపు పొందిన సారా.. తాజాగా వెల్నెస్ సెంటర్‌ను ఆరంభించింది. ముంబైలోని అంధేరి ప్రాంతంలో తన పేరిట పైలేట్స్ అకాడమీ (Type of mind-body exercise)ని నెలకొల్పింది.హైలైట్‌గా సానియా చందోక్ తల్లిదండ్రులు సచిన్- అంజలిలతో కలిసి సారా తన అకాడమీ పూజా కార్యక్రమంలో పాల్గొంది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, ఈ వీడియోలో అర్జున్ టెండుల్కర్‌కు కాబోయే భార్య సానియా చందోక్ (Saaniya Chandhok) హైలైట్‌గా నిలిచింది.అర్జున్‌తో ఎంగేజ్మెంట్!కాబోయే అత్తా- మామలు, వదినతో కలిసి సానియా ఈ పూజా కార్యక్రమాల్లో భాగమైంది. సచిన్ టెండూల్కర్ తనయుడు తనయుడు అర్జున్ వివాహ నిశ్చితార్థం జరిగినట్లు గురువారం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కేవలం కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు, మిత్రుల మధ్య బుధవారం ఈ వేడుకను నిర్వహించినట్లు తెలిసింది. సానియా చందోక్‌తో అర్జున్ టెండూల్కర్ ఎంగేజ్మెంట్ జరిగింది.బ్యాక్‌గ్రౌండ్ పెద్దదేకాగా ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త రవి ఘయ్ మనువరాలు సానియా. గ్రావిస్ గ్రూప్ చైర్మన్ రవి ఘయ్. ఫుడ్, హాస్పిటాలిటీ సెక్టార్లో ఈ గ్రూప్ పేరుగడించింది. ముంబైలోని ఇంటర్ కాంటినెంటల్ హోటల్, బ్రూక్లిన్ క్రీమరీ ఐస్ క్రీమ్ బ్రాండ్ వీరిదే. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ‘బాస్కిన్ అండ్ రాబిన్స్’ బ్రాండ్‌తో ఉన్న ప్రీమియం చైన్ ఐస్‌క్రీమ్ పార్లర్లు బ్రూక్లిన్ క్రీమరి సంస్థకు చెందినవే. క్వాలిటీ ఐస్ క్రీమ్స్ కూడా ఆ సంస్థ ఉత్పత్తులే!ఇక పరిమిత సంఖ్యలో, కేవలం ఆత్మీయుల మధ్యే జరిగిన ఎంగేజ్మెంట్పై ఇరు కుటుంబసభ్యులు గోప్యత పాటించడం గమనార్హం. వార్త బయటికి పొక్కినా... అటు రవి ఘయ్ కుటుంబం నుంచి గానీ, ఇటు సచిన్ కుటుంబం నుంచి గానీ ఇంకా ఎలాంటి ధ్రువీకరణ వెలువడలేదు. విషయం తెలిసిన ఐకాన్ క్రికెటర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.కెరీర్లో వెనుకబాటుకాగా 25 ఏళ్ల అర్జున్ లెఫ్టార్మ్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ముందుగా ముంబై అండర్–19 జట్టు నుంచి క్రికెట్లో అరంగేట్రం చేసిన అతను చెప్పుకోదగిన స్థాయిలో రాణించలేకపోయాడు. ప్రస్తుతం గోవా తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఐపీఎల్లో సచిన్ మెంటార్‌గా ఉన్న ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నాడు. కానీ ఇప్పటివరు కేవలం ఐదు మ్యాచ్‌లే ఆడి మూడే వికెట్లు తీయగలిగాడు. బ్యాట్ నుంచి ఇప్పటివరకు రాణించిన ఇన్నింగ్స్ లేదు. అర్జున్ చేయి అందుకున్న సానియా జంతు ప్రేమికురాలు. ముంబైలో ఉన్న పెంపుడు జంతువులు, మూగ జీవాల కోసం ఏర్పాటైన ‘మిస్టర్ పాస్’ను సానియా ప్రారంభించారు.సారా రిలేషన్షిప్ స్టేటస్?ఇదిలా ఉంటే.. అర్జున్.. అక్క సారా కంటే పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. సచిన్ తనయగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సారా.. బయోమెడికల్ సైంటిస్ట్, న్యూట్రీషనిస్ట్. అంతేగాకుండా సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్ డైరెక్టర్‌గానూ సేవలు అందిస్తున్న సారా.. ఇటీవలే ఆస్ట్రేలియా టూరిజం అంబాసిడర్‌గానూ ఎంపికైంది. కాగా టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో సారా ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, వీటిపై ఇంత వరకు ఇటు సారా.. అటు గిల్ నోరు విప్పలేదు. అయితే, తాజాగా తమ్ముడి నిశ్చితార్థం జరగడంతో సారా రిలేషన్షిప్ స్టేటస్ మరోసారి వైరల్ అవుతోంది. చదవండి: ధోని జట్టు నుంచి నన్ను తప్పించాడు.. అప్పుడే రిటైర్ అయ్యేవాడిని.. కానీ..: సెహ్వాగ్ View this post on Instagram A post shared by Pilates Academy x Sara Tendulkar (@pilates.academy.andheri) -
గౌరవ మిలిటరీ ర్యాంకులు పొందిన క్రికెటర్లు వీరే!.. సచిన్ ఒక్కడే ప్రత్యేకం
భారతదేశంలో క్రికెట్ కేవలం ఓ క్రీడ మాత్రమే కాదు.. ఇదొక మతం లాంటిది. క్రికెటర్లును దేవుళ్లుగా భావించే అభిమానులూ కోకొల్లలు. తరతరాలుగా తమ అద్భుత నైపుణ్యాలు, క్రమశిక్షణ, నాయకత్వ పటిమతో భారత క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు.అయితే, వీరిలో కొందరు మాత్రం కేవలం ఆటకే పరిమితం కాకుండా.. తమ దేశభక్తిని చాటుకుంటూ.. సామాజిక కార్యక్రమాలతో ముందుకు సాగుతూ.. సానుకూల దృక్పథాన్ని పెంపొందించాడనికి నడుం బిగించారు. ఇలా సమాజంపై తమదైన ముద్ర వేసిన భారత క్రికెట్ దిగ్గజాలను భారత ఆర్మీ గౌరవ మిలిటరీ ర్యాంకులతో సమున్నంతగా గౌరవించింది. కేవలం ఆటల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించడమే కాకుండా.. దేశ సేవలోనూ నేరుగా భాగమయ్యే భాగ్యం కల్పించింది. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆర్మీ నుంచి గౌరవ ర్యాంకులు అందుకున్న క్రికెటర్లు ఎవరో తెలుకుందామా!!సీకే నాయుడుటీమిండియా మొట్టమొదటి టెస్టు కెప్టెన్ సీకే నాయుడు. భారత క్రికెట్ చరిత్రలో ఆయన పేరు చిరస్మరణీయం. 1923లో హోల్కర్ స్టేట్ పాలకుడు సీకే నాయుడుని కల్నల్ హోదాలో నియమించారు. భారత జట్టు తమ మొట్టమొదటి అధికారిక టెస్టు ఆడే కంటే ముందే ఈ నియామకం జరిగింది.ఇక 1932లో టీమిండియా ఆడిన తొలి టెస్టుకు సీకే నాయుడు నాయకుడు. తన అద్భుత ఆట తీరు, దేశభక్తి ద్వారా స్ఫూర్తిదాయక వ్యక్తిగా ఆయన చరిత్ర పుటల్లో నిలిచిపోయారు.హేము అధికారిసైన్యంలో పనిచేసిన అరుదైన క్రికెటర్ల జాబితాలో హేము అధికారి ముందు వరుసలో ఉంటారు. ఆటగాడిగా కొనసాగుతూనే మిలిటరీలోనూ సేవలు అందించిన ఘనత ఆయన సొంతం. తన ప్రతిభతో లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి చేరిన హేము అధికారి.. యువ క్రికెటర్లకు మెంటార్‌గా వ్యవహరిస్తూనే సైన్యంలో తన విధులు నిర్వర్తించారు.ఇక 1971లో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో విజయవంతం కావడంలో హేము అధికారిది కీలక పాత్ర. ఇటు క్రికెటర్‌గా రాణిస్తూనే.. అటు సైన్యంలోనూ హేము అధికారి తన భూమికను చక్కగా పోషించారు.కపిల్ దేవ్టీమిండియాకు మొట్టమొదటి ఐసీసీ ట్రోఫీ అందించిన దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్. 1983లో ఆయన సారథ్యంలోని భారత్ తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌ను ముద్దాడింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి అద్భుతమే చేసి.. ప్రపంచ క్రికెట్లో తన ఆగమనాన్ని చాటింది.కాగా 2008లో ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో భారత సైన్యం కపిల్ దేవ్‌కు లెఫ్టినెంట్ కల్నల్ హోదా కల్పించింది. దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన ఈ హర్యానా హారికేన్‌ను ఈ విధంగా సత్కరించింది. మిలిటరీ సంబంధిత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ త్రివిధ దళాలకు కపిల్ మద్దతుగా నిలిచేవాడు.సచిన్ టెండుల్కర్‘క్రికెట్ దేవుడు’గా కీర్తింపబడుతున్న సచిన్ టెండుల్కర్ భారత క్రికెట్‌కు ఎనలేని సేవ చేశాడు. తన ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్లో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. అంతేకాదు.. వంద సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పి దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేశాడు.ఇదే కాకుండా ఇంకా ఎన్నెన్నో రికార్డులు నెలకొల్పిన సచిన్.. క్రికెట్లో భారత్‌కు ఐకాన్‌గా మారాడు. ఈ క్రమంలో భారత ఆర్మీ సచిన్ సేవలకు గుర్తింపుగా.. 2010లో భారత వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్ హోదాతో సత్కరించింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నుంచి ఈ గౌరవం పొందిన మొదటి ఆటగాడు సచిన్ కావడం గమనార్హం.మహేంద్ర సింగ్ ధోనిభారత్కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. మైదానంలో కూల్‌గా ఉంటూనే.. తెలివైన వ్యూహాలతో ప్రత్యర్థిని బోల్తా కొట్టించడంలో దిట్ట. 2007లో తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్‌తో పాటు .. 2011లో సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌నూ ధోని గెలిచాడు.ఆ తర్వాత 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్‌ను విజేతగా నిలిపాడు ధోని. ఈ క్రమంలో ఈ జార్ఖండ్ డైనమైట్‌కు 2011లో ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా దక్కింది. మిలిటరీ శిక్షణ తీసుకోవడంతో పాటు కీలక సమయాల్లో సైన్యానికి మద్దతుగా నిలబడటంలో ధోని ముందే ఉంటాడు. వీరు కూడా..వీరితో పాటు సునిల్ గావస్కర్, వినూ మన్కడ్, విజయ్ హజారే, విజయ్ మర్చంట్, విజయ్ మంజ్రేకర్, రవిశాస్త్రి , దిలీప్ వెంగ్‌సర్కార్ కూడా గౌరవ మిలిటరీ ర్యాంకులు పొందారు.సైన్యంలో చేరిన తర్వాతే క్రికెటర్‌గా వినూ మన్కడ్?లెఫ్టినెంట్ కల్నల్‌గా గావస్కర్ గౌరవం పొందగా.. క్రికెట్లో అడుగుపెట్టే ముందే వినూ మన్కడ్ సైన్యంలో చేరాడు. ఇక విజయ్ హజారే, విజయ్ మర్చంట్, విజయ్ మంజ్రేకర్, రవిశాస్త్రి, దిలీప్ వెంగ్‌సర్కార్ కూడా లెఫ్టినెంట్ కల్నల్ హోదా పొందారు.చదవండి: న్యూజిలాండ్ క్రికెట్‌కు ఊహించని షాక్ -
ఇది మీ దేశం కూడా..: భారతీయులకు ఐరిష్ దిగ్గజ క్రికెటర్ సందేశం
ఐర్లాండ్‌లో భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార దాడులను ఐరిష్ దిగ్గజ క్రికెటర్ కెవిన్ ఒ'బ్రెయిన్ ఖండించాడు. ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే తన మనసు తల్లడిల్లుతోందని.. తన హృదయంలో భారతీయులకు ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నాడు.కాగా ఇటీవలి కాలంలో ఐర్లాండ్‌లో భారతీయులపై దాడులు పెరిగిపోయాయి. రాజధాని డబ్లిన్‌లో ఓ భారత వ్యక్తిని దుండగులు దుస్తులు విప్పించి మరీ చిత్ర హింసలకు గురిచేశారు. మరో ఘటనలో ఆరేళ్ల చిన్నారిపై.. తోటి పిల్లలే దాడికి తెగబడటం సంచలనం రేపింది.తన ఇంటి బయట ఆడుకుంటున్న నియా నవీన్ అనే ఆరేళ్ల బాలిక ముఖంపై.. 12- 14 ఏళ్ల వయస్సున్న పిల్లలు పిడిగుద్దులు కురిపించారు. ఈ దుర్ఘటనలను ఐర్లాండ్‌లోని భారత రాయబారి తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో భారతీయ రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ నంబర్లను విడుదల చేసి సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించింది.నా మనసులో ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానంఈ పరిణామాల నేపథ్యంలో కెవిన్ ఒ బ్రెయిన్ ఐర్లాండ్‌లోని భారతీయులను ఉద్దేశించి ఉద్వేగపూరిత నోట్ రాశాడు. ‘‘ఐర్లాండ్‌లో భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార దాడులు, హేయమైన చర్యలు నా మనసుకు బాధ కలిగించాయి.ఇక్కడి ప్రజలుగా మేమేంటో ఇలాంటి దాడులు ఏ రకంగానూ నిర్వచించలేవు. ఇండియా, ఇండియన్స్‌కు నా మనసులో ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఐర్లాండ్ మాలాగే మీ ఇల్లు కూడా అని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాను.ఐరిష్ సమాజ అభివృద్ధిలో మీ వంతు సాయం కూడా ఉంది. మీరు కూడా ఈ దేశంలో భాగమయ్యారు. మీరు చేసే ప్రతి పనిని మేమెంతగానో గౌరవిస్తాం’’ అని కెవిన్ ఒ బ్రెయిన్ ప్రేమపూర్వక నోట్‌తో బాధితులకు సంఘీభావం తెలిపాడు.ఐర్లాండ్ తరఫున సత్తా చాటికాగా 2008 నుంచి 2021 వరకు ఐర్లాండ్‌కు ప్రాతినిథ్యం వహించిన కెవిన్.. మూడు టెస్టులు, 152 వన్డేలు, 109 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ టెస్టుల్లో 258 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 3619 రన్స్‌తో పాటు 114 వికెట్లు తీశాడు. అదే విధంగా.. అంతర్జాతీయ టీ20లలో 1973 పరుగులు సాధించడంతో పాటు 58 వికెట్లు కూల్చాడు ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్.ఇక తన కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌ను కెవిన్ భారత్‌లోనే ఆడటం విశేషం. 2011 వన్డే వరల్డ్‌కప్ సందర్భంగా ఇంగ్లండ్‌పై 50 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వన్డే ప్రపంచకప్ చరిత్రలో తొలి ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ ఇంగ్లండ్‌పై సంచలన విజయం సాధించింది. ఇదిలా ఉంటే, 2023 వరల్డ్‌కప్ సందర్భంగా ఫాస్టెస్ట్ సెంచరీ విషయంలో ఆస్ట్రేలియా స్టార్ గ్లెన్ మాక్స్వెల్ (40 బంతుల్లోనే శతకం) కెవిన్‌ను అధిగమించాడు.చదవండి: ఒక్క బిస్కట్ కోసం పడిగాపులు.. తోకలు ఊపుతూ..: రితికా సజ్దే భావోద్వేగం -
పంజరంలో బంధిస్తామంటే ఎలా?: రితికా భావోద్వేగం.. మనసు కరిగేలా..
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సతీమణి రితికా సజ్దే (Ritika Sajdeh) తీవ్ర భావోద్వేగానికి లోనైంది. దేశ రాజధాని ప్రాంతం నుంచి వీధి కుక్కలను తొలగించాలంటూ సుప్రీం ఇచ్చిన ఆదేశాలపై స్పందిస్తూ ఉద్వేగపూరిత నోట్ రాసింది.మా హృదయ స్పందన‘‘వాళ్లు వీటిని ప్రమాదకారులు అంటున్నారు. మేము మాత్రం ఇవే మా హృదయ స్పందన అంటాము. ఢిల్లీ- ఎన్సీఆర్ ప్రాంతంలోని వీధి కుక్కలన్నింటినీ బంధించి.. అక్కడి నుంచి పంపించి వేయాలని సుప్రీం కోర్టు అంటోంది.నైట్ గార్డుల్లా సూర్యోదయం లేదు.. స్వేచ్ఛా లేదు.. వాటిని ప్రతి ఉదయం పలకరించే ముఖాలు కూడా కనబడవు. అయినా.. ఇవి కేవలం ‘వీధి కుక్కలు’ మాత్రమే కాదు. ఒక్క బిస్కెట్ కోసం టీ స్టాల్ దగ్గర పడిగాపులు పడుతూ ఉంటాయి. రాత్రుళ్లు షాప్కీపర్లకు సాయంగా నైట్ గార్డుల్లా చెప్పకుండానే డ్యూటీ చేస్తాయి.స్కూల్ నుంచి పిల్లలు తిరిగి వస్తుంటే వారిని చూసి ప్రేమగా తోక ఊపుతాయి. చలిలో.. తమను పట్టించుకోని సిటీకి కాపలా కాస్తుంటాయి. అవును.. కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమే. కుక్కకాట్లు, వాటి వల్ల కలిగే నష్టం కూడా ఉంది.పంజరంలో బంధిస్తామంటే ఎలా?అంతమాత్రాన జాతి మొత్తాన్ని పంజరంలో బంధిస్తామంటే ఎలా? ఇదెలాంటి పరిష్కారం? అసలు స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారా? రెగ్యులర్‌గా వాక్సినేషన్లు వేస్తున్నారా? కమ్యూనిటీ ఫీడింగ్ జోన్లు ఉన్నాయా. దత్తత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా?.. వీటి ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చు.నోరులేని మూగజీవాలు.. పాపంఅప్పుడు వాటిని శిక్షించాల్సిన పని ఉండదు. బంధించాల్సిన అవసరమూ ఉండదు. నోరులేని మూగజీవాలను కాపాడలేని సమాజం.. తన ఆత్మనే కోల్పోతుంది. ఈరోజు ఈ కుక్కలు.. రేపు మరోటి? ఇప్పటికైనా అందరూ గొంతెత్తండి. ఎందుకంటే పాపం వాటికి నోరు లేదు. ఈ సందేశాన్ని వ్యాప్తి చేయండి’’ అంటూ రితికా సజ్దే తీవ్ర భావోద్వేగానికి లోనైంది.కాగా దేశ రాజధాని ప్రాంతంలో ఇటీవలి వీధి కుక్కల వరుస దాడుల వల్ల పసిపిల్లలు, వృద్ధులు పడుతున్న బాధలు, రేబిస్ బారిన పడి మరణించిన వ్యక్తుల గురించి మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. వీటిని సుమోటోగా స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టి.. 8 వారాల్లోపు వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.ప్రజల మేలు కోసమే..అంతేకాదు.. ఈ చర్యలను అడ్డుకోవాలని చూస్తే జంతు ప్రేమికులుగా చెప్పుకొనే వాళ్లు కూడా తీవ్ర పరిణామాలు చవిచూడక తప్పదని హెచ్చరించింది. ప్రజల మేలు కోసం చేసే పనులను అడ్డుకోవడం సరికాదని పేర్కొంది. ఈ నేపథ్యంలో జంతు ప్రేమికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నోరులేని మూగజీవాల పట్ల ఇంత కఠినంగా ఉండవద్దని న్యాయస్థానానికి విన్నవిస్తున్నారు. ఈ క్రమంలో రితికా సజ్దే సైతం సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకుంది.చదవండి: వీధి కుక్కల తీర్పుపై సుప్రీం కోర్టు యూటర్న్? -
కన్న కూతురి జీవితాన్నే నాశనం చేయాలని..: టీమిండియా స్టార్‌పై సంచలన ఆరోపణలు
టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ (Mohammed Shami)పై అతడి మాజీ భార్య హసీన్ జహాన్ (Hasin Jahan) మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేసింది. స్త్రీలోలుడిగా మారిన షమీ.. కన్న కూతురి చదువును అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నాడని ఆరోపించింది. తనకు నచ్చిన మహిళల పిల్లల్ని మాత్రం అంతర్జాతీయ స్థాయి పాఠశాలల్లో చదివించేందుకు భారీగా డబ్బు ఖర్చు పెడుతున్నాడని ఆరోపణలు చేసింది.విడిపోయారుకాగా ఐపీఎల్లో చీర్‌లీడర్‌గా ఉన్న హసీన్ జహాన్‌ను ప్రేమించిన షమీ.. 2014లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు 2015లో కుమార్తె ఐరా జన్మించింది. అయితే, ఆ తర్వాత అనూహ్య రీతిలో షమీపై సంచలన ఆరోపణలు చేసింది హసీన్. గృహహింసకు పాల్పడుతున్నాడని.. మ్యాచ్ ఫిక్సింగ్‌లు చేస్తున్నాడని ఆరోపించింది. ఇతర స్త్రీలతో వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాడని పేర్కొంది.నెలకు రూ. 4 లక్షలుఈ క్రమంలో వీరి పంచాయతీ న్యాయస్థానానికి చేరింది. తనకు, తన కూతురి పోషణకు కలిపి నెలకు రూ. 10 లక్షలు ఇవ్వాలంటూ హసీన్ జహాన్ కోరగా.. కలకత్తా హైకోర్టు ఇటీవల ఈ అంశంపై తీర్పును వెలువరించింది. హసీన్ జహాన్‌కు భరణంగా నెలకు రూ. 4 లక్షలు ఇవ్వాలని షమీని ఆదేశించింది. ఇందులో రూ. 2.5 లక్షలు తమ కుమార్తె కోసం ఖర్చు పెట్టాలని హసీన్‌కు సూచించింది.కూతురి జీవితాన్ని తానే నాశనం చేయాలని చూశాడుఈ నేపథ్యంలో తాజాగా హసీన్ జహాన్ ఓ శుభవార్తను పంచుకుంటూనే.. షమీపై మరోసారి ఆరోపణలు చేసింది. ‘‘నా కూతురికి మంచి స్కూల్లో అడ్మిషన్ దొరకవద్దని నా శత్రువులు కుట్రలు చేశారు. అయితే, అల్లా వారికి బుద్ధి చెప్పాడు. నా కూతురికి ఇంటర్నేషనల్ స్కూల్లో అడ్మిషన్ దొరికేలా చేశాడు.నా కూతురి తండ్రి మాత్రం.. ఆమెకు సీటు దొరకుండా ఉండాలని ప్రయత్నాలు చేశాడు. అయినా, తండ్రి దేవుడు కాలేడు కదా!.. బిలియనీర్ అయినప్పటికీ తన కూతురి జీవితాన్ని తానే నాశనం చేయాలని చూశాడు.ఆడవాళ్ల పిచ్చిలో పడి.. తన కూతురికి కాకుండా.. తనకు ఇష్టమైన మహిళల పిల్లలను పెద్ద పెద్ద స్కూళ్లలో చదివించే ప్రయత్నాలు చేస్తున్నాడు. లక్షలు ఖర్చు పెట్టి వాళ్లను విమానాల్లో.. అదీ బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించేలా చేస్తున్నాడు.కానీ కూతురి చదువుకి డబ్బు ఇచ్చేందుకు మాత్రం అతడికి మనసు రాదు’’ అంటూ హసీన్ జహాన్ షమీపై ఆరోపణలు గుప్పించింది. కాగా సీనియర్ పేస్ బౌలర్ షమీ ప్రస్తుతం టీమిండియాకు దూరంగా ఉన్నాడు. చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ బెంగాల్ పేసర్.. ఫిట్నెస్ సమస్యల వల్ల ఇటీవల ఇంగ్లండ్- భారత్ టెస్టు సిరీస్ ఆడలేకపోయాడు. తదుపరి దులిప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున షమీ బరిలోకి దిగే అవకాశం ఉంది. చదవండి: పిల్లలను కన్నాక ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు -
ఆ నటితో సచిన్ టెండుల్కర్ ప్రేమ?!.. అంజలి కంటే ముందు..
క్రికెట్- బాలీవుడ్ మధ్య విడదీయలేని అనుబంధం ఉందని చెప్పవచ్చు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ- షర్మిలా ఠాగోర్ నుంచి విరాట్ కోహ్లి (Virat Kohli- Anushka Sharma)- అనుష్క శర్మ, కేఎల్ రాహుల్- అతియా శెట్టి వరకు చాలా మంది క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అందుకే ఈ రెండు రంగాలకు చెందిన ఆడ- మగ కలిసి కనిపించారంటే ‘రిలేషన్షిప్’ గురించి వదంతులు పుట్టుకురావడం సహజమే. అయితే, క్రికెట్ దేవుడుగా పేరొందిన సచిన్ టెండుల్కర్ (Sachin Tendukar) గురించి 90వ దశకంలో ఇలాంటి ఓ రూమర్ వచ్చింది. నటి శిల్పా శిరోద్కర్‌తో కలిపి సచిన్ పేరు వినిపించింది. వీరిద్దరు ప్రేమలో పడ్డారని ఆ వదంతుల సారాంశం.శిల్పా శిరోద్కర్‌తో అఫైర్?అయితే, ఇందుకు సచిన్ టెండుల్కర్- శిల్పా శిరోద్కర్ స్పందించిన తీరు మాత్రం భిన్నంగా ఉండటం గమనార్హం. గతంలో సచిన్ టెండుల్కర్ ఇండియా టుడేతో మాట్లాడుతుండగా ఈ విషయం గురించి ప్రస్తావన రాగా.. ‘‘నాకూ- శిల్పా శిరోద్కర్‌తో అఫైర్?అన్నింటికంటే అత్యంత చెత్త రూమర్ ఇది.ఎందుకంటే మేమిద్దరం అసలు ఒకరికి ఒకరం పరిచయమే లేదు’’ అని కొట్టిపారేశాడు. మరోవైపు.. శిల్పా శిరోద్కర్ మాత్రం.. ‘‘నేను హమ్ సినిమా చేస్తున్న సమయంలో.. అంటే 1991లో తొలిసారి సచిన్‌ను కలిశాను. మా కజిన్ బాంద్రా ఈస్ట్‌కు ఆడేవాడు.ఒక్కసారి సచిన్‌ను కలిశానుఅదే జట్టు తరఫున సచిన్ కూడా ఆడేవాడు. అలా తన ద్వారా సచిన్ కలిసే అవకాశం వచ్చింది. అప్పటికే సచిన్ అంజలితో ప్రేమలో ఉన్నాడు. అయితే, అప్పటికి ఇంకా ఈ విషయం గురించి బయటకు రాలేదు.మేమే స్నేహితులం కాబట్టి మాకు ముందే ఈ విషయం తెలుసు. ఏదేమైనా ఓ నటి- క్రికెటర్‌ను కలిసింది అంటే.. అది కూడా సచిన్ టెండుల్కర్‌ను కలిసింది అంటే ఇలాంటి వార్తలు పుట్టుకురావడం సహజమే కదా!.. ఏదేమైనా ఒక్కసారి సచిన్‌ను నేను నేరుగా కలిశానని మాత్రం ఒప్పుకొంటా’’ అని పేర్కొంది.అంజలితో పెళ్లికాగా తన కంటే ఐదేళ్లు పెద్దదైన డాక్టర్ అంజలిని ప్రేమించిన సచిన్ టెండుల్కర్ 1995లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమార్తె సారా, కుమారుడు అర్జున్ సంతానం. ముప్పై ఏళ్ల వైవాహిక బంధాన్ని పూర్తి చేసుకున్న అంజలి- సచిన్ దంపతులు ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఉంటూ కపుల్ గోల్స్ సెట్ చేస్తూ ఉంటారు. మరోవైపు.. శిల్పా శిరోద్కర్ 2000 సంవత్సరంలో యూకేకు చెందిన బ్యాంకర్ అపరేశ్ రంజిత్‌ను పెళ్లి చేసుకుంది. కాగా శిల్పా మరెవరో కాదు... సూపర్‌స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌కు సొంత చెల్లెలు. అంటే.. మహేశ్ బాబుకు మరదలు అన్నమాట.సిరాజ్‌కు రాఖీ కట్టిన జనాయ్ఇదిలా ఉంటే.. ఇటీవల మహ్మద్ సిరాజ్- జనాయ్ భోస్లే గురించి కూడా ఇలా రిలేషన్షిప్ వార్తలు వచ్చాయి. అయితే, రాఖీ పూర్ణిమ రోజు జనాయ్ సిరాజ్‌కు రాఖీ కట్టి తమ మధ్య ఉన్న అనుబంధాన్ని తెలుపుతూ గాసిప్‌రాయుళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చింది. కాగా జనాయ్.. దిగ్గజ గాయని ఆశా భోస్లే మనుమరాలు.చదవండి: నిన్ను ఇలా చూడలేకపోతున్నాం భయ్యా!.. విరాట్ కోహ్లి ఫొటో వైరల్ -
నిన్ను ఇలా చూడలేకపోతున్నాం భయ్యా!.. విరాట్ కోహ్లి ఫొటో వైరల్
విరాట్ కోహ్లి (Virat Kohli).. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. భారత క్రికెట్లో సంచలనాలు సృష్టించిన ఈ దిగ్గజ బ్యాటర్.. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా పేరుగాంచాడు. టీమిండియా లెజెండ్, శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) తర్వాత అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక సెంచరీలు (82) బాదిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు.ప్రపంచ రికార్డుఇక వన్డేల్లో సచిన్‌కూ సాధ్యం కాని విధంగా.. 51 శతకాలు బాది ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అయితే, గతేడాది అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకొన్న ఈ రన్‌మెషీన్.. ఇటీవలే టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఊహించని విధంగాసంప్రదాయ క్రికెట్లో టీమిండియాను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన విరాట్ కోహ్లి.. తనలో ఇంకా ఆడగలిగే సత్తా ఉండి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో తన రిటైర్మెంట్ గురించి స్పందిస్తూ.. ‘‘గడ్డానికి కొన్ని రోజుల క్రితమే రంగు వేసుకున్నాను.తరచూ ఇలా గడ్డానికి రంగే వేయాల్సి వస్తుందంటేనే.. మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందని అర్థం’’ అంటూ లండన్‌లో యువీ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన కోహ్లి సరదాగా వ్యాఖ్యానించాడు. తాజాగా కోహ్లి న్యూ లుక్కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.నిన్ను ఇలా చూడలేకపోతున్నాం విరాట్ భయ్యా! భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త షాష్ విరాట్ కోహ్లితో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో గురువారం షేర్ చేశాడు. ఇందులో కోహ్లి గడ్డం, మీసం తెల్లబడి ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది చూసిన కింగ్ అభిమానులు.. ‘‘నిన్ను ఇలా చూడలేకపోతున్నాం విరాట్ భయ్యా! నువ్వు పెద్దవాడివై పోతున్నామంటే మనసు ఒప్పుకోవడం లేదు. నువ్వు ఎల్లప్పుడూ యాంగ్రీ యంగ్‌మేన్ లుక్‌లోనే ఉండాలి’’ అంటూ ఉద్వేగపూరిత కామెంట్లు చేస్తున్నారు.వన్డేలకు కూడా రిటైర్మెంట్?మరికొందరేమో టెస్టులోకి తిరిగి రావాలని కోరుతుండగా.. ఇంకొందరు మాత్రం వన్డేలకు కూడా కోహ్లి త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్టుల నుంచి వైదొలిగిన 36 ఏళ్ల కోహ్లి.. వన్డేల్లో, ఐపీఎల్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. తిరుగులేని ఛేజింగ్ కింగ్కాగా విరాట్ కోహ్లి తదుపరి ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్ సందర్భంగా టీమిండియాలో పునరాగమనం చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. 2008లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 123 టెస్టులు, 125 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 9230, 4188 పరుగులు సాధించాడు.ఇక వన్డేల్లో ఛేజింగ్ కింగ్‌గా పేరొందిన కోహ్లి ఇప్పటికి 302 మ్యాచ్‌లు ఆడి 14181 పరుగులు చేశాడు. చివరగా ఐపీఎల్-2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఆడాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ టైటిల్ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆరు పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలన్న కోహ్లి, ఆర్సీబీ పదిహేడేళ్ల కల నెరవేరింది. ఇక కోహ్లి తన భార్య అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్‌లతో కలిసి లండన్‌లోనే ఎక్కువగా నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. చదవండి: సంజూ శాంసన్‌కు మీకిస్తే బదులుగా ఇద్దరిని ఇవ్వండి.. రాయల్స్ డిమాండ్..! -
చెవికి అతికించి.. ఛీ!.. ఇలా చేశావేంటి?.. హ్యారీ బ్రూక్ చర్య వైరల్
టీమిండియాతో ఐదో టెస్టు సందర్భంగా ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ Harry Brook) చేసిన ఓ పని నెట్టింట వైరల్‌గా మారింది. ఓవల్ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆటలో ఈ మిడిలార్డర్ బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే.పందొమ్మిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్రూక్ ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసిపట్టిన టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj).. ఆ వెంటనే బౌండరీ లైన్ తొక్కేశాడు. దీంతో లైఫ్‌లైన్ పొందిన బ్రూక్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ధనాధన్ దంచికొట్టి భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు.చెవి వెనుక అతికించి.. ఆపైకేవలం 98 బంతుల్లోనే హ్యారీ బ్రూక్.. 111 పరుగులతో సత్తా చాటి మ్యాచ్‌ను ఇంగ్లండ్ వైపునకు తిప్పే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో డ్రింక్స్ విరామ సమయంలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. డ్రింక్స్‌తో తన శరీరాన్ని హైడ్రేట్ చేసుకున్న తర్వాత.. చెవి వెనుక అతికించి పెట్టిన చ్యూయింగ్ గమ్ తీసి నోట్లో వేసుకున్నాడు. అంటే అప్పటికి దానిని బాగా నమిలిన బ్రూక్.. డ్రింక్స్ బ్రేక్ కోసం చెవి వెనక పెట్టాడన్న మాట!ఛీ! ఇదేం పని బ్రూక్ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్లను ఆకర్షిస్తోంది. ‘‘ఛీ! ఇదేం పని బ్రూక్.. చ్యూయింగ్ గమ్ అంటే మరీ ఇంత పిచ్చి ఉంటుందా?’’ అంటూ నెటిజన్లు అతడిని సరదాగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఆ సమయంలో కామెంటేటర్లు రిక్కీ పాంటింగ్, రవిశాస్త్రి తమదైన శైలిలో బ్రూక్‌పై చణుకులు విసిరారు.ఎక్కడో దాచి ఉంటాడు‘‘రిక్కీ.. నువ్వు చూశావా? అదైతే చెవికి సంబంధించిన వస్తువు కాదు. అది కచ్చితంగా చ్యూయింగ్ గమ్ అని చెప్పగలను’’ అని రవిశాస్త్రి అన్నాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘అవును.. ఇలాంటిది నేనైతే ఇంతకు ముందెన్నడూ చూడలేదు. నాకు తెలిసి అతడి దగ్గర మరో రెండు పీసులు ఉండి ఉంటాయి. వాటిని ఎక్కడో దాచి ఉంటాడు’’ అని రిక్కీ పాంటింగ్ జోక్ చేశాడు.ఇక ఇందుకు స్పందనగా.. ‘‘అతడు నీళ్లు తాగేశాడు. ఆ వెంటనే గమ్ అతడి నోట్లోకి వెళ్లింది. మళ్లీ బయటకు.. మళ్లీ లోపలకు. ప్రతిసారి అతడు చ్యూయింగ్ గమ్ నములుతూనే ఉంటాడు’’ అని రవిశాస్త్రి అనగానే రిక్కీ పాంటింగ్ గట్టిగా నవ్వేశాడు.టీమిండియా విజయం.. సిరీస్ సమంఇదిలా ఉంటే.. ఓవల్ టెస్టులో బ్రూక్ మెరుపులు వృథా అయ్యాయి. ఆఖరిదైన ఐదో రోజు ఇంగ్లండ్‌కు 35 పరుగులు కావాల్సి ఉండగా.. సిరాజ్ అద్బుత రీతిలో రాణించి ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపించాడు. విజయానికి ఆరు పరుగుల దూరంలో ఉన్న వేళ ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసి.. టీమిండియాను గెలిపించాడు. ఫలితంగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ 2-2తో సమమైంది. హెడింగ్లీ, లార్డ్స్‌లో ఇంగ్లండ్ గెలవగా.. ఎడ్జ్‌బాస్టన్, ఓవల్‌లో టీమిండియా విజయం సాధించింది. మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టు డ్రా అయింది. చదవండి: నువ్వు టీమిండియాలోకి ఎలా వచ్చావో మర్చిపోవద్దు: జైస్వాల్‌తో రోహిత్ View this post on Instagram A post shared by We Are England Cricket (@englandcricket) -
వీడి వల్ల డబ్బు దండగ!.. వాళ్ల ఫోన్లు కూడా ఎత్తను: టీమిండియా స్టార్
‘వీడి వల్ల ఏమవుతుందిలే? క్రికెట్ ఆడుతున్న ప్రతోడు సచిన్, కోహ్లి అయిపోతారా ఏంటి? వీడిపై పెట్టుబడి దండగ. డబ్బు వృథా’ అంటూ గేలి చేసిన వాళ్ల ముందే టీమిండియాకు ఆడటమే కాదు.. చిన్న వయసులోనే ఐసీసీ ట్రోఫీని ముద్దాడితే.. ఆ కిక్కే వేరప్పా!!భారత యువ పేసర్ హర్షిత్ రాణా Harshit Rana) విషయంలో ఇదే నిజమైంది. తనను హేళన చేసిన బంధువుల ముందే తండ్రిని సగర్వంగా తలెత్తుకునేలా చేశాడు 23 ఏళ్ల ఈ ఫాస్ట్‌బౌలర్. దండగ అంటూ తిట్టినోళ్లే తనను పొగిడేలా చేసుకున్నాడు. అప్పుడు కనీసం తనతో మాట్లాడని వాళ్లు కూడా.. ఇప్పుడు ఫోన్లు చేస్తుంటే కాస్త గొప్పగానే అనిపిస్తున్నా.. వారికి రిప్లై మాత్రం ఇవ్వడం లేదంటున్నాడు హర్షిత్ రాణా.పేరుప్రఖ్యాతులు రాగానే..దేశానికి ఆడే స్థాయికి చేరుకునే క్రమంలో తనకు బంధువుల నుంచి ఎదురైన తిరస్కారం గురించి హర్షిత్ రాణా స్వయంగా వెల్లడించాడు. ‘‘మనకు ఒక్కసారి పేరుప్రఖ్యాతులు రాగానే.. అప్పటిదాకా దూరంగా ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా ‘దగ్గరై బంధువు’లైపోతారు.నిరాశపరిచే వారే ఎక్కువనేను క్రికెటర్ అవుతానంటే నవ్విన నా సోదరసోదరీమణులు, మా బంధువులు.. అనవసరంగా వాడి కోసం కష్టపడుతున్నావంటూ మా నాన్నను వెనక్కిలాగే ప్రయత్నం చేసిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు.వాళ్ల కాల్స్ లిఫ్ట్ చేయనువీడి వల్ల ఏం కాదు.. క్రికెట్లో అసలేం ఉందని నిరాశపరిచిన వాళ్లే ఎక్కువ. అయితే, ఈరోజు వాళ్లే మళ్లీ మా నాన్నకు ఫోన్ చేసి.. నీ కష్టానికి ఫలితం దక్కిందంటూ పొగడటం వింతగా అనిపిస్తుంది. వాళ్లు నాకు కూడా ఫోన్లు చేస్తారు. కానీ నేను మాత్రం వాళ్ల కాల్స్ లిఫ్ట్ చేయను.ఇదేమీ నా ఓవర్ ఆటిట్యూడ్ కాదు. గతంలో వాళ్లు నన్ను చాలా మాటలు అన్నారు. అలాంటి వాళ్లతో ఇప్పుడు నేను మాట్లాడాల్సిన అవసరం లేదనే అనుకుంటాను’’ అంటూ హర్షిత్ రాణా ఉద్వేగానికి లోనయ్యాడు. యూట్యూబర్ రణ్వీర్ అల్లాబాదియా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్.. తన మనసులోని భావాలు పంచుకున్నాడు.ఐపీఎల్ నుంచి టీమిండియా బాటకాగా 2022లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అడుగుపెట్టిన హర్షిత్ రాణా.. గతేడాది అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 2024లో కేకేఆర్ టైటిల్ గెలవడంలో ఈ రైటార్మ్ పేసర్ తన వంతు పాత్ర పోషించాడు.ఈ క్రమంలోనే టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన హర్షిత్ రాణా.. 2024లోనే టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఈ ఏడాది వన్డే, టీ20లలోనూ టీమిండియా తరఫున ఎంట్రీ ఇచ్చాడు.ఇప్పటి వరకు తన కెరీర్లో రెండు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడిన 23 ఏళ్ల హర్షిత్ రాణా.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 4, 10, 3 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది రోహిత్ శర్మ సారథ్యంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) గెలిచిన భారత జట్టులోనూ అతడు సభ్యుడు. చివరగా ఈ మెగా వన్డే టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్షిత్ ఆడి ఓ వికెట్ తీశాడు కూడా! చదవండి: Mohammed Siraj: అసదుద్దీన్ ఒవైసీకి సిరాజ్ రిప్లై ఇదే.. పోస్ట్ వైరల్ -
బీసీసీఐ వేటు!.. నా ఫ్యామిలీ లాంటిది అంటూ..
టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టగానే గౌతం గంభీర్ Gautam Gambhir).. సహాయ సిబ్బంది నియామకం విషయంలోనూ తన మాట నెగ్గించుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో వేర్వేరు సమయాల్లో, వేర్వేరు జట్లలో తనతో కలిసి పనిచేసిన ముగ్గురిని కోచింగ్ సిబ్బందిలో చేర్చుకున్నాడు.లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా ఉన్నప్పుడు తనతో కలిసి సహాయక సిబ్బందిలో ఉన్న దక్షిణాఫ్రికా బౌలర్ మోర్నీ మోర్కెల్‌ను.. టీమిండియా బౌలింగ్ కోచ్‌గా తెచ్చుకున్నాడు. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో ఉన్నపుడు తన అసిస్టెంట్లుగా ఉన్న నెదర్లాండ్స్ మాజీ ఆటగాడు ర్యాన్ డష్కాటే, భారత మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్‌ను టీమిండియాలోనూ అసిస్టెంట్ కోచ్‌లుగా తెచ్చుకున్నాడు.వేటు వేసిన బీసీసీఐఅయితే, టీమిండియా టెస్టుల్లో వరుసగా విఫలమైన తరుణంలో అభిషేక్ నాయర్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వేటు వేసింది. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని భారత్ చేజార్చుకున్న తర్వాత.. అతడికి ఉద్వాసన పలికింది.ఈ క్రమంలో అభిషేక్ నాయర్ మళ్లీ తన సొంతగూటికి చేరుకున్నాడు. ఐపీఎల్-2025లో కోల్‌కతా జట్టు అసిస్టెంట్ కోచ్‌గా సేవలు అందించాడు. ఇటు బీసీసీఐ పొమ్మనగానే.. అటు కేకేఆర్ తనను అక్కున చేర్చుకోవడంపై అభిషేక్ నాయర్ తాజాగా స్పందించాడు.నాకు కేకేఆర్ ఫ్యామిలీ లాంటిది‘‘కేకేఆర్ నా సొంత కుటుంబం వంటిది. ప్రతి వ్యక్తి తన భావోద్వేగాలను ఫ్యామిలీతోనే పంచుకుంటాడు. నాకు కేకేఆర్ ఫ్యామిలీ. కాబట్టే ఎలా ఇక్కడి నుంచి వెళ్లానో.. అంతే వేగంగా తిరిగి వచ్చేశాను. అన్ని రకాలుగా నేను కేకేఆర్కే చెందినవాడిని.ఇది నా ఇల్లు. ఇక్కడే నాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఈసారి కూడా అలాగే జరిగింది’’ అని అభిషేక్ నాయర్ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఈ ఏడాది మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో యూపీ వారియర్స్‌కు అభిషేక్ నాయర్ మార్గదర్శనం చేయనున్నాడు. ఆ జట్టు హెడ్‌కోచ్‌గా అతడు నియమితుడైనట్లు ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది.ఆ జట్టుకు హెడ్‌కోచ్‌గా..ఈ విషయం గురించి అభిషేక్ నాయర్ మాట్లాడుతూ.. ‘‘డబ్ల్యూపీఎల్ కేవలం భారత క్రికెట్ మీద మాత్రమే కాకుండా.. దేశవాళీ క్రికెట్ మీద కూడా ఉంది. తొలి సీజన్ నుంచి ఇప్పటికి చాలా మారింది. ఆదరణ పెరిగింది.అమ్మాయిలు డైవ్ చేస్తున్నారు. మైదానంలో పాదరసంలా కదులుతూ బంతిని ఫాస్ట్‌గా త్రో చేస్తున్నారు. రోజురోజుకీ ఈ లీగ్ అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగం కావడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన టీమిండియా.. ఆ తర్వాత ఆసీస్‌తో సిరీస్‌లోనూ 3-1తో ఓడిపోయింది. అయితే, తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో మాత్రం అదరగొట్టింది. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-2తో సమం చేసింది. తద్వారా వరుస పరాజయాల తర్వాత కోచ్ గౌతం గంభీర్‌కు ఉపశమనం కలిగింది.చదవండి: Dhruv Jurel: అతడికి నువ్వెందుకు చెప్పలేదు? గిల్‌తో సిరాజ్.. కొంప మునిగేదే! -
నాన్నంటే వాడికి ప్రాణం.. ఇంగ్లండ్‌కు వెళ్లే ముందు నాతో ఏమన్నాడంటే..
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం మార్మోగిపోతున్న పేరు మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj). ఇంగ్లండ్‌తో ఓవల్ టెస్టులో ఈ హైదరాబాదీ అద్బుతమే చేశాడు. ఓటమి కోరల్లో చిక్కుకున్న టీమిండియాను తన అద్భుతమైన డెలివరీతో విజయతీరాలకు చేర్చాడు.బాగా ఆడి ఇండియాను గెలిపించాలిఇంగ్లండ్తో ఓవరాల్‌గా ఐదు టెస్టుల్లో 185 ఓవర్లు బౌల్ చేసి.. ఏకంగా 23 వికెట్లు కూల్చాడు. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)ని భారత్ 2-2తో సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్‌కు బయల్దేరే ముందు సిరాజ్ తన తల్లితో అన్న మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.ఈ విషయం గురించి సిరాజ్ తల్లి షబానా బేగం టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘అమ్మా.. నాకోసం ప్రార్థన చేస్తూ ఉండు. నేను బాగా ఆడి ఇండియాను గెలిపించాలని ప్రార్థించు’’ అని కుమారుడు తనతో చెప్పాడన్నారు.నాన్నంటే వాడికి ప్రాణంఅదే విధంగా.. తండ్రి అంటే సిరాజ్‌కు ప్రాణమని.. ‘‘సిరాజ్‌కు వాళ్ల నాన్న అంటే చాలా ఇష్టం. ఆయనను ఎంతగానో ప్రేమిస్తాడు. తండ్రి కోసం ఏం చేసేందుకైనా సిరాజ్ వెనకాడేవాడు కాదు. సిరాజ్ కోసం నేను ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాను. నా కుమారుడు చేసే ప్రతి పనిలో విజయవంతం అయ్యేలా ఆ అల్లా దీవించాలి’’ అని షబానా మాతృప్రేమను చాటుకున్నారు.కాగా సిరాజ్ క్రికెటర్‌గా ఎదగడంలో అతడి కుటుంబం పాత్ర కీలకం. తండ్రి మహ్మద్ గౌస్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూనే.. కుమారుడి కల నెరవేరేలా ప్రోత్సహించారు. సిరాజ్ అంటే ఆయనకూ ప్రాణమే. ఆయన కోరుకున్నట్లే కొడుకు టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్నాడు.కుమారుడి ఎదుగుదల చూడకుండానేముఖ్యంగా తనకు ఇష్టమైన టెస్టు ఫార్మాట్లో ఆడేందుకు సిద్ధమైన తరుణంలోనే.. దురదృష్టవశాత్తూ గౌస్ కన్నుమూశారు. 2021లో సిరాజ్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా గౌస్ మరణించారు. అయితే, దేశం కోసం ఆడటమే ముఖ్యమని ఆయన నేర్పిన విలువలకు తగ్గట్లుగా అక్కడే ఉండిపోయిన సిరాజ్ తండ్రిని కడసారి చూసుకోలేకపోయాడు.తండ్రి సమాధి దర్శించుకున్న తర్వాతేఅయితే, ఆయన కోరుకున్నట్లుగానే టీమిండియా టాప్ పేసర్‌గా ఎదిగి ఇలా ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా తాను సిరీస్ ఆడేందుకు సన్నద్ధమయ్యే ముందు ముందుగా సిరాజ్ తన తండ్రి సమాధిని దర్శించుకుని అక్కడ ప్రార్థన చేస్తాడు. తాజాగా ఇంగ్లండ్‌కు వెళ్లే ముందు కూడా సిరాజ్ ఈ ఆనవాయితీని పాటించాడు. అత్యుత్తమ ప్రదర్శనతో భారత్‌కు చిరస్మరణీయ విజయం అందించాడు.చదవండి: ‘డ్రా’ అయినందుకే ఇంత సంబరమా?.. అవును.. కొన్ని పొరపాట్లున్నా..All heart. All hustle. All 𝘋𝘩𝘢𝘢𝘬𝘢𝘥 💪A fightback that will go down in Indian cricket history ✨#SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/bvXrmN5WAL— Sony Sports Network (@SonySportsNetwk) August 4, 2025 -
కన్నీటిపర్యంతమైన గంభీర్.. గూస్బంప్స్ తెప్పిస్తున్న వీడియో!
‘‘గౌతమ్ గంభీర్.. వన్డే, టీ20 ఫార్మాట్లకు కోచ్‌గా ఫర్వాలేదు. కానీ టెస్టులకు మాత్రం అతడు పనికిరాడు. అతడు హెడ్‌కోచ్‌గా ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత పసికూన బంగ్లాదేశ్‌పై సిరీస్ విజయాన్ని మినహాయిస్తే.. టీమిండియా అత్యంత ఘోరమైన పరాజయాలు చవిచూసింది.సొంతగడ్డపై చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా న్యూజిలాండ్ (IND vs NZ)తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్ అయింది. అంతేకాదు.. ఆస్ట్రేలియా పర్యటనలోనూ దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (IND vs AUS)ని చేజార్చుకుంది.ఇదంతా ఒక ఎత్తైతే.. ఇంగ్లండ్ టూర్‌కు ముందే దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడానికి గంభీర్ కూడా ఓ కారణం. అంతేకాదు.. యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ కెప్టెన్ కావడంలోనూ గౌతీదే కీలక పాత్ర.దిగ్గజాలు లేకుండా గిల్ సారథ్యంలో ఇంగ్లండ్ గడ్డ మీద గెలవాల్సిన తొలి జట్టులో టీమిండియా ఓడిపోవడానికి కోచ్, కెప్టెన్ వ్యూహాలు సరిగ్గా లేకపోవడమే కారణం’’.. ఇటీవలి కాలంలో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పై వచ్చిన విమర్శలూ, ఆరోపణలూ ఇవీ. టెస్టుల్లో భారత్ వరుసగా విఫలం కావడంతో అతడిని కోచ్‌గా తొలగించాలనే డిమాండ్లూ వచ్చాయి.ఈ సిరీస్ కూడా సమర్పయామి అంటూ..అయితే, ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత గౌతీపై విమర్శల దాడికి కాస్త బ్రేక్ పడింది. కానీ ఆ తర్వాత మళ్లీ పాత కథే పునరావృతమైంది.లార్డ్స్ టెస్టులో ఓటమి.. మాంచెస్టర్‌లో మ్యాచ్ డ్రా కావడం.. ఆఖరిగా ఓవల్‌లో ఐదో టెస్టులోనూ ఆఖరి రోజు వరకు ఇంగ్లండ్ పటిష్ట స్థితిలో ఉండటంతో .. ఇక ఈ సిరీస్ కూడా సమర్పయామి అంటూ మళ్లీ గంభీర్‌పై విమర్శలు మొదలయ్యాయి.అయితే, చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ టెస్టులో భారత్ సంచలన విజయం సాధించింది. ఇంగ్లండ్ విజయానికి 17 పరుగులు.. టీమిండియా విజయానికి రెండు వికెట్ల దూరంలో ఉన్నవేళ ప్రసిద్ కృష్ణ జోష్ టంగ్‌ను బౌల్డ్ చేసి తొమ్మిదో వికెట్ పడగొట్టాడు.అద్భుతం చేసిన సిరాజ్ఇక విజయ సమీకరణాలు 7 పరుగులు.. ఒక వికెట్‌గా మారగా మహ్మద్ సిరాజ్ మరోసారి అద్భుతమే చేశాడు. అద్భుతమైన డెలివరీతో గస్ అట్కిన్సన్ను బౌల్డ్ చేసి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ఈ దృశ్యాల్ని చూస్తున్న సగటు అభిమానులతో పాటు కోచ్ గంభీర్ హృదయం ఉప్పొంగిపోయింది.గంభీర్ కన్నీటి పర్యంతంగతంలో ఎన్నడూ లేనివిధంగా గౌతీ కంట నీరొలికింది. తీవ్ర భావోద్వేగానికి లోనైన గంభీర్.. సహచర సిబ్బందిని గట్టిగా ఆలింగనం చేసుకుని వారిని ఆప్యాయంగా ముద్దాడాడు. ఆనందభాష్పాలు రాలుస్తూ టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. గంభీర్‌కు ఈ గెలుపు ఎంత ముఖ్యమో.. ఎంత అవసరమో తెలియజేయడానికి ఈ దృశ్యాలు చాలు!!ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. ‘‘నిజంగా ఈ వీడియో గూప్‌బంప్స్ తెప్పిస్తోంది భయ్యా. టీమిండియాకు, గంభీర్‌కు శుభాకాంక్షలు’’ అంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఓవల్‌లో విజయంతో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-2తో సమం చేసింది.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు సంక్షిప్త స్కోర్లు👉భారత్- 224 & 396👉ఇంగ్లండ్- 247 & 367✊ఆరు పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచిన భారత్.చదవండి: నన్ను నమ్మినందుకు థాంక్యూ విరాట్ భయ్యా: మహ్మద్ సిరాజ్𝗕𝗲𝗹𝗶𝗲𝗳. 𝗔𝗻𝘁𝗶𝗰𝗶𝗽𝗮𝘁𝗶𝗼𝗻. 𝗝𝘂𝗯𝗶𝗹𝗮𝘁𝗶𝗼𝗻!Raw Emotions straight after #TeamIndia's special win at the Kennington Oval 🔝#ENGvIND pic.twitter.com/vhrfv8ditL— BCCI (@BCCI) August 4, 2025 -
భర్తతో విడాకులు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సైనా నెహ్వాల్
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ (Saina Nehwal) అభిమానులకు శుభవార్త చెప్పింది. భర్త పారుపల్లి కశ్యప్ (Parupalli Kasyap)తో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ.. ‘‘దూరం దగ్గర చేసింది’’ అని క్యాప్షన్ ఇచ్చింది. తద్వారా తాము తిరిగి కలిసిపోయామనే సంకేతాలు ఇచ్చింది.కాగా భర్త పారుపల్లి కశ్యప్‌తో తాను విడిపోతున్నట్లు (Divorce) సైనా నైహ్వాల్ గత నెలలో ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు జూలై 13న సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.ఆలోచించే విడాకుల నిర్ణయం‘‘జీవితం మనల్ని ఒక్కోసారి వేర్వేరు దిశల్లో ప్రయాణించేలా చేస్తుంది. సుదీర్ఘ చర్చలు, ఆలోచనల అనంతరం నేను, కశ్యప్ విడిపోవాలని నిశ్చయించుకున్నాం. ఈ బంధంలో నాకెన్నో మధురానుభూతులు ఉన్నాయి. ఇకపై కూడా మేము స్నేహితుల్లా కొనసాగుతాం’’ అని సైనా నోట్ విడుదల చేసింది.ఊహించని ట్విస్ట్అయితే, తాజాగా శనివారం పారుపల్లి కశ్యప్‌తో కలిసి దిగిన ఫొటోలను సైనా నెహ్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘‘కొన్నిసార్లు దూరమే.. మన సన్నిహితులతో కలిసి ఉండటం ఎంత విలువైనదో నేర్పుతుంది. మేము కలిసి ఉండేందుకు మరో ప్రయత్నం చేస్తున్నాం’’ అని రెండు హార్ట్ ఎమోజీలతో సైనా క్యాప్షన్ జతచేసింది. కాగా భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ దగ్గర శిక్షణ తీసుకున్న సైనా, కశ్యప్ చాలా ఏళ్లపాటు ప్రేమించుకున్నారు. 2018లో పెళ్లి బంధంతో ఒక్కటైన వీరు అన్యోన్యంగా ఉండేవారు. కెరీర్ పరంగానూ ఒకరికొరు అండగా ఉంటూ కపుల్ గోల్స్ సెట్ చేసేవాళ్లు. అయితే, సైనా విడాకుల ప్రకటన చేయగా.. కశ్యప్ మాత్రం అపుడు స్పందించలేదు.ఇక ఇప్పుడు భార్యతో కలిసి పోస్ట్ షేర్ చేస్తూ తమ రీయూనియన్‌ని మాత్రం తెలియజేశాడు. కాగా లండన్ ఒలింపిక్స్-2012లో మహిళల సింగిల్స్ విభాగంలో సైనా కాంస్యం గెలవగా.. అదే ఎడిషన్‌లో కశ్యప్ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు.చదవండి: నిప్పుతో చెలగాటం ఆడటమే.. వరల్డ్‌కప్ గెలిస్తే ధోని గొప్పవాడు అయిపోతాడా? View this post on Instagram A post shared by SAINA NEHWAL (@nehwalsaina) -
నా జీవితాన్నే మార్చేశావు: హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తన కుమారుడు అగస్త్య (Agasthya)ను ఉద్దేశించి భావోద్వేగపూరిత నోట్ రాశాడు. ఈ ప్రపంచంలో అందరి కంటే తాను ఎక్కువగా అగస్త్యనే ప్రేమిస్తానని తెలిపాడు. ఈ చిన్నారి రాకతో తన ప్రపంచమే మారిపోయిందంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్‌ను ప్రేమించి పెళ్లాడిన హార్దిక్ పాండ్యా.. గతేడాది ఆమెకు విడాకులు ఇచ్చాడు. వీరిద్దరి సంతానమే అగస్త్య. బుధవారం (జూలై 30) అతడు ఐదో వసంతంలో అడుగుపెట్టాడు.నాకు దక్కిన గొప్ప ఆశీర్వాదం నువ్వుఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా.. ‘‘వ్యక్తిగా నేను రోజురోజుకీ మరింత మెరుగపడేలా చేసే దైవదూత. నేను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలియదు. నీతో గడిపే ఇలాంటి క్షణాల కంటే నాకు ఇంకేమీ గొప్పకాదు.నా జీవితాన్నే మార్చివేసిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకు దక్కిన గొప్ప ఆశీర్వాదం నువ్వు. నేను చేసే ప్రతి చిలిపి పనిలోనూ నువ్వే నా పార్ట్నర్’’ అంటూ అగస్త్యతో కలిసి కెమెరా రికార్డింగ్ చేస్తున్న వీడియోను హార్దిక్ పాండ్యా షేర్ చేశాడు. ఇందులో తన పేరు చెప్పమని బతిమిలాడగా.. ఆఖర్లో ఆ పిల్లాడు అగస్త్య హార్దిక్ పాండ్యా అని చెప్తాడు. తండ్రీకొడుకుల బంధం చూసి నెటిజన్లు.. ‘మీకు ఎవరి దిష్టీ తగలకూడదు’ అంటూ అగస్త్యకు బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. అయితే, మరికొందరు మాత్రం అగస్త్యకు తల్లి- తండ్రితో కలిసి పుట్టినరోజు జరుపుకొనే అదృష్టం మాత్రం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Hardik Pandya (@hardikpandya93) కాగా పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడాడు. న్యూజిలాండ్‌తో ఫైనల్లో 18 బంతుల్లో 18 పరుగులు చేశాడు. ఇక మార్చిలో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపొంది టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే.హార్దిక్ అలా.. నటాషా ఇలామరోవైపు.. హార్దిక్ మాజీ భార్య నటాషా కూడా అగస్త్య బర్త్‌డే సందర్భంగా క్యూట్ వీడియో షేర్ చేసింది. ‘‘నా అగులీ.. నా సర్వస్వం నువ్వే. నిన్ను నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి ప్రతిరోజూ ధన్యవాదాలు చెబుతూనే ఉంటా. నీ చిరునవ్వు.., నీ ఆలింగనం.. నీ ఆప్యాయపు ముద్దులు.. ఇవే నాకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. నన్ను ముందుకు నడిపిస్తాయి. నువ్వెంత విలువైనవాడివో నీకు తెలియదు రా కన్నా! కాలం మారినా.. నువ్వెప్పుడూ నాతో ఇలాగే ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అంటూ ఎమోషనల్ నోట్ రాసింది. View this post on Instagram A post shared by @natasastankovic__ -
నిప్పుతో చెలగాటం ఆడటమే.. వరల్డ్‌కప్ గెలిస్తే ధోని గొప్పోడా?
క్లిష్ట పరిస్థితుల్లోనూ సహనం కోల్పోకుండా పరిస్థితులు చక్కదిద్దడంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) దిట్ట. ఓటమి ఖాయమనుకున్న సందర్భాల్లోనూ ఒత్తిడిని చిత్తు చేసి.. ప్రశాంత వదనంతోనే ప్రత్యర్థిని మట్టికరిపించడంలో తనకు తానే సాటి. అందుకే అతడిని అభిమానులు ముద్దుగా మిస్టర్ కూల్ అని పిలుచుకుంటారు.‘జీవిత సత్యాలు’ చెప్పిన ధోనిఅయితే, ఆటగాడిగానే కాదు.. వ్యక్తిగత జీవితంలోనూ ధోని మిస్టర్ కూల్‌గానే ఉంటాడు. భార్య సాక్షి (Sakshi Singh) ఏం చెప్పినా సరేనంటూ తలాడిస్తాడట. అలా అయితేనే ప్రతి మగాడి వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందట. ఓ పెళ్లి వేడుకకు హాజరైన ధోని ఇలా ‘జీవిత సత్యాలు’ చెప్తూ వధూవరులకు సలహాలు ఇవ్వడంతో పాటు అక్కడనున్న వారందరినీ నవ్వించాడు.‘‘వివాహం అనేది ఎంతో గొప్పది. పెళ్లి చేసుకోవాలని కొంతమంది ఆరాటపడుతూ ఉంటారు. వారికి నిప్పుతో చెలగాటం ఆడటం ఇష్టం గనుకే ఆ తొందర. అందులో ఇతడు కూడా ఒకడు’’ అంటూ వరుడు ఉత్కర్ష్పై హాస్యబాణాలు సంధించాడు ధోని.వరల్డ్‌కప్ గెలిస్తే ధోని గొప్పోడు అయిపోడు!‘‘ఉత్కర్ష్ కూడా ఇప్పుడు ఈ భ్రమల్లోంచి బయటకు వస్తాడు. ప్రతి భర్త కథ ఒకేలా ఉంటుంది. నువ్వు ప్రపంచకప్ గెలిచావా? లేదా అన్న విషయంతో అస్సలు సంబంధం ఉండదు. అయితే, మా ఆవిడ మాత్రం అందరి కంటే భిన్నం అనుకోండి’’ అంటూ ధోని జోకులు వేశాడు. ఇక వధువు ధ్వనికి కూడా ధోని ఈ సందర్భంగా ఓ సలహా ఇచ్చాడు.‘‘మీ భర్త ఎప్పుడైనా కోపంగా ఉన్నారంటే.. ఒక్క మాట కూడా మాట్లాడకండి. ఎందుకంటే.. భర్తలు కేవలం ఐదంటే ఐదే నిమిషాల్లో కూల్ అయిపోతారు. మాకు మాత్రమే ఆ శక్తి ఉంది. అయినా.. ఇవన్నీ జోకులు అనుకుని చాలా మంది మగవాళ్లు నవ్వుతూ ఉంటారు. మీరెందుకు ఇలా చేస్తారో నాకైతే అర్థం కాదు. కానీ ఇదే నిజం’’ అంటూ ధోని నవ్వులు పూయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మూడు ట్రోఫీలు గెలిచిన దిగ్గజ కెప్టెన్ కాగా 2004- 2019 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ధోని.. 350 వన్డేలు, 98 టీ20లు, 90 టెస్టుల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. వన్డేల్లో 10773, టీ20లలో 1617, టెస్టుల్లో 4876 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 10 వన్డే, ఆరు టెస్టు సెంచరీలు ఉన్నాయి.ఇక ఇంత వరకు ఏ టీమిండియా కెప్టెన్‌కూ సాధ్యం కాని విధంగా ధోని.. ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచాడు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్‌కప్, 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని ధోని సేన గెలుచుకుంది. అదే విధంగా ఐపీఎల్‌లోనూ ధోని అద్భుత విజయాలు సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత తలా సొంతం. ఐపీఎల్లో ఇప్పటి వరకు 278 మ్యాచ్‌లు ఆడిన ధోని 5439 పరుగులు సాధించాడు.ఇక ధోని వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. సాక్షి సింగ్ రావత్‌ను ప్రేమించిన ధోని 2010లో ఆమెను పెళ్లాడాడు. వీరి 2015లో కుమార్తె జీవా జన్మించింది. చదవండి: స్టువర్ట్ బిన్నీ విధ్వంసం, యువీ, పఠాన్ మెరుపులు.. సెమీస్‌లో ఇండియా View this post on Instagram A post shared by Social Media Management Waale (@smmwaale) -
‘వేరొకరి భర్తను లాక్కోవడం కూడా మోసమే కదా’
గత కొన్నాళ్లుగా టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ (Yuzuvendra Chahal) పేరు తరచూ వార్తల్లో వినిపిస్తోంది. ఆటతో కాకుండా వ్యక్తిగత విషయాల కారణంగా యుజీ సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాడు. భార్య ధనశ్రీ వర్మతో అధికారికంగా విడిపోయే ముందే చహల్.. రేడియో జాకీ మహ్వశ్ (RJ Mahvash)తో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) టోర్నీని వీక్షించేందుకు మహ్వశ్తో కలిసి చహల్ దుబాయ్‌కు వెళ్లాడు. అక్కడే ఈ ‘ప్రేమపక్షులు’ కెమెరా కంటికి చిక్కగా చహల్ కొత్త ప్రేమాయణానికి సంబంధించిన వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కొన్నాళ్లకే ధనశ్రీ వర్మతో చహల్‌కు అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి.ప్రేమలో ఉన్నట్లు హింట్ అప్పటి నుంచి ఎక్కడ చూసినా చహల్- మహ్వశ్ జంటగానే కనిపిస్తున్నారు. ఇటీవల ఓ షోకు హాజరైన చహల్ తాను ప్రేమలో ఉన్నట్లు హింట్ ఇచ్చేశాడు కూడా!.. మరోవైపు.. మహ్వశ్ కూడా చహల్ మాజీ భార్య ధనశ్రీని టార్గెట్ చేస్తూ పరోక్షంగా పలుమార్లు విమర్శలు గుప్పించింది. భరణం విషయంలోనూ ధనశ్రీ తీరును తప్పుబట్టింది.చీటింగ్ గురించి మహ్వశ్ వీడియోతాజాగా మరోసారి ఆర్జే మహ్వశ్ ఓ ఆసక్తికర వీడియోతో ముందుకు వచ్చింది. ఇది మోసం చేసే కాలం అంటూ.. ‘‘ఓ బంధంలో ఇలాంటి పనులు చేయడం మోసం. అలా చేసేవాళ్లను వాళ్ల కర్మకు వారిని వదిలిపెట్టాలి. వాళ్లు ఇప్పటికే కుంగుబాటుకు గురై ఉంటారు.మోసానికి గురవుతున్న వ్యక్తి పట్ల మనం సానుభూతి చూపాల్సిందే. ప్రేమ లేదని అతడు రోజూ బాధపడిపోతుంటాడు. అయితే, ప్రేమను వ్యాప్తి చేయడానికి మరొక వ్యక్తి జీవితంలోకి వచ్చి మళ్లీ మోసం చేస్తాడు. ఆ తర్వాత ఇంకొకరిని కూడా మోసం చేసేందుకు సిద్ధపడతాడు.దేవుడు వారి పనులకు అడ్డుకట్ట వేసేంతవరకు ఏ వ్యక్తి అయినా ఇలాగే చేస్తారు. అలాంటి వాళ్లను రెండుసార్ల కంటే ఎక్కువ క్షమించవద్దు. లేదంటే మీరు బాధపడాల్సి వస్తుంది. నా గత రిలేషన్షిప్లో ఇదే జరిగింది.అలాంటి వారిని చూసి మనం జాలి పడి వదిలేయాలి. వారివి చెడు ఆలోచనలు. కానీ మీరు అలా కాదుగా.. వారి కంటే మన జీవితంలోకి గొప్ప వ్యక్తి తప్పక వస్తారు. జీవితం చాలా చిన్నది. కొన్నిసార్లు సరైన వ్యక్తితో కంటే.. తప్పుడు వ్యక్తితోనే మనం ఎక్కువకాలం జీవించాల్సి వస్తుంది’’ అని మహ్వశ్ చెప్పుకొచ్చింది.వేరొకరి భర్తను లాక్కోవడం కూడా మోసమే కదా!ఈ నేపథ్యంలో చహల్- ధనశ్రీల పేర్లు ప్రస్తావిస్తూ.. ‘‘వేరొకరి భర్తను లాక్కోవడం కూడా మోసమే కదా!’’ అంటూ ఓ నెటిజన్ మహ్వశ్కు కౌంటర్ ఇచ్చాడు. ఇందుకు స్పందిస్తూ... ‘‘నేను ఎవరినీ లాక్కోలేదు. కాబట్టి నాకు ఈ విషయం గురించి పెద్దగా తెలియదు. ఏదేమైనా వేరొకరి భర్తను లాక్కోవడం కచ్చితంగా మోసం చేయడమే’’ అని పేర్కొంది. అంతేకాదు వ్యూస్ కోసం తనలాంటి వాళ్లను టార్గెట్ చేయడం ఇలాంటివి వారికి అలవాటు అంటూ సెటైర్ వేసింది. దీంతో మరోసారి ఆమె నెటిజన్లకు టార్గెట్ అయింది.కాగా కొరియాగ్రాఫర్ ధనశ్రీ వర్మను ప్రేమించిన చహల్.. 2020, డిసెంబరులో ఆమెను పెళ్లాడాడు. అయితే, వీరి బంధం మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. ఈ ఏడాది వీరికి విడాకులు మంజూరయ్యాయి. అయితే, భార్యకు దూరంగా ఉంటున్న సమయంలోనే మహ్వశ్తో కలిసి చక్కర్లు కొడుతూ కెమెరా కంటికి చిక్కిన చహల్.. తమ బంధం గురించి ఇంకా అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. ఇక చహల్ చివరగా ఇంగ్లండ్ కౌంటీల్లో నార్తాంప్టన్‌షైర్‌కు ఆడాడు. చదవండి: రెండు నెలల్లోనే 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్‌కు ఇదెలా సాధ్యమైందంటే? -
గాయంపై అప్డేట్.. ఫొటోలు షేర్ చేసిన పంత్.. పోస్ట్ వైరల్
టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) తన గాయంపై అప్డేట్ అందించాడు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని.. తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా.. తన కాలి గాయం తాలూకు ఫొటోలు షేర్ చేసిన పంత్.. కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.2022లో జరిగిన కారు ప్రమాదంలో అదృష్టవశాత్తూ.. ప్రాణాపాయం నుంచి బయటపడిన పంత్ దాదాపు ఏడాది పాటు ఆటకు దూరమయ్యాడు. గతేడాది ఐపీఎల్‌తో రీఎంట్రీ ఇచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. టీమిండియా తరఫున పునరాగమనంలోనూ అదరగొడుతున్నాడు.479 పరుగులుతాజాగా ఇంగ్లండ్‌తో టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy) టెస్టు సిరీస్‌లోనూ పంత్ సత్తా చాటాడు. నాలుగు టెస్టుల్లో కలిపి 479 పరుగులు సాధించాడు. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ శతకాలు (134, 118)బాదిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం (65)తో సత్తా చాటాడు.బొటనవేలు ఫ్రాక్చర్ఇక లార్డ్స్ మైదానంలోనూ హాఫ్ సెంచరీ(74) బాదిన పంత్.. మాంచెస్టర్ టెస్టు సందర్భంగా గాయపడినప్పటికీ వీరోచిత అర్ధ శతకం (54)తో మెరిశాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయిన పంత్.. కుడికాలి బొటనవేలికి బంతి బలంగా తాకింది. దీంతో కాలు ఉబ్బిపోవడంతో పాటు.. బొటనవేలు ఫ్రాక్చర్ అయింది.ఈ క్రమంలో 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన పంత్.. జట్టు అవసరాల దృష్ట్యా తిరిగి బ్యాటింగ్ దిగాడు. మరో 17 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. పంత్ పోరాట పటిమ కారణంగానే తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేయగలిగింది టీమిండియా.అనంతరం ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 669 పరుగులు చేసి సవాలు విసరగా.. భారత్ ఐదో రోజు ఆఖరి సెషన్ వరకు అద్భుతంగా పోరాడి.. మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఇక వేలి నొప్పి కారణంగా పంత్ ఐదో టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో నారాయణన్ జగదీశన్‌కు బీసీసీఐ పిలుపునిచ్చింది.ఉత్తమమైన, గర్వకారణమైన క్షణం అదేఇదిలా ఉంటే.. తన గాయం గురించి స్పందిస్తూ.. ‘‘నేను త్వరగా కోలుకోవాలంటూ నా శ్రేయోలాభిలాషుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నిజానికి నేను దృఢంగా ఉండటానికి మీ ప్రేమాభిమానాలే కారణం.గాయం పూర్తిగా నయమైన తర్వాత నేను రిహాబిలిటేషన్ మొదలుపెడతాను. తిరిగి మైదానంలో అడుగుపెట్టే ప్రక్రియ ప్రారంభిస్తాను. ఓపికగా ఎదురుచూస్తూ.. నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమవుతాను.దేశం కోసం ఆడటమే నా జీవితంలోని అత్యంత ఉత్తమమైన, గర్వకారణమైన క్షణం. త్వరలోనే మళ్లీ మైదానంలో దిగాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని పంత్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. ఈ మేరకు అతడు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో గిల్ సేన 1-2తో వెనుకబడి ఉంది. లండన్‌లోని ఓవల్ మైదానంలో చివరిదైన ఐదో టెస్టు గెలిస్తేనే టీమిండియా 2-2తో సిరీస్ సమం చేయగలుగుతుంది.చదవండి: IND vs ENG: ‘రెండు కుక్కలు తెచ్చి.. ఆ పేర్లు పెడతాడు’ 🙌#RP17 pic.twitter.com/LlAZ7lJKDm— Rishabh Pant (@RishabhPant17) July 28, 2025 -
సచిన్, ధోని, కోహ్లి సంపాదన తెలిసి.. నోరెళ్లబెట్టిన ఇంగ్లండ్ స్టార్లు!
సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar).. మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. విరాట్ కోహ్లి (Virat Kohli).. ఈ మూడు పేర్లకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. క్రికెట్‌ను కూడా ఓ మతంగా భావించే భారత్‌లో కోట్లాది మంది అభిమానులకు వీరు దేవుళ్లతో సమానం అంటే అతిశయోక్తి కాదు. తమదైన ఆటతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిన వీరు.. సంపాదనలోనూ ముందే ఉన్నారు.రెండు చేతులా సంపాదనఈ టీమిండియా దిగ్గజ త్రయం వెయ్యి కోట్లకు పైగా సంపాదన కలిగి ఉన్నారని అంచనా. క్రికెటర్లుగా బీసీసీఐ నుంచి పొందే ప్రయోజనాలతో పాటు.. తమ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో ఎన్నో ప్రఖ్యాత బ్రాండ్లకు వీరు అంబాసిడర్లుగా ఉన్నారు. తద్వారా రెండు చేతులతో సంపాదిస్తున్నారు.శతక శతకాల ధీరుడు సచిన్, మూడు ఐసీసీ ట్రోఫీల వీరుడు ధోని రిటైర్ అయినా.. సంపాదనలో మాత్రం ముందే ఉన్నారు. ఇక కోహ్లి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో టీమిండియా సూపర్స్టార్ల సంపద గురించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అడిగిన ప్రశ్నకు.. భారత జట్టు మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ఇచ్చిన సమాధానం వైరల్‌గా మారింది.రూ. 100 కోట్లకు పైగానే‘‘టీమిండియా సూపర్స్టార్ల సంపాదన ఏమేర ఉంటుంది’’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో వాన్.. రవిశాస్త్రిని అడిగాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘వాళ్ల సంపాదన చాలా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎండార్స్మెంట్ల ద్వారా రూ. 100 కోట్లకు పైగానే సంపాదించి ఉంటారు.నోరెళ్లబెట్టిన ఇంగ్లండ్ స్టార్లు!అవును.. పది మిలియన్ల పౌండ్లు. నేనైతే వంద రూపాయలకు ఒక పౌండ్ చొప్పున ఇప్పుడు లెక్కకడుతున్నా. ఎంఎస్, విరాట్, సచిన్... 15- 20కి పైగా యాడ్లు చేస్తారు. రోజూ ఏదో వ్యాపకం ఉంటుంది. ఒక్కరోజు నటించే యాడ్‌తో కోట్లు సంపాదిస్తారు’’ అని రవిశాస్త్రి చెప్పాడు. దీంతో నోరెళ్లబెట్టడం వాన్ వంతైంది. అతడితో పాటు అక్కడే ఉన్న అలిస్టర్ కుక్ కూడా ఆశ్చర్యపోయాడు.ఎవరికి వారే సాటికాగా సచిన్ టెండుల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు చేసి... ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అతడి పేరిట ఉన్న ఈ ప్రపంచ రికార్డు బద్దలయ్యే ప్రసక్తే లేదని చెప్పవచ్చు. ఇక ధోని టీమిండియాకు 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్‌కప్, 2013లో చాంపియన్స్ ట్రోఫీ రూపంలో మూడు ఐసీసీ టైటిళ్లు అందించాడు.మరోవైపు.. సూపర్‌స్టార్ కోహ్లి ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇప్పటికి ఎనభై రెండు శతకాలు సాధించి.. సచిన్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. ఇక వన్డేల్లో 51 సెంచరీలతో సచిన్‌ను కూడా అధిగమించి.. అత్యధిక శతకాల వీరుడిగా కొనసాగుతున్నాడు. కాగా అంతర్జాతీయ టీ20లకు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి.. వన్డేలతో పాటు ఐపీఎల్లో కొనసాగుతున్నాడు.చదవండి: మరణాన్నే జయించిన వాడికి ఇదో లెక్కా?: మాజీ క్రికెటర్ ప్రశంసలు -
నా కూతురు కూడా అంతే.. ఫిట్నెస్ లేకుంటే కష్టం: ధోని
టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయు ప్రమాణం గురించి మాట్లాడుతూ.. ఫిట్నెస్ ఆవశ్యకతను వివరించాడు. శారీరక శ్రమ చేస్తేనే ఆరోగ్యంగా ఉంటారని.. కానీ యువతరం ఈ విషయంలో అంతగా శ్రద్ధ తీసుకుంటున్నట్లు కనిపించడం లేదన్నాడు. 44 ఏళ్ల వయసులోనూభారత్కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ధోని 44 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు సారథిగా ఐదు ట్రోఫీలు అందించిన తలా.. ప్రస్తుతం ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ ఏడాది రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన నేపథ్యంలో మరోసారి కెప్టెన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు.ఇక ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడిగా పేరొందిన ధోని.. నాలుగు పదుల వయసు దాటిన తర్వాత కూడా మైదానంలో పాదరసంలా కదలడం విశేషం. వికెట్ల మధ్య పరుగులు తీయడంలోనూ యువ ఆటగాళ్లకు అతడు పోటీ ఇస్తాడంటే అతిశయోక్తి కాదు.నా కూతురు కూడా అంతేకాగా.. తాజాగా ధోని తన స్వస్థలం రాంచిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఫిట్నెస్ ప్రాముఖ్యత గురించి వివరించాడు. ‘‘ఈ రోజుల్లో శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. ఫలితంగా ఆయు ప్రమాణం కూడా తగ్గిపోతోంది.భారతీయుల సగటు ఆయు ప్రమాణం క్షీణిస్తోంది. నా కూతురు కూడా ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేసేందుకు ఇష్టపడదు. తనకు ఆటలాడటం పెద్దగా ఇష్టం ఉండదు. పిల్లలు బయటకు వెళ్లి ఆడకపోతే శారీరకంగా ఎలా చురుగ్గా ఉండగలరు?కచ్చితంగా ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. అందుకోసం ప్రతి తల్లిదండ్రులు వాళ్లను కొత్త ఆటలు ఆడేలా వారిలో స్ఫూర్తి నింపాలి’’ అని ధోని చిన్ననాటి నుంచే ఫిట్నెస్ మీద అవగాహన అవసరమని చెప్పుకొచ్చాడు.కాగా 2010లో సాక్షి సింగ్ రావత్‌ను పెళ్లాడాడు ధోని. ఈ జంటకు 2015లో కుమార్తె జన్మించగా.. జీవాగా నామకరణం చేశారు. పదేళ్ల జీవా కాస్త బొద్దుగా ఉండేది. తల్లి సాక్షితో కలిసి ధోనీ మ్యాచ్‌లు చూసేందుకు వచ్చే జీవా.. తండ్రి ఆటను ఆస్వాదిస్తూ కరతాళ ధ్వనులతో అతడిని ఉత్సాహపరచడంలో ముందే ఉంటుంది. చదవండి: రెండు నెలల్లోనే 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్‌కు ఇదెలా సాధ్యమైందంటే? -
రెండు నెలల్లోనే 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్‌కు ఇదెలా సాధ్యమైందంటే?
‘‘అధిక బరువు.. ఫిట్‌గా లేడు.. ఇలాగే ఉంటే కెరీర్‌ను ఎక్కువకాలం కొనసాగించలేడు. బరువు తగ్గితే బెటర్..’’.. టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను ఉద్దేశించి మాజీ క్రికెటర్లు తరచూ చేసే విమర్శలు ఇవి. అయితే, ఇకపై వారికి ఆ అవకాశం లేకుండా చేసేందుకు నడుంకట్టాడు ఈ ముంబైకర్.కేవలం రెండు నెలల్లోనే సర్ఫరాజ్ ఖాన్ ఏకంగా పదిహేడు కిలోల బరువు తగ్గి ఆశ్చర్యపరిచాడు. అంతకు ముందు అలా.. ఇప్పుడు ఇలా అంటూ అతడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో వైరల్‌గా మారింది. మరి ఇంతకీ సర్ఫరాజ్ ఖాన్ ఇంత త్వరగా బరువు తగ్గడానికి ఎలాంటి డైట్ పాటించాడో తెలుసా?!రోటీలు, అన్నం తినడం మానేశాముఈ విషయం గురించి సర్ఫరాజ్ ఖాన్ తండ్రి, కోచ్ నౌషద్ ఖాన్ మీడియాకు తెలియజేశాడు. ‘‘ ఒక రకంగా నోరు కట్టేసుకున్నామనే చెప్పవచ్చు. దాదాపు నెల, నెలన్నర పాటు రోటీలు, అన్నం తినడం పూర్తిగా మానేశాము.బ్రకోలి, క్యారట్, దోసకాయ, సలాడ్లు ముఖ్యంగా ఆకుపచ్చటి కూరగాయలతో చేసిన సలాడ్లు ఎక్కువగా తిన్నాము. వీటితో పాటు కాల్చిన చేపలు, కాల్చిన, ఉడకబెట్టిన చికెన్, ఉడకబెట్టిన గుడ్లు డైట్లో చేర్చుకున్నాము. గ్రీన్ టీ, గ్రీన్ కాఫీలు తాగాము.చక్కెర ముట్టనేలేదుఅవకాడోలు, మొలకెత్తిన విత్తనాలు ఎక్కువగా తిన్నాము. అయితే, వీటన్నికంటే ముఖ్యంగా మేము అన్నం, రోటీ తినడం మానేయడం వల్లే ఎక్కువ మేలు జరిగింది. అంతేకాదు చక్కెర కూడా అస్సలు ముట్టలేదు. మైదాతో చేసే పదార్థాలు, బేకరీ ఫుడ్‌ను పూర్తిగా పక్కనపెట్టేశాము.పన్నెండు కిలోలు తగ్గిపోయానుఈ క్రమంలోనే సర్ఫరాజ్ నెలన్నరలోనే దాదాపు పది కిలోలకు పైగా తగ్గిపోయాడు. ఇంకా బరువు తగ్గేందుకు తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. బిర్యానీ తినడం కూడా పూర్తిగా తగ్గించేశాడు. నేను కూడా దాదాపు పన్నెండు కిలోలు తగ్గిపోయాను.ఇప్పుడు నా మోకాలి నొప్పికి కాస్త ఉపశమనం కలిగింది. తనతో పాటు డైట్ చేయడం వల్ల నాకు కూడా ఇలా మేలు జరిగింది’’ అని నౌషద్ ఖాన్ హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.గతేడాది అరంగేట్రంకాగా దేశవాళీ క్రికెట్లో ముంబై తరఫున సత్తా చాటిన సర్ఫరాజ్ ఖాన్.. 2024లో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటికి ఆరు టెస్టులు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ మూడు అర్ధ శతకాలు, ఒక సెంచరీ సాయంతో 371 పరుగులు చేశాడు.చివరగా ఇటీవల ఇంగ్లండ్-‘ఎ’ జట్టుతో భారత్-‘ఎ’ ఆడిన అనధికారిక టెస్టు సిరీస్‌లో సర్ఫరాజ్ పాల్గొన్నాడు. కాంటర్బరీలో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 119 బంతుల్లో 92 పరుగులు చేసి.. సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇక నార్తాంప్టన్‌లో జరిగిన రెండో టెస్టులో అతడికి ఆడే అవకాశం రాలేదు. -
ODI WC 2011: యువీని సెలక్ట్ చేయడం అవసరమా?
టీమిండియా వన్డే వరల్డ్‌కప్-2011 గెలవడంలో ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh)ది కీలక పాత్ర. ఈ ఐసీసీ టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న యువీ.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. ఈ ఈవెంట్ మొత్తంలో 362 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు పడగొట్టి కీలక మ్యాచ్‌లలో భారత్‌ను గెలిపించాడు. యువీ లేని ఈ టోర్నీని ఊహించడం కూడా సాధ్యం కాదు.అయితే, యువీని అసలు జట్టులోకి తీసుకోవాలా? వద్దా? అన్న అంశంపై తీవ్రమైన చర్చ నడిచిందట. 2010లో ఈ ఆల్‌రౌండర్ ఆట తీరు అంత గొప్పగా లేకపోవడమే ఇందుకు కారణం. అయితే, నాటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni)తో పాటు అప్పటి టీమిండియా కోచ్ గ్యారీ కిర్‌స్టన్ మాత్రం అతడి కోసం పట్టుబట్టారట. ఇందుకు సంబంధించి కిర్‌స్టన్ తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.ధోని కూడా నాలాగే ఆలోచించాడు‘‘నాడు ఆ జట్టు ఎంపిక అంత తేలికగా ఏమీ జరుగలేదు. పదిహేను మంది ప్లేయర్లు ఎవరా అన్న అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఆఖరి నిమిషంలో.. అతడిని జట్టులోకి తీసుకున్నాం. ఇందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పాల్సిందే.నిజానికి నేను అతడిని తప్పక జట్టులోకి తీసుకోవాలనే పట్టుదలతో ఉన్నాను. ధోని కూడా నాలాగే ఆలోచించాడు. యువీ అనుభవాన్ని, అతడి ప్రతిభను మిస్ చేసుకోకూడదని మేము ఫిక్సయ్యాం. మా నమ్మకాన్ని నిలబెట్టేలా అతడు టోర్నీ ఆసాంతం ఎలా ఆడాడో అందరూ చూశారు కదా!యువరాజ్ అంటే చాలా ఇష్టంనాకు యువరాజ్ అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్కరితోనూ ఎంతో ఆప్యాయంగా ఉంటాడు. అయితే, ఎదుటివాళ్లకు చిరాకు తప్పించడం అతడికి అలవాటు. ఒక్కోసారి ఆ అల్లరి శ్రుతిమించుతుంది కూడా!.. అయినప్పటికీ అతడంటే నాకు అభిమానం.చాలా మంచివాడు. అతడు ఎప్పుడు బ్యాటింగ్ చేసినా పెద్ద ఎత్తున పరుగులు రాబట్టాలని కోరుకుంటాను. అతడి బ్యాటింగ్‌ను పూర్తిగా ఆస్వాదిస్తాను’’ అని గ్యారీ కిర్‌స్టెన్ పాత సంగతులు గుర్తు చేసుకుంటూ యువీపై ప్రశంసలు కురిపించాడు.అతడి పాత్రా కీలకమేఇక యువీ వరల్డ్‌కప్ ప్రయాణం అంత తేలికగా ఏమీ సాగలేదన్న కిర్‌స్టన్.. ‘‘యువీని ప్రపంచకప్ టోర్నీకి పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయడంలో ప్యాడీ ఉప్టన్ (మెంటల్ కండిషనింగ్- స్ట్రాటజిక్ లీడర్షిప్ కోచ్)ది కీలక పాత్ర. తను ఎల్లవేళలా యువీకి మద్దతుగా నిలిచాడు. ఇక యువరాజ్ కూడా కీలక సమయాల్లో తనను మోటివేట్ చేసుకుంటూ అనుకున్న ఫలితాలను రాబట్టగలిగాడు’’ అని చెప్పుకొచ్చాడు.కాగా ధోని సారథ్యంలో టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011 గెలిచిన భారత జట్లలో యువీ సభ్యుడు అన్న విషయం తెలిసిందే. అయితే, యువీ తండ్రి యోగ్రాజ్ సింగ్ మాత్రం ధోనిని ఉద్దేశించి ఎల్లప్పుడూ ఘాటు విమర్శలు చేస్తూ ఉంటాడు. ధోని వల్లే తన కుమారుడి కెరీర్ నాశనమైందంటూ తీవ్రస్థాయిలో అతడిని విమర్శిస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే.. ముంబైలోని వాంఖడే వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో శ్రీలంకను ఓడించి టీమిండియా 2011లో ట్రోఫీని కైవసం చేసుకుంది.చదవండి: రుతురాజ్ గైక్వాడ్ కీలక నిర్ణయం -
బీసీసీఐ పెన్షన్.. సచిన్, యువీకి ఎంతంటే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రస్తుతం అమలు చేస్తున్న సెంట్రల్ కాంట్రాక్టుల గురించి అడిగితే క్రికెట్ లవర్స్ ఈజీగా చెప్పేస్తారు. ఎన్ని గ్రేడులు ఉన్నాయ్, ఏ గ్రేడ్‌కు ఎంత జీతం వస్తుందనే వివరాలు సగటు క్రికెట్ అభిమానులకు కరతలామలకం. కానీ పెన్షన్ గురించి అడిగి చూడండి.. చాలా తక్కువ మంది మాత్రమే కరెక్ట్ సమాధానం చెప్పగలుగుతారు. రిటైర్ అయిన మాజీ ఆటగాళ్లు, అంపైర్లకు బీసీసీఐ ప్రతినెలా పెన్షన్ ఇస్తుంటుంది.టీమిండియాకు అందించిన సేవలను గుర్తించి వారికి కృతజ్ఞత తెలిపేందుకు, రిటైర్ అయిన తర్వాత అండగా నిలిచేందుకు పెన్షన్ పథకాన్ని బీసీసీఐ (BCCI) అమలు చేస్తోంది. 2022, జూన్‌లో ఈ పథకాన్ని సవరించడంతో మాజీ ఆటగాళ్లు, అంపైర్లకు పెన్షన్ ద్వారా వచ్చే మొత్తం గణనీయంగా పెరిగింది. ఉన్నత శ్రేణి, దిగువ శ్రేణితో పాటు ఫస్ట్‌క్లాస్ మాజీ ఆటగాళ్లకు ఇచ్చే పెన్షన్‌లో కూడా పెరుగుదల చోటు చేసుకుంది.అదే కొలమానంటీమిండియా (Team India) తరపు ఎన్ని మ్యాచ్‌లు ఆడారు, ఎన్నేళ్ల పాటు జట్టులో ఉన్నారనే అంశాలతో పాటు టెస్ట్ మ్యాచ్‌ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడా లేదా అనే దాని ఆధారంగా మూడు కేటగిరీలుగా బీసీసీఐ విభజించింది. ఉన్నత శ్రేణిలో ఉన్న క్రికెటర్లకు నెలకు రూ. 70 వేలు, దిగువ శ్రేణిలోని వారికి రూ. 60 వేలు, ఫస్ట్‌క్లాస్ మాజీ ఆటగాళ్లకు రూ. 30 వేలు పెన్షన్ అందిస్తోంది.900 మందికి పెన్షన్సవరించిన పెన్షన్ పథకం ప్రస్తుతం దాదాపు 900 మంది రిటైర్డ్ క్రికెటర్లు, అంపైర్లకు ప్రయోజనం చేకూరుస్తోంది. 2022 సవరణ తర్వాత వారిలో దాదాపు 75% మంది పెన్షన్లలో 100% పెరుగుదల కనిపించింది. ఉన్నత శ్రేణి పెన్షన్ అందుకుంటున్న వారిలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటు పలువురు మాజీ ఆటగాళ్లు ఉన్నారు. అంటే సచిన్‌కు బీసీసీఐ నుంచి ప్రతినెల రూ. 70 వేలు పెన్షన్ అందుతోంది. తక్కువ టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన యువరాజ్ సింగ్ లాంటి ప్లేయర్లు దిగువ శ్రేణిలో ఉన్నారు. వీరికి నెలకు రూ.60 వేలు పెన్షన్ వస్తోంది. దేశవాళీ క్రికెట్ ఎక్కువ ఆడిన వినోద్ కాంబ్లి (Vinod Kambli) ఫస్ట్-క్లాస్ కేటగిరీలో నెలకు రూ.30 వేలు పెన్షన్ తీసుకుంటున్నాడు.చదవండి: బీసీసీఐ నుంచి వచ్చే నిధులు మళ్లించారువిలువైన గుర్తింపుసంపన్నులైన సచిన్, యువీ లాంటి స్టార్ ఆటగాళ్లకు పెన్షన్ అవసరమే లేదు. రిటైర్ అయిన తర్వాత కాంట్రాక్టులు, ఎండార్స్మెంట్ల ద్వారా ఇప్పటికీ కోట్లు సంపాదిస్తున్నారు. అయితే బీసీసీఐ నుంచి పెన్షన్ తీసుకోవడం వారు గౌరవంగా భావిస్తున్నారు. తమ సేవలకు దక్కిన విలువైన గుర్తింపుగా దీన్ని పరిగణిస్తున్నారు. క్రీడా జీవితానికి ముగింపు పలికిన ఎందరో ఆటగాళ్లకు మలి దశలో బీసీసీఐ ఇచ్చే పెన్షన్ ఆదరువుగా నిలుస్తోంది. చివరి రోజుల్లో గౌరప్రదమైన జీవితం గడిపేందుకు దోహదం చేస్తోంది. -
Divorce: సైనా అలా.. పారుపల్లి కశ్యప్ ఇలా!.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్
Saina Nehwal- Parupalli Kashyap Divorce: భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్స్ పతక విజేత సైనా నెహ్వాల్ (Saina Nehwal) తన భర్త పారుపల్లి కశ్యప్ (Parupalli Kashyap)తో విడిపోతున్నట్లు ప్రకటించింది. తాము సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆదివారం రాత్రి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.ప్రకటన విడుదల చేసిన సైనాఈ మేరకు.. ‘‘జీవితం మనల్ని ఒక్కోసారి వేర్వేరు దిశల్లో ప్రయాణం చేయిస్తుంది. సుదీర్ఘ చర్చలు, ఆలోచనల తర్వాత.. నేను కశ్యప్ పారుపల్లి విడిపోవాలని నిర్ణయించుకున్నాం.శాంతియుత జీవనం, ఎదుగుదల, మానసిక ప్రశాంతత మా ఇరువురికీ ముఖ్యమని భావించి వేర్వేరు దారుల్లో ప్రయాణించాలని భావించాము. మా ఇద్దరి బంధానికి సంబంధించి నాకెన్నో మధురానుభూతులు ఉన్నాయి. ఇక ముందు కూడా స్నేహితుల్లా ముందుకు సాగుతాం.ఇలాంటి క్లిష్ట సమయంలో మా గోప్యత, గౌరవానికి భంగం కలగకుండా మా నిర్ణయాన్ని గౌరవించాలని కోరుకుంటున్నా’’ అని సైనా నెహ్వాల్ ఇన్‌స్టా స్టోరీ ద్వారా తమ విడాకుల విషయాన్ని వెల్లడించింది.బెస్టెస్ట్ అంటూ కశ్యప్ స్టోరీఅయితే, అదే సమయంలో పారుపల్లి కశ్యప్ మాత్రం విడాకుల గురించి ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. అంతేకాదు.. సైనా కంటే ముందే ఓ పోస్ట్‌ను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఇందులో కశ్యప్ తన స్నేహితులతో కలిసి వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోను రీషేర్ చేస్తూ.. ‘‘బెస్టెస్ట్’’ అంటూ స్టోరీ పెట్టాడు.కపుల్ గోల్స్ సెట్ చేసిన క్రీడా జంట.. అంతలోనే..అయితే, సైనాతో ఉన్న పాత ఫొటోలన్నీ కూడా పారుపల్లి కశ్యప్ అలాగే ఉంచాడు. ఆమెతో కలిసి టూర్లకు వెళ్లిన ఫొటోలన్నీ తన సోషల్ మీడియా అకౌంట్లో అలాగే అట్టిపెట్టుకున్నాడు. కాగా భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ దగ్గర శిక్షణ తీసుకున్న సైనా, కశ్యప్ చాలా ఏళ్లపాటు ప్రేమించుకున్నారు. 2018లో పెళ్లి బంధంతో ఒక్కటైన వీరు అన్యోన్యంగా ఉండేవారు. కెరీర్ పరంగానూ ఒకరికొరు అండగా ఉంటూ కపుల్ గోల్స్ సెట్ చేసే వాళ్లు.కానీ అకస్మాత్తుగా ఇలా సైనా నుంచి విడాకుల ప్రకటన రాగా.. కశ్యప్ మాత్రం ఇంకా స్పందించకపోవడం గమనార్హం. కాగా సైనాకు ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం. కొన్నిసార్లు భర్త కశ్యప్‌తో పాటు టూర్లకు వెళ్లే సైనా.. మరికొన్ని సార్లు తన తల్లిదండ్రులతో కలిసి ప్రయాణాలు చేసేది. ఇందుకు సంబంధించిన జ్ఞాపకాలను ఫొటోల రూపంలో తన సోషల్ మీడియాలో షేర్ చేసేది సైనా. ఇక భర్తతో ఉన్న మధురానుభూతులను కూడా కెమెరాతో ఒడిసిపట్టి అభిమానులతో పంచుకునేది. చివరగా ఈ ఏడాది మేలో సైనా, కశ్యప్ సౌతాఫ్రికా టూర్‌కి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అక్కడ సంతోషంగా గడిపిన క్షణాలను సైనా షేర్ చేసింది. అయితే, వీరి మధ్య విభేదాలు, విడాకులకు గల కారణం ఏమిటో మాత్రం తెలియదు.కెరీర్లో బెస్ట్కాగా సైనా లండన్ ఒలింపిక్స్-2012లో మహిళల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం గెలవగా.. అదే ఎడిషన్‌లో కశ్యప్ మెన్స్ సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన భారత తొలి బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా కశ్యప్ చరిత్ర సృష్టించాడు. -
వైభవ్ సూర్యవంశీ క్రేజ్ మామూలుగా లేదుగా!.. టీనేజ్ స్టార్ కోసం ఏకంగా..
భారత క్రికెట్ వర్గాల్లో టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)తో పాటు అండర్-19 ఆటగాడు వైభవ్ సూర్యవంశీ పేరు మారుమ్రోగిపోతోంది. ఇంగ్లండ్ గడ్డ మీద వరుస శతకాలు బాదుతూ ఎడ్జ్‌బాస్టన్‌లో తొలిసారి జట్టును గెలిపించి గిల్ చరిత్ర సృష్టించగా.. అండర్-19 యూత్ వన్డే సిరీస్‌ను భారత్ గెలుచుకోవడంలో వైభవ్‌ది కీలక పాత్ర.ఇంగ్లండ్ గడ్డపై యాభై ఓవర్ల ఫార్మాట్లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. టీ20 మాదిరి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. తొలి మ్యాచ్‌లో 19 బంతుల్లోనే 48 పరుగులు సాధించిన ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు.. రెండో వన్డేలో 34 బంతుల్లో 45 రన్స్ రాబట్టాడు.సునామీ శతకంఇక మూడో యూత్ వన్డేల్లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ 31 బంతుల్లోనే 86 పరుగులతో దుమ్ములేపాడు. అయితే, ఆ తర్వాతి వన్డేలో మాత్రం వైభవ్ సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ బౌలింగ్‌ను చిత్తు చేశాడు. వోర్సెస్టర్ వేదికగా కేవలం 52 బంతుల్లోనే వంద పరుగులు పూర్తి చేసుకుని.. యూత్ వన్డేల్లో అత్యంత పిన్న వయసు (14 ఏళ్ల వంద రోజుల వయసు)లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సాధించాడు.అయితే, ఆఖరిదైన ఐదో వన్డేలో మాత్రం వైభవ్ 42 బంతుల్లో 33 పరుగులే చేయగలిగాడు. అయితేనేం.. ఇంగ్లండ్‌తో ఐదు వన్డేల్లో ఓవరాల్‌గా 29 సిక్సర్లు బాది.. 355 పరుగులు సాధించాడు. దీంతో క్రికెట్ ప్రేమికుల్లో ఎక్కడ చూసినా వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్ గురించే చర్చ.వైభవ్ సూర్యవంశీ క్రేజ్ మామూలుగా లేదుగా!ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ గడ్డ మీద వైభవ్ సూర్యవంశీ మేనియా ఏ రేంజ్లో ఉందో తెలిపేలా.. అతడి ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్ ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ఆరు గంటల పాటు కారులో ప్రయాణించి వోర్సెస్టర్‌కు చేరుకున్నారు. పింక్ జెర్సీ ధరించి వచ్చి వైభవ్‌తో పాటు టీమ్ ఇండియాకు మద్దతు పలికారు.ఆన్య, రివా.. వైభవ్ వయసు వారే. తమ అభిమాన ఆటగాడి కోసం వారు ఇంత దూరం వచ్చి.. మధురజ్ఞాపకాలు పోగు చేసుకున్నారు’’ అంటూ వైభవ్‌తో ఇద్దరమ్మాయిలు దిగిన ఫొటోలను రాజస్తాన్ రాయల్స్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.ఐపీఎల్‌లోనూ సరికొత్త చరిత్రకాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో భాగంగా రాజస్తాన్ రాయల్స్ బిహార్‌కు చెందిన వైభవ్‌ను.. రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ ఫిట్‌నెస్‌లేమి కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరం కాగా.. అతడి స్థానంలో తుదిజట్టులోకి వచ్చాడు వైభవ్. రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనంలో ఆకాశమే హద్దుగా చెలరేగి క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యంత పిన్న వయసులోనే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 14 ఏళ్ల 32 రోజుల వయసులో వైభవ్ 35 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదు యూత్ వన్డేల సిరీస్‌ను భారత్ 3-2తో గెలుచుకుంది. చదవండి: IND vs ENG: తుది జట్టులోకి బుమ్రా.. అతడిపైనే వేటుProof why we have the best fans 🫡🚗 Drove for 6 hours to Worcester👚 Wore their Pink🇮🇳 Cheered for Vaibhav & Team IndiaAanya and Rivaa, as old as Vaibhav himself, had a day to remember 💗 pic.twitter.com/9XnxswYalE— Rajasthan Royals (@rajasthanroyals) July 9, 2025 -
బాధపడకు తమ్ముడు!.. ఇంకో ఆర్నెళ్ల సమయం ఉంది.. అన్నీ తానై..
లక్నో: భారత పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) విజయవంతమైన బౌలింగ్ ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేసిన అతని సోదరి అఖండ్ జ్యోతి సింగ్ భావోద్వేగానికి గురైంది. క్యాన్సర్‌తో పోరాడుతున్న జ్యోతికి.. ఎడ్జ్‌బాస్టన్‌లోని పది వికెట్ల ప్రదర్శన అంకితమిస్తున్నట్లు మ్యాచ్ ముగిసిన అనంతరం ఆకాశ్‌దీప్ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో ఓ వార్తా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించిన జ్యోతి తన సోదరుడికి తన ఆనారోగ్యంపై చింతించకుండా దేశం కోసం శ్రమించాలని చెప్పినట్లు వెల్లడించింది.మా నాన్న చనిపోయినపుడు..క్యాన్సర్ బారిన పడటంతో తన కుటుంబానికి దూరమైన ఆనందాన్ని ఆకాశ్‌దీప్ తన ఆటతీరు ద్వారా తిరిగి తీసుకొచ్చాడని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. తమ కుటుంబాన్ని 2015 ఏడాది పెను విషాదంలో ముంచిందని... మళ్లీ ఇన్నాళ్లకు ఆనందం వెల్లివిరిసిందని జ్యోతి చెప్పింది. ‘మా నాన్న చనిపోయినపుడు ఆకాశ్ ఢిల్లీలో క్లబ్ క్రికెట్ ఆడుతున్నాడు. అయితే ఆశించిన ఎదుగుదల రాలేదు. దీంతో నేను గట్టిగా చెప్పాను. క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకుంటేనే రాణిస్తావని చెప్పా. ఇక్కడ కుదరకపోతే మరో చోటయినా ప్రయత్నించాలని సూచించాను. దీంతో 2017లో కోల్‌కతాకు మారాక బెంగాల్ అండర్–23 జట్టు తరఫున నిలకడగా రాణించడం మొదలుపెట్టాడు. ఒకే ఏడాది తండ్రి, ఓ తమ్ముడు మరణించడంతో మా కుటుంబాన్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. అయినా సరే దేనికి దిగులు చెందక ఆకాశ్ లక్ష్యాన్ని చేరుకునేందుకు మా వంతు ప్రయత్నం మేం చేశాం’ అని జ్యోతి వివరించింది.జబ్బు గురించి చెప్పాలనుకోలేదు ఈ మ్యాచ్‌ను మేమంతా చూశాం. వికెట్ తీసిన ప్రతీసారి గట్టిగా చప్పట్లతో సంబరం చేసుకున్నాం. దీంతో ఇరుగు పొరుగువారు వచ్చి ఏమైందని అడిగి వెళ్లిపోయారు. దేశానికి విజయాన్నిచ్చిన అతని ప్రదర్శన మాకైతే పండగను తెచ్చింది. ఇక మీడియాలో నా జబ్బు సంగతి చెప్పినట్లు మొదట తెలియదు.ఎందుకంటే నా క్యాన్సర్ గురించి బయటికి వెల్లడించేందుకు మా కుటుంబం సిద్ధంగా లేదు. బహుశా నాపై అప్యాయత కొద్దీ ఆ క్షణం భావోద్వేగానికి గురై అక్కకు అంకితం చేస్తున్నానని చెప్పి ఉండొచ్చు. నేనన్నా... కుటుంబమన్నా అతనికి వల్లమాలిన ప్రేమ. నాకిప్పుడు క్యాన్సర్ మూడో దశలో ఉంది. ఇంకో ఆర్నేళ్ల చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. ఆ తర్వాతే ఏమవుతుందో చూడాలి. ఐపీఎల్ సమయంలో హాస్పిటల్‌కు... ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించే ఆకాశ్ లీగ్ జరిగే సమయంలో పది వేదికలు మార్చి మార్చి ఆడే అంతటి బిజీ షెడ్యూల్లోనూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నన్ను పరామార్శించేందుకు మ్యాచ్ ముందో, తర్వాతో తప్పకుండా వచ్చేవాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికపై విజయం సాధించాక రెండుసార్లు వీడియో కాల్లో మాట్లాడుకున్నాం.అప్పుడు అతను.. నాతో .. ‘‘అక్క ఏమాత్రం బాధపడకు. దేశం మొత్తం మనవెంటే ఉందని చెప్పడంతో ఆ క్షణం నన్ను నేను నియంత్రించుకోలేక భావోద్వేగానికి గురై ఏడ్చేశాను. నిజం చెబుతున్నా... ఇలాంటి తమ్ముడు చాలా అరుదుగా ఉంటాడు. మాకెప్పుడు అండగా ఉంటాడు. మాకు చెప్పందే ఏదీ చేయడు. ప్రతి విషయాన్ని కుటుంబంతో పంచుకుంటాడు. ఆర్నెళ్ల వ్యవధిలోనే మా నాన్న, ఒక సోదరుడు మరణించడంతో కుటుంబభారాన్ని ఆకాశే అన్నీ తానై మోస్తున్నాడు.ఆకాశమంత ధైర్యం నేను క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నప్పుడు ఆకాశ్ మాటలే నా స్థయిర్యాన్ని పెంచేవి. నా ఆరోగ్యం గురించే ఆలోచించేవాడు. అప్పుడు నేను అతని దృష్టి ఆటపైనే కేంద్రీకరించేందుకు ధైర్యం చెప్పేదాన్ని. ‘నేనిప్పుడు బాగానే ఉన్నాను. నా కోసం బాధపడొద్దు. నాకు తోడుగా నా భర్త ఉన్నాడు. నీవేం విచారించకు’ అని చెబితే... వెంటనే కల్పించుకుని తానేం చేసినా, సాధించినా సోదరిల కోసం, కుటుంబం కోసమే అని బదులిచ్చాడు.మా తల్లిదండ్రులకు మేం ఆరుగురు సంతానం. ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలం. ఆకాశ్ అందరికంటే చిన్నవాడు. నేను తనకంటే పదేళ్లు పెద్ద. చిన్నప్పటి నుంచి కూడా మా ఇద్దరి మధ్య ఆప్యాయత ఎక్కువే. మ్యాచ్‌కు ముందు, తర్వాత నాకు వీడియో కాల్ చేసి మాట్లాడతాడు. నేను తీసిన ఈ వికెట్లు నీ కోసం, దేశం కోసం’ అని గర్వంగా చెబుతాడు.రాగానే దహీ వడ తినిపిస్తా ఇంగ్లండ్ నుంచి స్వదేశానికి రాగానే ఆకాశ్ దీప్‌కు ఇష్టమైన వంట చేసి పెడతా. తనకిష్టమైనవే కాదు... తను ఏం కావాలన్నా సరే వండిపెడతా. నేను చేసే దహీ వడ అంటే అతనికెంతో ఇష్టం. ఆకుకూరలతో చేసిన వంటకాలను ఇష్టంగా తింటాడు. మా ఇంటికి ఎప్పుడొచ్చినా అవే చేసిపెట్టాలంటాడు. చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్ -
సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న సురేశ్ రైనా.. ప్రకటన విడుదల
టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా (Suresh Raina) కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాడు. సినిమా నటుడిగా అవతారం ఎత్తేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని రైనా స్వయంగా వెల్లడించాడు. తాను కోలీవుడ్‌లో నటించనున్నట్లు తెలిపాడు.ఇందుకు సంబంధించి తమిళ సినిమా నిర్మాణ సంస్థ నుంచి శనివారం అధికారిక ప్రకటన వెలువడింది. డ్రీమ్ నైట్ స్టోరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీలో రైనాకు స్వాగతం పలుకుతున్న వీడియోను క్రికెటర్ శివం దూబే చేతుల మీదుగా విడుదల చేశారు.క్రికెట్ మైదానం నుంచి.. కోలీవుడ్ ఫ్రేమ్స్ దాకా..ఈ నేపథ్యంలో సురేశ్ రైనా స్పందిస్తూ.. ‘‘క్రికెట్ మైదానం నుంచి.. కోలీవుడ్ ఫ్రేమ్స్ దాకా.. చెన్నై నాలో నిండి నన్ను ముందుకు నడిపిస్తోంది. నా ఈ కొత్త ప్రయాణంలో డీకేఎస్ సంస్థతో జట్టుకట్టడం ఎంతో గర్వంగా ఉంది’’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేశ్ రైనా.. 2005 నుంచి 2018 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.అంతర్జాతీయ స్థాయిలో 226 వన్డేలు, 78 టీ20లు, 18 టెస్టులు ఆడిన రైనా.. ఆయా ఫార్మాట్లలో 5615, 1604, 768 పరుగులు సాధించాడు. ఇక ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌కు ఐపీఎల్లో ఘనమైన రికార్డు ఉంది. క్యాష్ రిచ్ లీగ్‌లో మొత్తంగా 205 మ్యాచ్‌లు ఆడిన రైనా.. 5528 పరుగులు సాధించి మిస్టర్ ఐపీఎల్‌గా గుర్తింపు పొందాడు.చిన్న తలాగా అభిమానుల హృదయాల్లో చోటుఇక ఐపీఎల్ కెరీర్లో చాలా ఏళ్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సురేశ్ రైనా.. చిన్న తలాగా గుర్తింపు పొందాడు. మహేంద్ర సింగ్ ధోని తర్వాత అంతటి స్థాయిలో చెన్నై అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు అక్కడి నుంచే తన సినీ ప్రయాణం కూడా మొదలుపెట్టనున్నాడు.సంతోషంగా ఉందితాను తమిళ సినిమా ద్వారా అరంగేట్రం చేయడం గురించి సురేశ్ రైనా మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు నా దగ్గరకు వచ్చి కథ చెప్పినపుడు అది నా మనసుకు ఎంతో దగ్గరగా అనిపించింది. క్రికెట్‌కు సంబంధించిన ఈ సినిమాలో నటించడం గర్వకారణం.అది కూడా ఎన్నో ఏళ్లుగా సీఎస్కేకు ఆడి.. తమిళనాడు నుంచి నా సినిమా ప్రయాణం మొదలుపెట్టడం మరింత సంతోషంగా ఉంది. ఇక్కడి ప్రజలు మాపై ఎంతో ప్రేమను కురిపించారు’’ అని పేర్కొన్నాడు. కాగా సురేశ్ రైనా నటిస్తున్న తమిళ చిత్రానికి లోగాన్ దర్శకుడు కాగా.. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా మరో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా కోలీవుడ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అదే విధంగా.. కేరళకు చెందిన మాజీ పేసర్ శ్రీశాంత్ కూడా తమిళ సినీ రంగంలో నటుడిగా అడుగుపెట్టాడు. నయనతార, సమంతలతో కలిసి విజయ్ సేతుపతి నటించిన కాతువాకుల రెండు కాదల్ సినిమాలో శ్రీశాంత్ మోబీ అనే పాత్రలో నటించాడు.చదవండి: వేలంలో రికార్డులు బద్దలు.. అత్యంత ఖరీదైన ఆటగాడిగా సంజూ శాంసన్ -
భావోద్వేగంతో వీడ్కోలు పలికిన రొనాల్డో.. పోస్ట్ వైరల్
లివర్‌పూల్ ఫుట్‌బాల్ స్టార్ డియోగో జోటా (Diogo Jota) జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. 28 ఏళ్లకే ఈ పోర్చుగల్ ఫుట్‌బాలర్‌కు నూరేళ్లూ నిండాయి. స్పెయిన్‌లో జరిగిన ఘోర ర కారు ప్రమాదం అతడిని బలిగొంది. ఈ దుర్ఘటనలో జోటాతో పాటు అతడి తమ్ముడు ఆండ్రీ సిల్వా (25) కూడా మృత్యువాత పడ్డాడు.కాగా ఆండ్రీ కూడా అన్న మాదిరే ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్. వీరిద్దరి దుర్మరణంతో ఫుట్‌బాల్ ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. ముఖ్యంగా పెళ్లైన పదిరోజులకే జోటా ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా వెళ్లిపోవడం.. అతడి భార్య రూటే కార్డొసోకు తీరని శోకాన్ని మిగిల్చింది. మర్చిపోలేని రోజుఇక చనిపోవడానికి కొన్ని గంటల ముందే జోటా.. తమ పెళ్లి వీడియోను షేర్ చేశాడు. ‘ఇది జీవితంలో మర్చిపోలేని రోజు’ అంటూ తన లవ్ లైఫ్‌లోని మధుర క్షణాలను అభిమానులతో పంచుకున్నాడు. వధూవరులుగా మారిన చిరకాల స్నేహితులు అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో ఉంగరాలు మార్చుకుని వివాహ బంధంతో ఒక్కటైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ వీడియోను చూసిన జోటా అభిమానులు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. ‘‘మీ ప్రేమను చూసి చూసి విధికి కన్నుకుట్టింది. వి మిస్ యూ’’ అంటూ జోటాకు సంతాపం తెలుపుతున్నారు. కాగా పది రోజుల క్రితమే.. తన చిన్ననాటి స్నేహితురాలు రూటేను జోటా పెళ్లి చేసుకున్నాడు. జోటాకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు సంతానం. View this post on Instagram A post shared by Diogo Jota (@diogoj_18) రొనాల్డో భావోద్వేగంపోర్చుగల్ దిగ్గజ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) సహచర ఆటగాడు జోటా దుర్మరణం పట్ల తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశాడు. ‘‘అసలు ఇది నిజమేనా?!.. ఇలాంటిది ఒకటి జరిగిందా?.. మనం ఇప్పుడే కదా జాతీయ జట్టులో కలిసి ఆడటం మొదలుపెట్టాము.మొన్ననే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు. నీ భార్య, పిల్లలు, కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. నువ్వు ఎల్లప్పుడూ వాళ్లతోనే ఉంటావని నాకు తెలుసు. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. డియోగో, ఆండ్రీ.. మీ ఇద్దరిని మేము చాలా మిస్సవుతాము’’ అంటూ రొనాల్డో భావోద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. డియోగో జోటా ఫొటో షేర్ చేస్తూ రొనాల్డో పెట్టిన ఈ పోస్టు కూడా పదికి పైగా మిలియన్ల వ్యూస్‌తో వైరల్‌గా మారింది.లివర్‌పూల్ తరఫున ఐదు టైటిళ్లులివర్పూల్ ఫుట్‌బాల్ క్లబ్ తరఫున డియోగో జోటా ప్రీమియర్ లీగ్‌తో పాటు రెండు నేషన్స్ లీగ్ టైటిళ్లు.. అదే విధంగా.. రెండు ఈఎఫ్ఎల్ టైటిళ్లూ గెలిచాడు. కాగా తమ స్టార్ ప్లేయర్ మృతి పట్ల లివర్‌పూల్ ఎఫ్‌సీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. డియోగో, ఆండ్రీ మరణం తమను తీవ్రంగా కలచివేసిందని.. ఇలాంటి క్లిష్ట సమయంలో వారి కుటుంబం ధైర్యంగా ఉండాలంటూ సంతాపం ప్రకటించింది. వారికి తాము ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపింది. View this post on Instagram A post shared by Cristiano Ronaldo (@cristiano) -
నెలకు రూ. 4 లక్షలు ఇవ్వండి
టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami) విడాకుల కేసులో కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భరణం కింద నెలకు నాలుగు లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. షమీ నుంచి విడిగా ఉంటున్న భార్య హసీన్ జహాన్ (Hasin Jahan)కు భరణం కింద నెలకు రూ. 1.5 లక్షలు.. అదే విధంగా వీరి కుమార్తె ఐరా నిర్వహణ ఖర్చు నిమిత్తం నెలకు రూ. 2.5 లక్షల చొప్పున చెల్లించాలని పేర్కొంది.అదే విధంగా.. 2018 నుంచి ఈ మేరకు ఇద్దరికీ నెలకు నాలుగు లక్షల చొప్పున చెల్లించాలని హైకోర్టు షమీని ఆదేశించింది. కాగా షమీపై అతడి భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అతడు స్త్రీలోలుడని, ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డాడంటూ ఆరోపించిన హసీన్.. తనపై గృహహింసకు కూడా పాల్పడ్డాడంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలో ఏడేళ్లుగా వీరు విడిగా ఉంటున్నారు.ఈ నేపథ్యంలో కుమార్తెను తన వద్దే పెట్టుకున్న హసీన్.. భరణం కింద తనకు రూ. 10 లక్షల చొప్పున చెల్లించేలా షమీని ఆదేశించాలంటూ కోర్టుకు వెళ్లింది. ఈ క్రమంలో ఆమెకు రూ. 1.3 లక్షలు మాత్రమే చెల్లించేలా దిగువ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో హసీన్ జహాన్ హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా ఈ మేరకు తీర్పునిచ్చింది.ఈ సందర్భంగా జస్టిస్ ముఖర్జీ.. ‘‘ ఈ కేసులో పిటిషనర్ నంబర్ 1 అనగా భార్యకు నెలకు రూ. 1.50 లక్షలు.. అదే విధంగా ఆమె కూతురుకి రూ. 2.50 లక్షలు ఇవ్వడమే న్యాయం. వీరిద్దరి జీవనం సజావుగా సాగేందుకు ఈమాత్రం భర్త చెల్లించాల్సిందే’’ అని తన ఆదేశాల్లో పేర్కొన్నారు.పిటిషనర్ భర్త ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నారన్న న్యాయస్థానం.. అతడి నుంచి విడిపోయిన భార్య మరో పెళ్లి చేసుకోలేదని.. కుమార్తెను కూడా ఆమె పెంచుతున్నందున ఈమాత్రం భరణం సబబేనని పేర్కొన్నట్లు బార్ అండ్ బెంచ్ తెలిపింది. తల్లిదండ్రులతో కలిసి ఉన్నపుడు కుమార్తె జీవనశైలి ఎలా ఉండేదో.. ఇప్పుడే అదేలా ఉండాలన్నా, ఆమె భవిష్యత్తుకు బాగుండటానికి నెలకు రూ. 2.50 లక్షల మొత్తం చెల్లించాల్సిందేనని షమీని ఆదేశించినట్లు పేర్కొంది. అంతేకాదు ఈ కేసును త్వరితగతిన పూర్తి చేయాలని దిగువ కోర్టును ఆదేశించినట్లు తెలిపింది.ఇక హైకోర్టు ఆదేశాల అనంతరం హసీన్ జహాన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గత ఏడేళ్లుగా నా హక్కుల కోసం పోరాడే క్రమంలో నేను దాదాపుగా నా సర్వస్వం కోల్పోయాను. నా కూతురిని మంచి పాఠశాలలో కూడా చేర్చించలేకపోయాను. ఇప్పుడు నాకు కాస్త ఊరట లభించింది. న్యాయస్థానానికి ధన్యవాదాలు చెబుతున్నా’’ అని తన మనసులోని ఆవేదనను పంచుకున్నారు.కాగా ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ చీర్ లీడర్‌గా ఉన్న సమయంలో హసీన్ జహాన్‌కు షమీతో ఏర్పడిన పరిచయం పెళ్లికి దారితీసింది. వీరు 2014లో పెళ్లి చేసుకోగా మరుసటి ఏడాదే కుమార్తె జన్మించింది. అయితే, 2018 నుంచి విభేదాలు తారస్థాయికి చేరడంతో షమీ- హసీన్ జహాన్ విడిగా ఉంటున్నారు.ఇక షమీ కెరీర్ విషయానికొస్తే.. 34 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్ ఫిట్నెస్ లేమి కారణంగా దాదాపు ఏడాది ఆటకు దూరంగా ఉన్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డేలతో తిరిగి మైదానంలో అడుగుపెట్టిన షమీ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ ఆడాడు. ఏడు మ్యాచ్‌లలో కలిపి పదకొండు వికెట్లు తీశాడు.అయితే, ఐపీఎల్-2025లో మాత్రం షమీ పూర్తిగా తేలిపోయాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన అతడు తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి కేవలం ఆరు వికెట్లే తీశాడు. అనంతరం ఫిట్నెస్ సమస్యల కారణంగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ ఆడే జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. -
నా మనసులో ప్రత్యేక స్థానం.. : తొలిసారి స్పందించిన కావ్యా మారన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మారి.. లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరు (287) సాధించిన జట్టుగా కొనసాగుతోంది. 2016లో టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్.. గత రెండేళ్లుగా మరోసారి ఇలా పాతరోజులను గుర్తుచేస్తూ ఆరెంజ్ ఆర్మీని ఖుషీ చేస్తోంది. దేశీ స్టార్ అభిషేక్ శర్మతో పాటు ఆస్ట్రేలియా స్టార్లు ప్యాట్ కమిన్స్, ట్రవిస్ హెడ్, సౌతాఫ్రికా స్టార్ హెన్రిచ్ క్లాసెన్ రాకతో జట్టు బలపడింది.కమిన్స్ కెప్టెన్సీలో గతేడాది ఏకంగా ఫైనల్ చేరిన సన్‌రైజర్స్ ఈసారి మాత్రం కాస్త నిరాశపరిచింది. ఆరంభంలో వరుస ఓటములు చవిచూసినా ఆఖర్లో వరుసగా మ్యాచ్‌లు గెలవడం అభిమానులకు కాస్త ఊరట కలిగించే అంశం. ఇక సన్‌రైజర్స్ అనగానే ఆటగాళ్లతో పాటు ఆ జట్టు సహ యజమాని కావ్యా మారన్ (Kavya Maran) ఠక్కున గుర్తుకువస్తారు.సోషల్ మీడియా క్వీన్సన్ నెట్వర్క్ అధినేత కళానిధి మారన్ కుమార్తె అయిన కావ్యా.. సన్‌రైజర్స్ బాధ్యతలు చూసుకుంటున్నారు. మ్యాచ్ జరిగిన ప్రతిసారి.. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్ ఆడుతుందంటే అక్కడ కావ్యా తప్పనిసరిగా కనిపిస్తారు. మ్యాచ్ సాగుతున్న వేళ తన భావోద్వేగాలను ఏమాత్రం దాచుకోరు.ప్రతికూల ఫలితం వచ్చినప్పుడు చిన్నబుచ్చుకునే కావ్యా.. అనుకూల ఫలితం వచ్చినప్పుడు మాత్రం చిన్న పిల్లలా ఎగిరి గంతులు వేస్తారు. ఈ నేపథ్యంలో తొలిసారి మీడియా కంటికి చిక్కినప్పటి నుంచి ఇప్పటిదాకా సోషల్ మీడియాలో కావ్యా మారన్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరోవైపు.. ఆమెను ట్రోల్ చేస్తూ మీమ్స్ క్రియేట్ చేసే వాళ్లూ ఎక్కువే.నన్ను తప్పక క్యాప్చర్ చేస్తాడుఈ క్రమంలో సోషల్ మీడియాలో తన ఫొటోలు, తనపై వచ్చే మీమ్స్‌పై కావ్యా మారన్ తాజాగా స్పందించారు. ఇన్‌సైడ్‌స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నిజంగానే అవి నా మనసు నుంచి వచ్చిన భావోద్వేగాలు. మ్యాచ్ ఎక్కడ జరిగినా అక్కడికి వెళ్లడం నా పనిలో భాగం. అయితే, ఆట పట్ల ఉన్న అభిమానం కూడా అందుకు మరో కారణం.హైదరాబాద్‌లో ఇంకా వేరేగా నేనేం చేయగలను. స్టేడియంలో కూర్చోవాల్సిందే కదా!.. అక్కడ మాత్రమే నేను కూర్చుకునేందుకు వీలుంటుంది. ఒకవేళ్ల అహ్మదాబాద్ లేదంటే.. చెన్నై వెళ్తే అక్కడా ఏదో చోట కూర్చోవాల్సిందే.నేను ఎక్కడున్నా సరే కెమెరామెన్ నన్ను తప్పక క్యాప్చర్ చేస్తాడు. కొన్నిసార్లు అవే మీమ్స్‌గా రూపాంతరం చెందుతాయి’’ అని కావ్యా మారన్ పేర్కొన్నారు.నా మనసంతా అదే..ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టంటే తనకు ఎంతో ఇష్టమన్న కావ్యా మారన్.. ‘‘ సన్‌రైజర్స్ ఆడుతుందంటే నా మనసంతా అక్కడే ఉంటుంది. సన్‌రైజర్స్‌కు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. దాని కోసం నా శాయశక్తులా కష్టపడి చేయగలిగిందంతా చేస్తాను.కాబట్టి సహజంగానే జట్టు విజయాలు, అపజయాలను మనసుకు తీసుకుంటాను. అందుకే గెలిచినప్పుడు ఎంతగా సంతోషిస్తానో.. ఓడినప్పుడు అంతే బాధపడతాను’’ అని చెప్పుకొచ్చారు.చదవండి: రితికా కంటే ముందు ఆమెతో ప్రేమలో రోహిత్?.. నన్‌గా మారిన నటి?! -
రితికా కంటే ముందు ఆమెతో ప్రేమలో రోహిత్?.. నన్‌గా మారిన నటి?!
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తన వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ ఓనమాలు దిద్దిన స్టేడియం పిచ్‌పైనే మోకాళ్లపై కూర్చుని ప్రేయసి రితికా (Ritika Sajdeh)కు ప్రేమను వ్యక్తపరిచినట్లు వెల్లడించాడు. ఆమె కూడా సంతోషంగా ఒప్పుకోవడంతో ఇద్దరం పెళ్లి బంధంతో ఒక్కటయ్యామని రోహిత్ శర్మ తన రొమాంటిక్ ప్రపోజల్ గురించి చెబుతూ నవ్వులు చిందించాడు.ఇద్దరు పిల్లలు.. ముచ్చటైన కుటుంబంమాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అతడి భార్య గీతా బస్రా కలిసి నిర్వహిస్తున్న యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూకు భార్య రితికాతో కలిసి హాజరైన రోహిత్ ఈ విషయాన్ని వెల్లడించాడు. కాగా రోహిత్- రితికా చాలా ఏళ్ల పాటు డేటింగ్ చేసి.. 2015, డిసెంబరు 13న పెళ్లిపీటలు ఎక్కారు. వీరికి కూతురు సమైరా, కుమారుడు అహాన్ సంతానం.తెరపైకి సోఫియా హయత్ పేరుఇక రోహిత్ శర్మ తన ప్రేమకథ గురించి వివరించిన నేపథ్యంలో గతంలో అతడు డేటింగ్ చేసిన అమ్మాయిల గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ క్రమంలో ప్రధానంగా తెరపైకి వచ్చిన పేరు సోఫియా హయత్ (Sofia Hayat).లండన్‌లో కామన్ ఫ్రెండ్ ద్వారా సోఫియా- రోహిత్‌లకు పరిచయమైంది. తొలిచూపులోనే రోహిత్‌ను ఇష్టపడ్డ సోఫియా అతడితో డేటింగ్ చేసిందనే ప్రచారం ఉంది. అయితే, ప్రేమలో ఉన్నపుడు ఇద్దరూ కూడా ఈ విషయం గురించి బయటపెట్టలేదు. కానీ.. మీడియాలో వీరి గురించి వార్తలు రాగా.. 2012లో సోఫియా స్వయంగా స్పందించింది.నేను రోహిత్ శర్మతో డేటింగ్ చేశా‘‘ఇకనైనా వదంతులకు స్వస్తి పలుకుదాం. అవును.. నేను రోహిత్ శర్మతో డేటింగ్ చేశా. కానీ ఇప్పుడు అదంతా ముగిసిపోయింది.. ఇకపై జీవితంలో అతడితో మరోసారి డేటింగ్ చేయను. ఈసారి నేను మనసున్న మంచి వ్యక్తి కోసం మాత్రమే ఎదురుచూస్తున్నా’’ అని సోఫియా ట్వీట్ చేసింది.అందుకే బ్రేకప్ చెప్పానుఅంతేకాదు.. రోహిత్ శర్మతో తన బంధం ముగిసిపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ.. ‘‘అతడు మంచివాడు. కలిసి ఉన్నపుడు ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్లం. అయితే, అతడు బిడియస్తుడు. హోటల్స్, రూమ్స్ దగ్గర మేము మీడియా కంటపడకూడదని భావించేవాళ్లం.కానీ మీడియాకు టిప్ అందింది. అపుడు మా మేనేజరే ఈ విషయం గురించి స్పందించారు. రోహిత్‌తో ఉన్న నాకున్న రిలేషన్‌పై గౌరవంతో నేనూ ఏమీ మాట్లాడలేదు. కానీ ఓసారి రోహిత్ మీడియాతో మాట్లాడుతున్నపుడు నా గురించి ప్రశ్న ఎదురుకాగా.. నేను కేవలం తన అభిమానిని మాత్రమే అని చెప్పాడు.దాంతో నేను చాలా బాధపడ్డాను. అందుకే అతడితో బ్రేకప్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతడితో ఉన్న అన్ని రకాల కాంటాక్టులను చెరిపివేశా’’ అని సోఫియా గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. పెదవి విప్పని రోహిత్అయితే, రోహిత్ మాత్రం ఆమెతో ప్రేమ, బ్రేకప్ గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే.. వివాదాలకు కేరాఫ్ అయిన సోఫియా.. విరాట్ కోహ్లి కోసం తాను రోహిత్‌ను వదిలేశానంటూ మరో ట్వీట్ చేసింది. దీన్ని బట్టి చూస్తే ఆమె ప్రచారం కోసమే ఇదంతా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.నటి నుంచి నన్‌గా?సోఫియా హయత్ బ్రిటిష్ మోడల్, సింగర్. ఆ తర్వాత టెలివిజన్ రంగంలోకి ప్రవేశించింది. హిందీ బిగ్‌బాస్ 7లో సోఫియా పాల్గొంది. 2013లో బిగ్ బ్రదర్ ఇండియన్ వర్షన్లోనూ తళుక్కుమంది. అయితే, 2016లో అందరికీ షాకిస్తూ... ఆధ్యాత్మిక బాటలో నడుస్తూ.. నన్‌గా మారినట్లు ప్రకటించింది. తన పేరును గైయా సోఫియా మదర్‌గా మార్చుకుంది. యోగా టీచర్, హీలర్గా తన ఇన్స్టాగ్రామ్ బయోలో పేర్కొంది.చదవండి: ధావన్‌పై మండిపడ్డ రోహిత్ శర్మ.. షాకింగ్ విషయం బయటపెట్టిన గబ్బర్ -
ధావన్‌పై మండిపడ్డ రోహిత్ శర్మ.. షాకింగ్ విషయం బయటపెట్టిన గబ్బర్
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan).. ‘ది వన్: క్రికెట్, మై లైఫ్ అండ్ మోర్’ పేరిట ఆటోబయోగ్రఫీ రాశాడు. తన వ్యక్తిగత జీవితంలోని విశేషాలను కూడా ఇందులో వెల్లడించాడు. ఈ క్రమంలో ఓ షాకింగ్ విషయాన్ని గబ్బర్ బయటపెట్టాడు.భారత్-‘ఎ’ జట్టు 2006లో ఆస్ట్రేలియాలో పర్యటించగా.. నాటి ఆ టీమ్‌లో ధావన్‌తో పాటు టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా ఉన్నాడు. ఇక ఈ టూర్లోనే ధావన్ ఓ బ్రిటిష్ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. తనను విడిచి ఉండలేని స్థితికి చేరుకున్న గబ్బర్ ఆమెను హోటల్ గదికి కూడా తీసుకువచ్చేవాడట.ఆమె నా కోసమే పుట్టింది.. తన చర్య.. అప్పటికి రూమ్మేట్ రోహిత్ శర్మకు ఎంతో విసుగు తెప్పించిందని గబ్బర్ తన పుస్తకంలో రాశాడు. స్పోర్ట్స్‌స్టార్ కథనం ప్రకారం.. ‘‘ఆమె చాలా అందంగా ఉండేది. ఒకరోజు నేను అకస్మాత్తుగా ప్రేమలో పడిపోయాను. ‘ఆమె నా కోసమే పుట్టింది.. తననే నేను పెళ్లి చేసుకోబోతున్నాను’ అంటూ మైకంలో తేలిపోయాను.అప్పటికి జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో నేను హాఫ్ సెంచరీ చేశాను. పర్యటన బాగానే జరుగుతోంది. ప్రతి మ్యాచ్ ముగిసిన తర్వాత ఆమెను కలిసేందుకు వెళ్లేవాడిని. తనను నా హోటల్ రూమ్‌కు తీసుకువచ్చేవాడిని.నువ్వు అసలు నన్ను నిద్రపోనిస్తావా?అప్పుడు రోహిత్ శర్మ నాతో పాటు అదే గదిలో ఉండేవాడు. అయితే, తనకు ఇదంతా నచ్చేది కాదు. ‘నువ్వు అసలు నన్ను నిద్రపోనిస్తావా?’ అంటూ హిందీలో కంప్లైంట్ చేస్తూ ఉండేవాడు.ఓరోజు సాయంత్రం నేను ఆమెతో కలిసి డిన్నర్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యా. అప్పటికే మా గురించి జట్టులో అందరికీ తెలిసిపోయింది. నేను ఆరోజు ఆమె చేయి పట్టుకుని హోటల్ లాబీ నుంచి వెళ్తుండగా.. జాతీయ జట్టులోని సెలక్టర్ ఒకరు మమ్మల్ని చూశారు.తప్పు చేయలేదుఅయినా సరే నేను ఆమె చేతిని వీడలేదు. ఎందుకంటే.. నేను ఎటువంటి తప్పు చేయడం లేదని నాకు తెలుసు. ఆ పర్యటనలో బాగా రాణిస్తే జాతీయ జట్టులో చోటు దక్కుతుందని తెలుసు. కానీ రోజురోజుకూ నా ప్రదర్శన దిగజారిపోయింది’’ అని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు.కాగా శిఖర్ ధావన్ రోహిత్ శర్మతో కలిసి చాలాకాలం టీమిండియా ఓపెనర్‌గా ఉన్నాడు. తన అంతర్జాతీయ కెరీర్లో 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడిన గబ్బర్.. టెస్టుల్లో 2315, వన్డేల్లో 6793, టీ20 మ్యాచ్‌లలో 1759 పరుగులు సాధించాడు.ఇక శిఖర్ ధావన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీ అనే డివోర్సీని పెళ్లాడిన.. అతడు కొన్నేళ్ల క్రితం ఆమెతో విడిపోయాడు. ప్రస్తుతం ఐర్లాండ్ బ్యూటీ సోఫీ షైన్‌తో లిన్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఆయేషా- ధావన్‌లకు కుమారుడు జొరావర్ ఉన్నాడు.చదవండి: IND vs ENG 2nd Test: భారత జట్టులో కీలక మార్పులు.. అతడిపై వేటు! తెలుగోడికి చోటు? -
రింకూ సింగ్- ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి వాయిదా!.. కారణం?
భారత స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ (Rinku Singh)- లోక్‌సభ ఎంపీ ప్రియా సరోజ్ (Priya Saroj)ల పెళ్లి వాయిదా పడినట్లు సమాచారం. ఈ ఏడాది జరగాల్సిన వీరి వివాహం (Wedding Postoponed) వచ్చే సంవత్సరంలో జరుగనున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు ప్రాతినిథ్యం వహిస్తూ వెలుగులోకి వచ్చాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన రింకూ సింగ్.గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదిన అతడు.. టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో 2023లో ఐర్లాండ్‌తో టీ20 సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. నయా ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. అదే ఏడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు.ఇప్పటి వరకు భారత్ తరఫున 33 టీ20లు, 2 వన్డే మ్యాచ్‌లు ఆడిన రింకూ సింగ్.. ఆయా ఫార్మాట్లలో 339, 41 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ ఇప్పటికి 58 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఈ కేకేఆర్ స్టార్.. 1099 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి.ఎంపీతో ప్రేమలో రింకూనిరుపేద కుటుంబం నుంచి వచ్చి స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన రింకూ.. కెరీర్ పరంగా నిలదొక్కుకున్నాడు. ఇటీవలే వివాహ బంధంలో అడుగుపెట్టేందుకు కూడా సిద్ధపడ్డాడు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారగా.. ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ ఏడాది జూన్ 8న వీరి నిశ్చితార్థం జరిగింది. మూడేళ్లుగా ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నామంటూ రింకూ- ప్రియా తమ ఎంగేజ్మెంట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.జూన్ 8న నిశ్చితార్థంఇక లక్నోలోని ఓ హోటల్లో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో రింకూ- ప్రియా ఉంగరాలు మార్చుకున్నారు. సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌తో పాటు జయా బచ్చన్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తదితరులు వీరి ఎంగేజ్మెంట్కు హాజరయ్యారు.ఈ క్రమంలో నవంబరు 18న తాజ్ హోటల్లో పెళ్లి వేడుకను జరిపేందుకు పెద్దలు ముహూర్తం ఖరారు చేశారు. అయితే, అమర్ ఉజాలా న్యూస్‌పేపర్ కథనం ప్రకారం.. రింకూ- ప్రియాల వివాహం వాయిదా పడినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరుగనుందని సమాచారం. కారణం ఇదే?టీమిండియా క్రికెటర్‌గా రింకూ బిజీ షెడ్యూల్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ ఏడాది నవంబరులో టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. నవంబరు 14- డిసెంబరు 19 వరకు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.చదవండి: పంత్ సెంచరీలపై అలా.. కేఎల్ రాహుల్ శతకంపై ఇలా! గోయెంకా పోస్ట్ వైరల్ -
పంత్ సెంచరీలపై అలా.. కేఎల్ రాహుల్ శతకంపై ఇలా! గోయెంకా పోస్ట్ వైరల్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant)పై ప్రముఖ వ్యాపారవేత్త, లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా (Sanjiv Goenka) ప్రశంసలు కురిపించారు. దూకుడైన ఆటకు మారుపేరంటూ పంత్ బ్యాటింగ్ తీరును కొనియాడారు. అదే సమయంలో.. భారత ఓపెనింగ్ బ్యాటర్, లక్నో మాజీ ఆటగాడు కేఎల్ రాహుల్‌ను కూడా సంజీవ్ గోయెంకా ప్రశంసించడం విశేషం.రెండు ఇన్నింగ్స్‌లోనూ శతకాలుకాగా భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య తొలి టెస్టులో రిషభ్ పంత్ శతకాలతో అదరగొట్టిన విషయం తెలిసిందే. లీడ్స్ వేదికగా తొలి ఇన్నింగ్స్‌లో 178 బంతులు ఎదుర్కొన్న ఈ ఐదో నంబర్ బ్యాటర్.. 12 ఫోర్లు, ఆరు సిక్సర్ సాయంతో.. 75కు పైగా స్ట్రైక్‌రేటుతో 134 పరుగులు సాధించాడు.ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ పంత్ దంచికొట్టాడు. 140 బంతుల్లోనే 118 పరుగులు రాబట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. స్ట్రైక్‌రేటు 84.29. తన అద్భుత శతక ఇన్నింగ్స్‌ల ద్వారా టీమిండియా పటిష్ట స్థితిలో నిలవడంలో పంత్ కీలక పాత్ర పోషించాడు.అమోఘం.. రాహుల్‌కు కంగ్రాట్స్ ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ యజమాని తమ కెప్టెన్ రిషభ్ పంత్‌ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘అమోఘం! రెండు వరుస సెంచరీలు.. దూకుడుకు మారుపేరుగా, బెదురులేని.. అద్భుత ఇన్నింగ్స్.టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన రెండో వికెట్ కీపర్‌గా చరిత్ర.. సూపర్’’ అంటూ క్లాప్ ఎమోజీలు జత చేశారు. అదే సమయంలో మరో శతక వీరుడు కేఎల్ రాహుల్ పేరును కూడా గోయెంకా ప్రస్తావించడం వైరల్‌గా మారింది. ‘‘సెంచరీ చేసిన కేఎల్ రాహుల్‌కు కూడా శుభాకాంక్షలు’’ అని గోయెంకా ట్వీట్ చేశారు.కాగా 2022లో ఐపీఎల్లో అడుగుపెట్టిన లక్నో జట్టుకు మూడేళ్ల పాటు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2022, 2023లో వరుసగా రెండుసార్లు జట్టును ప్లే ఆఫ్స్‌నకు చేర్చాడు. కానీ 2024లో మాత్రం రాహుల్ ఇదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు.రాహుల్‌పై ఫైర్.. ఫ్రాంఛైజీని వీడిన స్టార్ఈ నేపథ్యంలో సంజీవ్ గోయెంకా మైదానంలో బహిరంగంగా రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఇక ఈ పరిణామం తర్వాత అంటే.. 2025 మెగా వేలానికి ముందు రాహుల్ లక్నో ఫ్రాంఛైజీని వీడాడు.అనంతరం ఆక్షన్‌లో భాగంగా లక్నో రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లకు రిషభ్ పంత్‌ను కొనుగోలు చేసి కెప్టెన్‌గా నియమించింది. అయితే, బ్యాటర్, కెప్టెన్‌గా ఈ సీజన్లో పంత్ పూర్తిగా విఫలమయ్యాడు. పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి పంత్ కేవలం 269 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉండటం చెప్పుకోదగ్గ అంశం.గెలుపునకు పది వికెట్ల దూరంలోఇక పంత్ సేన తాజా ఎడిషన్‌లో పద్నాలుగింట ఆరు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికే పరిమితమైంది. మరోవైపు.. 2025లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన కేఎల్ రాహుల్ పదమూడు మ్యాచ్‌లు ఆడి.. ఓ శతకం సాయంతో 539 పరుగులు సాధించడం విశేషం.ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు రసవత్తరంగా మారింది. ఆఖరిదైన ఐదో రోజు ఆటలో విజేత ఎవరన్నది తేలనుంది. భారత బౌలర్లు రాణించి పది వికెట్లు కూలిస్తే.. గిల్ సేనకు శుభారంభం లభిస్తుంది. మరోవైపు.. భారత్ విధించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలంటే ఇంగ్లండ్ మంగళవారం 350 పరుగులు చేయాలి. చదవండి: ‘లక్ష్మణ్‌ను కాదని అతడిని తీసుకున్నాం.. నాతో మూడు నెలలు మాట్లాడలేదు’𝘈 𝘚𝘰𝘯𝘨 𝘰𝘧 𝘐𝘤𝘦 & 𝘍𝘪𝘳𝘦 𝘢𝘵 𝘏𝘦𝘢𝘥𝘪𝘯𝘨𝘭𝘦𝘺.🔥❄️@klrahul set the foundation with a composed and elegant century while @RishabhPant17’s quickfire hundred electrified the crowd with an explosive display of fearless strokeplay! 🤩WATCH FULL HIGHLIGHTS OF DAY 4… pic.twitter.com/MQ13EvHIae— Star Sports (@StarSportsIndia) June 23, 2025 -
అచ్చం నాన్నలాగే!.. కుమారుడితో రోహిత్- రితికా.. వీడియో వైరల్
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం కుటుంబంతో సమయం గడుపుతున్నాడు. ఐపీఎల్-2025 తర్వాత దొరికిన విరామాన్ని పూర్తిగా ఫ్యామిలీకే కేటాయించిన హిట్‌మ్యాన్.. తాజాగా ముంబై విమానాశ్రయంలో దర్శనమిచ్చాడు. భార్య రితికా సజ్దే, కుమార్తె సమైరా, చిన్నారి కుమారుడు అహాన్‌లతో కలిసి రోహిత్ ఎయిర్‌పోర్టులో ప్రవేశించాడు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియో ద్వారా రోహిత్ కొడుకు అహాన్ ఫేస్ పూర్తిగా రివీల్ అయింది. అహాన్‌ను చూసిన అభిమానులు.. ‘‘అచ్చం నాన్నలాగే ఉన్నాడు’’ కామెంట్లు చేస్తున్నారు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్‌ను విజేతగా నిలిపిన రోహిత్ శర్మ.. కెప్టెన్‌గా రెండో ఐసీసీ ట్రోఫీని అందుకున్నాడు. అంతకు ముందు టీ20 ప్రపంచకప్-2024లోనూ టీమిండియాను చాంపియన్‌గా నిలిపాడు హిట్‌మ్యాన్. ఆ తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. ప్రస్తుతం ఐపీఎల్లో కొనసాగుతున్నాడు.ఐపీఎల్-2025లో భాగంగా హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రోహిత్.. పదిహేను మ్యాచ్‌లలో కలిపి 418 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక ఎలిమినేటర్ మ్యాచ్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌పై అతడు ఈ సీజన్లో తన అత్యధిక స్కోరు (81) నమోదు చేశాడు.అయితే, క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడటంతో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ మధ్యలోనే రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే ముందే తన నిర్ణయాన్ని వెల్లడించాడు.కాగా టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన 38 ఏళ్ల రోహిత్.. వన్డేల్లో మాత్రం కొనసాగనున్నట్లు స్పష్టం చేశాడు. ఈ క్రమంలో ఆగష్టులో అతడు మళ్లీ మైదానంలో దిగనున్నాడు. బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నేపథ్యంలో సారథిగా పునరాగమనం చేయనున్నాడు.ఇక 2007లో అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ.. టీమిండియా తరఫున ఇప్పటి వరకు 273 వన్డేలు ఆడి.. 11168 పరుగులు సాధించాడు. ఇందులో 32 శతకాలు ఉన్నాయి. ఇక వన్డేల్లో రోహిత్ ఎవరికీ సాధ్యం కాని రీతిలో అత్యధికంగా మూడు డబుల్ సెంచరీలు చేయడం విశేషం. అంతేకాదు.. యాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక స్కోరు (264) అతడిదే కావడం గమనార్హం. అదే విధంగా.. 159 టీ20లలో ఐదు శతకాల సాయంతో రోహిత్ 4231 పరుగులు చేశాడు. 67 టెస్టుల్లో కలిపి 4301 రన్స్ సాధించాడు. View this post on Instagram A post shared by Rohit Saraiya (@rohitsaraiya.official) -
తమ్ముడి గురువు.. ఆ అక్క మర్చిపోలేదు!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దిగ్గజ బ్యాటర్‌గా పేరొందిన ఈ రన్‌మెషీన్ ఇప్పటికే ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. ముఖ్యంగా వన్డేల్లో ఛేజింగ్ కింగ్‌గా పేరొందిన కోహ్లి.. ఈ ఫార్మాట్లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో 51 శతకాలు సాధించాడు.అదే విధంగా.. టీమిండియా తరఫున టెస్టుల్లో 30, టీ20లలో ఓ సెంచరీ సాధించాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో 82 శతకాలు నమోదు చేసిన కోహ్లి.. శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక కోహ్లి ఈ స్థాయికి చేరడంలో అతడి కుటుంబంతో పాటు చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ (Rajkumar Sharma)ది కూడా కీలక పాత్ర.పశ్చిమ ఢిల్లీలోని రాజ్‌కుమార్ శర్మ క్రికెట్ అకాడమీలో ఓనమాలు దిద్దిన కోహ్లి.. ఆధునిక క్రికెట్ యుగంలో మకుటంలోని మారాజుగా ఎదిగాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే కోహ్లి ఇప్పటికీ తన చిన్ననాటి కోచ్‌తో కాంటాక్టులో ఉన్నాడు. ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్‌పై గెలిచిన నేపథ్యంలో శర్మకు ఫోన్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు.ఇక ఈరోజు రాజ్‌కుమార్ శర్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా కోహ్లి అక్క భావనా కోహ్లి ధింగ్రా (Bhawna Kohli Dhingra ) తన తమ్ముడి గురువుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కోహ్లికి రాజ్‌కుమార్ శర్మ మొమెంటో అందిస్తున్న ఫొటోను పంచుకుంటూ.. ‘‘హ్యాపీ బర్త్‌డే సర్. మీరే నిజమైన మార్గ నిర్దేశకులు.. మెంటార్’’ అంటూ విషెస్ తెలియజేశారు.ఈ నేపథ్యంలో కోహ్లి- రాజ్‌కుమార్ శర్మల బంధం మరోసారి తెరమీదకు వచ్చింది. కాగా 2008లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన కోహ్లి.. ఇప్పటి వరకు 302 వన్డేలు ఆడి 14181 పరుగులు సాధించాడు.అదే విధంగా.. 125 టీ20 మ్యాచ్‌లలో కలిపి ఓ శతకం సాయంతో 4188 రన్స్ చేశాడు. 123 టెస్టుల్లో కలిపి 9230 పరుగులు సాధించాడు. ఇక టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి.. ఇటీవలే టెస్టులకు కూడా వీడ్కోలు పలికాడు.ప్రస్తుతం వన్డేలతో పాటు ఫ్రాంఛైజీ క్రికెట్లో కొనసాగుతున్న కోహ్లి ఇటీవలే తన చిరకాల కలను సాకారం చేసుకున్నాడు. ఐపీఎల్-2025లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలవడంతో తొలిసారి ట్రోఫీని ముద్దాడాడు. కాగా ఐపీఎల్ ఆరంభ సీజన్ (2008) నుంచి ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లి.. క్యాష్ రిచ్ లీగ్‌లో తన జట్టును చాంపియన్‌గా నిలిపేందుకు పదిహేడేళ్లు పట్టింది.చదవండి: టీ20 ప్రపంచకప్-2026 షెడ్యూల్ విడుదల -
ఖరీదైన ఫ్లాట్ కొన్న శిఖర్ ధావన్.. ధర తెలిస్తే షాక్!
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశాడు. గురుగ్రామ్ (Gurugram)లోని విలాసవంతమైన ఈ ఇంటి కోసం దాదాపు రూ. 69 కోట్లు ఖర్చు చేశాడు. కాగా భారత జట్టు మాజీ ఓపెనర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు శిఖర్ ధావన్.రోహిత్ శర్మ (Rohit Sharma)కు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగిన ధావన్.. 2013లో టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా ఐసీసీ ఈవెంట్లో కేవలం ఐదు ఇన్నింగ్స్‌లోనే 363 పరుగులతో సత్తా చాటి ధోని సేన ట్రోఫీని ముద్దాడేలా చేశాడు.జాతీయ జట్టు తరఫున ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన ధావన్.. శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్‌ల రాకతో టీమిండియాలో స్థానం కోల్పోయాడు. ఈ క్రమంలో 2022లో చివరగా భారత్‌కు ఆడిన ధావన్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.రెండు చేతులా సంపాదన.. నికర ఆస్తి?మొత్తంగా టీమిండియా తరఫున 288 మ్యాచ్‌లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 10867 పరుగులు సాధించాడు. ఇక ఫామ్‌లో ఉండగా రెండు చేతులా సంపాదించిన ధావన్.. ఐపీఎల్ ద్వారా కూడా కోట్లాది రూపాయలు ఆర్జించాడు. పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గానూ వ్యవహరించి తన నెట్‌వర్క్‌ను పెంచుకున్నాడు.జాతీయ స్పోర్ట్స్ వెబ్సైట్ నివేదిక ప్రకారం.. 2025 నాటికి శిఖర్ ధావన్ నికర ఆస్తుల విలువ రూ. 120 కోట్లు ఉన్నట్లు అంచనా. ఇక 39 ఏళ్ల ధావన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆయేషా ముఖర్జీ అనే డివోర్సీని పెళ్లి చేసుకున్న గబ్బర్‌కు కుమారుడు జొరావర్ ఉన్నాడు.మరోసారి ప్రేమలో గబ్బర్అయితే, ఆయేషాతో విభేదాల కారణంగా 2023లో విడాకులు తీసుకున్నాడు. ఇక గత కొంతకాలంగా ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్ అనే మహిళతో శిఖర్ ధావన్ డేటింగ్ చేస్తున్నాడు. ఈ జంట సహజీవనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో గబ్బర్ గురుగ్రామ్‌లో కొత్త ఫ్లాట్ కొనడం విశేషం.గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్ 5, సెక్టార్ 54, గోల్ఫ్ కోర్స్ రోడ్‌లోని రెసిడెన్షియల్ ప్రాజెక్టులో ధావన్ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీని ధర రూ. సుమారు 65.61 కోట్లు కాగా..స్టాంపు డ్యూటీగా రూ. 3.28 కోట్లు చెల్లించినట్లు సమాచారం.అద్బుత ఆట తీరుతోకాగా అంతర్జాతీయ క్రికెట్లో మొత్తంగా 167 వన్డేలు ఆడి 6793 పరుగులు చేసిన గబ్బర్..టెస్టు ఫార్మాట్లో 34 మ్యాచ్‌లు ఆడి 2315 రన్స్ సాధించాడు. ఇక టీమిండియా తరఫున 68 టీ20లలో 1759 పరుగులు చేసిన గబ్బర్.. ఐపీఎల్లో 221 ఇన్నింగ్స్‌లో 6769 పరుగులు సాధించాడు. తద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఇప్పటికీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇలా తన అద్బుత ఆట తీరుతో కోట్లు గడించాడు ధావన్.చదవండి: ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్ -
ఒకప్పుడు బాక్సింగ్ చాంపియన్.. ఇప్పుడు రామ్ చరణ్ బౌన్సర్!
దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్‌తో తలపడ్డ యోధుడు అతడు.. ఐదుసార్లు బ్రిటిష్ హెవీవెయిట్ చాంపియన్‌షిప్ గెలిచిన వీరుడు.. అంతేకాదు నాలుగుసార్లు కామన్వెల్త్ చాంపియన్‌గా నిలిచిన ఘనత అతడిది.. కానీ ఇప్పుడు ఓ ఈవెంట్లో బౌన్సర్..ఆ బాక్సింగ్ చాంపియన్ పేరు జూలియస్ ఫ్రాన్సిస్ (Julius Francis). కాగా టాలీవుడ్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charana) మైనపు విగ్రహాన్ని ఇటీవలే.. లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ (Madame Tussauds) మ్యూజియంలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి కుటుంబంతో సహా చెర్రీ హాజరయ్యాడు.ఈ సందర్భంగా రామ్ చరణ్ తన అభిమానులను కలిసేందుకు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో బౌన్సర్ల బృందంలో బ్రిటిష్ హెవీవెయిట్ చాంపియన్ బాక్సర్ జూలియస్ ఫ్రాన్సిస్ కూడా కనిపించడం విశేషం.అంతేకాదు.. ఫ్రాన్సిస్ తన బాక్సింగ్ బెల్టును తీసుకుని రామ్ చరణ్ దగ్గరికి వచ్చి.. దానిని తన భుజం చుట్టూ వేయాల్సిందిగా కోరాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఎవరీ జూలియస్ ఫ్రాన్సిస్?1993- 2006 మధ్య జూలియస్ ఫ్రాన్సిస్ ప్రొపెఫషనల్ బాక్సర్‌గా ఉన్నాడు. 2000 సంవత్సరంలో దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్‌తో తలపడ్డ అతడు.. ఓటమి చవిచూశాడు. అరవై ఏళ్ల జూలియస్ ఓవరాల్‌గా తన కెరీర్లో 23 విజయాలు సాధించి.. ఇరవై నాలుగింటిలో ఓడిపోయాడు.ఇక 2007లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ బౌట్లోనూ జూలియస్ ఫ్రాన్సిస్ పాల్గొన్నాడు. 2012లో నటనా రంగంలోనూ అడుగుపెట్టాడు. ఆ తర్వాత 2022లో యూకేలో ఓ రెస్టారెంట్ బయట ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు అభిమానులతో ఓ వ్యక్తికి గొడవ జరుగగా.. అక్కడే బౌన్సర్‌గా ఉన్న ఫ్రాన్సిస్ సదరు ఫ్యాన్స్‌ను నెట్టివేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో చాలాకాలం తర్వాత ఫ్రాన్సిస్ మరోసారి తెరమీదకు వచ్చాడు. ఇదిలా ఉంటే.. బాక్సర్ మైక్ టైసన్‌కు టాలీవుడ్‌తో అనుబంధం ఏర్పడిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాలో అతడు కీలక పాత్రలో కనిపించాడు.చదవండి: ‘మాక్స్‌వెల్‌ను పెళ్లి చేసుకోలేదు కాబట్టే ఇలా’!.. మండిపడ్డ ప్రీతి జింటా.. -
రోహిత్ శర్మకు సత్కారం.. ఇంటికి ఆహ్వానించి సన్మానించిన సీఎం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు ఘన సత్కారం లభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) హిట్‌మ్యాన్‌ను తన ఇంటికి ఆహ్వానించి.. సన్మానించారు. ఈ విషయాన్ని సీఎం స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.కాగా రోహిత్ శర్మ ఇటీవలే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ (Test Cricket Retirement) ప్రకటించిన విషయం తెలిసిందే. మే 7న ఇందుకు సంబంధించి ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అధికారిక ప్రకటన విడుదల చేశాడు. తెలుపు రంగు జెర్సీలో దేశానికి ప్రాతినిథ్యం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవమంటూ భారమైన హృదయంతో వీడ్కోలు పలికాడు.అయితే, వన్డేల్లో మాత్రం తాను కొనసాగుతానని రోహిత్ శర్మ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ.. అతడే వన్డే జట్టు కెప్టెన్‌గా కొనసాగుతాడని పేర్కొంది. అధికారిక నివాసానికి ఆహ్వానించిన సీఎంకాగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అతడిని తన అధికారిక నివాసానికి ఆహ్వానించారు. పుష్ఫగుచ్ఛం అందించి.. శాలువాతో రోహిత్‌ను ఫడ్నవిస్ సత్కరించారు. అతడితో కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పంచుకుంటూ.. ‘‘భారత క్రికెట్ రోహిత్ శర్మను నా అధికారిక నివాసం ‘వర్ష’కు ఆహ్వానించడం.. ఆయనను కలిసి మాట్లాడటం ఎంతో గొప్పగా అనిపిస్తోంది.టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్కు ప్రకటించిన రోహిత్ శర్మకు శుభాకాంక్షలు. జీవితంలోని తదుపరి అధ్యాయంలోనూ ఆయన ఇలాగే మరింత విజయవంతం కావాలని ఆశిస్తున్నా’’ అని దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్నారు.దిగ్గజ కెప్టెన్గాకాగా టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఇప్పటికే రెండు ఐసీసీ ట్రోఫీలు సాధించిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌ను చాంపియన్‌గా నిలపడంతో పాటు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (వన్డే) కూడా అందించాడు. అయితే, గత కొంతకాలంగా టెస్టుల్లో మాత్రం రోహిత్ శర్మ ప్రదర్శన ఇటు కెప్టెన్‌గా.. అటు బ్యాటర్‌గా బాగాలేదు.రోహిత్ సారథ్యంలో టీమిండియా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది సొంతగడ్డపై విదేశీ జట్టు చేతిలో ఓడిపోయింది. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా.. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. ఫలితంగా ఈసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (2025) ఫైనల్‌కు చేరుకోలేకపోయింది.కోహ్లి కూడా ఇదే బాటలోఆ తర్వాత ముంబై తరఫున రోహిత్ శర్మ రంజీ బరిలో దిగి కూడా విఫలమయ్యాడు. ఈ పరిణామాల నేపథ్యంలోనూ ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ బీసీసీఐ అతడినే కెప్టెన్‌గా కొనసాగిస్తుందని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, అనూహ్యంగా బుధవారం రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక ఆ తర్వాత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా టెస్టులకు వీడ్కోలు పలికాడు. వీరిద్దరు లేకుండానే జూన్ 20 నుంచి టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌తో యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ టీమిండియా కొత్త కెప్టెన్‌గా నియమితుడు కానున్నట్లు తెలుస్తోంది.చదవండి: Ind vs Eng: కుర్రాళ్లతో ఈ సిరీస్ ఆడటం కష్టం.. వాళ్లిద్దరు ఉంటే బెటర్! -
నువ్వు దాచుకున్న కన్నీళ్లే గుర్తుండి పోతాయి: అనుష్క భావోద్వేగం
‘‘అందరూ రికార్డులు, మైలురాళ్ల గురించే మాట్లాడవచ్చు.. కానీ నాకు మాత్రం నువ్వు దాచుకున్న కన్నీళ్లు.. బయటకు తెలియకుండా నీతో నువ్వు చేసిన యుద్ధాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.. ఈ ఫార్మాట్ పట్ల నీకున్న అమితమైన ప్రేమ గురించి నాకు తెలుసు.నీ నుంచి ఈ ఫార్మాట్ ఎంత లాగేసుకుందో నాకు తెలుసు. ప్రతి టెస్టు సిరీస్ తర్వాత నువ్వు మరింత రాటుదేలడంతో పాటు మరింత నిరాడంబరంగా తయారయ్యేవాడివి. నీ ఈ ప్రయాణానికి సాక్షిగా ఉండటం నాకు దక్కిన విశేష గౌరవం. నువ్వు టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ కాబోతున్నావని చాలాసార్లు ఊహించాను.అయితే, నువ్వు మాత్రం మీ మనసు చెప్పిన మాట విన్నావు. నువ్వు ఇప్పుడు ఇలా వీడ్కోలు పలకడం సరైన నిర్ణయం మై లవ్’’ అంటూ భారత దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లి సతీమణి అనుష్క శర్మ భావోద్వేగానికి లోనైంది.తన భర్త, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రేమపూర్వక నోట్ షేర్ చేసింది అనుష్క. కాగా పద్నాలుగేళ్ల టెస్టు కెరీర్‌కు కోహ్లి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో కీలక సిరీస్‌కు ముందు అతడు ఈ మేరకు తన నిర్ణయాన్ని ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు.కొనసాగాల్సిందిఈ నేపథ్యంలో భారత, విదేశీ మాజీ క్రికెటర్లు.. 36 ఏళ్ల కోహ్లి మరికొన్నాళ్ల పాటు సంప్రదాయ ఫార్మాట్లో కొనసాగాల్సిందని అభిప్రాయపడుతున్నారు. టెస్టుల్లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అతడి రికార్డులను కొనియాడుతున్నారు. ఈ క్రమంలో అనుష్క పైవిధంగా స్పందించడం గమనార్హం.మూడు ముళ్ల బంధం.. ముచ్చటైన పిల్లలుకాగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో ప్రేమలో ఉన్న కోహ్లి.. 2017 డిసెంబరు 11న ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు 2021, జనవరి 11న కుమార్తె వామిక జన్మించింది. ఆ తర్వాత మూడేళ్లకు అంటే.. ఫిబ్రవరి 15, 2024లో కుమారుడు అకాయ్‌కు విరుష్క జన్మనిచ్చారు.తమ పిల్లలిద్దరిని సోషల్ మీడియాకు దూరంగా ఉంచుకున్న ఈ స్టార్ జోడీ.. ఇంత వరకు వారి ముఖాలు రివీల్ చేయలేదు. అంతేకాదు.. పిల్లల గోప్యత, భవిష్యత్తు దృష్ట్యా ఎక్కువగా లండన్‌లోనే కాలం గడుపుతున్నారు.శతకాల ధీరుడుఇక టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా టెస్టులకూ గుడ్‌బై చెప్పిన ఈ రన్‌మెషీన్.. వన్డేల్లో మాత్రం కొనసాగనున్నాడు. కాగా కోహ్లి అంతర్జాతీయ కెరీర్లో మొత్తంగా 82 శతకాలు ఉన్నాయి. టెస్టుల్లో 30, వన్డేల్లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో 51 శతకాలు బాదిన కోహ్లి.. టీమిండియా తరఫున టీ20లలోనూ సెంచరీ నమోదు చేశాడు.ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్న కోహ్లి.. ఈసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరును విజేతగా నిలపాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక 2008 నుంచి ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లి ఐపీఎల్లో ఇప్పటికి 263 మ్యాచ్‌లు ఆడి.. 8 శతకాల సాయంతో 8509 పరుగులు సాధించాడు.చదవండి: కోహ్లి రిటైర్మెంట్పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులు -
నా కుమారుడు క్రికెటర్ కావాలని కోరుకోను.. ఎందుకంటే..: యువీ
టీమిండియా మేటి క్రికెటర్లలో యువరాజ్ సింగ్ (Yuvraj Singh) ఒకడు. అద్భుత ఆటతీరుతో ఆల్‌రౌండర్‌గా భారత క్రికెట్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. భారత్ టీ20 ప్రపంచకప్-2007 (T20 WC 2007), వన్డే వరల్డ్‌కప్-2011 (ODI WC 2011) గెలవడంలో యువీది కీలక పాత్ర.నాటి ముఖ్యంగా వన్డే ప్రపంచకప్ టోర్నీ ఆద్యంతం ఆకట్టుకునే ప్రదర్శన చేసిన యువీ.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. మొత్తంగా తన కెరీర్లో 40 టెస్టులు, 304 వన్డేలు, 58 అంతర్జాతీయ టీ20లు ఆడిన ఈ ఎడమచేతివాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో 3277, 9924, 863 పరుగులు సాధించాడు.అంతేకాదు.. ఈ లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ ఖాతాలో 9 టెస్టు, 111 వన్డే, 28 టీ20 వికెట్లు కూడా ఉన్నాయి. ఇప్పటికీ యువ తరం ఆటగాళ్లకు అభిమాన క్రికెటర్‌గా కొనసాగుతున్న యువీ..తన కుమారుడిని మాత్రం క్రికెటర్ని చేయాలనుకోవడం లేదట!నా కుమారుడు క్రికెటర్ కావాలని కోరుకోనుకామియా జానీతో ఇటీవల జరిపిన సంభాషణ సందర్భంగా యువరాజ్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘‘మా కొడుకు క్రికెట్ ఆడటం నాకైతే ఇష్టంలేదు. ఒకవేళ తాను క్రికెటర్ కావాలని కోరుకుంటే మాత్రం నేను అడ్డుచెప్పను.ఎందుకంటే.. ప్రస్తుత సమాజంలో ఓ పిల్లాడు క్రికెట్ ఆడుతున్నాడంటే అతడిపై భరించలేనంత ఒత్తిడి పడుతోంది. ఇక చాలా మంది పిల్లల్ని వాళ్ల నాన్నలతో పోలుస్తూ.. వారసత్వాన్ని గురించి చర్చిస్తూ ఉంటారు.ఒక్కొక్కరికి ఒక్కో రంగంలో టాలెంట్నిజానికి అది చాలా అన్యాయం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒకే రంగంలో ప్రతిభ ఉండాలనే నిబంధన ఏమీ లేదు. అదే విధంగా అందరూ సమానంగా రాణించాలనీ లేదు. ఒక్కొక్కరికి ఒక్కో రంగంలో టాలెంట్ ఉంటుంది. కాబట్టి ఎవరి అభీష్టాలకు అనుగుణంగా వారు ఎదిగేలా ప్రోత్సహిస్తే మంచిది’’ అని యువీ చెప్పుకొచ్చాడు.కాగా ఐపీఎల్‌లోనూ తనదైన ముద్ర వేసిన యువరాజ్ సింగ్ .. శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ వంటి పంజాబీ యువ సంచలనాలకు మెంటార్‌గా ఉన్నాడు. ఐపీఎల్లో మొత్తంగా 132 మ్యాచ్‌లు ఆడిన యువీ 2750 పరుగులు చేయడంతో పాటు.. 36 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ముచ్చటైన కుటుంబంఇక యువీ వ్యక్తిగత జీవితానికి వస్తే.. నటి హాజిల్ కీచ్‌తో చాన్నాళ్లు ప్రేమలో ఉన్న అతడు 2017, నవంబరు 30న ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు 2022లో మొదటి సంతానంగా కుమారుడు ఓరియోన్ జన్మించాడు. ఇక రెండో సంతానంగా కుమార్తె జన్మించగా ఆమెకు ఆరా అని నామకరణం చేశారు.చదవండి: Smriti Mandhana: శతక్కొట్టిన టీమిండియా ఓపెనర్.. సరికొత్త చరిత్ర -
Operation Sindoor: ఈ ఒక్క ఫొటో చాలు: సానియా మీర్జా పోస్ట్ వైరల్
‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) నేపథ్యంలో భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా (Sania Mirza) సోషల్ మీడియాలో స్పందించిన తీరు వైరల్ అవుతోంది. ఈ దేశ ఐక్యతకు ఇదే సరైన నిదర్శనం అంటూ ఆమె పంచుకున్న ఫొటో నెటిజన్ల మనసు దోచుకుంటోంది. కాగా జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడికి బదులు తీర్చుకునేందుకు భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న ముష్కరులకు మెరుపు దాడులతో మన సైన్యం సమాధానమిచ్చింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని దాదాపు తొమ్మిది స్థావరాలను ధ్వంసం చేసింది. తద్వారా ఉగ్రవాదాన్ని సహించేది లేదని మరోసారి భారత్ స్పష్టమైన సందేశాన్ని దాయాదికి అందించింది.పేరు సరిగ్గా సరిపోయిందంటూఇక ఈ ఆపరేషన్‌కు సిందూర్ అనే పేరు సరిగ్గా సరిపోయిందంటూ బాధిత కుటుంబాలతో పాటు యావత్ భారతావని ప్రశంసిస్తోంది. అమాయకపు ఆడపడుచుల నుదిటి సిందూరం చెరిగేపోయేలా పాశవిక దాడికి తెగబడిని ఉగ్రవాదులకు ‘రక్త సిందూరం’తో సమాధానమిచ్చారని.. ఇది సరైన నివాళి అని ఉద్వేగానికి లోనవుతున్నారు.మహిళా శక్తి, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకలుగాఅదే విధంగా.. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన ప్రెస్మీట్లో మిలిటరీ బ్రీఫింగ్‌కు ఇద్దరూ మహిళా సైనికాధికారులు నాయకత్వం వహించడం కూడా జాతి హృదయాలు ఉప్పొంగేలా చేసింది. కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్... భారత దేశపు మహిళా శక్తి, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకలుగా తాము చేపట్టిన ఆపరేషన్ గురించి వివరిస్తూ ఉంటే భారతీయల గుండెలు గర్వంతో నిండిపోయాయి.ఈ ఒక్క ఫొటో చాలువాళ్లిద్దరు అలా చెరోవైపు ప్రెస్ మీట్లో కూర్చుని ఐక్యతకు ప్రతీకలా నిలిచిన తీరు నిజమైన దేశభక్తుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. ఈ దృశ్యాన్ని ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ‘‘ఈ శక్తివంతమైన ఫొటో.. మనమంతా ఒక్కటే జాతి అనేందుకు నిలువెత్తు నిదర్శనంలా నిలిచింది’’ అని సానియా మీర్జా పేర్కొన్నారు.మరోవైపు.. సరిహద్దుల్లో తీవ్రవాదులను తుదముట్టించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై క్రీడాలోకం హర్షం వ్యక్తం చేసింది. తాజా ఘటనపై పలువురు క్రీడాకారులు స్పందిస్తూ మన దేశ ఘనతను కీర్తించారు. ఏకత్వంలో నిర్భీతిఇక టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్.. ‘ఏకత్వంలో నిర్భీతి. ఎల్లలెరుగని బలం. మన ప్రజలే మన దేశానికి బలం. మనమంతా ఒక్కటే. ప్రపంచంలో తీవ్రవాదానికి చోటు లేదు. జైహింద్’ అంటూ వ్యాఖ్యానించాడు. పేసర్ షమీ, మాజీ క్రికెటర్లు సెహ్వాగ్, రైనా, ఇర్ఫాన్ పఠాన్, శిఖర్ ధావన్ కూడా ఇదే తరహాలో స్పందించారు.‘మీపై ఎవరైనా రాళ్లు విసిరితే మీరు పూలు విసరండి. అయితే అది పూలకుండీతో సహా విసరండి’ అని సెహ్వాగ్ ట్వీట్ చేయగా, ‘ప్రతికూల పరిస్థితులను కూడా భారత సైన్యం తమకు అనుకూలంగా మార్చుకొని విజయం సాధించింది. ప్రమాదకర సమయంలో వారి ధైర్యాన్ని చూసి గర్విస్తున్నాం’ అని షమీ స్పందించాడు.బాక్సింగ్‌లో ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ ‘భారత్ మాతాకీ జై’ అని ట్వీట్ చేయగా... పఠాన్, సైనా నెహ్వాల్ ‘జైహింద్’ అంటూ మద్దతు పలికారు. ‘మన సైనికులు కేవలం భయపెట్టడంతో ఆగిపోరు. వారు ఏదైనా చేసి చూపిస్తారు’ అని బాక్సర్ నిఖత్ జరీన్ పేర్కొంది. మన సైనికుల భద్రత గురించి తాను ప్రార్థన చేస్తున్నట్లు ఒలింపియన్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ వెల్లడించింది.చదవండి: సరైన సమాధానం.. సాక్ష్యం కనబడుతోందా?.. ఆపరేషన్ సిందూర్‌పై స్పందనలు -
కేఎల్ రాహుల్‌ను కలిసిన బీఆఎర్ఎస్ ఎమ్మెల్యే.. కుమార్తెకు ఓ ‘గిఫ్ట్’!
ఐపీఎల్-2025 (IPL 2025)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (SRH vs DC)తో తలపడనుంది. సొంత మైదానం ఉప్పల్‌లో అక్షర్ సేనను కమిన్స్ బృందం ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సాంకేతికంగా రైజర్స్‌కు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి.ఒకవేళ సోమవారం నాటి మ్యాచ్‌లో గనుక ఢిల్లీ చేతిలో ఓడితే.. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ తర్వాత ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన మూడో జట్టుగా సన్‌రైజర్స్ నిలుస్తుంది. ఈ క్రమంలో కీలక పోరు కోసం కమిన్స్ బృందం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది.కేఎల్ రాహుల్‌ను కలిసిన బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేమరోవైపు.. ఢిల్లీ జట్టు కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు అన్ని విధాలా సన్నద్ధమైంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. ఢిల్లీ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను కలిశారు.ఈ సందర్భంగా తన కుమార్తె శ్రీనికను కూడా కౌశిక్ రెడ్డి వెంట తీసుకువెళ్లారు. ఇక రాహుల్ కూడా ప్రేమ పూర్వకంగా నవ్వుతూ వీరిని పలకరించాడు. అదే విధంగా.. శ్రీనిక తీసుకువచ్చిన టీ-షర్టుపై తన ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు. అంతేకాదు ముగ్గురు కలిసి సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం ఫొటోలు కూడా దిగారు.ఇందుకు సంబంధించిన వీడియోను పాడి కౌశిక్ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. కాగా ఇంతకు ముందు.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. అదే జట్టుకు ఆడుతున్న హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను కూడా కౌశిక్ రెడ్డి కలిశారు.కాగా కౌశిక్ రెడ్డి కూడా క్రికెటర్ అన్న విషయం తెలిసిందే. దేశీ క్రికెట్లో ఆయన హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు.అదరగొడుతున్న రాహుల్ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025 సీజన్లో కేఎల్ రాహుల్ అదరగొడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఇప్పటికి తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 371 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 93 నాటౌట్. ఇక ఢిల్లీ జట్టు పది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఆరింట గెలిచి పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. కాగా తన భార్య అతియా శెట్టి తమ తొలి సంతానం ఇవారాకు జన్మనిచ్చిన నేపథ్యంలో రాహుల్ సీజన్లో తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు.చదవండి: IPL 2025: ఈ పంత్ మనకొద్దు, పీకి పడేయండి సార్..! Had a great time with KL Rahul. I absolutely loved his outfit colour...PINK PERFECT 🩷@KLRAHUL@Kaushik @Shrinika@Cricket@PinkVibes pic.twitter.com/NI6Faiq5dD— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) May 5, 2025 -
అవును.. ప్రేమలో ఉన్నాం!.. ఇంతకీ ఎవరీమె?
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ఎట్టకేలకు తన ప్రేమ బంధాన్ని బహిర్గతం చేశాడు. సోఫీ షైన్ (Sophie Shine)తో కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్లు సోషల్ మీడియా పోస్టు ద్వారా ధ్రువీకరించాడు. కాగా భారత జట్టు ఓపెనర్‌గా ఎన్నో ఘనతలు సాధించిన శిఖర్.. ఆ తర్వాత జట్టులో చోటే కరువు కావడంతో ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇక వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు శిఖర్ ధావన్. ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీ (Aesha Mukherjee)అనే డివోర్సీని 2011లో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉండగా వారిని తన సొంత కూతుళ్లలా చూసుకుంటానని గబ్బర్ పలు సందర్భాల్లో వెల్లడించాడు.భార్యతో విడాకులుఇక శిఖర్- ఆయేషాలకు జొరావర్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే, ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట మధ్య విభేదాలు తలెత్తి విడాకులకు దారితీసింది. 2023లో శిఖర్- ఆయేషాలకు విడాకులు మంజూరయ్యాయి.అప్పటి నుంచి నుంచి ఒంటరిగా ఉంటున్న శిఖర్ ధావన్.. కనీసం తన కుమారుడిని కలిసేందుకు కూడా పరిస్థితులు అనుకూలంగా లేవంటూ పలు సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను పంచుకున్నాడు. ఇక ఇప్పుడు అతడు సోఫీ రూపంలో మరోసారి ప్రేమను వెదుక్కున్నాడు.ఇంతకీ ఎవరీ సోఫీ షైన్?సోఫీ షైన్ ఐర్లాండ్‌కు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. ఐర్లాండ్‌లోనే విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె.. మార్కెటింగ్- మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసింది.ఇక ప్రస్తుతం నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్ అనే కంపెనీలో సెకండ్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో సోఫీ పనిచేస్తున్నట్లు సమాచారం. ఇది అమెరికన్ ఫైనాన్షియల్ కంపెనీ అని తెలుస్తోంది.ఇక వృత్తిరీత్యా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉంటున్న సోఫీకి అక్కడే శిఖర్‌తో పరిచయమైనట్లు సమాచారం. ఈ క్రమంలో స్నేహం ప్రేమగా మారి ఇద్దరూ సహజీవం చేస్తున్నట్లు సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుస్తోంది.అందమైన మహిళే నా గర్ల్ఫ్రెండ్కొన్నిరోజుల క్రితం శిఖర్ ధావన్ ఓ కార్యక్రమంలో పాల్గొనగా.. అతడి రిలేషన్షిప్ గురించి ప్రశ్న ఎదురైంది. ప్రేయసి పేరు చెప్పాలంటూ గబ్బర్ను యాంకర్ ప్రశ్నించగా.. ‘‘నేను పేరు మాత్రం చెప్పను.. అయితే, ఇక్కడే ఉన్న అమ్మాయిల్లోకెల్లా అందమైన మహిళే నా గర్ల్‌ఫ్రెండ్’’ అని చెప్పాడు. అంతలో లైట్ సోఫీ ముఖంపై పడింది.ఇక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో.. సోఫీతో దిగిన ఫొటోను షేర్ చేసిన ధావన్.. ‘‘మై లవ్’’ అంటూ అధికారికంగా తమ బంధం గురించి అభిమానులతో పంచుకున్నాడు. అయితే, పెళ్లి గురించి మాత్రం ఇంకా కన్ఫామ్ చేయలేదు.కాగా 2010 నుంచి 2022 మధ్య శిఖర్ ధావన్ టీమిండియా తరఫున అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడాడు. తన కెరీర్లో 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో 2315, 6793, 1759 పరుగులు సాధించాడు.భారత జట్టు మేటి ఓపెనర్‌గా పేరొందిన శిఖర్ ధావన్ ఖాతాలో ఏడు టెస్టు, 17 వన్డే శతకాలు ఉన్నాయి. ఇక ఐపీఎల్లో ఏకంగా 222 మ్యాచ్‌లు ఆడిన ఈ ఢిల్లీ స్టార్.. రెండు సెంచరీలు, 51 అర్ధ శతకాల సాయంతో 6768 పరుగులు సాధించాడు. చదవండి: పిల్లలంతా హ్యాపీ అంటూ ట్రోలింగ్!.. వైభవ్‌ను ఓదార్చిన రోహిత్.. ఆటలో ఇవి మూమూలే -
వారెవ్వా ‘హిట్’మ్యాన్!.. పేద కుటుంబంలో పుట్టి.. కోటీశ్వరుడిగా!.. ఆస్తి ఎంతంటే?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) నేడు (ఏప్రిల్ 30)లో 38వ వసంతం అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా హిట్‌మ్యాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు జట్టులో స్థానం కోసం ఎదురుచూసిన రోహిత్.. భారత్‌కు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గజ కెప్టెన్‌గా ఎదిగాడు.మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) నాయకత్వంలో ఓపెనర్‌గా ప్రమోట్ అయిన తర్వాత తన విశ్వరూపం చూపించి.. ‘హిట్‌మ్యాన్’గా అభిమానుల గుండెల్లో, భారత క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేశాడు. టీ20 ప్రపంచకప్-2024 (T20 WC 2024)తో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) గెలిచిన సారథిగా ప్రశంసలు అందుకున్న రోహిత్ కెరీర్, మేటి రికార్డులు, వ్యక్తిగత జీవితం, నికర ఆస్తుల విలువ తదితర వివరాలు.. అతడి బర్త్‌డే సందర్భంగా మీకోసం..పేద కుటుంబంలో జన్మించిన రోహిత్రోహిత్ శర్మ 1987, ఏప్రిల్ 30న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించాడు. అతడి తల్లిదండ్రులు పూర్ణిమా శర్మ- గురునాథ్ శర్మ. పూర్ణిమా శర్మ విశాఖపట్నంకు చెందినవారు. ఇక రోహిత్‌కు తమ్ముడు విశాల్ శర్మ ఉన్నాడు.పేద కుటుంబంలో జన్మించిన రోహిత్ శర్మ క్రికెట్ మీద మక్కువతో చిన్ననాటి నుంచే అనేక కష్టాలకోర్చాడు. అంచెలంచెలుగా ఎదిగి భారత జట్టులో స్థానం సంపాదించాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రోహిత్.. ధోని కెప్టెన్సీలో ఓపెనర్‌గా ప్రమోట్ అయ్యాడు. ఏకైక ఆటగాడిగా రికార్డుఆ తర్వాత అతడికి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 273లు వన్డేలు, 159 టీ20లు, 67 టెస్టులు ఆడాడు. టెస్టుల్లో 4302, వన్డేల్లో 11168, టీ20లలో 4231 పరుగులు సాధించాడు.వన్డేల్లో అత్యధికంగా మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. అంతేకాదు.. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) సాధించిన క్రికెటర్‌గా కూడా రోహిత్ చరిత్రకెక్కాడు. ఇక అంతర్జాతీయ టీ20లలోనూ అత్యధికంగా ఐదు శతకాలు బాదాడు. ఓవరాల్‌గా టీమిండియా తరఫున 47 సెంచరీలు చేశాడు. ఇవేగాక సిక్సర్ల వీరుడు రోహిత్ మరెన్నో ఘనమైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఐపీఎల్‌లోనూ రోహిత్ శర్మకు తిరుగులేని రికార్డు ఉంది. ముంబై ఇండియన్స్‌ను ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపి.. క్యాష్ రిచ్ లీగ్‌లో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా చరిత్రపుటల్లో తన పేరు లిఖించుకున్నాడు. ఇప్పటికి 266 మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 6868 పరుగులు సాధించాడు.రితికా సజ్దేతో ఆరేళ్ల పాటు ప్రేమలోఇక స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజర్‌గా పనిచేసిన రితికా సజ్దేతో ఆరేళ్ల పాటు ప్రేమలో ఉన్న రోహిత్ 2015, డిసెంబరు 13న ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె సమైరా (2018), కుమారుడు అహాన్ సంతానం (2024).నికర ఆస్తుల విలువ రూ. 218 కోట్లుక్రికెటర్గా ఉన్నత శిఖరాలకు ఎదిగిన రోహిత్ శర్మ ఇటు ఆటగాడిగా, అటు పలు ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గా.. ఐపీఎల్ ద్వారా కోట్లు ఆర్జించాడు. స్పోర్ట్స్‌కీడా నివేదిక ప్రకారం హిట్‌మ్యాన్ నికర ఆస్తుల విలువ రూ. 218 కోట్లు అని తెలుస్తోంది. బీసీసీఐ ఏ+ గ్రేడ్‌లో ఉన్న రోహిత్ ఏడాదికి రూ. 7 కోట్లు వేతనంగా పొందుతున్నాడు.ఇక ఒక్కో టెస్టు మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, టీ20కి రూ. 3 లక్షలు బోర్డు ద్వారా ఫీజుగా అందుకుంటున్నాడు. ఐపీఎల్లో ముంబై కెప్టెన్‌గా కోట్లాది రూపాయలు ఆర్జించిన రోహిత్ శర్మను.. ఐపీఎల్-2025కి ముందు సదరు ఫ్రాంఛైజీ రూ. 16.3 కోట్లకు రిటైన్ చేసుకుంది.లగ్జరీ ఇల్లు, కార్లురోహిత్ శర్మ ముంబైలో విలాసవంతమైన అపార్టుమెంట్లు ఉన్నాయి. వర్లిలో భార్యాబిడ్డలతో కలిసి హిట్‌మ్యాన్ నివసించే ఇంటి విలువ రూ. 30 కోట్లు అని జిక్యూ ఇండియా అంచనా వేసింది.ఇక రోహిత్ శర్మ గ్యారేజీలో లంబోర్గిని ఉరుస్ (రూ. 4.18 కోట్లు), మెర్సిడెజ్ బెంజ్ (1.5 కోట్లు), మెర్సిడెజ్ జీఎఎల్‌ఎస్ 400 డి(రూ. 1.5 కోట్లు), బీఎండబ్ల్యూ ఎం5 (రూ. 1.79 కోట్లు) , రేంజ్ రోవర్ (రూ. 2.8 కోట్లు) వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.చదవండి: Kuldeep Slaps Rinku Singh: అతడిని బ్యాన్ చేయండి, టీమిండియా స్టార్‌పై నెటిజన్ల ఆగ్రహం -
వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్
భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్, ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) సతీమణి సంజనా గణేషన్ (Sanjana Ganesan) నెటిజన్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వినోదం కోసం తమ చిన్నారి కుమారుడి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడవద్దని విజ్ఞప్తి చేశారు. తమకేమీ ప్రచార పిచ్చి లేదని.. ఇకనైనా పిచ్చి వాగుడు కట్టిపెట్టాలంటూ చురకలు అంటించారు.అసలేం జరిగిందంటే.. ఐపీఎల్-2025 (IPL 2025) లో భాగంగా ముంబై ఇండియన్స్ ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా అద్బుత ప్రదర్శన కనబరిచాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు కూల్చాడు.ఐడెన్ మార్క్రమ్ (9), డేవిడ్ మిల్లర్ (24) రూపంలో రెండు కీలక వికెట్లు తీసిన బుమ్రా.. అబ్దుల్ సమద్ (2), ఆవేశ్ ఖాన్ (0)లను వచ్చీ రాగానే పెవిలియన్‌కు పంపాడు. తన పేస్ పదునుతో లక్నో బ్యాటర్లకు చుక్కలు చూపించి ముంబై విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.చిన్నారి అంగద్తోస్టేడియానికి సంజనఇదిలా ఉంటే.. ముంబై సొంత మైదానం వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌కు బుమ్రా భార్య, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ తమ కుమారుడు అంగద్తో కలిసి హాజరైంది. ఈ క్రమంలో చిన్నారి అంగద్ ఎక్స్ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో అతడు కాస్త నీరసంగా ఉన్నట్లు కనిపించిందని.. డిప్రెషన్, ట్రామా వంటి పదాలు వాడుతూ కొంత మంది నెటిజన్లు బుమ్రా- సంజనాలను విమర్శించారు.PC: Xఈ విషయంపై సంజనా ఘాటుగా స్పందించారు. ఈ మేరకు.. ‘‘మీ వినోదం కోసం మా కుమారుడి పేరు లాగొద్దు. జస్ప్రీత్, నేను అంగద్‌ను సోషల్ మీడియాకు వీలైనంత ఎక్కువ దూరంగానే ఉంచుతాం. ఎందుకంటే.. ఇంటర్నెట్లో ఎక్కువగా విద్వేషం, విషం చిమ్మే వాళ్లే ఉంటారని తెలుసు.మాకు అలాంటి పిచ్చిలేదుచిన్నారితో కలిసి క్రికెట్ స్టేడియానికి వెళ్తే ఎలాంటి విమర్శలు వస్తాయో నాకు తెలుసు. అక్కడ కెమెరాలు ఉంటాయనీ తెలుసు. అయితే, నేను, అంగద్ కేవలం జస్ప్రీత్కు మద్దతుగా మాత్రమే అక్కడకు వచ్చాం.మా కొడుకు ఇంటర్నెట్లో వైరల్ కంటెంట్గానో.. జాతీయ వార్తగానో మారిపోవాలని మాకు ఎంతమాత్రం లేదు. కీబోర్డు వారియర్లు అయితే ఏకంగా అంగద్‌ను మూడు సెకన్ల ఫుటేజ్‌లో చూసి ఏదేదో మాట్లాడేస్తున్నారు.మా గురించి మీకేం తెలుసు?.. వాడికి ఇప్పుడు ఏడాదిన్నర వయసు మాత్రమే. కానీ మీరు ట్రామా, డిప్రెషన్ వంటివి పదాలు వాడుతూ వాడి గురించి మాట్లాడుతున్నారు. ఇది నిజంగా విచారకరం. మా కొడుకు గురించి మీకు ఏం తెలుసు?మా జీవితాల గురించి మీకెంత తెలుసు. మీ అభిప్రాయాలను మీతోనే పెట్టుకోండి. ఎదుటివారి పట్ల దయ, సహానుభూతి కలిగి ఉండటం వంటివి ఈరోజుల్లో ఎంతో ముఖ్యమైన విషయాలుగా మారిపోయాయి’’ అని సంజనా గణేషన్ తన ఇన్‌స్టా స్టోరీలో భావోద్వేగపూరిత నోట్ రాశారు. దయచేసి చిన్నపిల్లల విషయంలోనైనా కాస్త సంయమనంతో వ్యవహరించాలని కోరారు. చదవండి: కేఎల్ రాహుల్‌తో కోహ్లి వాగ్వాదం.. గట్టిగానే బదులిచ్చిన వికెట్ కీపర్! వీడియో View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
టీమిండియా దిగ్గజం బర్త్‌డే.. సారా టెండుల్కర్ పోస్ట్ వైరల్
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) పుట్టినరోజు నేడు (ఏప్రిల్ 24). ఈరోజు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 52వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా బీసీసీఐ (BCCI) ఈ లెజెండరీ బ్యాటర్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది.శతక శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్‘‘664 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. 34,357 పరుగులు.. 201 అంతర్జాతీయ వికెట్లు.. 2011 వన్డే వరల్డ్‌కప్ విజేత.. కల్నల్ సీకే నాయుడు జీవనసాఫల్య పురస్కారం అందుకున్న విజేత..అంతర్జాతీయ క్రికెట్లో శతక శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్.. దిగ్గజ, స్ఫూర్తిదాయక ఆటగాడికి పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అని ఎక్స్ వేదికగా విషెస్ చెప్పింది. మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, వీరేందర్ సెహ్వాగ్, సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్ తదితరులు సచిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.హ్యాపీ బర్త్‌డే బాబాఇక సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ తండ్రి బర్త్‌డే సందర్భంగా తాను అమూల్యంగా భావించే ఫొటోలను పంచుకుంది. అంతేకాదు తన తండ్రి గొప్పదనాన్ని వివరిస్తూ.. ‘‘ఎవరికీ భయపడొద్దు.. అయితే, ప్రతి ఒక్కరిని గౌరవించాలి అని నేర్పించిన వ్యక్తికి...ఫ్రాక్చర్ అయిన తన భుజంపై నన్ను మోసుకువెళ్లిన దృఢమైన సారథికి.. నా ఫొటోషూట్లను మరింత ప్రత్యేకంగా మార్చే వ్యక్తికి.. అన్నిటికంటే ముఖ్యంగా జీవితాన్ని ఆస్వాదిస్తూ నవ్వులతో ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్పే వ్యక్తికి హ్యాపీ బర్త్‌డే బాబా’’ అంటూ సారా క్యాప్షన్ జత చేయగా.. ఆమె పోస్ట్ వైరల్‌గా మారింది.కాగా 1989లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన సచిన్ టెండుల్కర్ లిటిల్ మాస్టర్ నుంచి క్రికెట్ దేవుడిగా ఎదిగాడు. తన ఇరవై రెండేళ్ల కెరీర్లో లెక్కలు మిక్కిలి రికార్డులు సాధించిన మాస్టర్ బ్లాస్టర్.. తన కెరీర్లో అంతర్జాతీయ స్థాయిలో ఏకైక టీ20 ఆడాడు.సచిన్ కెరీర్లో టాప్-9 రికార్డ్స్ ఇవే👉టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్- 15,921👉వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్- 18,426👉అత్యధిక వన్డేలు ఆడిన ప్లేయర్- 463👉అత్యధిక టెస్టులు ఆడిన ప్లేయర్- 200👉వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్👉అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్👉దేశవాళీ క్రికెట్లో ఇరానీ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, దులిప్ ట్రోఫీ అరంగేట్రంలోనే శతక్కొట్టిన వీరుల జాబితాలో తొలి స్థానం👉టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్- 51👉వరల్డ్‌కప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్- 2278.చదవండి: IND Vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం -
అసభ్యకర ఫొటోలు పంపేవారు.. ఆ సీనియర్ క్రికెటర్ కార్లో కూర్చోమంటూ..
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ బిడ్డ అనయా బంగర్ (Anaya Bangar) సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. తాను ఆర్యన్ (Aryan Bangar)గా ఉన్నపుడు క్రికెటర్లతో మంచి అనుబంధం ఉండేదని.. అయితే, అనయాగా మారిన తర్వాత కొంత మంది నిజస్వరూపాలు బయటపడ్డాయంటూ విస్మయకర విషయాలు వెల్లడించింది. సీనియర్ ఆటగాడు ఒకరు తనకు అండగా మాట్లాడినట్లు నటించి.. తనతో నిద్రించాలని ఉందంటూ అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది.అమ్మాయిగా మారిపోయిన ఆర్యన్కాగా టీమిండియా మాజీ కోచ్ అయిన సంజయ్ బంగర్- కశ్మీర దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. వీరిలో ఆర్యన్ పెద్దవాడు. అతడు కూడా తండ్రి బాటలోనే క్రికెటర్‌గా ఎదగాలనే ఆశయంతో దేశీ టోర్నీల్లో ఆడాడు. కానీ శరీర ధర్మానికి అనుగుణంగా తాను అబ్బాయిని కాదు.. అమ్మాయినని గుర్తించి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయించుకున్నాడు.తద్వారా అమ్మాయిగా మారిపోయిన ఆర్యన్.. అనయా బంగర్గా కొత్త పేరుతో ముందుకు వచ్చాడు. ప్రస్తుతం అనయా యునైటెడ్ కింగ్డమ్లో జీవిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ‘లలన్‌టాప్’నకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. క్రికెట్ ప్రపంచంలో ఎంతో మంది విషపూరితమైన మగాళ్లు ఉన్నారంటూ అనయా బంగర్ సంచలన విషయాలు వెల్లడించింది.నేను అమ్మాయిని.. అమ్మాయిలాగే ఉండాలి‘‘నాకు అప్పుడు ఎనిమిది- తొమ్మిదేళ్ల వయసు ఉంటుంది. మా అమ్మ కబోర్డ్‌లోని దుస్తులు తీసుకుని వేసుకునే వాడిని. అద్దంలో చూసుకుని మురిసిపోయేవాడిని. అప్పుడే నాకు.. ‘నేను అమ్మాయిని.. అమ్మాయిలాగే ఉండాలి’ అనే కోరిక కలిగింది.దేశీ క్రికెట్లో నేను ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్ వంటి ప్రసిద్ధ క్రికెటర్లతో ఆడాను. అప్పుడు నా శరీర ధర్మం గురించి బయటపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునేవాడిని.ఎందుకంటే.. నాన్నకు క్రికెటర్‌గా, టీమిండియా కోచ్‌గా గొప్ప పేరుంది. అందుకే నా విషయాన్ని దాచాల్సి వచ్చింది. క్రికెట్ ప్రపంచం మొత్తం అభద్రతాభావం, మగాళ్ల ఆధిపత్యంతో నిండిపోయింది.దుస్తుల్లేకుండా ఫొటోలు పంపేవారునా గురించి తెలిసిన తర్వాత కొంత మంది మంచి మాటలు చెబుతూ అండగా నిలబడ్డారు. మరికొందరు మాత్రం వేధించారు. అప్పుడప్పుడు దుస్తుల్లేకుండా వారి ఫొటోలు నాకు పంపించేవారు.ఓ వ్యక్తి అయితే అందరి ముందు నన్ను తిట్టేవాడు. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి వ్యక్తిగత ఫొటోలు పంపమని అడిగేవాడు. ఇంకో సందర్భంలో ఓ వెటరన్ క్రికెటర్ తన బుద్ధిని బయటపెట్టాడు.పద కార్లో కూర్చో.. నీతో కలిసినా పరిస్థితి గురించి అతడికి చెప్పగానే.. ‘పద కార్లో కూర్చో.. నీతో కలిసి నిద్రించాలని నాకు ఆశగా ఉంది’ అంటూ చెత్త మాటలు మాట్లాడాడు’’ అని అనయా బంగర్ తాను ఎదర్కొన్న చేదు అనుభవాల గురించి పంచుకుంది.చదవండి: ఇలాంటి వికెట్ మీద కష్టమే.. మా వాళ్లు నిర్లక్ష్యంగా ఆడలేదు.. కానీ: కమిన్స్ -
పెళ్లైన ఎనిమిదేళ్లకు శుభవార్త.. తండ్రైన జహీర్ ఖాన్
టీమిండియా దిగ్గజ క్రికెటర్ జహీర్ ఖాన్ తండ్రయ్యాడు. అతడి భార్య, బాలీవుడ్ నటి సాగరిక ఘట్కే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సాగరిక- జహీర్ దంపతులు బుధవారం సోషల్ మీడియా వెల్లడించారు.చిన్నారి పేరేమిటంటేఈ మేరకు ‘‘ఆ దేవుడి దివ్యాశీసులతో.. మా వెలకట్టలేని సంతోషానికి, చిన్నారి కుమారుడికి స్వాగతం పలుకుతున్నాం’’ అని పేర్కొన్నారు. తమ కుమారుడికి ఫతేసిన్హ్ ఖాన్‌గా నామకరణం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కుమారుడిని చేతుల్లోకి తీసుకున్న ఫొటోను షేర్ చేయగా.. జహీర్- సాగరికలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, కేఎల్ రాహుల్ భార్య, నటి అతియా శెట్టి, టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సతీమణి దేవిశా శెట్టి తదితరులు లవ్ సింబల్‌తో విషెస్ తెలియజేశారు.పెళ్లైన ఎనిమిదేళ్లకు శుభవార్తకాగా కొన్నాళ్లపాటు సాగరికతో ప్రేమలో మునిగితేలిన జహీర్ ఖాన్.. 2017లో ఇరు కుటుంబాల సమ్మతంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తన గత ప్రేమ (ఈశా శర్వాణి) తాలుకు చేదు జ్ఞాపకాలను చెరిపి.. జీవితంలో నవ వసంతం తెచ్చిన సాగరికతో ఎనిమిదేళ్లుగా కలిసి అడుగులు వేస్తున్నాడు. ఇక ఇప్పుడు తమ ప్రేమకు గుర్తుగా కుమారుడి రాకతో ఈ జంట కుటుంబం పరిపూర్ణమైంది. View this post on Instagram A post shared by Sagarika Z Ghatge (@sagarikaghatge)దిగ్గజ పేసర్‌గా నీరాజనాలుమహారాష్ట్రకు చెందిన 46 ఏళ్ల జహీర్ ఖాన్.. లెఫ్టార్మ్ మీడియం పేసర్. 2000 సంవత్సరంలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. పద్నాలుగేళ్ల కెరీర్లో 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 311, వన్డేల్లో 282, టీ20లలో 17 వికెట్లు కూల్చి.. దిగ్గజ పేసర్‌గా వెలుగొందాడు. లక్నో మెంటార్‌గాఇక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం ఐపీఎల్లో కొనసాగిన జహీర్ ఖాన్.. క్యాష్ రిచ్ లీగ్‌లో 100 మ్యాచ్‌లు ఆడి 102 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం.. ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడి మార్గదర్శనంలో లక్నో ఈ సీజన్లో ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని నాలుగు గెలిచింది. చదవండి: KKR Vs PBKS: ’తప్పంతా నాదే.. అతడు కూడా నాతో అదే అన్నాడు.. ఓటమికి నేనే బాధ్యుడిని’కెప్టెన్‌గా అది పంత్ నిర్ణయం.. నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..: బిష్ణోయి -
రూ. 4 కోట్లా? ప్రభుత్వ ఉద్యోగమా?.. స్థలమా?.. ఏది కావాలి?
ప్యారిస్ ఒలింపిక్స్-2024 (Paris Olympics)లో సత్తా చాటిన భారత రెజ్లర్, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేశ్ ఫొగట్ (Vinesh Phogat)కు.. హర్యానా ప్రభుత్వం మూడు ఆప్షన్లు ఇచ్చింది. ‘‘రూ. 4 కోట్లా? ప్రభుత్వ ఉద్యోగమా?.. లేదంటే ప్లాట్’’.. వీటిలో ఆమెకు ఏదీ కావాలో చెప్పాలని కోరింది. కాగా వినేశ్ ఫొగట్ తృటిలో ఒలింపిక్ పతకాన్ని చేజార్చుకున్న విషయం తెలిసిందే.మహిళల యాభై కిలోల కుస్తీ విభాగంలో అద్భుత ప్రదర్శనలతో ఫైనల్‌కు చేరిన వినేశ్.. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించారు. అయితే, అనూహ్య రీతిలో టైటిల్ పోరుకు ముందు.. పోటీలో పాల్గొనకుండా ఆమెపై వేటు పడింది. నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉన్న కారణంగా పతకం కోసం పోటీ పడే అవకాశం చేజారింది.కనీసం రజతమైనా ఇవ్వాలని అప్పీలుఆ తర్వాత స్పోర్ట్స్ కోర్టులో కనీసం రజతమైనా ఇవ్వాలని అప్పీలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఒక్క గ్రాము బరువు ఎక్కువగా ఉన్నా పోటీకి, పతకానికి అనర్హులే అంటూ కోర్టు వినేశ్ ఫొగట్ పిటిషన్‌ను కొట్టి వేయడంతో ఆమెతో పాటు యావత్ భారతావనికి నిరాశే మిగిలింది.అయితే, ఫైనల్ వరకు వినేశ్ చేరిన తీరును ప్రశంసిస్తూ అభినందలు వెల్లువెత్తాయి. ఓడినా మనసులు గెలిచిందంటూ ఆమెపై ప్రశంసల జల్లు కురిసింది. నాడు.. ప్రస్తుత హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ సైతం.. ‘‘హర్యానాకు గర్వకారణమైన ఫొగట్ గౌరవాన్ని మేము మరింత పెంచుతాం’’ అని ట్వీట్ చేశారు.కుస్తీకి వీడ్కోలు పలికి..రాజకీయ రంగ ప్రవేశంఅంతేకాదు.. రాష్ట్ర క్రీడా విధానాన్ని అనుసరించి ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన ఆటగాళ్లకు ఇచ్చే నజరానాను వినేశ్‌కు అందిస్తామనే హామీ అందింది. అయితే, ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అనూహ్య రీతిలో పతకం చేజారిన చేదు అనుభవాన్ని జీర్ణించుకోలేక వినేశ్ ఫొగట్ కుస్తీకి వీడ్కోలు పలికి..రాజకీయ రంగ ప్రవేశం చేశారు.కాంగ్రెస్ పార్టీ నుంచి ఝులానా నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె.. అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ క్రమంలో క్రీడాకారుల కోటాలో తనకు అందాల్సిన నజరానా గురించి ఇటీవల విధాన సభలో ప్రస్తావించారు.హామీ మరిచారా?‘‘వినేశ్ ఫొగట్ మా కూతురు. ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్‌కు ఇచ్చే రివార్డును ఆమెకు అందజేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఇంత వరకు ఆ హామీని పూర్తి చేయలేకపోయారు.ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు. గౌరవానికి సంబంధించిన అంశం. ఈ రాష్ట్రంలో చాలా మంది క్రీడాకారులకు ఇప్పటికే రివార్డులు అందజేశారు’’ అని వినేశ్ ఫొగట్ బీజేపీ ప్రభుత్వ తీరును విమర్శించారు.ఈ నేపథ్యంలో మంగళవారం నాటి కేబినెట్ సమావేశంలో వినేశ్ ఫొగట్ రివార్డుకు సంబంధించి ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ నిర్ణయం తీసుకున్నారు. ‘‘వినేశ్ ఫొగట్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. తన క్యాష్ రివార్డుకు సంబంధించిన అంశాన్ని ఆమె విధాన సభలో లేవనెత్తారు.ఈ మూడింటిలో ఏది కావాలి?అందుకే కేబినెట్ ప్రత్యేకంగా ఈ విషయంపై చర్చింది. స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఆమెకు ప్రయోజనాలు చేకూర్చాలని నిశ్చయించింది’’ అని తెలిపారు. నిబంధనల ప్రకారం.. రూ. 4 కోట్ల క్యాష్ ప్రైజ్.. లేదంటే ప్రభుత్వ ఉద్యోగం.. లేదా హర్యానా షహరీ వికాస్ ప్రాధికారణ్ పథకం కింద ప్లాట్.. ఈ మూడింటిలో ఏదో ఒకటి తీసుకోవాలని కేబినెట్ వినేశ్ ఫొగట్‌కు ఆఫర్ ఇచ్చింది. అయితే, ఆమె ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. ఇక తాను తల్లి కాబోతున్నట్లు ఇటీవలే వినేశ్ ఫొగట్.. తన భర్త, రెజ్లర్ సోమ్‌వీర్ రాఠీతో కలిసి శుభవార్త పంచకున్న విషయం తెలిసిందే.చదవండి: ‘విడాకులు మాత్రమే కావాలి.. నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దు’ -
‘విడాకులు మాత్రమే కావాలి.. నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దు’
‘‘నాకు విడాకులు మాత్రమే కావాలి.. అతడి నుంచి ఒక్క పైసా కూడా అవసరం లేదు’’ అంటూ భారత బాక్సర్, ప్రపంచ చాంపియన్ స్వీటీ బూరా (Saweety Boora) తీవ్ర భావోద్వేగానికి గురైంది. భర్త దీపక్ హుడా (Deepak Hooda)తో వీలైనంత త్వరగా వైవాహిక బంధం తెంచుకోవాలని మాత్రమే భావిస్తున్నట్లు తెలిపింది. కాగా స్వీటీతో పాటు దీపక్ కూడా దేశానికి ప్రాతినిథ్యం వహించిన ప్రముఖ కబడ్డీ ఆటగాడు.అంతేకాదు.. 2019- 2022 వరకు భారత కబడ్డీ జట్టు కెప్టెన్‌గానూ ఉన్నాడు. ప్రొ కబడ్డీ లీగ్‌లోనూ తెలుగు టైటాన్స్, పుణేరి పల్టన్, పట్నా పైరేట్స్ తదితర జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. మరోవైపు.. స్వీటీ బూరా 81 కిలోల విభాగంలో 2023లో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం సాధించింది.అదనపు కట్నం కోసం ఇక దీపక్‌తో పాటు స్వీటీ కూడా అర్జున అవార్డు గ్రహీత కావడం విశేషం. హర్యానాకు చెందిన ఈ క్రీడా జంట 2022లో వివాహం చేసుకున్నారు. అయితే, భర్తతో పాటు అత్తింటి వారు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని స్వీటీ బూరా ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాళ్లు కోరినట్లుగా గతంలోనే విలాసవంతమైన కారు ఇచ్చినా.. ఇంకా డబ్బు కావాలంటూ తనను హింసిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.ఈ క్రమంలో ఫిబ్రవరి 25న దీపక్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, ఇందుకు సంబంధించి పోలీసులు నోటీసులు ఇచ్చినా దీపక్ కుటుంబం నుంచి ఎలాంటి స్పందనా రాలేదని హిస్సార్ పోలీసులు జాతీయ మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలో తన భర్తలో మార్పు రావడం కష్టమని భావించిన స్వీటీ బూరా విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇటీవల పోలీస్ స్టేషన్లో స్వీటీ- దీపక్‌లు తమ మద్దతుదారులతో కలిసి సెటిల్మెంట్ కోసం రాగా.. కోపోద్రిక్తురాలైన స్వీటీ భర్తపై దాడి చేసింది. పోలీస్ స్టేషన్లోనే అతడిపై పిడిగుద్దులు కురిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో స్వీటీ సహనం నశించినందు వల్లే ఇలా చేసిందని కొంతమంది మద్దతునివ్వగా.. భరణం కోసం డిమాండ్ చేస్తోందంటూ మరికొంత మంది ఆరోపించారు. అయితే, స్వీటీ మాత్రం వీటిని కొట్టిపారేసింది. మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నాకు విడాకులు కావాలి. అతడి నుంచి ఎలాంటి భరణం అక్కర్లేదు.నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దునా వస్తువులు నాకు తిరిగి ఇచ్చేస్తే చాలు. ఈ సమస్యకు శాంతియుతమైన పరిష్కారం లభించాలని మాత్రమే కోరుకుంటున్నా. హింసకు, అణచివేతకు వ్యతిరేకంగా గొంతెత్తడమే నేను చేసిన తప్పు అనుకుంటా.విడాకుల కోసం నేను కోర్టులో పిటిషన్ వేశాను. ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలు సమర్పించా. ఆ వ్యక్తి విడాకులు వద్దంటూ నాపై ఒత్తిడి తెస్తున్నాడు. అయినా ఆ దెయ్యం డబ్బులు నాకెందుకు? నేనేమీ బికారిని కాదు. నాకు న్యాయం మాత్రమే కావాలి. ఇంకేమీ వద్దు’’ అంటూ స్వీటీ బూరా తీవ్ర భావోద్వేగానికి లోనైంది. చదవండి: చహల్ మాజీ భార్య అంటే రోహిత్ శర్మ సతీమణికి పడదా.. ఎందుకు ఇలా చేసింది..? -
ధనశ్రీకి చహల్ కౌంటర్?.. ఆ మాటలకు అర్థం ఏమిటి? మధ్యలో ఆమె!
టీమిండియా స్టార్ క్రికెటర్ యజువేంద్ర చహల్ (Yuzuvendra Chahal)- యూట్యూబర్ ధనశ్రీ వర్మ (Dhanashree Verma) తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. గత కొంతకాలంగా వేరుగా ఉంటున్న ఈ జంటకు విడాకులు మంజూరు అయ్యాయి. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు గురువారం (మార్చి 20) ఈ మేరకు తుదితీర్పును వెల్లడించింది.ఈ నేపథ్యంలో చహల్ - ధనశ్రీ వేర్వేరుగా కోర్టుకు హాజరయ్యారు. విడాకుల అనంతరం వీరిద్దరు బయటకు వస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో చహల్ ధరించిన షర్టుపై ఉన్న సామెత నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.ధనశ్రీకి చహల్ కౌంటర్?'Be your own sugar daddy' అని రాసి ఉన్న నలుపు రంగు కస్టమైజ్డ్ షర్టును చహల్ వేసుకున్నాడు. ఈ సామెతకు.. ‘ఆర్థికంగా స్వతంత్రంగా ఉండండి.. మీ బాగోగులు మీరే చూసుకోండి.. ఆర్థిక సాయం, బహుమతుల కోసం ఇతరులపై ఆధారపడకండి’’ అనే అర్థం ఉంది. ఈ నేపథ్యంలో చహల్ తన మాజీ భార్య ధనశ్రీకి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ షర్టు ధరించాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కాగా లాక్డౌన్ సమయంలో ధనశ్రీ వద్ద డాన్స్ పాఠాలు నేర్చుకున్న చహల్ ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో 2020, డిసెంబరులో ఇరు కుటుంబాల అంగీకారంతో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు. ధనశ్రీ కొరియోగ్రాఫర్‌గా రాణిస్తూ ఇన్ఫ్లూయెన్సర్గా పేరు తెచ్చుకుంటోంది.ఈ క్రమంలో వీరిద్దరు రీల్స్‌లో కనిపిస్తూ అభిమానులకు కనువిందు చేయడంతో పాటు.. టీమిండియా, ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం చహల్ వెంట వెళ్లిన ఫొటోలు కూడా పంచుకునేది. అయితే, కొన్నాళ్ల క్రితం తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి ధనశ్రీ ‘చహల్’ పేరును తీసివేసింది. దీంతో విడాకుల వార్తలు తెరమీదకు వచ్చాయి.ఆర్థిక స్వాతంత్యం గురించి ప్రస్తావిస్తూఆ తర్వాత ఇద్దరూ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తొలగించడంతో వీటికి మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో తాజాగా బాంద్రా కోర్టు వీరికి విడాకులు మంజూరు చేయడంతో.. వదంతులు నిజమేనని తేలాయి. ఇక విడాకుల నేపథ్యంలో ధనశ్రీకి చహల్ రూ. 4.75 కోట్ల భరణం చెల్లించేందుకు అంగీకరించాడు. ఇందులో ఇప్పటికే దాదాపు రెండున్నర కోట్లకు పైగా ముట్టజెప్పినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో చహల్.. ఆర్థిక స్వాతంత్యం గురించి ప్రస్తావిస్తూ ధనశ్రీకి హితవు పలికేలా ఈ సామెత ఉన్న షర్టును ధరించాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా ధనశ్రీ గతంలో టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి డాన్స్ చేసిన వీడియోలు వైరల్ కాగా.. అతడి పేరుతో ఆమెను ముడిపెట్టారు. నిజానికి శ్రేయస్ సోదరి శ్రేష్ట కూడా కొరియోగ్రాఫర్ కావడం.. ధనశ్రీకి ఆమె స్నేహితురాలు కావడం వల్ల శ్రేయస్‌తో ఆమె డాన్స్ చేసి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.మధ్యలో ఆమె!అయితే, చహల్ ప్రస్తుతం ఆర్జే మహవశ్‌తో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెతో కలిసి డిన్నర్ పార్టీలకు వెళ్లడం, ఐసీసీ చాంపియన్స్‌ట్రోఫీ-2025 సమయంలోనూ మహవశ్‌తో జంటగా కనిపించడం ‘ప్రేమ’ వార్తలకు ఊతమిచ్చాయి. ఇక చహల్- ధనశ్రీ విడాకుల వేళ మహవశ్ కూడా.. ‘‘అబద్ధాలు, అత్యాశ, అబద్ధపు ప్రచారాలు.. దేవుడి దయవల్ల వీటన్నింటికీ అతీతంగా నిలబడగలుగుతున్నాం’’ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టడం గమనార్హం. ఇందుకు నెటిజన్ల నుంచి భిన్న స్పందన వస్తోంది. చహల్- ధనశ్రీ మధ్య విభేదాలకు కారణం ఏమిటన్నది ఇప్పుడు అర్థమైందంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండగా.. ‘కొత్త వదినతోనైనా జాగ్రత్త’ అంటూ మరికొందరు ఉచిత సలహాలు ఇస్తున్నారు.చదవండి: IPL 2025: ఈసారి విజేతగా ఆ జట్టే.. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) -
చహల్, ధనశ్రీ బంధానికి ఎండ్ కార్డు.. విడాకులు మంజూరు
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్, ధనశ్రీ వర్మ విడిపోతున్నారంటూ వస్తున్న వార్తలకు తెరపడింది. చాహల్-ధనశ్రీ అధికారికంగా విడిపోయారు. వీరిద్దిరికి ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు గురువారం విడాకులు మంజూరు చేసింది. దీంతో ఈ జంట ఐదేళ్ల వివాహ బందం నేటితో ముగిసింది. ధనశ్రీకి భరణం కింద రూ.4.75 కోట్లు ఇవ్వడానికి చాహల్ అంగీకరించాడు. ఇప్పటికే రూ. 2 కోట్ల 37 లక్షలు ధనశ్రీకి భరణం కింద చెల్లించినట్లు తెలుస్తోంది. కాగా వీరిద్దరి విడాకుల కేసుపై గత కొంతకాలంగా బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విచారణ సాగుతోంది. అయితే ఐపీఎల్-2025లో పాల్లోనేందుకు చాహల్ వెళ్లనుండడంతో విచారణను వేగవంతం చేయాలని ఫ్యామిలీ కోర్టును బాంబే హైకోర్టు బుధవారం ఆదేశించింది. అదేవిధంగా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్న కారణంగా, తప్పనిసరి ఆరు నెలల విరామ (కూలింగ్ ఆఫ్ పీరియడ్) గడువును హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలొనే బాంద్రా ఫ్యామిలీ కోర్టు నేడు ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది.యూట్యూబర్, కొరియాగ్రాఫర్ అయిన ధనశ్రీతో 2020 డిసెంబర్ 22న చాహల్‌కు వివాహం జరిగింది. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ, ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ అభిమానులను అలరించేవారు. కానీ గత రెండేళ్లగా విభేదాలు తలెతెత్తడంతో వీరిద్దరూ విడిగానే ఉంటున్నారు.అయితే గతేడాది ధనశ్రీ సోషల్ మీడియా ఖాతాల్లో తన పేరు నుంచి ‘చాహల్’ పేరును తీసేయడంతో పాటు ఫొటోలను కూడా డిలేట్ చేసింది. దీంతో ఈ జంట విడిపోతున్నరంటూ వార్తలు వ్యాపించాయి. అప్పటి నుంచి వీరిద్దరూ విడాకులకు సంబంధించి పూటకో ఓ వార్త వస్తూనే ఉండేది. ఎట్టకేలకు ఈ వార్తలు నిజమేనని అధికారికంగా స్పష్టమైంది. ఇక ధనశ్రీతో విడాకులు తీసుకున్న చాహల్ ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆర్జే మహ్వశ్తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడనున్నాడు.చదవండి: షాక్‌లో క్రికెట్ ఫ్యాన్స్.. నమీబియా కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లెసిస్ -
భార్యకు విడాకులు.. భరణంగా చహల్ ఎన్ని కోట్లు ఇస్తున్నాడంటే..?
టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ (Yuzuvendra Chahal)- సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ధనశ్రీ వర్మ (Dhanashree Verma)ల వైవాహిక బంధం ముగిసిపోయింది. పరస్పర అంగీకారంతో వీరిద్దరు విడిపోయేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.అయితే, చట్ట ప్రకారం ఆరు నెలల పాటు కలిసి ఉండాలన్న నిబంధనను తమ కేసులో పరిగణనలోకి తీసుకోవద్దని చహల్- ధనశ్రీ కోరగా.. ఫిబ్రవరి 20న ఫ్యామిలీ కోర్టు వీరి అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో వీరు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.ఈ క్రమంలో చహల్- ధనశ్రీ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. ఆరు నెలల కూలింగ్ పీరియడ్ విషయంలో వీరికి ఉపశమనం కలిగించింది. విడాకుల అంశాన్ని గురువారం తేల్చాల్సిందిగా బాంద్రా మెజిస్ట్రేట్ కోర్టును ఆదేశించింది. వేరుగా ఉంటున్నారుజస్టిస్ మాధవ్ జామ్దార్తో కూడిన ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. మార్చి 22 నుంచి చహల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో కానున్న నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.‘‘పిటిషనర్ 1 (చహల్) ఐపీఎల్లో పాల్గొనాల్సి ఉందని.. కాబట్టి మార్చి 21 తర్వాత అతడు అందుబాటులో ఉండకపోవచ్చని అతడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాబట్టి మార్చి 20న ఈ విషయమై ఫ్యామిలీ కోర్టు నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నాం’’ అని పేర్కొంది.కాగా హిందూ వివాహ చట్టం ప్రకారం.. విడాకులు జారీ చేసే ముందు తమ సమస్యను పరిష్కరించుకుని కలిసిపోయేందుకు కనీసం ఆరు నెలల పాటు కోర్టు సమయం ఇస్తుంది. అయితే, చాలా కాలం నుంచే చహల్- ధనశ్రీ విడిగా ఉంటున్నట్లు సమాచారం. ఇప్పటికే భార్యాభర్తలుగా వారు వేరుపడినందున.. ఆరు నెలల కూలింగ్ పీరియడ్ విషయంలో తమకు మినహాయింపు ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బాంబే హైకోర్టు ఈ విషయమై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. రూ. 4.75 కోట్ల భరణం!కాగా ధనశ్రీకి భరణం రూపంలో రూ. 4.75 కోట్లు చెల్లించేందుకు చహల్ సిద్ధపడినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే రూ. 2 కోట్ల 37 లక్షల యాభై ఐదు వేలు చెల్లించినట్లు తెలుస్తోంది. మిగతా మొత్తం చెల్లించేందుకు కూడా చహల్ సిద్ధంగా ఉన్నాడు కాబట్టి.. పిటిషనర్ల మధ్య ఎలాంటి వివాదానికి తావు లేనందున విడాకుల మంజూరు విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిందిగా హైకోర్టు ఫ్యామిలీ కోర్టును ఆదేశించినట్లు సమాచారం. ప్రేమ వివాహం..కాగా 2016లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన చహల్.. ఇప్పటి వరకు 72 వన్డేలు, 80 టీ20లు ఆడాడు. ఈ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్ ఆయా ఫార్మాట్లలో 121, 96 వికెట్లు తీశాడు. ఇక టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా చివరిగా జాతీయ జట్టుకు ఎంపికైన చహల్ ఆ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆ తర్వాత మళ్లీ టీమిండియాకు ఎంపిక కాలేదు.అయితే, ఐపీఎల్లో మాత్రం చహల్‌కు ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు 160 మ్యాచ్‌లు ఆడిన ఏకంగా 205 వికెట్లు తీశాడు. తద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ అతడిని ఏకంగా రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది.ఇక చహల్ వ్యక్తిగత విషయానికొస్తే.. 2020, డిసెంబరులో కొరియాగ్రాఫర్ ధనశ్రీ వర్మను పెళ్లాడాడు. లాక్డౌన్లో సోషల్ మీడియా ద్వారా ధనశ్రీతో పరిచయం ప్రేమగా మారింది. అయితే, వీరి బంధం మూణ్ణాళ్ల ముచ్చటే అయింది.చదవండి: IPL 2025: కెప్టెన్ల మార్పు.. ఎవరి జీతం ఎంత?.. అతి చవగ్గా దొరికిన సారథి అతడే! -
Virushka: తల్లీ, తండ్రి, తోబుట్టువు.. అందరికీ ఒకేలా కనిపించవు!
విదేశీ పర్యటనల సమయంలో కుటుంబ సభ్యుల అనుమతిని పరిమితం చేస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీసుకున్న నిర్ణయంపై స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) అసంతృప్తి వ్యక్తం చేశాడు. సన్నిహితులు వెంట ఉంటే ఆటగాళ్లు మానసికంగా మరింత బలంగా ఉంటారని అతడు అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో కోహ్లి సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ (Anushka Sharma) సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. అందరికీ ఒకేలా కనిపించవు!‘‘నువ్వెవరో తెలిసిన ప్రతి వ్యక్తి మనసులో నీ పట్ల భిన్న భావాలు ఉన్నాయి. నువ్వు ఎవరని నువ్వు అనుకుంటావో అదే నువ్వు. ఆ ‘నువ్వు’ ఎవరన్నది నీకూ పూర్తిగా తెలియదు. నిన్ను కలిసిన వ్యక్తులు, నీ బంధువులు.. లేదంటే వీధిలో వెళ్తున్నపుడు నీతో చూపులు కలిపిన వాళ్లు.. ఇలా ప్రతి ఒక్కరి మదిలో నీ గురించిన ఆలోచన వేరుగా ఉంటుంది.తల్లి, తండ్రి, తోబుట్టువులకు నువ్వు ఒకే తీరుగా కనిపించవు. సహచరులకు, ఇరుగుపొరుగు వారికి, నీ స్నేహితులకూ వారి కోణంలోనే కనిపిస్తావు. ఎదుటివారి ఆలోచనల్లో నీకు వెయ్యి రూపాలు ఉండవచ్చు. కానీ.. ప్రతి వర్షన్లోనూ నువ్వు ప్రత్యేకమే. నువ్వు నువ్వే.. వేరొకరివి అసలే కావు’’ అని అనుష్క శర్మ తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో తన భర్త.. ప్రత్యేకమైన వాడని అనుష్క చెప్పాలనుకుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పరోక్షంగా బీసీసీఐ నిబంధనను ఆమె కూడా విమర్శించిందని అభిప్రాయపడుతున్నారు.కాగా ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో టీమిండియా పరాజయం పాలవడంతో బీసీసీఐ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 45 రోజుల్లోపు విదేశీ పర్యటనలో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కుటుంబ సభ్యులను వారం రోజులు మాత్రమే అనుమతించనుంది. దానికి వెలకట్టలేంనలభై ఐదు రోజులకు మించిన విదేశీ పర్యటనల్లో రెండు వారాల పాటు సన్నిహితులకు అనుమతి ఉంటుంది. ఈ నేపథ్యంలో కోహ్లి మాట్లాడుతూ... ‘ఒక ఆటగాడి వెనక కుంటుబ సభ్యుల ప్రాతను అందరికీ వివరించడం కష్టం. కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు వారిచ్చే మద్దతును వెలకట్టలేం. దాని మీద ప్రజలకు అవగాహన లేదని అనుకోలేం.కుటుంబ సభ్యులు పక్కన ఉంటే మైదానంలో ఆవరించిన నిరాశ, నిస్పృహ నుంచి ప్లేయర్లు త్వరగా బయటపడగలరు. అంతేకానీ మ్యాచ్ ముగిసిన తర్వాత దిగాలుగా వెళ్లి గదిలో కూర్చోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. నిరాశ కలిగించిందిసన్నిహితుల సమక్షంలో బాధ్యత మరింత పెరుగుతుంది. ఆట అయిపోయిన తర్వాత కుటుంబంతో గడపడంలో తప్పేముంది. నా వరకైతే కుటుంబ సభ్యులతో ఉండేందుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తా. అలాంటి అవకాశాలను వదిలిపెట్టను.మైదానంలో ఏం జరుగుతుందో తెలియని వ్యక్తులు దీనిపై నియంత్రణ తేవడం నిరాశ కలిగించింది. ఏ ఆటగాడిని అడిగినా కుటుంబ సభ్యులు వెంట ఉండటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు’ అని వివరించాడు. కాగా ఐపీఎల్‌లోనూ డ్రెసింగ్ రూమ్‌లోకి కుటుంబ సభ్యులను అనుమతించబోమని బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే, కోహ్లి మాత్రం తాను అనుష్కతో ప్రేమలో ఉన్ననాటి నుంచి.. ఇప్పుడు తాము ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులైన తర్వాత కూడా.. భార్యను ఎల్లవేళలా తన వెంటే తీసుకువెళ్లడానికి ప్రాధాన్యం ఇస్తాడు. ఆమె ఎదురుగా ఉంటే.. తాను సానుకూల దృక్పథంతో ముందుకు సాగగలనని పలు సందర్భాల్లో కోహ్లి వెల్లడించాడు. అయితే, బీసీసీఐ తెచ్చిన కొత్త రూల్ వల్ల కోహ్లి బాగా ఇబ్బంది పడుతున్నట్లు అతడి మాటల ద్వారా వెల్లడైంది. అనుష్క శర్మ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి -
‘నువ్వుంటే నిశ్చింత.. నువ్వే నా హృదయ స్పందన’
టీమిండియా స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)- స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ (Sanjana Ganesan) వివాహ వార్షికోత్సవం నేడు (మార్చి 15). ఈ సందర్భంగా సంజనా భర్తపై ప్రేమను కురిపిస్తూ ఉద్వేగ పూరిత నోట్ షేర్ చేసింది. ‘‘నువ్వుంటేనే నా గుండె కొట్టుకుంటుంది.. నువ్వు నాతో ఉంటేనే నాకు శ్వాస ఆడుతుంది.. నువ్వు లేని ఇల్లు ఇల్లులా కనిపించదు.. నువ్వే నా ధైర్యం.. నువ్వుంటే నేను నిశ్చితంగా ఉంటాను.. హ్యాపీ 4 లవ్’’ అంటూ సంజనా కవితాత్మక పంక్తులతో భర్తకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ‘మిస్టర్ అండ్ మిసెస్ మాహి’ సినిమా పాటలోని లిరిక్స్‌తో తన ప్రేమను వ్యక్తపరిచింది.హ్యాపీ యానివర్సరీఇందుకు బుమ్రాతో కలిసి ఉన్న ఫొటోను సంజనా జతచేసింది. ఈ క్రమంలో బుమ్రా దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా సాధారణ కుటుంబంలో జన్మించిన బుమ్రా.. తన అంకిత భావం, కఠిన శ్రమతో వరల్డ్‌క్లాస్ బౌలర్‌గా ఎదిగాడు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో అతడే ముందున్నాడు.అంతేకాదు.. టీమిండియా పేస్ దళ నాయకుడిగా ఉన్న బుమ్రా.. వైస్ కెప్టెన్‌గానూ సేవలు అందిస్తున్నాడు. ఇక సంజనా విషయానికొస్తే.. బీటెక్ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్‌లో ప్రవేశించిన ఆమె.. తర్వాత స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)తో పాటు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రజెంటర్‌గా పనిచేస్తూ ఉన్నత స్థాయికి చేరుకుంది.ఈ క్రమంలో బుమ్రా- సంజనా మధ్య కుదిరిన స్నేహం ప్రేమగా రూపాంతరం చెందింది. ఇరు కుటుంబాల సమ్మతంతో వీరు 2021, మార్చి 15న సిక్కు సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు సెప్టెంబరు 4, 2023లో కుమారుడు జన్మించగా.. అతడికి అంగద్‌గా నామకరణం చేశారు. కోలుకుంటున్న బుమ్రాకాగా బుమ్రా ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. గాయం కారణంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మొత్తానికి దూరమైన అతడు... కోలుకుంటున్నట్లు సమాచారం. అయితే, ఐపీఎల్-2025లో ఆరంభ మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు.ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ వర్గాలు వెల్లడించాయి. కాగా ఐపీఎల్ ఆరంభం నుంచి ముంబైతో ప్రయాణిస్తున్న బుమ్రాను మెగా వేలానికి ముందు ఫ్రాంఛైజీ తమ మొదటి ప్రాధాన్య ప్లేయర్‌గా రిటైన్ చేసుకుంది. అతడి కోసం రూ. 18 కోట్లు ఖర్చు చేసింది.ఇక ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 45 టెస్టులు ఆడిన బుమ్రా.. 205 వికెట్లు తీశాడు. ఇక 89 వన్డేల్లో ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్ 149 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ఫార్మాట్లో టీమిండియా తరఫున 89 వికెట్లు తీసిన బుమ్రా.. ఐపీఎల్లో ఇప్పటి వరకు 133 మ్యాచ్‌లు ఆడి 165 వికెట్లు పడగొట్టాడు. చదవండి: ఇంగ్లండ్‌తో టెస్టులు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే! బీసీసీఐ గ్రీన్ సిగ్నల్? -
రోహిత్‌ను ఆలింగనం చేసుకున్న అనుష్క శర్మ.. ప్రత్యేక అభినందనలు
వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ నాటి చేదు అనుభవాన్ని మరిపిస్తూ టీమిండియా అద్భుత విజయం సాధించింది. సొంతగడ్డపై ఎదురైన పరాభవాన్ని మరిపించేలా.. దుబాయ్‌లో చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) గెలిచి అభిమానులకు కానుక అందించింది. ఈ మెగా వన్డే టోర్నమెంట్ ఆద్యంతం అజేయంగా నిలిచి పరిపూర్ణ విజయంతో ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది.పాతికేళ్ల క్రితం న్యూజిలాండ్(India vs New Zealand) చేతిలో ఫైనల్లో ఓడిపోయిన భారత జట్టు తాజాగా అదే ప్రత్యర్థిని ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. నాలుగు వికెట్ల తేడాతో కివీస్‌పై గెలుపొంది 2025 చాంపియన్స్ ట్రోఫీ విజేతగా అవతరించింది. దీంతో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ నేపథ్యంలో టీమిండియాపై.. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై ప్రశంసల వర్షం కురుస్తోంది.స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్-2023లో తన అద్భుత కెప్టెన్సీతో జట్టును ఫైనల్ చేర్చిన హిట్‌మ్యాన్.. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను చాంపియన్‌గా నిలిపాడు. తాజాగా చాంపియన్స్ ట్రోఫీ గెలిచి రెండో ఐసీసీ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా మహేంద్ర సింగ్ ధోని తర్వాత ఎక్కువ ఐసీసీ ట్రోఫీలు గెలిచిన రెండో కెప్టెన్‌గా నిలిచాడు.ఆత్మీయంగా హత్తుకుని.. శుభాకాంక్షలుఇక చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత సహచరులు రోహిత్ శర్మతో తమ ఆనందాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. స్టార్ బ్యాటర్, మాజీ సారథి విరాట్ కోహ్లి అయితే సంతోషంతో తబ్బిబ్బైపోయాడు. ఆ సమయంలో రోహిత్ కుటుంబంతో పాటు కోహ్లి ఫ్యామిలీ కూడా అక్కడే ఉంది.అయితే, విజయానంతరం రోహిత్ తన కుమార్తె సమైరాను ముద్దాడటంతో పాటు భార్య రితికాను ఆలింగనం చేసుకుని సంతోషం పంచుకున్నాడు. ఆ సమయంలో రితికా పక్కనే ఉన్న కోహ్లి భార్య అనుష్క శర్మ రోహిత్‌ను ప్రత్యేకంగా అభినందించింది. అంతేకాదు ఆత్మీయంగా అతడిని హత్తుకుని శుభాకాంక్షలు తెలిపింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాగా చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా గెలవగానే అనుష్క- కోహ్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆనందాన్ని పంచుకున్నారు. ఇక టీమిండియాకు మద్దతుగా అనుష్క పలుమార్లు స్టేడియంలో సందడి చేయడంతో పాటు భర్త విరాట్ అద్భుతంగా ఆడిన వేళ గాల్లో ముద్దులు ఇస్తూ అతడిపై ప్రేమను చాటుకున్న సందర్భాలు కోకొల్లలు. This moment!🏆❤️#AnushkaSharma hugged #ViratKohli after India's epic win in the #ICCChampionsTrophy2025 finals. #INDvsNZ pic.twitter.com/QmEDAJcziu— Filmfare (@filmfare) March 9, 2025 విరాట్ కూడా తాను కీలక మైలురాయిని అందుకున్న ప్రతివేళా సతీమణికి దానిని అంకితమిస్తాడు. ముఖ్యంగా ఫామ్‌లేమితో సతమతమైన వేళ అనుష్క వల్లే తాను తిరిగి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేవాడినని.. ఆమె తనకు నైతికంగా ఎల్లవేళలా మద్దతు ఇస్తుందని గతంలో వెల్లడించాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ బారత్ వర్సెస్ న్యూజిలాండ్ వేదిక: దుబాయ్, మార్చి 9టాస్: న్యూజిలాండ్ .. మొదట బ్యాటింగ్కివీస్ స్కోరు: 251/7 (50)టీమిండియా స్కోరు: 254/6 (49)ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచి చాంపియన్‌గా భారత్ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రోహిత్ శర్మ(83 బంతుల్లో 76) Anushka Sharma specially called Rohit Sharma and gave him a tight hug.🔥They are like a family bro.#INDvNZ pic.twitter.com/6UgeFchHVT— 𝐕𝐢𝐬𝐡𝐮 (@Ro_45stan) March 9, 2025 -
సూపర్ ఫామ్‌లో టీమిండియా స్టార్.. ‘ఐటం సాంగ్’తో సోదరి బాలీవుడ్ ఎంట్రీ
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపిన ఈ ముంబై బ్యాటర్.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో అదే జోరును కొనసాగిస్తున్నాడు. విలువైన ఇన్నింగ్స్ ఆడుతూ భారత్ ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు.ఈ వన్డే టోర్నమెంట్లో భాగంగా తొలుత బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ కాస్త నిరాశపరిచాడు. కేవలం 15 పరుగులే చేసి నిష్క్రమించాడు. అయితే, సెమీస్ చేరాలంటే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో కీలకమైన మ్యాచ్‌లో మాత్రం హాఫ్ సెంచరీతో మెరిశాడు. 67 బంతుల్లో 56 పరుగులు చేసి విరాట్ కోహ్లి(100 నాటౌట్) మంచి భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలిపించడంలో భాగమయ్యాడు.ఆకాశమే హద్దుగాఆ తర్వాత గ్రూప్ దశలో ఆఖరుగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 98 బంతులు ఎదుర్కొని 79 పరుగులతో టీమిండియా ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లోనూ శ్రేయస్ అయ్యర్ రాణించాడు. జట్టు విజయానికి పునాది వేసే క్రమంలో 45 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో జయభేరి మోగించిన టీమిండియా ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే.‘ఐటం’ సాంగ్‌తో బాలీవుడ్లో ఎంట్రీఇదిలా ఉంటే.. భారత్- ఆసీస్ మధ్య మ్యాచ్ చూసేందుకు శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ట అయ్యర్(Shresta Iyer) కూడా దుబాయ్ స్టేడియానికి వచ్చింది. తన తమ్ముడిని ఉత్సాహపరుస్తూ కెమెరాల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో శ్రేష్టకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. కొరియోగ్రాఫర్, ప్రొఫెషనల్ డాన్సర్ అయిన శ్రేష్ట.. ఓ ‘ఐటం’ సాంగ్‌తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది.ఒకరేమో టీమిండియా స్టార్.. మరొకరు బాలీవుడ్ స్టార్‘సర్కారీ బచ్చా’ అనే సినిమాలో ‘అగ్రిమెంట్ కర్లే’ అంటూ సాగే పాటకు జోష్‌గా స్టెప్పులేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘ఒకరేమో టీమిండియా స్టార్.. మరొకరు బాలీవుడ్ స్టార్’’ అంటూ అక్కాతమ్ముళ్ల ప్రతిభను మెచ్చుకుంటున్నారు. ఇక ఆసీస్‌పై భారత్ విజయానంతరం శ్రేష్ట మ్యాచ్ వీక్షిస్తున్న ఫొటోలతో పాటు.. సెలబ్రిటీలతో దిగిన ఫొటోలను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది.కాగా ముంబైలో 1994లో జన్మించిన శ్రేయస్ అయ్యర్ 2017లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 14 టెస్టులు, 68 వన్డేలు, 51 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో 811, 2752, 1104 పరుగులు సాధించాడు. మరోవైపు.. శ్రేయస్ అక్క శ్రేష్ట అయ్యర్ 1990లో జన్మించింది. వీరి తండ్రి సంతోష్ అయ్యర్- కేరళకు చెందినవారు కాగా.. తల్లి రోహిణి అయ్యర్ స్వస్థలం మంగళూరు. వీరు ముంబైలో స్థిరపడ్డారు. ఇక అక్కాతమ్ముళ్లు శ్రేష్ట- శ్రేయస్‌లకు ఒకరంటే మరొకరి ఎనలేని ప్రేమ. సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని ఇద్దరూ బయటపెడుతుంటారు. చదవండి: శుబ్‌మన్ గిల్ చేసిన ‘తప్పు’..! టీమిండియాకు శాపమయ్యేది! ఎందుకంటే.. View this post on Instagram A post shared by Panorama Music (@panoramamusic) -
61 ఏళ్ల వయసులో మరోసారి ప్రేమలో పడ్డ ‘ఐపీఎల్ సృష్టికర్త’!.. ఎవరీమె?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తొలి చైర్మన్, వ్యాపారవేత్త లలిత్ మోదీ(Lalit Modi) మరోసారి ప్రేమలో పడ్డాడు. రీమా బౌరీ(Rima Bouri)తో పాతికేళ్లుగా తనకున్న స్నేహం ప్రేమగా రూపాంతరం చెందిందని తెలిపాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఈ విషయాన్ని లలిత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.దేశం విడిచిపారిపోయికాగా వ్యాపార కుటుంబానికి చెందిన లలిత్ మోదీ ఢిల్లీలో జన్మించాడు. ఐపీఎల్(IPL) సృష్టికర్తగా పేరు ప్రఖ్యాతులు పొందిన అతడు.. అదే స్థాయిలో అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఆర్థిక అవకతవలకు పాల్పడి దేశం విడిచిపారిపోయే పరిస్థితికి చేరుకున్నాడు. ప్రస్తుతం లలిత్ మోదీ లండన్‌లో తలదాచుకుంటున్నట్లు జాతీయ మీడియా కథనాల ద్వారా వెల్లడైంది.భార్య కంటే తొమ్మిదేళ్లు చిన్నఇదిలా ఉంటే.. లలిత్ మోదీ వృత్తిగత జీవితం మాదిరే వ్యక్తిగత జీవితం కూడా సంచలనాల మయమే. వయసులో తనకంటే తొమ్మిదేళ్లు పెద్దదైన, డివోర్సీ మినాల్‌ను లలిత్ మోదీ ప్రేమించి పెళ్లాడాడు. ఆమె కోసం కుటుంబాన్ని ఎదిరించి మరీ ఢిల్లీ నుంచి ముంబైకి మకాం మార్చిన లలిత్.. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగాడు.ఇక లలిత్- మినాల్ దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె అలియా, కుమారుడు రుచిర్ మోదీ ఉన్నారు. వీరిద్దరితో పాటు మినాల్‌కు మొదటి వివాహం ద్వారా కలిగిన కుమార్తె కరీమా సంగ్రాణిని కూడా లలిత్ మోదీ చేరదీసినట్లు కథనాలు ఉన్నాయి. లలిత్ ప్రాణంగా ప్రేమించిన మినాల్ క్యాన్సర్‌తో పోరాడి దురదృష్టవశాత్తూ 2018లో కన్నుమూశారు.సుస్మితా సేన్‌తో ప్రేమలో ఉన్నట్లుఅప్పటి నుంచి ఒంటరి జీవితం గడుపుతున్న లలిత్ మోదీ గతేడాది.. విశ్వ సుందర్ సుస్మితా సేన్‌తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించి సంచలనానికి తెరదీశాడు. అనంతరం.. ఆమెను బెటర్ హాఫ్ అని సంబోధిస్తూ పెళ్లి వార్తలకు ఊతమిచ్చాడు. అయితే, ఆ తర్వాత ఇద్దరూ వీటిని ఖండించడంతో ఊహాగానాలకు చెక్ పడింది.అయితే, తాజాగా.. 61 ఏళ్ల లలిత్ మోదీ తాను మరోసారి ప్రేమలో పడ్డట్లు తెలపడం విశేషం. ‘‘ఒక్కసారి అదృష్టం అంటారు... మరి నేను మాత్రం రెండుసార్లు లక్కీ అయ్యాను. 25 ఏళ్ల స్నేహం ప్రేమగా రూపాంతరం చెందిన వేళ.. అవును ఇది రెండోసారి జరిగింది. మీ జీవితాల్లోనూ ఇలా జరిగే ఉంటుంది. హ్యాపీ వాలైంటైన్స్ డే’’ అంటూ రీమా బౌరీతో ఉన్న ఫొటోలతో కూడిన వీడియోను లలిత్ మోదీ షేర్ చేశాడు.జీవితాంతం నువ్వే నా ప్రేమఇందుకు స్పందిస్తూ.. ‘‘లవ్ యూ మోర్’’ అని రీమా పేర్కొనగా.. లలిత్.. ‘‘జీవితాంతం నువ్వే నా ప్రేమ’’ అంటూ రొమాంటిక్‌గా బదులివ్వడం విశేషం. కాగా రీమా బౌరీ వృత్తిరీత్యా మార్కెటింగ్ కన్సల్టెంట్‌గా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. 2022లో లలిత్ మోదీ తన కుమార్తె ఆలియా వివాహం జరిపించాడు. బ్రెట్ కార్ల్సన్ అనే విదేశీయుడిని ఆలియా పెళ్లి చేసుకున్నారు. ఇటలీలోని వెనిస్ నగరంలో వీరి వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఇదిలా ఉంటే.. 2008లో మొదలైన ఐపీఎల్ పదిహేనేళ్లుగా విజయవంతమైన లీగ్‌గా కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చి 21 నుంచి ఈ మెగా క్రికెట్ ఈవెంట్ మొదలుకానుంది.చదవండి: అప్పుడే ఆఫర్ వచ్చింది.. కానీ!.. వదిలేసిన ఫ్రాంఛైజీ జట్టుకే కెప్టెన్‌గా.. View this post on Instagram A post shared by Lalit Modi (@lalitkmodi) -
PV Sindhu: కీలక టోర్నీకి దూరం.. భర్తతో ‘మ్యాచీ మ్యాచీ’!
ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత పతకావకాశాలకు దెబ్బ పడింది. భారత స్టార్ షట్లర్, ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు(PV Sindhu) కండరాల గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. క్రితంసారి 2023లో దుబాయ్(Dubai)లో జరిగిన ఈ మెగా ఈవెంట్లో సింధు సభ్యురాలిగా ఉన్న భారత జట్టు కాంస్య పతకాన్ని(Bronze Medal) సాధించింది. గువాహటిలో ఈనెల నాలుగో తేదీన మొదలైన జాతీయ శిక్షణ శిబిరం సందర్భంగా సింధు ప్రాక్టీస్ సమయంలో గాయపడింది.ఎంఆర్ఐ స్కాన్ తీయగా సింధు కండరాల గాయం నుంచి కోలుకోవడానికి కొన్ని వారాల సమయం పడుతుందని తేలింది. దాంతో సింధు ఈ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆసియా మిక్స్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఈనెల 11 నుంచి 15 వరకు చైనాలోని కింగ్డావో నగరంలో జరుగుతుంది. గ్రూప్ ‘డి’లో ఉన్న భారత్ ఈనెల 12న మకావు జట్టుతో, 13న దక్షిణ కొరియా జట్టుతో ఆడుతుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల (పురుషుల, మహిళల సింగిల్స్, పురుషుల, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్) చొప్పున జరుగుతాయి. భారత బ్యాడ్మింటన్ జట్టు: లక్ష్య సేన్, ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, ధ్రువ్ కపిల, అర్జున్, సతీశ్ కుమార్, మాళవిక బన్సోద్, గాయత్రి గోపీచంద్, ట్రెసా జాలీ, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, ఆద్య. మ్యాచీ మ్యాచీఇదిలా ఉంటే.. గాయం కారణంగా ఆటకు దూరమైన పీవీ సింధు వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించింది. భర్త వెంకట దత్తసాయితో కలిసి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ చాక్లెట్ కలర్ దుస్తులు ధరించిన ఉన్న ఫొటోను షేర్ చేసిన సింధు.. ‘మ్యాచీ మ్యాచీ’ అంటూ మురిసిపోయింది.శభాష్ మానస్ న్యూఢిల్లీ: భారత పురుషుల టెన్నిస్ రైజింగ్ స్టార్ మానస్ ధామ్నే తన కెరీర్లో తొలి ప్రొఫెషనల్ టైటిల్ సాధించాడు. ట్యూనిషియాలో జరిగిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఎం15 టోర్నీలో 17 ఏళ్ల మానస్ విజేతగా నిలిచాడు. ఐటీఎఫ్ ర్యాంకింగ్స్‌లో 64వ స్థానంలో ఉన్న ఈ మహారాష్ట్ర కుర్రాడు ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 2–6, 6–0, 6–2తో ఇటలీకి చెందిన లొరెంజో కార్బోనిపై గెలుపొందాడు.తద్వారా భారత్ నుంచి ఐటీఎఫ్ టైటిల్ నెగ్గిన రెండో అతి పిన్న వయస్కుడిగా మానస్ గుర్తింపు పొందాడు. ఈ రికార్డు యూకీ బాంబ్రీ (16 ఏళ్ల 10 నెలలు; 2009లో న్యూఢిల్లీ ఫ్యూచర్స్ టోర్నీ) పేరిట ఉంది. క్వాలిఫయర్‌గా ట్యూనిషియా ఎం15 టోర్నీలో మెయిన్ ‘డ్రా’లోకి అడుగు పెట్టిన మానస్ వరుసగా 8 మ్యాచ్‌లు గెలిచి చాంపియన్‌గా అవతరించడం విశేషం. ప్రస్తుత ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ మాజీ కోచ్ రికియార్డో పియాటి వద్ద మానస్ శిక్షణ తీసుకుంటున్నాడు. -
‘ఫీమేల్ యాక్టర్లకు.. క్రికెటర్లు మెసేజ్ చేస్తే తప్పేంటి?’
పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్(Shadab Khan)కు ఓ ఇంటర్వ్యూ సందర్భంగా మహిళా అభిమాని నుంచి విచిత్ర ప్రశ్న ఎదురైంది. పాక్ క్రికెటర్లంతా నటీమణులకు పదే పదే ఫోన్లో సందేశాలు ఎందుకు పంపిస్తారని ఆమె అడిగింది. ఇందుకు షాదాబ్ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కాగా గతంలో పలువురు నటీమణులు తమకు పాక్ క్రికెటర్ల నుంచి మెసేజ్‌లు వచ్చాయని పేర్కొన్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో టిక్‌టాకర్ షాతాజ్ ఖాన్(Shahtaj Khan).. షాదాబ్ ఖాన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అతడు తనతో వాట్సాప్‌లో కాంటాక్టులో ఉన్నాడని.. తనను పెళ్లి చేసుకోమంటూ ప్రతిపాదన(Marriage Proposal) కూడా తెచ్చాడని చెప్పింది.ఈ విషయం గురించి తాజాగా షాదాబ్ ఖాన్ స్పందించాడు. జియో న్యూస్ ‘షో’కు హాజరైన అతడు అభిమానులతో కాసేపు ముచ్చటించాడు. ఈ క్రమంలో ఓ లేడీ ఫ్యాన్.. ‘‘చాలా మంది ఫీమేల్ యాక్టర్లు తమకు క్రికెటర్లు సోషల్ మీడియాలో సందేశాలు పంపుతున్నారని చెప్తూ ఉన్నారు. అందులో మీరు కూడా ఉన్నారా?.. ఎవరికైనా ఎప్పుడైనా మీరు అలా మెసేజ్ చేశారా?’’ అని ప్రశ్నించింది.అందులో తప్పేముంది?ఇందుకు షాదాబ్ ఖాన్ బదులిస్తూ.. ‘‘ఒకవేళ క్రికెటర్లు వాళ్లకు మెసేజ్‌లు పంపినా.. అందులో తప్పేముంది?.. క్రికెటర్లు నిజంగానే ఓ నటికి మెసేజ్ పంపించారే అనుకోండి. వాళ్లకు అది నచ్చకపోతే బదులివ్వకుంటే సరిపోతుంది కదా!అలా చేస్తే ఇంకోసారి ఎవరూ మెసేజ్ చేసే సాహసం చేయరు. ఒకవేళ అలా కాకుండా.. వాళ్లు మెసేజ్‌లకు రెస్పాండ్ అవుతున్నారు అంటే.. వారికి కూడా ఎదుటి వ్యక్తి పట్ల ఆసక్తి ఉన్నట్లే అనుకోవాలా?..కొంతమంది నటీమణులు ఈ విషయం గురించి ఇటీవల చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వారి వీడియోలు చూశాను. కానీ అందులో వారు చెప్పే ప్రతీ విషయం నిజం కావాలని లేదు. కొన్నిసార్లు చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసి.. అతిశయోక్తులతో వర్ణిస్తారు.ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతోఅయితే, ఇలాంటి వాటి వల్ల జట్టుపై పెద్దగా ప్రభావం పడదు. కానీ టీమ్‌లోని ఏ సభ్యుడు మెసేజ్ పంపించాడన్న విషయంపై కాస్త చర్చ జరుగుతుంది. కొంతమంది యాక్టర్లు తాము ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో టైమ్ చూసి ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా వరల్డ్కప్లాంటి మెగా టోర్నీలు జరుగుతున్నపుడు వీటి గురించి మాట్లాడటం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాలని అనుకుంటారు’’ అని షాదాబ్ ఖాన్ చెప్పుకొచ్చాడు.కాగా పాకిస్తాన్ తరఫున 2017లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు షాదాబ్ ఖాన్. అతడు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ఇప్పటి వరకు ఆరు టెస్టులు, 70 వన్డేలు, 104 అంతర్జాతీయ టీ20లు ఆడిన 26 ఏళ్ల షాదాబ్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 300, 855, 679 పరుగులు చేశాడు. అదే విధంగా.. టెస్టుల్లో 14, వన్డేల్లో 85, టీ20లలో 107 వికెట్లు తీశాడు. చివరగా 2023, నవంబరులో ఇంట్లండ్తో వన్డే సందర్భంగా పాకిస్తాన్‌కు చివరగా ప్రాతినిథ్యం వహించాడు.ఇక షాదాబ్ ఖాన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే... దిగ్గజ స్పిన్నర్, తన కోచ్ సక్లెయిన్ ముస్తాక్ అలీ కుమార్తె మలైకాను అతడు వివాహం చేసుకున్నాడు. అత్యంత సన్నిహితుల నడుమ 2023లో వీరి షాదాబ్- మలైకాల పెళ్లి జరిగింది.చదవండి: Vinod Kambli: విడాకులకు సిద్ధమైన భార్య.. ‘తల్లి’ మనసు కరిగి.. -
Vinod Kambli: విడాకులకు సిద్ధమైన భార్య.. ‘తల్లి’ మనసు కరిగి..
కష్టసుఖాల్లో తోడుంటానన్న పెళ్లి నాటి ప్రమాణాలను ఆ భర్త మరిచాడు. తాగుడుకు బానిసై భార్యాబిడ్డలను పట్టించుకోవడమే మానేశాడు. తన చెడువ్యసనాల కారణంగా అనారోగ్యం పాలై ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.భర్త తీరుతో విసిగిపోయిన ఆ భార్య అతడిని వదిలేద్దామనుకుంది. విడాకులు(Divorce) తీసుకోవాలని నిశ్చయించుకుంది. కానీ.. కట్టుకున్న వాడి పరిస్థితి చూసి ఆమె మనసు కరిగిపోయింది. అతడు కూడా ‘బిడ్డ’లాంటి వాడేనంటూ ‘తల్లి’లా మళ్లీ చేరదీసింది. తమ ఇద్దరు పిల్లల్లాగే ఇప్పుడు అతడి ఆలనాపాలనా ఆమే చూసుకుంటోంది. నిజమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనంలా నిలిచింది. ఆ భార్యాభర్తలు ఆండ్రియా హెవిట్(Andrea Hewitt)- వినోద్ కాంబ్లీ(Vinod Kambli).టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో కొన్నాళ్లపాటు సత్తా చాటినా.. ఆ తర్వాత అదే జోరును కనబరచలేకపోయాడు ముంబై ప్లేయర్ కాంబ్లీ. ఉన్నత శిఖరాలకు చేరుకోగల సత్తా ఉన్నా క్రమశిక్షణా రాహిత్యం వల్ల.. తన భవిష్యత్తును తానే నాశనం చేసుకున్నాడనే విమర్శలూ ఉన్నాయి. మోడల్‌పై మనసు పారేసుకునిఇక వినోద్ కాంబ్లీ వ్యక్తిగత జీవితం కూడా అంతగొప్పగా ఏమీ లేదు. తొలుత నొయెల్లా లూయీస్‌ను పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఆమెతో ఎక్కువ కాలం బంధం కొనసాగించలేకపోయాడు. అనంతరం.. ఓ బిల్‌బోర్డుపై ఉన్న యాడ్‌లో కనిపించిన మోడల్‌పై మనసు పారేసుకున్నాడు కాంబ్లీ.ఆమే ఆండ్రియా హెవిట్. ఆమెను నేరుగా కలిసి మనసులోని మాటను చెప్పడంతో పాటు.. పెళ్లికి కూడా ఒప్పించాడు. ఇరువురి అంగీకారంతో 2006లో సివిల్ కోర్టులో చట్టబద్దంగా పెళ్లి జరిగింది. వినోద్- ఆండ్రియా దాంపత్యానికి గుర్తుగా కుమారుడు జీసస్ క్రిస్టియానో కాంబ్లీ, కుమార్తె జొహానా జన్మించారు.అయితే, పందొమిదేళ్ల వైవాహిక బంధంలో ఆండ్రియా- వినోద్ కాంబ్లీ మధ్య ఎన్నోసార్లు గొడవలు జరిగాయి. అయితే, వినోద్ మద్యపానం, ధూమపానానికి అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడంతో పాటు.. ఒక దశలో ఇంటిని పూర్తిగా పట్టించుకోవడం మానేశాడట.గృహహింస కేసుఅంతేకాదు.. భార్యను వేధించేవాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2023లో ఆండ్రియా వినోద్ కాంబ్లీపై గృహహింస కేసు పెట్టింది. కుకింగ్ ప్యాన్‌తో తనను కొట్టడంతో తలకు గాయమైందని ఫిర్యాదులో పేర్కొంది. అయితే, ఆ తర్వాత ఇద్దరు కాంప్రమైజ్ అయినట్లు సమాచారం.కానీ వినోద్ కాంబ్లీ మాత్రం చెడుఅలవాట్లను వదల్లేదు. ఈ క్రమంలో ఓసారి గుండెపోటుకు గురికావడంతో పాటు.. దాదాపు 14సార్లు పునరావాస కేంద్రానికి వెళ్లినా వ్యసనాల్ని మాత్రం వదల్లేకపోయాడు. దీందో విసుగు చెందిన ఆండ్రియా అతడికి విడాకులు ఇవ్వాలనే నిర్ణయంతో పిటిషన్ కూడా దాఖలు చేసింది. అయితే, అతడి ఆరోగ్య పరిస్థితి చూసి ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.అతడు కూడా నా బిడ్డ లాంటివాడేఈ విషయాన్ని తాజాగా ఓ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆండ్రియా వెల్లడించింది. ‘‘విడిపోవాలనే ఆలోచన వచ్చింది. అయితే, నేను వదిలేస్తే అతడు ఏమైపోతాడోననే భావన నన్ను నిలవనీయలేదు.అతడు కూడా నా బిడ్డ లాంటివాడే. అతడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. స్నేహితుల విషయంలోనే నేను చాలా ఎమోషనల్‌గా ఉంటాను. అలాంటిది నా జీవిత భాగస్వామి పట్ల ఇంకెంత ప్రేమ ఉంటుందో అర్థం చేసుకోండి.ఇక విడిపోవాలని అనిపించలేదుకొన్నిసార్లు తనతో గొడవపడి బయటకు వెళ్లిపోయేదాన్ని. కానీ అతడు భోజనం చేశాడో.. లేదో.. నిద్రపోయాడా లేదంటే ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా? అని మళ్లీ వెళ్లి చెక్ చేసేదాన్ని. అతడికి నా అవసరం ఉందని గుర్తించిన తర్వాత ఇక విడిపోవాలని అనిపించలేదు’’ అని తల్లి మనసును చాటుకుంది.నా కుమారుడు అన్నీ అర్థం చేసుకుంటాడుఅయితే, భర్త ప్రవర్తన వల్ల పిల్లలపై ఈ ప్రభావం పడిందన్న ఆండ్రియా.. ‘‘నా కుమారుడు మాత్రం చిన్న వయసులోనే నా గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అమ్మ మానసిక ఆరోగ్యంతో పాటు.. నాన్నను కూడా జాగ్రత్తగా చూసుకోవాలని తను అప్పుడే డిసైడయ్యాడు’’ అని పేర్కొంది. కాగా ఇటీవలే మరోసారి అనారోగ్యం పాలైన వినోద్ కాంబ్లీ ప్రస్తుతం కోలుకున్నాడు. తన భార్య వల్లే ఇది సాధ్యమైందంటూ ఆమెపై ప్రేమను కురిపించాడు. చదవండి: పరాయి స్త్రీలను తాకను.. ఇంత పొగరు పనికిరాదు! -
నీరజ్ చోప్రా ప్రేమ పెళ్లి.. ‘కట్నకానుకలు’ ఎంతో తెలుసా?
ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) ఇటీవలే వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. టెన్నిస్ క్రీడాకారిణి హిమానీ మోర్(Himani Mor)తో జనవరి 16న అతడి పెళ్లి జరిగింది. అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను నీరజ్ షేర్ చేసిన తర్వాతే.. ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది.ఈ నేపథ్యంలో నీరజ్ భార్య హిమానీ మోర్ బ్యాగ్రౌండ్‌తో పాటు.. అత్తామామల నుంచి అతడు తీసుకున్న కట్నకానుకలు, అల్లుడిగా అందుకున్న బహుమతులు ఏమిటన్న అంశాల గురించి అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో నీరజ్‌కు పిల్లనిచ్చిన అత్తామామలు చంద్ర మోర్, మీనా మోర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.ప్రేమ పెళ్లి‘‘దేవుడి దయ వల్ల మా అమ్మాయికి మంచి భర్త దొరికాడు. దేశం మొత్తాన్ని గర్వింపజేసిన వ్యక్తితో నా కూతురి పెళ్లి కావడం సంతోషంగా ఉంది. నీరజ్, హిమానీలకు గత రెండేళ్లుగా పరిచయం ఉంది. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు. అయితే, ఇరు కుటుంబాల అనుమతితోనే పెళ్లి చేసుకున్నారు’’ అని మీనా మోర్ దైనిక్ భాస్కర్‌కు తెలిపారు.‘కట్నకానుకలు’ ఎంతో తెలుసా?అదే విధంగా.. తమ అల్లుడు తమ నుంచి కట్నంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నాడని హిమానీ తల్లిదండ్రులు వెల్లడించారు. ఇది కాకుండా ఎలాంటి కట్నం, కానుకలు, బహుమతులు.. ఆఖరికి పెళ్లి కూతురికి తల్లిదండ్రులు ఇచ్చే వస్తువులు, దుస్తులను కూడా స్వీకరించలేదని తెలిపారు. తమ కూతురిని అచ్చంగా వాళ్లింటి అమ్మాయిని చేసుకున్నారని సంతోషంతో పొంగిపోయారు.కాగా హర్యానా అథ్లెట్లు నీరజ్- హిమానీల వివాహం హిమాచల్ ప్రదేశ్‌లో జరిగింది. ఇక ప్రి వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా జనవరి 14న నిశ్చితార్థం జరుగగా.. జనవరి 15న హల్దీ, మెహందీ, సంగీత్ నిర్వహించారు. జనవరి 16 మధ్యాహ్నం పెళ్లి తంతు పూర్తికాగా.. సాయంత్రం అప్పగింతల కార్యక్రమం జరిగింది. కేవలం అరవై మంది అతిథుల సమక్షంలోనే వివాహం జరగడం విశేషం. ఇక కొత్త జంట ఇప్పటికే హనీమూన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.ఎవరీ హిమానీ మోర్?హర్యానాలోని లార్సౌలీ హిమానీ స్వస్థలం. సోనిపట్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఆమె.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ అండ్‌ఫిజికల్ సైన్స్‌లో పట్టా పుచ్చుకుంది. ఉన్నత విద్యనభ్యసించేందుకు హిమానీ అమెరికాకు వెళ్లింది.ప్రస్తుతం హిమానీ మెక్‌కోర్మాక్ ఐసెంబర్గ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చదువుతోంది. 2018లో హిమానీ ఆలిండియా టెన్సిస్ అసోసియేషన్ ఈవెంట్లలో పాల్గొనడం ప్రారంభించింది. కెరీర్లో ఉత్తమంగా సింగిల్స్ విభాగంలో 42వ, డబుల్స్‌లో అత్యుత్తమంగా 27వ ర్యాంకు సాధించింది.నికర ఆస్తుల విలువ?కాగా హర్యానాలోని పానిపట్ జిల్లాలో గల ఖాంద్రా గ్రామంలో నీరజ్ చోప్రా ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. గతంలో ఆర్మీ సుబేదార్‌గా పనిచేశాడు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన 27 ఏళ్ల నీరజ్ చోప్రా.. ‘గోల్డెన్ బాయ్’గా ప్రసిద్ధి పొందాడు. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం నీరజ్ రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక నీరజ్ నికర ఆస్తుల విలువ రూ. 30 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.చదవండి: ‘నా కుమారుడిపై పగబట్టారు.. కావాలనే తొక్కేస్తున్నారు’ -
ఎంపీతో రింకూ సింగ్ నిశ్చితార్థం? ఆమె ఎవరంటే?
టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్(Cricketer Rinku Singh Engagement) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్(MP Priya Saroj)తో అతడి నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. రింకూ- ప్రియాల ఎంగేజ్మెంట్కు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చెల్లెలితో రింకూ సింగ్బంధువుల కోలాహలంఈ నేపథ్యంలో కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, అటు రింకూ గానీ.. ఇటు ప్రియా గానీ నిశ్చితార్థం విషయమై అధికారికంగా స్పందించలేదు. అయితే, రింకూ చెల్లెలు నేహా సింగ్(Neha Singh) తన అన్నతో కలిసి ఉన్న ఫొటోలను తాజాగా షేర్ చేసింది. ఇందులో బంధువుల కోలాహలంతో పాటు.. ఇల్లంతా అలంకరించినట్లుగా కనిపిస్తోంది. దీనిని బట్టి నిశ్చితార్థం జరిగినట్లు నెటిజన్లు అంచనాకు వస్తున్నారు.పేద కుటుంబంలో జన్మించిన రింకూకాగా ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లోని పేద కుటుంబంలో రింకూ కుమార్ సింగ్ జన్మించాడు. అతడి తండ్రి ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు వేసి కుటుంబాన్ని పోషించేవాడు. ఒక్కోసారి రింకూ కూడా తండ్రికి ఆరోగ్యం సహకరించనపుడు సిలిండర్లు వేసేవాడు. ఒకానొక సమయంలో స్వీపర్‌గానూ రింకూ పనిచేశాడు.కోటీశ్వరుడిగా ఎదిగిన రింకూఅయితే, ఎన్ని కష్టాలు ఎదురైనా రింకూ మాత్రం క్రికెట్‌పై ప్రేమను వదులుకోలేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ తొలుత ఐపీఎల్లో అడుగుపెట్టిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అదరగొట్టాడు. ఈ క్రమంలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లోనూ ఎంట్రీ ఇచ్చి నయా ఫినిషర్‌గా ఎదిగాడు. ఆర్థికంగానూ స్థిరపడ్డాడు.ఇప్పటి వరకు భారత్ తరఫున 27 ఏళ్ల రింకూ సింగ్ 30 టీ20లు, రెండు వన్డేలు ఆడి 507, 55 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ మెగా వేలం-2025కి ముందు కోల్‌కతా ఫ్రాంఛైజీ అతడిని రూ. 13 కోట్లకు రిటైన్ చేసుకుంది.ఎవరీ ప్రియా సరోజ్?ఇక ప్రియా సరోజ్ విషయానికొస్తే.. వారణాసిలో 1998లో జన్మించిన ఆమె.. న్యూఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్స్టిట్యూట్లో విద్యాభ్యాసం చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. అనంతరం.. అమిటి యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు.రాజకీయాలపై ఆసక్తి కలిగి ఉన్న ప్రియా సరోజ్ 2024 సాధారణ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేశారు. మచ్లిశహర్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. తన ప్రత్యర్థి బీపీ సరోజ్‌పై 35850 ఓట్ల తేడాతో విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ప్రియా సరోజ్ నికర ఆస్తుల విలువ రూ. 11.3 లక్షలుగా సమాచారం. ఇక ప్రియా తండ్రి తూఫానీ సరోజ్ కూడా మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం కేరాకట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, రింకూ- ప్రియల నిశ్చితార్థ వార్తలను తూఫానీ సరోజ్ తాజాగా ఖండించారు.చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్ Rinku Singh gets engaged to Samajwadi Party MP Priya Saroj. 💍- Many congratulations to them! ❤️ pic.twitter.com/7b7Hb0D2Em— Mufaddal Vohra (@mufaddal_vohra) January 17, 2025 -
వామిక, అకాయ్‌లతో బృందావనంలో విరాట్- అనుష్క! వీడియో వైరల్
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) మరోసారి ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయాడు. సతీమణి అనుష్క శర్మ(Anushka Sharma), పిల్లలు వామిక(Vamika), అకాయ్(Akaay)లతో కలిసి ప్రేమానంద్ మహరాజ్ ఆశీస్సులు తీసుకున్నాడు. కాగా గత కొంతకాలంగా కెరీర్ పరంగా కోహ్లి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ విఫలంముఖ్యంగా టెస్టుల్లో నిలకడలేమి ఆట తీరు, వరుస వైఫల్యాల కారణంగా తీవ్ర స్థాయిలో విమర్శలు మూటగట్టుకున్నాడు కోహ్లి. తొలుత సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో సిరీస్‌లో తేలిపోయిన ఈ ‘రన్‌మెషీన్’.. తనకు ఘనమైన రికార్డు ఉన్న ఆస్ట్రేలియాలోనూ చేతులెత్తేశాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా ఓడిపోవడానికి కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ప్రధాన కారణమయ్యాడు కోహ్లి. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో శతకం బాదడం మినహా.. మిగతా మ్యాచ్‌లలో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. అంతేకాదు.. ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని ఆడేందుకు ప్రయత్నించి.. ఒకే రీతిలో వికెట్ పారేసుకున్నాడు.అంతేకాదు.. ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో ప్రతిసారి బోల్తా పడి వికెట్ సమర్పించుకున్నాడు ఇక ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో టీమిండియా కంగారూ జట్టు చేతిలో 3-1తో ఓడిపోయి.. పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. అంతేకాదు.. ఈ పరాజయం కారణంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2025 ఫైనల్ రేసు నుంచి కూడా భారత జట్టు నిష్క్రమించింది.ఇంగ్లండ్‌తో స్వదేశంలో సిరీస్లుతదుపరి ఇంగ్లండ్‌తో స్వదేశంలో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. జనవరి 22 నుంచి ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ మొదలుకానున్నాయి. ఆ తర్వాత వెంటనే చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో ఐసీసీ టోర్నీలో తలపడాల్సి ఉంది.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన తర్వాత కుటుంబంతో కలిసి కోహ్లి భారత్‌కు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మానసిక ప్రశాంతతకై ఉత్తరప్రదేశ్‌లోని బృందావనంలో ఉన్న ప్రేమానంద్ మహరాజ్ దర్శనం చేసుకున్నాడు. ఆ సమయంలో భార్య అనుష్కతో పాటు.. కుమార్తె వామిక, చిన్నారి కుమారుడు అకాయ్ కూడా కోహ్లి వెంట ఉన్నారు.అనుష్క వల్లే కోహ్లి ఇలాఈ సందర్భంగా అనుష్క ప్రేమానంద్ మహరాజ్‌తో మాట్లాడుతూ.. ‘‘గతంలో ఇక్కడికి వచ్చినపుడు నా మనసులోని కొన్ని ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్నలు వేరే వాళ్లు అడిగేశారు. ఈసారి ఇక్కడికి వచ్చినపుడు మాత్రం నా మనసులోని సందేహాలకు సమాధానం పొందాలని భావించాను. అయితే, ఈసారి కూడా వేరేవాళ్ల వల్ల నా ప్రశ్నలకు జవాబు దొరికింది. ఇప్పుడు మాకు కేవలం మీ ఆశీస్సులు ఉంటే చాలు’’ అని పేర్కొంది.ఇక విరుష్క దంపతులు తన ముందు ప్రణమిల్లడం చూసి భావోద్వేగానికి గురైన ప్రేమానంద్ మహరాజ్.. ‘‘మీరు చాలా ధైర్యవంతులు. ప్రపంచవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు సంపాదించిన తర్వాత కూడా దేవుడి పట్ల ఇంత అణకువగా ఉండటం అందరికీ సాధ్యం కాదు,.భక్తి మార్గంలో నడుస్తున్న అనుష్క ప్రభావమే కోహ్లి మీద కూడా ఉంటుందని మేము అనుకుంటూ ఉంటాం. విరాట్ కోహ్లి తన ఆటతో దేశం మొత్తానికి సంతోషాన్ని పంచుతాడు. అతడు గెలిస్తే దేశమంతా సంతోషంగా ఉంటుంది. అంతలా ప్రజలు అతడిని ప్రేమిస్తున్నారు’’ అంటూ కోహ్లిపై ప్రశంసలు కురిపించారు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఇందులో వామిక, అకాయ్‌ల ముఖాలు కనిపించకుండా విరుష్క జోడీ జాగ్రత్తపడింది. కాగా ఈ జంట ఎక్కువగా లండన్‌లోనే ఉంటున్న విషయం తెలిసిందే.చదవండి: భార్యను భర్త తదేకంగా ఎందుకు చూడొద్దు: గుత్తా జ్వాల ఫైర్Virat Kohli and Anushka Sharma with their kids visited Premanand Maharaj. ❤️- VIDEO OF THE DAY...!!! 🙏 pic.twitter.com/vn1wiD5Lfc— Mufaddal Vohra (@mufaddal_vohra) January 10, 2025 -
భార్యను.. భర్త తదేకంగా ఎందుకు చూడొద్దు?
పని గంటల గురించి ప్రముఖ కార్పొరేట్ కంపెనీ లార్సన్ అండ్ టుబ్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్(SN Subramanyan) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల బంధాన్ని తక్కువ చేసేలా ఆయన మాట్లాడిన మాటలు వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో ఎస్ఎన్ సుబ్రమణ్యన్ కామెంట్లపై భారత బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల(Jwala Gutta) ఘాటుగా స్పందించారు. ఉన్నత విద్యావంతులు కూడా మహిళల పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ చురకలు అంటించారు.కాగా.. ‘భార్యను భర్త.. భర్తను భార్య ఎంత సేపు చూడగలరు? ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండి.. ఆదివారాలు కూడా ఆఫీసుకు రావాలి. వారానికి 90 గంటలు పనిచేయాలి’ అంటూ సుబ్రమణ్యన్ చేసిన కామెంట్లపై మెజారిటీ మంది నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పెట్టుబడిదారులు వేల కోట్లు ఆర్జిస్తూ.. తరతరాలకు సంపాదించిపెట్టడానికి సామాన్యుల శ్రమను దోచుకోవడం కోసం అభివృద్ధి అనే సాకును వాడుకోవడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.భార్యను.. భర్త తదేకంగా ఎందుకు చూడొద్దు?ఈ నేపథ్యంలో గుత్తా జ్వాల సైతం సుబ్రమణ్యన్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ట్వీట్ చేశారు. ‘‘అసలు నాకొకటి అర్థం కాని విషయం ఏమిటంటే.. భర్త భార్య వైపు తదేకంగా చూస్తూ ఎందుకు ఉండిపోకూడదు? అది కూడా ఆదివారం మాత్రమే ఇలాంటివి ఉంటాయా!!బాగా చదువుకున్న వాళ్లు.. ఉన్నత పదవుల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న వాళ్ల నుంచి కూడా ఇలాంటి మాటలు వినాల్సి రావడం విచారకరం. ఇలాంటివి ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కావు. మానసిక ఆరోగ్యం, విశ్రాంతి గురించి పట్టించుకోకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని నమ్మలేకపోతున్నా.నిరాశ, భయంఅంతేకాదు స్త్రీల పట్ల వారికున్న చిన్నచూపును ఇంత బహిరంగంగా చెప్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే.. నిరాశగానూ.. భయంగానూ ఉంది’’ అని గుత్తా జ్వాల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అదే విధంగా.. ఆదివారాలు కూడా పనిచేయడం అందరికీ ఇష్టం ఉండదని.. మానసిక ప్రశాంతత ఉండాలంటే తగిన విశ్రాంతి అవసరమని నొక్కివక్కాణించారు.ఏదేమైనా బహిరంగ వేదికపైన సుబ్రమణ్యన్ లాంటి వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ విమర్శించారు.డబుల్స్ విభాగానికి వన్నె తెచ్చిన ప్లేయర్గాకాగా మహారాష్ట్రలో జన్మించిన గుత్తా జ్వాల హైదరాబాద్‌లో సెటిలయ్యారు. బాల్యం నుంచే బ్యాడ్మింటన్‌పై మక్కువ పెంచుకున్న ఆమె.. పద్నాలుగుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచారు. అశ్విని పొన్నప్పతో కలిసి అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలు అందుకున్నారు. మహిళల డబుల్స్ విభాగంలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి జోడీగా జ్వాల- అశ్విని ద్వయం నిలిచింది.ఇక 2011లో లండన్‌లో జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్స్‌లో కాంస్యం గెలిచిన గుత్తా జ్వాల.. 2010 కామన్వెల్త్ గేమ్స్ వుమెన్ డబుల్స్ విభాగంలో స్వర్ణం, 2014 గేమ్స్‌లో రజతం గెలిచారు. అదే విధంగా.. 2014లో ప్రతిష్టాత్మక ధామస్- ఉబెర్ కప్ ఈవెంట్లో కాంస్యం కైవసం చేసుకున్నారు. అంతేకాకుండా మిక్స్డ్ డబుల్స్ విభాగంలో 2009 బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ ఫైనల్లో డిజు(లండన్)తో కలిసి టైటిల్ పోరుకు అర్హత సాధించి చరిత్ర సృష్టించారు.కాగా భారత బ్యాడ్మింటన్ రంగంలో డబుల్స్ విభాగానికి వన్నె తెచ్చిన ప్లేయర్‌గా గుత్తా జ్వాల పేరొందారు. తన సేవలకు గానూ అర్జున అవార్డు పొందారు. కేవలం క్రీడా రంగంలోనే కాకుండా.. విద్య, వైద్య, మహిళా సాధికారికత, లింగ సమానత్వంపై కూడా గుత్తా జ్వాల తన గొంతును బలంగా వినిపిస్తున్నారు.నటుడితో రెండో వివాహంసహచర బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను 2005లో పెళ్లి చేసుకున్నారు గుత్తా జ్వాల. అయితే, ఆరేళ్ల తర్వాత ఈ జంట విడాకులు తీసుకుంది. అనంతరం తమిళనటుడు, డివోర్సీ విష్ణు విశాల్(Vishnu Vishal)తో ప్రేమలో పడ్డ జ్వాల.. 2021లో అతడితో వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. చదవండి: ఎట్టకేలకు మౌనం వీడిన చహల్.. అవన్నీ నిజం కాకపోవచ్చు! -
అవన్నీ నిజం కాకపోవచ్చు: ఎట్టకేలకు మౌనం వీడిన చహల్
టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. అతడి వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక వదంతులు వ్యాప్తిలోకి వచ్చాయి. భార్య ధనశ్రీ వర్మ(Dhanashree Verma)తో చహల్‌కు విభేదాలు తలెత్తాయని.. త్వరలోనే ఈ జంట విడిపోనుందనేది(Divorce Rumours) వాటి సారాంశం. అందుకు చహల్ సోషల్ మీడియా పోస్టులు ఊతమిచ్చాయి.పెళ్లి ఫొటోలు డిలీట్సతీమణి ధనశ్రీతో ఉన్న ఫొటోలన్నింటినీ యజువేంద్ర చహల్(Yuzvendra Chahal) డిలీట్ చేశాడు. పెళ్లి ఫొటోలను కూడా తన అకౌంట్ల నుంచి తీసేశాడు. అంతేకాదు.. ఈ దంపతులు సామాజిక మాధ్యమాల్లో ఒకరినొకరు అన్‌ఫాలో చేశారు. అయితే, ధనశ్రీ ఇన్‌స్టా ఖాతాలో మాత్రం చహల్‌తో దిగిన ఫొటోలు అలాగే ఉన్నాయి.కాగా ధనశ్రీ చహల్‌ను మోసం చేస్తోందంటూ అప్పట్లో రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే. మరో టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ పేరుతో ఆమె పేరును ముడిపెట్టి దారుణమైన కామెంట్లు, మీమ్స్ చేశారు కొంతమంది నెటిజన్లు. మరోవైపు.. చహల్ ఇటీవల ఓ పెళ్లికి మరో అమ్మాయితో కలిసి హాజరైనట్లు ఫొటోలు బయటకు వచ్చాయి.ఆర్జేతో డేటింగ్?అంతేకాదు.. మహ్వశ్ అనే రేడియో జాకీతో కలిసి చహల్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలు కూడా వైరల్‌గా మారాయి. వీటికి మహ్వశ్ ఫ్యామిలీ అనే ట్యాగ్ జతచేయడంతో చహల్‌తో ఆమె డేటింగ్ చేస్తుందనే వదంతులు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో చహల్ కూడా ధనశ్రీకి ద్రోహం చేశాడని.. దొందూ దొందేనంటూ ఈ జంటపై విమర్శల వర్షం కురుస్తోంది.ఈ పరిణామాలపై యజువేంద్ర చహల్ ఎట్టకేలకు మౌనం వీడాడు. ‘‘మీ ప్రేమ, మద్దతు వల్లే నేను ఈస్థాయికి చేరుకోగలిగాను. అందుకు నా అభిమానులందరికీ ఎల్లకాలం రుణపడి ఉంటాను. అయితే, ఇప్పటికి ఈ ప్రయాణం ఈ ముగిసిందా?.. లేదు.. నేను వేయాల్సిన ఓవర్లు ఇంకా మిగిలే ఉన్నాయి. నా దేశం కోసం.. నా జట్టు కోసం.. నా అభిమానుల కోసం నేను ఆడుతూనే ఉంటాను.నిజం కావచ్చు.. కాకపోవచ్చు కూడా!దేశానికి ప్రాతినిథ్యం వహించే ఆటగాడిగా ఉండటం నాకెంతో గర్వకారణం. అదే విధంగా.. నేను ఓ కొడుకుని, ఒకరికి సోదరుడిని.. అలాగే చాలా మందికి స్నేహితుడిని. ఈ మధ్యకాలంలో నా వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలపై చాలా మందికి ఆసక్తి కలిగించడం సహజమే. అయితే, కొన్ని సోషల్ మీడియా పోస్టుల వల్ల పుడుతున్న వార్తలు నిజం కావచ్చు.. కాకపోవచ్చు కూడా!అందరూ బాగుండాలిఓ కొడుకుగా.. సోదరుడిగా, స్నేహితుడిగా.. మీ అందరికీ ఓ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి వదంతులు నా కుటుంబ దుఃఖానికి కారణమవుతున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. ఎదుటివారికి అంతా మంచే జరగాలని కోరుకునేలా నా కుటుంబం నాకు విలువలు నేర్పించింది. అదే విధంగా.. అడ్డదారుల్లో వెళ్లకుండా.. అంకిత భావం, కఠిన శ్రమతోనే విజయాన్ని అందుకోవాలని చెప్పింది. నేను ఇప్పటికీ ఆ విలువలకే కట్టుబడి ఉన్నాను.ఆ దేవుడి దయ వల్ల మీ అందరి ప్రేమ, మద్దతు ఎల్లప్పుడూ నాతోనే ఉండాలి. కానీ మీ సానుభూతిని భరించలేను. లవ్ యూ ఆల్’’ అని చహల్ ఇన్‌స్టా స్టోరీలో సుదీర్ఘ పోస్ట్ షేర్ చేశాడు. అయితే, ఇందులో ఎక్కడా ధనశ్రీ పేరుగానీ, భర్త అనే పదం కానీ అతడు వాడలేదు. కాబట్టి విడాకుల విషయాన్ని చెప్పకనే చెప్పాడంటూ మరోసారి గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు.డాన్స్ టీచర్‌తో ప్రేమలో పడికాగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ కొరియోగ్రాఫర్, యూట్యూబర్ అయిన ధనశ్రీ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో ధనశ్రీ వద్ద డాన్స్ నేర్చుకునే క్రమంలో ఆమెతో ప్రేమల్లో పడ్డ చహల్.. ఇరు కుటుంబాల సమ్మతంతో 2020, డిసెంబరు 20న ఆమెను వివాహం చేసుకున్నాడు.ఇదిలా ఉంటే.. టీమిండియా తరఫున 2016లో అరంగేట్రం చేసిన చహల్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో స్పిన్నర్‌గా సత్తా చాటాడు. ఇప్పటి వరకు 72 వన్డేల్లో 121, 80 అంతర్జాతీయ టీ20లలో 96 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లోనూ 205 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. వచ్చే ఏడాది అతడు పంజాబ్ కింగ్స్‌కు ఆడనున్నాడు. చదవండి: వన్డే సిరీస్ నుంచి అతడికి విశ్రాంతి! -
విడాకులకు సిద్ధమైన టీమిండియా క్రికెటర్!
టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్(Yuzvendra Chahal ) విడాకులకు సిద్ధమయ్యాడా?.. భార్య ధనశ్రీ వర్మతో అతడు విడిపోనున్నాడా? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. చహల్ సోషల్ మీడియా అకౌంటర్లను గమనిస్తే అతడు త్వరలోనే ఈ చేదు వార్తను అభిమానులతో పంచుకోనున్నట్లు తెలుస్తోంది.హర్యానాకు చెందిన 34 ఏళ్ల చహల్ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్. 2016లో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన చహల్.. వన్డే, టీ20లలో ప్రధాన స్పిన్ బౌలర్‌గా ఎదిగాడు. తన ఇంటర్నేషనల్ కెరీర్లో ఇప్పటి వరకు 72 వన్డేలు, 80లు ఆడిన చహల్ ఆయా ఫార్మాట్లలో 121, 96 వికెట్లు తీశాడు.ఐపీఎల్ వికెట్ల వీరుడుఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లోనూ చహల్‌కు గొప్ప రికార్డు ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు ఈ టీ20 లీగ్‌లో 160 మ్యాచ్‌లు ఆడిన అతడు.. ఏకంగా 205 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఇక చహల్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. కోవిడ్ లాక్డౌన్ సమయంలో యూట్యూబర్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ(Dhanashree Verma)తో అతడు ప్రేమలో పడ్డాడు.కొరియోగ్రాఫర్‌తో వివాహంఈ క్రమంలో ఇరు కుటుంబాలను ఒప్పించిన చహల్- ధనశ్రీ డిసెంబరు 20, 2020లో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే, ధనశ్రీ పేరు మరో క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు కలిసి వినిపించడం.. గ్లామర్లోనూ ఆమె హీరోయిన్లకు ధీటుగా ఫొటోలు షేర్ చేయడం.. తదితర పరిణామాల నేపథ్యంలో విడాకుల అంశం తెరమీదకు వచ్చింది. విడాకులు తీసుకోవడమే తరువాయి అన్నట్లు వార్తలు రాగా.. చహల్- ధనశ్రీ అప్పట్లో సంయుక్తంగా విడాకుల విషయాన్ని ఖండించారు.అనంతరం ఇద్దరూ కలిసి ట్రిప్పులకు వెళ్లిన ఫొటోలు, ప్రత్యేకమైన సందర్భాలను కలిసి జరుపుకొన్న వీడియోలు షేర్ చేస్తూ.. తమ మధ్య విభేదాలు లేవని చెప్పకనే చెప్పారు. అయితే, తాజాగా మరోసారి వీరు విడిపోతున్నారనే ప్రచారం(Divorce Rumours) ఊపందుకుంది. ఇందుకు కారణం సోషల్ మీడియాలో చహల్- ధనశ్రీ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం.పెళ్లి ఫొటోలు కూడా డిలీట్ చేసిన చహల్ఇటీవల తమ వివాహ వార్షికోత్సవం(డిసెంబరు 22)న కూడా ఇద్దరూ ఎటువంటి పోస్ట్ పెట్టలేదు. అంతేకాదు.. చహల్ ధనశ్రీతో తన పెళ్లి ఫొటోలతో పాటు వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోలన్నింటినీ డిలీట్ చేశాడు. మరోవైపు.. ధనశ్రీ ఖాతాలో చహల్‌తో కలిసి ఉన్న కొన్ని ఫొటోలు ప్రస్తుతానికి అలాగే ఉన్నా అవి ప్రమోషన్లలో భాగంగా తీసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వీరి బంధం బీటలు వారిందనే సంకేతాలు వస్తున్నాయి.ఇదిలా ఉంటే.. చహల్ చివరగా టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఈ మెగా ఈవెంట్ల ఒక్క మ్యాచ్‌లోనూ చహల్ ఆడకపోయినప్పటికీ చాంపియన్‌గా నిలిచిన జట్టులో ఉన్న కారణంగా ట్రోఫీని ముద్దాడాడు. ఇక ఇటీవల జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలో చహల్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. పంజాబ్ కింగ్స్ అతడిని రూ. 18 కోట్ల మొత్తానికి అతడిని సొంతం చేసుకుంది.చదవండి: పిచ్చి పనులు మానుకోండి: రోహిత్ శర్మ ఆగ్రహం -
భావోద్వేగంతో వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ
కొత్త సంవత్సరం వచ్చేసింది. నవ వసంతాన్ని తెచ్చింది. చేదు జ్ఞాపకాలను వదిలేసి.. మధురానుభూతులను పదిలం చేసుకుంటూ ముందుకు సాగిపొమ్మంటోంది. ఇక నూతన సంవత్సరం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) 2024-25 కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత క్రికెట్ జట్టు అక్కడే కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. ఐదో టెస్టు కోసం మంగళవారమే సిడ్నీకి చేరుకుని న్యూ ఇయర్‌కి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పింది.అనుష్కతో విరాట్ఇక భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన సతీమణి అనుష్క శర్మ(Viat Kohli- Anushka Sharma)తో పాటు దేవ్‌దత్ పడిక్కల్, ప్రసిద్ కృష్ణతో కలిసి కొత్త సంవత్సర వేడులకు హాజరయ్యాడు. మరోవైపు.. యువ ఆటగాళ్లు రిషభ్ పంత్, శుబ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్ తదితరులు కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.భావోద్వేగంతో వీడ్కోలు పలికిన రోహిత్ శర్మఇదిలా ఉంటే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) 2024కు భావోద్వేగ వీడ్కోలు పలికాడు. ‘‘ఎన్నో ఎత్తు-పళ్లాలు.. అయినప్పటికీ ప్రతి ఒక్కటి గుర్తుండిపోతుంది. థాంక్యూ 2024’’ అంటూ గతేడాదికి సంబంధించిన జ్ఞాపకాలను వీడియో రూపంలో షేర్ చేశాడు.టీ20 ప్రపంచకప్ గెలిచిన సారథిగాకాగా 2024 రోహిత్ శర్మకు ఎన్నో ఆనందాలతో పాటు కొన్ని చేదు జ్ఞాపకాలను ఇచ్చింది. కెప్టెన్‌గా టీ20 ప్రపంచకప్-2024 గెలవడం రోహిత్ కెరీర్లోనే అత్యంత గొప్ప విషయం. అయితే, ఈ మెగా టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలవగానే హిట్‌మ్యాన్ అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్ అయ్యాడు.ఐపీఎల్లో మాత్రం పరాభవంఇక అంతకంటే ముందే.. అంటే ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తొలగించారు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆడిన రోహిత్ బ్యాటర్‌గా ఆకట్టుకోలేకపోయాడు. జట్టు కూడా పాయింట్ల పట్టికలో అట్టడుగన పదో స్థానంలో నిలిచి ఘోర పరాభవం చవిచూసింది. అయితే, ఆ తర్వాత ప్రపంచ కప్ గెలుపు రూపంలో రోహిత్‌కు ఊరట దక్కింది.అదొక మాయని మచ్చగాఅనంతరం.. స్వదేశంలో న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌లో టీమిండియా క్లీన్‌స్వీప్ కావడం రోహిత్ శర్మ కెప్టెన్సీ కెరీర్లోనే ఓ మాయని మచ్చగా మిగిలింది. సొంతగడ్డపై ఇంతకు మునుపెన్నడూ భారత టెస్టు జట్టు ప్రత్యర్థి చేతిలో ఇలా 3-0తో వైట్‌వాష్ కాలేదు. అలా అత్యంత చెత్త కెప్టెన్సీ రికార్డు 2024లో రోహిత్ పేరిట నమోదైంది.కుమారుడి రాకఇదిలా ఉంటే.. వ్యక్తిగత జీవితంలోనూ రోహిత్ శర్మకు 2024 మరుపురానిదిగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే.. గతేడాదే రోహిత్- రితికా జంట తమ రెండో సంతానం కుమారుడు అహాన్ శర్మకు జన్మనిచ్చారు. ఇక ఈ శుభవార్త తర్వాత ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన రోహిత్ శర్మకు అక్కడ మాత్రం గడ్డు పరిస్థితులే ఎదురయ్యాయి. బ్యాటర్‌గా, సారథిగానూ అతడు విఫలమయ్యాడు.అడిలైడ్ పింక్‌బాల్ టెస్టులో రోహిత్ సేన 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం.. బ్రిస్బేన్ టెస్టును డ్రా చేసుకున్నా.. మెల్బోర్న్లో నాలుగో టెస్టులో మాత్రం 184 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.ఇక ఆఖరిదైన సిడ్నీ టెస్టు(జనవరి 3-7)లో గెలిస్తేనే బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 2-2తో డ్రా చేసుకోగలుగుతుంది. అదే విధంగా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025 ఫైనల్ అవకాశాలను సజీవం చేసుకుంటుంది. చదవండి: అతడి కోసం పట్టుబట్టిన గంభీర్.. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు? View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45) -
పీవీ సింధు పెళ్లి.. తొలి ఫొటో వైరల్
PV Sindhu Marries Venkatta Datta Sai: భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు పెళ్లి బంధంలో అడుగుపెట్టింది. వ్యాపారవేత్త వెంకట దత్త సాయి(Venkatta Datta Sai)ని ఆదివారం ఆమె వివాహమాడింది. ఈ వేడుకకు సంబంధించిన తొలి ఫొటో సోమవారం బయటకు వచ్చింది.ఫొటో షేర్ చేసిన కేంద్ర మంత్రికేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ పీవీ సింధు- వెంకట దత్త సాయి పెళ్లి ఫొటోను షేర్ చేశారు. ‘ఉదయర్పూర్లో నిన్న సాయంత్రం.. మన బ్యాడ్మింటన్ చాంపియన్, ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు- వెంకట దత్త సాయి వివాహానికి హాజరుకావడం సంతోషంగా ఉంది.నూతన దంపతులకు శుభాకాంక్షల వెల్లువజీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టబోతున్న నూతన దంపతులకు శుభాకాంక్షలతో పాటు ఆశీర్వాదాలూ అందజేశాను’’ అని గజేంద్ర సింగ్ షెకావత్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.కాగా జీవితంలోని ప్రత్యేకమైన ఘట్టంలో సింధు- వెంకట దత్త సాయి వెండి రంగు దుస్తుల్లో తళుక్కుమన్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులతో పాటు పలువురు క్రీడా ప్రముఖులు కూడా ఈ పెళ్లికి హాజరైనట్లు సమాచారం.రాజస్తాన్‌లో పెళ్లిరాజస్తాన్లోని ఉదయ్‌పూర్‌లోని రాజకోట వంటి వేదికపై సింధు- వెంకట దత్త సాయి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కాగా వరుడు మరెవరో కాదు.. సింధుకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఇరు కుటుంబాల పెద్దల నిర్ణయం మేరకు వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక మంగళవారం(డిసెంబరు 24) సింధు- వెంకట దత్త సాయి వివాహ రిసెప్షన్ జరుగనుంది.రెండు ఒలింపిక్ పతకాలుకాగా రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన తెలుగు తేజం సింధు.. టోక్యో విశ్వక్రీడల్లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. తద్వారా భారత్ తరఫున వరుసగా రెండు ఎడిషన్లలో ఒలింపిక్ పతకాలు గెలిచిన ప్లేయర్‌గా పీవీ సింధు చరిత్ర సృష్టించింది. అయితే, ఇటీవల ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయింది.ఈ వార్త చదవండి: IPL 2025: సంజూ శాంసన్ కీలక నిర్ణయం!.. ఇకపై.. Pleased to have attended the wedding ceremony of our Badminton Champion Olympian PV Sindhu with Venkatta Datta Sai in Udaipur last evening and conveyed my wishes & blessings to the couple for their new life ahead.@Pvsindhu1 pic.twitter.com/hjMwr5m76y— Gajendra Singh Shekhawat (@gssjodhpur) December 23, 2024 -
నా పిల్లలు ఉన్నపుడు ఇలా చేస్తారా?: మండిపడ్డ కోహ్లి
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సహనం కోల్పోయాడు. తన అనుమతి లేకుండా వీడియో ఎలా తీస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలేం జరిగిందంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో భారత స్టార్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా భార్యాపిల్లలతో కలిసి ఆసీస్‌కు చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా పెర్త్, అడిలైడ్, బ్రిస్బేన్ మ్యాచ్‌లు ముగియగా.. తదుపరి భారత్- ఆస్ట్రేలియా మెల్బోర్న్లో తలపడనున్నాయి.వామిక, అకాయ్‌ల వీడియో తీశారనిఇందుకోసం కోహ్లి కుటుంబంతో కలిసి మెల్బోర్న్ వినామాశ్రయానికి చేరుకున్నాడు. అయితే, ఆ సమయంలో కొంతమంది మీడియా ప్రతినిధులు కోహ్లితో పాటు అతడి భార్య అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్‌ల వీడియో చిత్రీకరించినట్లు సమాచారం. దీంతో కోపోద్రిక్తుడైన కోహ్లి.. సదరు వ్యక్తుల దగ్గరకు వెళ్లి మరీ గట్టిగా హెచ్చరించాడు.నా పిల్లలు ఉన్నపుడు ఇలా చేస్తారా?అనంతరం మరోసారి మీడియాను ఉద్దేశించి మాట్లాడిన విరాట్ కోహ్లి.. ‘‘నా పిల్లలు ఉన్నపుడు నాకు కాస్త ప్రైవసీ ఇవ్వాలి కదా? నా అనుమతి లేకుండా వాళ్ల ఫొటోలు, వీడియోలు ఎలా తీస్తారు?’’ అని ప్రశ్నించాడు. నిజానికి.. కోహ్లి ఫ్యామిలీతో కలిసి వచ్చేసరికి ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్‌ను కొంత మంది విలేకరులు ఇంటర్వ్యూ చేస్తున్నారు.అయితే, అదే సమయంలో కోహ్లి ఎంట్రీ ఇవ్వడంతో అన్ని కెమెరాలు అతడి వైపు తిరిగాయి. ఇక పిల్లల గురించి హెచ్చరిస్తూ కోహ్లి కాస్త సీరియస్ కావడంతో.. తాము వామిక, అకాయ్‌ల ఫొటోలు, వీడియోలు తీయలేదని వారు సమాధానం ఇచ్చారట. దీంతో శాంతించిన కోహ్లి వారితో కరచాలనం చేసి అక్కడి నుంచి నిష్క్రమించినట్లు తెలుస్తోంది.పెర్త్‌లో సెంచరీ మినహాఇదిలా ఉంటే.. ఆసీస్‌తో పెర్త్ టెస్టులో గెలిచిన టీమిండియా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఓడింది. దీంతో సిరీస్ 1-1తో సమం కాగా.. బ్రిస్బేన్ టెస్టు ‘డ్రా’గా ముగిసింది. ఈ నేపథ్యంలో మెల్బోర్న్ బాక్సింగ్ డే టెస్టు(డిసెంబరు 26-30) ఇరుజట్లకు మరింత కీలకంగా మారింది. ఇక ఈ సిరీస్‌లో పెర్త్‌లో సెంచరీ చేయడం మినహా కోహ్లి పెద్దగా రాణించలేదు. ఈ క్రమంలో అతడి ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి.చదవండి: నా కుమారుడికి అవమానం జరిగింది.. అశ్విన్ తండ్రి సంచలన ఆరోపణలుIndian cricket superstar Virat Kohli has been involved in a fiery confrontation at Melbourne Airport. @theodrop has the details. https://t.co/5zYfOfGqUb #AUSvIND #7NEWS pic.twitter.com/uXqGzmMAJi— 7NEWS Melbourne (@7NewsMelbourne) December 19, 2024 -
పీవీ సింధు కాబోయే భర్త.. ఈ ఐపీఎల్ టీమ్‌తో రిలేషన్!.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట సింధుకు పెళ్లి గడియలు సమీపించాయి. వెంకట దత్తసాయి(Venkata DattaSai) అనే వ్యక్తితో ఆమె వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ విషయాన్ని పీవీ సింధు తండ్రి పీవీ రమణ స్వయంగా నిర్దారించారు.ఆసక్తికర విషయాలుఈ నేపథ్యంలో పీవీ సింధుకు కాబోయే భర్త, వరుడు వెంకట దత్తసాయి బ్యాక్‌గ్రౌండ్ ఏమిటన్న అంశం గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్తసాయి 2018లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఫ్లేమ్ యూనివర్సిటీ నుంచి బీబీఏ పట్టా అందుకున్నారు.అంతకంటే ముందు.. ఫౌండేషన్ ఆఫ్ లిబరల్ అండ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా పూర్తి చేశారు. ఇక బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డాటా సైన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్‌లో వెంకట దత్తసాయి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.ఢిల్లీ క్యాపిటల్స్తోనూఅనంతరం.. బహుళజాతి సంస్థ జేఎస్‌డబ్ల్యూ(జిందాల్ సౌత్ వెస్ట్)లో వెంకట దత్తసాయి తన కెరీర్ మొదలుపెట్టారు. అక్కడ సమ్మర్ ఇంటర్న్‌గా, ఇన్హౌజ్గా కన్సల్టెంట్‌గా పనిచేశారు. అయితే, తన విధుల్లో భాగంగా జేఎస్‌డబ్ల్యూ గ్రూపునకు చెందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తోనూ ఆయన కలిసి పనిచేసినట్లు సమాచారం.లింక్డిన్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల మేరకు.. ‘‘ఐపీఎల్ జట్టు నిర్వహణతో పోలిస్తే నా బీబీఏ డిగ్రీ తక్కువగానే అనిపించవచ్చు. అయితే, ఈ రెండింటి నుంచి నేను కావాల్సినంత విజ్ఞానం పొందాను’’ అని వెంకట దత్తసాయి రాసుకొచ్చారు.కృతజ్ఞతలు సింధుఇక గతంలోనూ వెంకట దత్తసాయి, పీవి సింధుకు లింక్డిన్లో రిప్లై ఇచ్చిన తీరును కూడా నెటిజన్లు హైలైట్ చేస్తున్నారు. దత్తసాయి తండ్రిని ఉద్దేశించి.. ‘‘లింక్డిన్‌లోకి స్వాగతం అంకుల్. ఈ ప్లాట్‌ఫామ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి’’ అని పీవీ సింధు పేర్కొనగా.. ‘‘నాన్నను స్వాగతించినందుకు కృతజ్ఞతలు సింధు’’ అని వెంకట దత్తసాయి పేర్కొన్నారు. ఉదయ్‌పూర్ వేదికగాకాగా వెంకట దత్తసాయి ప్రస్తుతం ‘పొసిడెక్స్ టెక్నాలజీస్’ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక పీవీ సింధు వివాహానికి రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ వేదిక కానుంది. డిసెంబరు 22న పెళ్లి జరుగనుంది. రెండురోజుల తర్వాత హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఇక సింధు- వెంకట దత్తసాయి కుటుంబాలకు ఇది వరకే పరిచయం ఉంది. కాగా సింధు 2016 రియో విశ్వ క్రీడల్లో సిల్వర్ మెడల్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
భార్య అంటే శ్రీకాంత్‌కు ఎంత ప్రేమో!.. చెప్పినట్లే విన్నాడు! వీడియో
Srikanth Kidambi - Shravya Varma Wedding Reception: భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్ వన్ ర్యాంకర్ కిదాంబి శ్రీకాంత్ పెళ్లిపీటలెక్కాడు. టాలీవుడ్ సెలబ్రిటీ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ మెడలో మూడు ముళ్లు వేసి వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. హైదరాబాద్‌లో శనివారం అంగరంగ వైభవంగా శ్రీకాంత్- శ్రావ్యల పెళ్లి జరిగింది.రిసెప్షన్లో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునబ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్‌తో పాటు పలువురు క్రీడా ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకాగా.. శ్రావ్య తరఫున టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, కీర్తి సురేశ్ తదతర స్టార్లు వీరి పెళ్లిలో సందడి చేశారు. ఇక ఆదివారం నిర్వహించిన వెడ్డింగ్ రిసెప్షన్ పార్టీలో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున తదితర విశిష్ట అతిథులు తళుక్కుమన్నారు.కాగా కొంతకాలంగా ప్రేమలో ఉన్న శ్రీకాంత్- శ్రావ్య పెద్దల అంగీకారంతో ఒక్కటైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీరి అన్యోన్య బంధానికి అద్దంపట్టేలా ఉన్న ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రిసెప్షన్ వేడుకలో శ్రావ్య భారీ లెహంగా ధరించిగా.. శ్రీకాంత్ వైట్సూట్లో మెరిసిపోయాడు.నాగ్ సర్ వచ్చారు.. త్వరగా రా!అయితే, పార్టీ మొదలుకావడానికి ముందే నాగార్జున హాల్లో అడుగుపెట్టాడు. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో శ్రావ్యకు ఫోన్ చేశాడు. దీంతో కంగారూపడిన శ్రావ్య.. ‘‘నాగ్ సర్ వచ్చారు.. త్వరగా రా’’అంటూ భర్త శ్రీకాంత్‌కు ఫోన్ చేసింది. వెంటనే శ్రీకాంత్ శ్రావ్యతో కలిసి లిఫ్ట్‌లోకి చేరుకున్నాడు.‘‘నేను వేగంగా వెళ్లాలి కాబట్టి.. నువ్వు నా లెహంగాను పట్టుకోవాలి’’ అంటూ శ్రావ్య భర్తకు ప్రేమపూర్వకంగా ఆర్డర్ వేసింది. అందుకే ఎంచక్కా తలూపిన శ్రీకాంత్ ఆమె చెప్పినట్లుగానే లెహంగాను పట్టుకుని.. భార్య వెనకాలే పరిగెత్తాడు. ఇద్దరూ కలిసి నాగార్జున దగ్గరకు వెళ్లగా.. కొత్త జంటను ఆశీర్వదించాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు శ్రీకాంత్‌కు భార్య అంటే ఎంత ప్రేమో.. భయం- భక్తీ రెండూ ఉన్నాయంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. థామస్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడుకాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీకాంత్ నమ్మాల్వార్ కిదాంబి 1993, ఫిబ్రవరి 7న జన్మించాడు. తొలుత కామన్వెల్త్ యూత్ గేమ్స్-2011లో మెన్స్ డబుల్స్ విభాగంలో కాంస్యం గెలిచిన శ్రీకాంత్.. మిక్స్డ్ డబుల్స్‌లో రజత పతకం కైవసం చేసుకున్నాడు.అదే విధంగా.. 2013లో థాయ్‌లాండ్ ఓపెనర్ గ్రాండ్ పిక్స్ గోల్డ్ టైటిల్‌ను శ్రీకాంత్‌ను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. చారిత్రాత్మక థామస్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు కూడా! ఇక ప్రపంచ నంబర్ వన్ షట్లర్‌గా ఎదిగిన శ్రీకాంత్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీ ,అర్జున అవార్డులతో సన్మానించింది.చదవండి: ఓటమి అంచుల్లో ఉన్నా... ఆందోళన చెందకుండా! రూ. 40 కోట్ల 55 లక్షల ప్రైజ్‌మనీ View this post on Instagram A post shared by Shravya Varma & Srikanth Kidambi (@weshranth) -
అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ కోచ్ కొడుకు.. స్త్రీగా మారినందు వల్ల..
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కొడుకు ఆర్యన్ బంగర్ అమ్మాయిగా మారిపోయాడు. తండ్రి బాటలోనే క్రికెటర్‌గా అడుగులు వేసిన అతడు.. తన శరీర ధర్మానికి అనుగుణంగా అనయగా మార్పు చెందాడు. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన అనయ బంగర్.. స్త్రీగా మార్పు చెందడంలో తన ప్రయాణం సాగిన తీరును ప్రస్తావిస్తూ తాజాగా వీడియో షేర్ చేసింది.అంతులేని సంతోషాన్ని పొందాను‘‘శారీరకంగా బలాన్ని కోల్పోయినా.. అంతులేని సంతోషాన్ని పొందాను. నా శరీరం మారిపోయింది. అసంతృప్తి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇంకా నేను చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. అయితే, వేసే ప్రతీ అడుగు నాకు మరింతగా నచ్చుతోంది’’ అని అనయ తన సంతోషాన్ని పంచుకుంది.టీమిండియా బ్యాటింగ్ కోచ్గానూకాగా మహారాష్ట్రకు చెందిన సంజయ్ బంగర్ కుడిచేతి వాటం బ్యాటర్. అదే విధంగా.. రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ కూడా. 2001- 2004 మధ్య టీమిండియా తరఫున ఈ ఆల్‌రౌండర్ 12 టెస్టులు, 15 వన్డేలు ఆడి.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 470, 180 పరుగులు సాధించాడు. అలాగే.. టెస్టుల్లో ఏడు, వన్డేల్లో ఏడు వికెట్లు తీశాడు.టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గానూ పనిచేసిన 52 ఏళ్ల సంజయ్ బంగర్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. కశ్మీరతో అతడికి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. అందులో పెద్దవాడైన ఆర్యన్ బంగర్ ఇప్పుడు అనయ బంగర్గా మారాడు. కాగా అనయ కూడా క్రికెటర్‌గా ఎదగాలనే ఆశయంతో ఉంది.గతంలో భారత దేశీ టోర్నీల్లోనూ ఆడిన అనయ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉంటున్నట్లు సమాచారం. ట్రాన్స్ వుమన్కు క్రికెట్ ఆడే అవకాశం లేనందు వల్ల తన కలకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని అనయ ఇటీవల ఆవేదన చెందుతూ సోషల్ మీడియాలో ఓ లేఖ షేర్ చేసింది.మా నాన్న బాటలో నడవాలనున్నాను.. కానీ‘‘నా ప్రేమ.. నా కల.. నా ఆశయం.. నా భవిష్యత్తు.. అంతా క్రికెటే. మా నాన్న టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడమే కాదు.. కోచ్‌గానూ పనిచేశాడు. ఆయనను చూస్తూ పెరిగిన నేను ఆయన అడుగుజాడల్లో నడవాలని భావించాను. క్రికెట్లో నా నైపుణ్యాలను పెంచుకునేందుకు కృషి చేశాను.కానీ అర్ధంతరంగా ఆటను ఇలా వదిలేయాల్సి వస్తుందని అనుకోలేదు. అయితే, ఈ చేదు నిజాన్ని అంగీకరించకతప్పదు. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేసుకున్న తర్వాత ట్రాన్స్ వుమన్‌గా నాలో చాలా మార్పులు వచ్చాయి.కండబలం తగ్గిందినా శరీరం మొత్తం పూర్తిగా మారిపోయింది. నా కండబలం తగ్గింది. శక్తిని కోల్పోయాను. అథ్లెట్లకు ఉండాల్సిన పవర్ మెల్లమెల్లగా తగ్గింది. ట్రాన్స్వుమన్కు కూడా క్రికెట్ ఆడే అవకాశాలు ఇవ్వాలి’’ అని అనయ ఉద్వేగపూరిత నోట్ షేర్ చేసింది. కాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి నిబంధనల ప్రకారం.. ట్రాన్స్జెండర్లకు ఇంటర్నేషనల్ స్థాయిలో మహిళా క్రికెట్ ఆడే వీలు లేదు. 2023లో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. మహిళా క్రికెట్ భవితవ్యం, వుమెన్ ప్లేయర్ల భద్రత, సమగ్రత దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.చదవండి: Ind vs SA: సూర్య చేసిన అతిపెద్ద తప్పు అదే.. అతడిని ఎందుకు ఆడిస్తున్నట్లు మరి? View this post on Instagram A post shared by Anaya Bangar (@anayabangar) View this post on Instagram A post shared by Anaya Bangar (@anayabangar) -
తండ్రైన సన్‌రైజర్స్ విధ్వంసకర వీరుడు..
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్, ఎస్ఆర్హెచ్ విధ్వంసకర వీరుడు ట్రావిస్ హెడ్ రెండో సారి తండ్రయ్యాడు. అతడి భార్య జెస్సికా సోమవారం పండింటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈ శుభవార్తను జెస్సికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. తన భర్త హెడ్, కుమార్తె మీలా, కొడుకుతో కలిసి ఉన్న ఫోటోలను జెస్సికా షేర్ చేసింది.హెడ్-జెస్సికా జోడీ తమ కుమారుడికి హారిసన్ జార్జ్ అని నామకరణం చేశారు. "వెల్కమ్ టూ వరల్డ్ హారిసన్ జార్జ్ హెడ్" అంటూ ఆమె క్యాప్షన్‌గా రాసుకొచ్చింది. కాగా వీరిద్దిరికి తొలి సంతానంగా 2022 ఏడాదిలో మీలా జన్మించింది.బీజీటీతో రీఎంట్రీ?ఇక గత కొంతకాలంగా అవిరామంగా క్రికెట్ ఆడుతున్న హెడ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. తన కుటుంబంతో సమయం గడిపేందుకు పాకిస్తాన్‌తో వైట్‌బాల్ సిరీస్‌లకు హెడ్ దూరమయ్యాడు. అతడు తిరిగి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. నవంబర్ 22న పెర్త్‌లో ఈ బీజీటీ ట్రోఫీ ప్రారంభం కానుంది.ఎస్ఆర్హెచ్ రిటైన్..ఇక ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన ట్రావిస్ హెడ్ విధ్వంసకర ప్రదర్శనలు చేశాడు. ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్‌లు ఆడిన హెడ్.. 191.55 స్ట్రైక్ రేటుతో 567 పరుగులు చేశాడు. దీంతో హెడ్‌ను ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకుంది. View this post on Instagram A post shared by JESSICA DAVIES (@jess_head) -
Akaay: కోహ్లి బర్త్‌డే.. తొలిసారి కుమారుడి ఫొటో షేర్ చేసిన అనుష్క
క్రికెట్ కింగ్, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పుట్టినరోజు నేడు(నవంబరు 5). ఈ సందర్భంగా ఈ రన్మెషీన్కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి సహా యువరాజ్ సింగ్, సురేశ్ రైనా తదితరులు కోహ్లికి విషెస్ తెలిపారు. అభిమానులు సైతం తమ ఆరాధ్య క్రికెటర్‌ను విష్ చేస్తూ కోహ్లి పేరును ట్రెండ్ చేస్తున్నారు.ఈ క్రమంలో విరాట్ ఫ్యాన్స్‌కు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది అతడి సతీమణి అనుష్క శర్మ. తమ ఇద్దరు పిల్లలు వామిక, అకాయ్‌లతో కోహ్లి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో కోహ్లి అకాయ్‌ను ఎత్తుకోవడంతో పాటు తన గారాలపట్టి వామికను ఒంటిచేత్తో మోస్తూ కనిపించాడు. అయితే, అనుష్క ఇక్కడో ట్విస్ట్ ఇచ్చారు.తమ చిన్నారుల ముఖాలు కనిపించకుండా లవ్ సింబల్స్‌తో కవర్ చేశారు. ఏదేమైనా తొలిసారి వామిక, అకాయ్‌లను ఈమాత్రం చూపించినందుకు ‘థాంక్స్ వదినా’ అంటూ కోహ్లి ఫ్యాన్స్ ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కాగా ఇదివరకు వామిక ఫొటోలను అడపాదడపా షేర్ చేసినా.. అకాయ్‌కు సంబంధించి మాత్రం ఇదే తొలి ఫొటో. కాగా రికార్డుల రారాజు విరాట్ కోహ్లి నవంబరు 5, 1988లో ఢిల్లీలో జన్మించాడు. అతడి తండ్రి ప్రేమ్ కోహ్లి క్రిమినల్ లాయర్. తల్లి సరోజ్ గృహిణి. కోహ్లి తోబుట్టువులు అన్న వికాస్ కోహ్లి, అక్క భావనా కోహ్లి ధింగ్రా ఉన్నారు.కెప్టెన్‌గానూ సేవలు2008లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు కోహ్లి. జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగి కెప్టెన్‌గానూ సేవలు అందించాడు. ఇక వన్డేల్లో అత్యధికంగా 50 సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా కోహ్లి వరల్డ్ రికార్డు సాధించాడు కోహ్లి. సమకాలీన క్రికెటర్లలో ఎవరికీ సాధ్యం కాని ఘనతలెన్నో సాధించాడు.ఇప్పటి వరకు టీమిండియా తరపున 118 టెస్టులు, 295 వన్డేలు, 125 టీ20లు ఆడిన కోహ్లి 27,134 పరుగులు చేశాడు. ఇందులో 80 సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా.. వన్డే వరల్డ్‌కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013, టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన జట్లలో కోహ్లి సభ్యుడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్న కోహ్లి తదుపరి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు.బాలీవుడ్ హీరోయిన్‌తో పెళ్లిఇక వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను కోహ్లి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటలీలో 2017, డిసెంబరు 11న ఈ జంట వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. విరుష్క జోడీకి తొలి సంతానంగా 2021లో కూతురు వామిక జన్మించగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమారుడు అకాయ్‌కు ఈ జంట జన్మనిచ్చింది. చదవండి: బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. ముందుగానే ఆస్ట్రేలియాకు ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు? View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) -
భార్యతో విడాకులు.. ‘మిస్టరీ గర్ల్’తో శిఖర్ ధావన్! వీడియో వైరల్
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ వార్తల్లోకి వచ్చాడు. ముంబై విమానాశ్రయంలో ‘మిస్టరీ గర్ల్’తో కలిసి అతడు కెమెరాలకు చిక్కడమే ఇందుకు కారణం. కాగా భారత క్రికెట్ జట్టు ఓపెనర్‌గా అద్భుత రికార్డు కలిగి ఉన్న శిఖర్ ధావన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.శుబ్‌మన్ గిల్ రాకతోఐసీసీ టోర్నీల్లో నిలకడగా రాణించి అభిమానులను అలరించిన ధావన్.. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో కలిసి 269 మ్యాచ్‌లు ఆడి 10867 పరుగులు చేశాడు. ఇందులో 24 శతకాలు.. 44 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే, శుబ్‌మన్ గిల్ రాకతో గబ్బర్ కెరీర్ నెమ్మదించింది. ఒకవైపు తన ఫామ్‌లేమి.. మరోవైపు గిల్ అద్భుత ఆట తీరు కనబరచడంతో సెలక్టర్లు ధావన్‌ను పక్కనపెట్టారు.ఈ క్రమంలో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా గిల్ పాతుకుపోవడమే కాదు.. ఏకంగా టీమిండియా భవిష్య కెప్టెన్ అనేంతగా దూసుకుపోయాడు. ఈ నేపథ్యంలో గత రెండేళ్లుగా అవకాశాలు కరువైన శిఖర్ ధావన్ ఆగష్టులో రిటైర్మెంట్ ప్రకటించాడు.ఆయేషా ముఖర్జీతో వివాహంఇక ధావన్ వ్యక్తిగత విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీని పెళ్లాడాడు. అప్పటికే ఆమెకు మొదటి భర్తతో ఇద్దరు ఆడపిల్లలు జన్మించగా.. వారిని కూడా తన కూతుళ్లుగానే ధావన్ స్వీకరించాడు. ఇక ఆయేషాతో ధావన్‌కు ఒక కుమారుడు కలిగాడు. అతడికి జొరావర్గా నామకరణం చేశారు.భార్యతో విడాకులు.. కుమారుడు దూరంధావన్- ఆయేషా ఎంతో అన్యోన్యంగా కనిపించేవారు. అయితే, అభిప్రాయ భేదాలు తారస్థాయికి చేరడంతో 2023లో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో జొరావర్‌ను తీసుకుని ఆయేషా ఆస్ట్రేలియాకు వెళ్లిపోయింది. అంతేకాదు.. తన కుమారుడితో మాట్లాడేందుకు కూడా ఆమె ఒప్పుకోవడం లేదని.. కొడుకును తనకు పూర్తిగా దూరం చేస్తోందని ధావన్ సోషల్ మీడియా పోస్టుల్లో పరోక్షంగా వెల్లడించాడు.ఆ అమ్మాయి ఎవరు?ఈ క్రమంలో ధావన్ తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో ఓ అమ్మాయితో కలిసి కనిపించడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇద్దరూ కలిసి ఒకే కారులో రాగా.. ఆ అమ్మాయి మాత్రం ధావన్‌తో కలిసి ఒకే ఫ్రేములో కెమెరా కళ్లకు చిక్కకుండా పక్కకు వెళ్లిపోయింది. అయితే, కాసేపటి తర్వాత ఇద్దరూ కలిసి విమానాశ్రయంలోకి వెళ్లిపోయారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో గబ్బర్ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరి జంట ముచ్చటగా ఉందని.. ఆ అమ్మాయి ఎవరోగానీ ధావన్ జీవితంలోకి వస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు. కాగా ధావన్ బాలీవుడ్‌లోనూ తన అదృష్టం పరీక్షించుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో ఆమె మోడల్ లేదంటే నటి అయి ఉంటుందని.. ఇద్దరూ కలిసి షూటింగ్‌కు వెళ్తున్నారేమోనంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. గబ్బర్ నోరు విప్పితే కానీ.. అసలు విషయం బయటకు రాదు మరి!చదవండి: IPL 2025: మెగా వేలం ముహూర్తం ఖరారు! ఇప్పటికి రూ. రూ. 550.5 కోట్లు.. ఇక View this post on Instagram A post shared by HT City (@htcity) -
IND vs SA: దక్షిణాఫ్రికాకు చేరుకున్న టీమిండియా.. వీడియో వైరల్
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా ఇప్పుడు మరో కఠిన సవాల్‌కు సిద్దమైంది. నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు సోమవారం సఫారీ గడ్డపై అడుగుపెట్టింది. డర్బన్‌కు చేరుకున్న భారత జట్టుకు సౌతాఫ్రికా క్రికెట్ ఆధికారులు ఘన స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్‌లో షేర్ చేసింది. కాగా ఈ సిరీస్‌లో భారత జట్టు ప్రధాన కోచ్‌గా నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ లక్ష్మణ్ వ్యహరించనున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం సిద్దమవుతుండడంతో రెగ్యూలర్ హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌కు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. నవంబర్ 8న డర్బన్ వేదికగా జరగనున్న తొలి టీ20 ఈ సిరీస్ ప్రారంభం కానుంది.అద్భుత ఫామ్‌లో టీమిండియా..ఇక ఈ ఏడాదిలో టీ20ల్లో భారత్ క్రికెట్ జట్టు అదరగొడుతోంది. 2024 ఏడాదిలో 22 టీ20లు ఆడిన టీమిండియా కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓటమి చవిచూసింది. కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత జట్టు దూసుకుపోతుంది. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై కూడా అదే జోరును కనబరచాలని యంగ్ ఇండియా ఉవ్విళ్లూరుతోంది.భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్. వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వ్యాషాక్, అవేష్ ఖాన్, యశ్ దయాల్దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, డోనోవన్ ఫెర్రీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, పాట్రిక్ క్రూగర్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్లాలీ మ్పోంగ్వానా, న్కాబా పీటర్, ర్యాన్ సిమిప్లాన్, ర్యాన్ సిమిప్లామ్టన్, ట్రిస్టన్ స్టబ్స్చదవండి: IPL 2025: రిషబ్ పంత్‌కు రూ. 50 కోట్లు!? Touchdown Durban 🛬🇿🇦How good is #TeamIndia's knowledge of their next destination 🤔#SAvIND pic.twitter.com/m4YjikAw6Y— BCCI (@BCCI) November 4, 2024 -
‘గర్ల్‌ఫ్రెండ్’తో లండన్‌లో టీమిండియా ఓపెనర్.. ఫొటోలు వైరల్
-
ప్రాణ స్నేహితుడు, నా ప్రపంచం: సూర్య భార్య భావోద్వేగం
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 34వ వసంతంలో అడుగుపెట్టాడు. అతడి పుట్టినరోజు సందర్భంగా స్నేహితులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి నూతన చైర్మన్‌గా ఎన్నికైన బీసీసీఐ కార్యదర్శి జై షా, మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తదితరులు సూర్యను విష్ చేశారు.నా ప్రాణ స్నేహితుడు, నా ప్రపంచంఇక సూర్య భార్య దేవిశా శెట్టి తన మనసులోని భావాలు వెల్లడిస్తూ.. భావోద్వేగపూరిత నోట్‌తో హ్యాపీ బర్త్‌డే చెప్పింది. ‘‘నా ప్రాణ స్నేహితుడు, భర్త, ప్రేమికుడు.. నా ప్రపంచం.. నా జీవితంలో నేను తీసుకున్న సరైన నిర్ణయానికి నిదర్శనం.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ జీవితంలో నా కోసం కేటాయిస్తున్న ప్రతి ఒక్క రోజుకు నేను రుణపడి ఉంటా!ఈ ప్రపంచాన్ని నాకోసం అందంగా మలిచావు. అసలు నువ్వు లేకుండా నేను ఒక్క పనైనా చేయగలనా? ఇప్పుడూ.. ఎల్లప్పుడూ.. నిన్ను ప్రేమిస్తూనే ఉంటా’’ అంటూ భర్తపై ప్రేమను చాటుకుంది. ఈ సందర్భంగా సూర్యతో దిగిన ఫొటోలను దేవిశా షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక భార్య షేర్ చేసిన పోస్టుకు బదులుగా.. సుకూన్(శాంతి) అంటూ సూర్య బదులిచ్చాడు. కాగా కాలేజీలో తన జూనియర్ అయిన దేవిశాను ప్రేమించిన సూర్య.. పెద్దలను ఒప్పించి 2016, జూలై 7న ఆమెను పెళ్లి చేసుకున్నాడు.నాలుగు టీ20 సెంచరీలుఇక సూర్య కెరీర్ విషయానికొస్తే... టీమిండియా తరఫున ఇప్పటి వరకు 109 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్.. 3213 పరుగులు చేశాడు. అత్యధికంగా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో నాలుగు సెంచరీలు నమోదు చేశాడు. పొట్టి ఫార్మాట్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా ఎదిగి సత్తా చాటాడు. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.టీమిండియా పూర్తిస్థాయి సారథిగాఈ నేపథ్యంలో రోహిత్ శర్మ స్థానంలో సూర్య ఇటీవలే భారత టీ2 జట్టు సారథిగా నియమితుడయ్యాడు. శ్రీలంక పర్యటన సందర్భంగా పూర్తిస్థాయి కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టి.. టీమిండియాకు 3-0తో క్లీన్‌స్వీప్ విజయం అందించాడు. ప్రస్తుతం గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న సూర్య.. అక్టోబరులో బంగ్లాదేశ్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.చదవండి: 'అతడు ఆటను గౌరవించడు.. జట్టులో చోటు దండగ' View this post on Instagram A post shared by Devisha Suryakumar Yadav (@devishashetty_) -
నా భార్య వల్లే ఇలా: శుభవార్త చెప్పిన క్రికెటర్
ఐర్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ సిమ్రన్‌జిత్ సింగ్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. కాలేయ మార్పిడి విజయవంతంగా జరిగిందని.. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు వెల్లడించాడు. అదృష్టవశాత్తూ తన భార్యే దాతగా మారిందని.. ఆమె మంచి మనసు, అభిమానుల ప్రార్థన వల్లే ప్రాణాలతో బయటపడ్డాడని కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.పంజాబ్‌కు ఆడిన సిమికాగా సిమ్రన్‌జిత్ సింగ్ భారత్‌లోని పంజాబ్‌లో గల మొహాలిలో జన్మించాడు. సిమి సింగ్‌గా ప్రసిద్ధి చెందిన అతడు భారత దేశవాళీ క్రికెట్లో అండర్-14, అండర్-17 స్థాయిలో పంజాబ్ తరఫున ఆడాడు. కానీ ఈ లెగ్ స్పిన్ ఆల్‌రౌండర్‌కు భారత అండర్-19 జట్టులో మాత్రం స్థానం దక్కలేదు. దీంతో మళ్లీ చదువుపై దృష్టి సారించిన సిమి.. 2005లో ఐర్లాండ్‌కు వెళ్లిపోయాడు. అక్కడే హోటల్ మేనేజ్మెంట్ చేశాడు.అవకాశాలు లేక ఐర్లాండ్‌కు వెళ్లిఅయితే, క్రికెట్‌పై మక్కువ తగ్గకపోవడంతో 2006లో డబ్లిన్‌లో ప్రొఫెషనల్ క్రికెటర్ మారిన అతడు.. 2017లో ఐర్లాండ్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టాడు. ప్రతిభను చాటుకుంటూ జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన 37 ఏళ్ల సిమి.. మొత్తంగా ఇప్పటి వరకు 35 వన్డేల్లో 39, 53 టీ20లలో 44 వికెట్లు తీశాడు. అంతేకాదు.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో సెంచరీ కొట్టి సంచలనం సృష్టించాడు.సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్గాఈ క్రమంలో... 2020లో సిమికి ఐర్లాండ్ సెంట్రల్ కాంట్రాక్టు దక్కింది. కాగా సిమి సింగ్ లివర్ పూర్తిగా పాడైపోయినట్లు అతడి కుటుంబ సభ్యులు ఇటీవల మీడియాకు తెలిపారు. అతడిని ఇండియాకు తీసుకువచ్చామని.. గురుగ్రామ్‌లో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా సిమి సింగ్ స్వయంగా తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ అందించాడు.నా భార్య వల్లే ఇదంతా‘‘అందరికీ హాయ్.. నా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ విజయవంతంగా పూర్తైంది. 12 గంటల పాటు శస్త్ర చికిత్స జరిగింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. తప్పుడు యాంటి బయాటిక్స్, స్టెరాయిడ్స్‌ను కొందరు నాకు ప్రిస్కైబ్ చేశారు. వాటి వల్లే లివర్ పాడయ్యే దుస్థితి తలెత్తింది. నా భార్యే నాకు కాలేయ దాత కావడం నిజంగా నా అదృష్టం. నాకోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా’’ అని సిమి సింగ్ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.నిపుణులు సూచించిన మందులనే వాడాలని తన ఫాలోవర్లను అప్రమత్తం చేశాడు.చదవండి: Ind vs Aus: ఆ ముగ్గురు బ్యాటర్లు ప్రమాదకరం: ఆసీస్ బౌలర్ -
వాళ్లు ఎలా భరిస్తున్నారో భయ్యా!.. రోహిత్ శర్మ వీడియో వైరల్
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తనలోని మరో కోణాన్ని అభిమానులతో పంచుకున్నాడు. వ్యాయామ సమయంలో 99 శాతం తాను కష్టపడతానని.. అయితే, మిగిలిన ఒక్క శాతం మాత్రం తన చేష్టలతో సహచరులను ఇబ్బంది పెడతానన్నట్లుగా సరదా వీడియో షేర్ చేశాడు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన తర్వాత.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రోహిత్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.నలభై రోజులకు పైగా విరామంఈ క్రమంలో సుదీర్ఘ విరామం అనంతరం శ్రీలంక పర్యటన సందర్భంగా వన్డే సిరీస్ ఆడిన హిట్‌మ్యాన్.. ప్రస్తుతం సెలవులో ఉన్నాడు. ఎల్లప్పుడూ వరుస సిరీస్‌లతో బిజీగా ఉండే టీమిండియాకు దాదాపు నలభై రోజులకు పైగా విశ్రాంతి దొరకడంతో కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాడు. అయితే, సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు షెడ్యూల్ ఖరారు కావడంతో రీఎంట్రీ ఇచ్చేందుకు రోహిత్ సిద్ధమవుతున్నాడు.ఈ నేపథ్యంలో ఇప్పటికే జిమ్‌లో తీవ్రంగా చెమటోడుస్తున్న రోహిత్ శర్మ... ఫిట్నెస్ మరింత మెరుగుపరచుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా ‘వన్ పర్సెంట్’ ట్రెండ్‌కు అనుగుణంగా తన వీడియోను షేర్ చేశాడు. స్నేహితులను ఏడిపించిన రోహిత్ఇందులో రోహిత్ వర్కౌట్లు చేస్తున్న సమయంలో ఎంత శ్రద్ధగా ఉంటాడో.. కాస్త విరామం దొరకగానే తన ట్రెయినీలు, స్నేహితులను టీజ్ చేయడం కనిపిస్తుంది. తన సరదా చేష్టలతో వారిని ఉడికిస్తున్నట్లుగా ఆ దృశ్యాలు ఉన్నాయి.ఈ వీడియో రోహిత్ శర్మ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. షేర్ చేసిన గంటల్లోనే మిలియన్ల కొద్దీ లైకులతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో.. ‘‘వాళ్లు ఎలా భరిస్తున్నారో భయ్యా!.. నిజంగా నువ్వింకా చిన్నపిల్లాడిలానే ఫ్రెండ్స్‌ను ఆటపట్టిస్తున్నావు’’ అంటూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు. వారి రీ ఎంట్రీ కూడా..కాగా సెప్టెంబరు 19న బంగ్లాదేశ్‌తో టీమిండియా తొలి టెస్టు మొదలుకానుంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించింది. అయితే, కెప్టెన్ రోహిత్‌కు డిప్యూటీగా ఎవరు ఉంటారన్నది మాత్రం చెప్పలేదు. ఇక ఈ మ్యాచ్‌తోనే విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నారు. మిగతా వాళ్లలో చాలా మంది దులిప్ ట్రోఫీ-2024లో ఆడి ఫిట్నెస్ నిరూపించుకున్నారు.చదవండి: హిట్‌మ్యాన్ మరో 10 పరుగులు చేస్తే..! View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45) -
అగస్త్యను హార్దిక్ ఇంటికి పంపిన నటాషా.. ఫొటో వైరల్!
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇప్పట్లో జట్టులోకి వచ్చే అవకాశం లేదు. మరో నెల రోజుల పాటు అతడికి విశ్రాంతి లభించనుంది. దీంతో విరామ సమయాన్ని పర్యాటక ప్రదేశాలు సందర్శిస్తూ మనోల్లాసం పొందుతున్నాడు హార్దిక్. ఇక ఇప్పుడు కుమారుడు అగస్త్య కూడా తన దగ్గరికి వచ్చేయడంతో మరింత ఖుషీ ఖుషీగా గడుపుతున్నట్లు తెలుస్తోంది.తల్లితో సెర్బియా వెళ్లిన అగస్త్యకాగా హార్దిక్ పాండ్యా ఇటీవలే తన భార్య, సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్ నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. సామరస్యపూర్వకంగానే తాము విడిపోతున్నామని.. అగస్త్యకు తల్లిదండ్రులుగా మాత్రం కొనసాగుతామని ఇద్దరూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అనంతరం కుమారుడిని తీసుకుని నటాషా పుట్టింటికి వెళ్లిపోయింది.అయితే, తాజాగా అగస్త్య తిరిగి తన తండ్రి దగ్గరకు వచ్చినట్లు తెలుస్తోంది. సెర్బియా నుంచి ఈ చిన్నారి ముంబైకి చేరుకున్నాడు. హార్దిక్ వదిన, క్రికెటర్ కృనాల్ పాండ్యా భార్య పాంఖురి శర్మ షేర్ చేసిన ఫొటోల ద్వారా ఈ విషయం వెల్లడైంది. తన కుమారుడు కవిర్‌తో కలిసి అగస్త్యకు కథలు చెప్తున్నానంటూ పాంఖురి ఇన్‌స్టాలో స్టోరీ షేర్ చేసింది.కెరీర్ పరంగానూ ఒడిదొడుకులుకాగా టీమిండియా టీ20 ప్రపంచకప్-2024లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా... జట్టును చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ అనంతరం అతడే సారథి అవుతాడని విశ్లేషకులు భావించారు. అయితే అనూహ్యం అతడిని వైస్ కెప్టెన్సీ పదవి నుంచి తొలగించింది బీసీసీఐ. శ్రీలంక పర్యటన -2024 సందర్భంగా సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ప్రకటించడంతో పాటు.. శుబ్‌మన్ గిల్‌ను అతడికి డిప్యూటీగా నియమించింది. ఫిట్నెస్ కారణాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. ఇదిలా ఉంటే.. పనిభారాన్ని తగ్గించుకునే క్రమంలో హార్దిక్ పాండ్యా కేవలం వన్డే, టీ20లకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. శ్రీలంక నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతడు ఆటకు దూరమయ్యాడు. ఇక రోహిత్ సేన సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై టెస్టు సిరీస్ ఆడనుండగా.. అక్టోబరు 6 నుంచి ఆరంభమయ్యే టీ20 సిరీస్ సందర్భంగా హార్దిక్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. -
ప్రేమంటే నమ్మకం: హార్దిక్ మాజీ భార్య నటాషా పోస్ట్ వైరల్
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ తర్వాత విరామం తీసుకున్న ఈ ఆల్‌రౌండర్ సెలవులను పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. తనకు తాను సమయం కేటాయించుకుని ప్రకృతి అందాల్లో సేద తీరుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికపుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నాడు.సింగర్‌తో ప్రేమలో?ఈ క్రమంలో పాండ్యా ఇటీవల షేర్ చేసిన కొన్ని ఫొటోల్లోని లొకేషన్.. బ్రిటిష్ సింగర్, నటి జాస్మిన్ వాలియా దిగిన ఫొటోల లొకేషన్ ఒకేలా ఉండటంతో వీరిద్దరు కలిసే అక్కడకు వెళ్లారనే వదంతులు వ్యాపించాయి. దీంతో హార్దిక్ మరోసారి ప్రేమలో పడ్డాడనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్టార్ ప్లేయర్ మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ ప్రేమను నిర్వచిస్తూ పెట్టిన ఇన్‌స్టా స్టోరీ వైరల్‌గా మారింది.ప్రేమ ఎప్పటికీ విఫలం కాదు‘‘ప్రేమకు సహనం ఎక్కువ. ప్రేమ దయగలది. ప్రేమలో ద్వేషం, అసూయ ఉండవు. గొప్పలు చెప్పుకోవడాలూ ఉండవు. ఇతరులను కించపరచడం, స్వార్థపూరితంగా వ్యవహరించడం ప్రేమకు తెలియదు. ప్రేమ తప్పొప్పులను లెక్కకడుతూ కోపం ప్రదర్శించదు. ప్రేమంటే నిజం.. నమ్మకం.. ఆశ.. రక్షణ.. ప్రేమ ఎప్పటికీ విఫలం కాదు’’ అంటూ నటాషా స్టాంకోవిక్ ఉద్వేగపూరిత వాక్యాలు షేర్ చేసింది.అందుకే విడాకులు?అయితే, ఈ పోస్ట్ హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి చేసిందేనంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అతడి పట్ల నటాషాకు ఇంకా ప్రేమ ఉందని.. కానీ అతడే దానిని నిలబెట్టుకోలేకపోయాడని.. ఏదేమైనా ఎవరి జీవితాల్లో వారు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా హార్దిక్‌కు నచ్చినట్లుగా మారడానికి నటాషా ఎంతో ప్రయత్నించిందని.. అయితే, అతడి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో విడాకులు తీసుకుందని ఇటీవల ఆమె సన్నిహితవర్గాలు వెల్లడించాయి.మరోవైపు.. హార్దిక్‌తో విడిపోయిన తర్వాత నటాషాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. కాగా సెర్బియాకు చెందిన నటాషా మోడల్‌గా కెరీర్ ఆరంభించింది. బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టిన ఆమె ఓ పార్టీలో హార్దిక్‌ను కలిసింది. స్నేహం కాస్తా ప్రేమగా మారగా పెళ్లిపీటలెక్కారు. అధికారికంగా ప్రకటించిఈ జంటకు కుమారుడు అగస్త్య సంతానం. అయితే, ఎంతో అన్యోన్యంగా కనిపించే హార్దిక్- నటాషా కొన్నాళ్ల క్రితం తాము విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, అగస్త్యకు మాత్రం తల్లిదండ్రులుగా కొనసాగుతామని స్పష్టం చేశారు. ఇక విడాకుల తర్వాత కొడుకును తీసుకుని నటాషా సెర్బియాకు వెళ్లిపోయింది. అయితే, ఈ మాజీ జంట ఇన్‌స్టాలో తాము కలిసి ఉన్న, తమ పెళ్లి ఫొటోలు డిలీట్ చేయకపోవడం గమనార్హం.చదవండి: టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ప్రకటన -
రెండోసారి తండ్రి కాబోతున్న సన్‌రైజర్స్ కెప్టెన్!
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. తాను రెండోసారి తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘మా బేబీకి సంబంధించిన శుభవార్తను మీతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది!మా జీవితాలను మరింత క్రేజీగా మార్చేందుకు వస్తున్న చిన్నారి కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నాం’’ అని బెకీతో పాటు కమిన్స్ ఇన్‌స్టాలో ఈ విషయాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా భార్య బెకీ, కుమారుడు ఆల్బీ ఫొటోలను షేర్ చేశాడు. ఇందులో బెకీ బేబీ బంప్‌తో కనిపించగా.. ఆల్బీ తల్లిని ముద్దాడుతున్నాడు.కుమారుడి సమక్షంలో వివాహంకాగా ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ 2020లో బెకీ బోస్టన్తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ జంట 2022లో వివాహ బంధంతో ఒక్కటైంది. పెళ్లికి ముందే వీరికి అల్బీ(2021) జన్మించాడు. తాజాగా మరోసారి కమిన్స్- బెకీ తల్లిదండ్రులు కాబోతున్నారు. కాగా కమిన్స్ ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.మూడేళ్లుగా నిరాశాజనక ప్రదర్శనతో డీలా పడ్డ రైజర్స్‌ను ఏకంగా ఫైనల్‌కు చేర్చి ఆరెంజ్ ఆర్మీ హృదయాలు గెలుచుకున్నాడు కమిన్స్. ఐపీఎల్ సమయంలో కమిన్స్‌తో పాటు బెకీ, ఆల్బీ.. ఇతర కుటుంబ సభ్యులు సైతం హైదరాబాద్‌కు విచ్చేశారు.ఎనిమిది వారాల విరామంటీ20 ప్రపంచకప్-2024లో ఆసీస్ సెమీస్‌లోనే నిష్క్రమించగా.. కమిన్స్ అప్పటి నుంచి ఎనిమిది వారాల పాటు విరామం తీసుకున్నాడు. టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ముందు ఈ బ్రేక్ తీసుకున్న కమిన్స్.. ఏ ఆటగాడికైనా విరామం కచ్చితంగా అవసరమని పేర్కొన్నాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ సైకిల్లో భాగంగా వరుస టెస్టులు ఆడాల్సిన నేపథ్యంలో తాను ఈ మేరకు విశ్రాంతి తీసుకున్నట్లు వెల్లడించాడు. View this post on Instagram A post shared by Rebecca Jane Cummins (@becky_cummins) -
లండన్ వీధుల్లో కన్పించిన విరాట్ కోహ్లి( వీడియో)
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి లండన్ వీధుల్లో ప్రత్యక్షమయ్యాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ అనంతరం కోహ్లి తన భార్య పిల్లలను కలిసేందుకు లండన్‌కు పయనమయ్యాడు. ఈ క్రమంలో లండన్ వీధుల్లో కోహ్లి తిరుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది.బ్లాక్ డ్రెస్ వేసుకున్న కోహ్లి రోడ్డును దాటుతున్నట్లు ఈ వీడియోలో కన్పించింది. కాగా గత కొంత కాలంగా విరాట్ భార్య అనుష్క శర్మ.. పిల్లలు వామిక, అకాయ్‌తో లండన్‌లో ఉంటుంది. కోహ్లి కూడా ఎక్కువగా ఫ్యామిలీతో కలిసి అక్కడే ఉంటున్నాడు. కేవలం మ్యాచ్‌లు ఉన్నప్పుడు మాత్రమే జట్టుతో కింగ్ కోహ్లి కలుస్తున్నాడు. మ్యాచ్‌లు మగిసిన వెంటనే మళ్లీ లండన్‌కు పయనవుతున్నాడు. గతకొన్నళ్లగా ఇదే జరుగుతుంది. అయితే రిటైర్మెంట్ తర్వాత విరాట్-అనుష్క లండన్‌లో స్థిరపడాలని భావిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అనుష్కతో పాటు వామిక, అకాయ్లు ఇంగ్లండ్ పౌరసత్వం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక లండన్‌లోనే పుట్టిన ఆకాయ్ను ఇప్పటివరకు కోహ్లి భారత్‌కు తీసుకురాలేదు. విరుష్క జంట లండన్‌లో ఓ లిస్టెడ్ కంపెనీ కలిగి ఉంది. మ్యాజిక్ ల్యాంప్ డైరెక్టర్లుగా విరాట్ కోహ్లి, అనుష్క శర్మలు ఉన్నారు. ఈ క్రమంలోనే విరాట్-అనుష్క లండన్‌లో స్ధిరనివాసం ఏర్పరుచుకోనున్నారని ప్రచారం జరగుతోంది. ఇక శ్రీలంతో వన్డే సిరీస్ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న కోహ్లి.. బంగ్లాతో టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి రానున్నాడు. Virat Kohli on the London streets. 🐐pic.twitter.com/0WvBi9byXZ— Mufaddal Vohra (@mufaddal_vohra) August 14, 2024 -
చీటర్.. అలాంటి వాళ్లతో జాగ్రత్త! హార్దిక్ పాండ్యాను ఉద్దేశించేనా?
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం సెలవులో ఉన్నాడు. ఆటకు దూరంగా ప్రకృతికి దగ్గరగా ఉంటూ క్రికెట్ నుంచి దొరికిన విరామ సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. సాగరతీరాన.. స్విమ్మింగ్‌పూల్ ఒడ్డున సేద తీరుతూ.. నీలాకాశాన్ని వీక్షిస్తున్న దృశ్యాలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ ‘చీటర్’ అన్న పోస్టుకు లైక్ కొట్టడం నెట్టింట చర్చకు దారితీసింది.నటాషాపై విమర్శలుకాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా పూర్తిగా విఫలమైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. టీ20 ప్రపంచకప్-2024 ద్వారా ఆటగాడిగా తనను తాను నిరూపించుకున్నాడు. దాదాపు పదకొండేళ్ల తర్వాత టీమిండియా మరోసారి ఐసీసీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి అభిమానుల నీరాజనాలు అందుకున్నాడు. అయితే, ఈ రెండు సందర్భాల్లోనూ భార్య నటాషా హార్దిక్‌తో లేకపోవడంతో వీరి మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలు రాగా.. కొన్నిరోజులు తర్వాత ఈ అంశంపై స్పష్టత వచ్చింది.తమ దారులు వేరయ్యానని.. తాము విడాకులు తీసుకున్నామని హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్ సంయుక్త అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో హార్దిక్ అభిమానులు నటాషాను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. హార్దిక్ పేరు, డబ్బు ఉపయోగించుకునేందుకే అతడి జీవితంలోకి వచ్చిందని.. భరణం రూపంలోనూ పెద్ద మొత్తమే తీసుకుందని ఇష్టారీతిన కామెంట్లు చేశారు.ఇక కుమారుడు అగస్త్యను తీసుకుని పుట్టినిల్లు సెర్బియాకు వెళ్లిన నటాషా.. అతడితో ట్రిప్‌నకు వెళ్లిన ఫొటోలు పంచుకోగా.. హార్దిక్ వాటికి హార్ట్ సింబల్ జోడిస్తూ లైక్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నటాషాను మర్చిపోలేకపోతున్నాడని.. ఆమె వల్ల హార్దిక్ పాండ్యా చాలా బాధపడుతున్నాడంటూ ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ విషయంపై నటాషా పరోక్షంగా స్పందించింది.చీటర్.. ఆ పోస్టులకు నటాషా లైక్‘‘చీటర్.. శారీరకంగా, మానసికంగా హింసించే వాళ్లతో బంధం కొనసాగిస్తే ఇలాగే ఉంటుంది.. కొంతమంది తామే సమస్యను సృష్టించి మళ్లీ వారే బాధితులుగా నటిస్తారు.. అందుకు ఇదే ఉదాహరణ... ఇతరుల ముందు మిమ్మల్ని తప్పుగా చూపించేవాళ్లతో జాగ్రత్తగా ఉండండి’’ అంటూ బంధాల గురించి చర్చిస్తున్న ఇన్‌స్టా వీడియోలకు నటాషా స్టాంకోవిక్ లైక్ కొట్టింది. ఇందుకు స్పందించిన నెటిజన్లలో మెజారిటీ మంది నటాషాకు మద్దతుగా నిలుస్తున్నారు. హార్దిక్ ఫ్యాన్స్ అని చెప్పుకొనే వాళ్లు ఇప్పటికైనా నటాషాను వేధించడం మానాలని హితవు పలుకుతున్నారు.కాగా ప్రపంచకప్-2024 తర్వాత హార్దిక్ పాండ్యా శ్రీలంకతో టీ20 సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చాడు. అయితే, వన్డే సిరీస్‌కు మాత్రం అతడు ఎంపికకాలేదు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ సిరీస్‌కు అతడు దూరంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. శ్రీలంక టూర్లో 3-0తో టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను 0-2తో ఆతిథ్య శ్రీలంకకు కోల్పోయింది. View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
మాటల్లో వర్ణించలేను.. లవ్ యూ: హార్దిక్ పాండ్యా
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. లంకతో టీ20 సిరీస్ జట్టుకు ఎంపికైన అతడు తొలి మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. రెండో టీ20లో మాత్రం అదరగొట్టాడు. రెండు కీలక వికెట్లు తీయడంతో పాటు.. తొమ్మిది బంతుల్లోనే 22 పరుగులు చేసి దుమ్ములేపాడు.ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించి టీమిండియా లంకపై టీ20 సిరీస్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు ఈ వరల్డ్‌కప్ చాంపియన్. ఈ క్రమంలో మంగళవారం నాటి నామమాత్రపు టీ20కి పాండ్యా సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే.. ఈరోజు(జూలై 30)కు హార్దిక్ పాండ్యా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంది. అతడి కుమారుడు అగస్త్య పుట్టినరోజు నేడు.ప్రేమను వర్ణించేందుకు మాటలు చాలవుఈ నేపథ్యంలో తన ముద్దుల కుమారుడితో ఉన్న వీడియో షేర్ చేసిన హార్దిక్ పాండ్యా.. ‘‘నేను ఇలా ముందుకు సాగుతున్నానంటే అందుకు కారణం నువ్వే. నా పార్ట్నర్ ఇన్ క్రైమ్. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా మనసంతా నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఆగూ..! నీపై నాకున్న ప్రేమను వర్ణించేందుకు మాటలు చాలవు’’ అంటూ ఉద్వేగపూరిత క్యాప్షన్ జతచేశాడు. అగస్త్యను ఎంతగానో మిస్సవుతున్నానని చెప్పకనే చెప్పాడు.ముక్కలైన బంధంకాగా సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్‌ను హార్దిక్ పాండ్యా ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఏకంగా మూడుసార్లు పెళ్లి చేసుకుంది. అయితే, కాలక్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్నారు. ఇటీవలే ఇందుకు సంబంధించి హార్దిక్ పాండ్యా- నటాషా అధికారిక ప్రకటన విడుదల చేశారు.కుమారుడిపై ప్రేమఅనంతరం కుమారుడు అగస్త్యను తీసుకుని నటాషా సెర్బియాలోని తన పుట్టింటికి వెళ్లిపోగా.. హార్దిక్ పాండ్యా టీమిండియాతో పాటు శ్రీలంకలో ఉన్నాడు. ఇక అంతకుముందు టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. స్వదేశానికి వచ్చిన అనంతరం అగస్త్యతో కలిసి తన ఇంట్లో సంబరాలు చేసుకున్నాడు హార్దిక్. ఇక ఇటీవల అగస్త్యతో కలిసి నటాషా విహారయాత్రకు వెళ్లిన ఫొటోలు పంచుకోగా.. హార్దిక్ పాండ్యా హార్ట్ సింబల్స్‌తో తన ప్రేమను తెలిపాడు. చదవండి: Ind vs SL ODIs: ‘ద్రవిడ్ వల్లే కాలేదు.. ఇక్కడ నేనే బాస్ అంటే కుదరదు’ View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా స్టార్.. పోస్ట్ వైరల్
టీమిండియా క్రికెటర్ దీపక్ హుడా ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసిని పెళ్లాడినట్లు తెలిపాడు. సోమవారం(జూలై 15) తమ వివాహం జరిగిందని సోషల్ మీడియా వేదికగా తాజాగా వెల్లడించాడు.తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణఈ సందర్భంగా పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలను దీపక్ హుడా షేర్ చేశాడు. ‘‘తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ.. ఈ ప్రయాణంలోని ప్రతీ క్షణం, ప్రతీ కల, ప్రతీ సంభాషణ మనల్ని ఈరోజు ఇక్కడి దాకా తీసుకువచ్చాయి.మా కళ్లలోని భావాలు.. మేము చెప్పుకొనే ముచ్చట్లు కేవలం మా రెండు హృదయాలకు మాత్రమే అర్థమవుతాయి. నా చిన్నారి- పొన్నారి హిమాచలి అమ్మాయీ.. మన ఇంట్లోకి నీకు స్వాగతం పలుకుతున్నా’’ అంటూ దీపక్ హుడా తన శ్రీమతిని ఉద్దేశించి భావోద్వేగ క్యాప్షన్ కూడా జతచేశాడు.కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ.. అందరి ఆశీర్వాదాలతో తాము కొత్త జీవితం మొదలుపెట్టామని తెలిపాడు. తమ బంధం ఈరోజుతో శాశ్వతంగా ముడిపడిపోయిందని.. మనసంతా సంతోషంతో నిండిందని పేర్కొన్నాడు.శుభాకాంక్షల వెల్లువఈ నేపథ్యంలో కొత్త జంటకు క్రికెటర్లు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. శిఖర్ ధావన్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చహల్, ఖలీల్ అహ్మద్ తదితర భారత క్రికెటర్లతో పాటు మహ్మద్ నబీ(అఫ్గనిస్తాన్), లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా.. దీపక్ హుడా దంపతులను విష్ చేశారు.అయితే, దీపక్ హుడా తన భార్య పేరును మాత్రం వెల్లడించలేదు. కాగా ఐపీఎల్-2024లో దీపక్ హుడా లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.అదే ఆఖరుహర్యానాకు చెందిన దీపక్ హుడా కుడిచేతి వాటం బ్యాటర్.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్. ఐపీఎల్లో సత్తా చాటిన 29 ఏళ్ల ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. 2022లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.అదే ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది న్యూజిలాండ్‌తో సిరీస్ సందర్భంగా దీపక్ హుడా టీమిండియాకు చివరిసారిగా ఆడాడు.ఇక ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 10 వన్డేలు, 21 టీ20లు ఆడిన దీపక్ హుడా.. ఆయా ఫార్మాట్లలో 153, 368 పరుగులు చేశాడు. అదే విధంగా.. 3, 6 వికెట్లు తీశాడు. చదవండి: పక్షవాతాన్ని జయించి.. ప్యారిస్ ఒలింపిక్స్‌లో! View this post on Instagram A post shared by Deepak Hooda (@deepakhooda30) -
Virat Kohli: అకాయ్‌ను ఆడిస్తున్న కోహ్లి.. వీడియో వైరల్
భారత స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లి ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్నాడు. కుటుంబంతో కలిసి సెలవులను ఆస్వాదిస్తున్నాడు. ఈ క్రమంలో తన కుమారుడు అకాయ్‌ను కోహ్లి ఎత్తుకున్న వీడియో వైరల్ అవుతోంది.కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను విజేతగా నిలపడంలో కోహ్లి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అమెరికా వేదికగా లీగ్ మ్యాచ్‌లలో తేలిపోయినా.. వెస్టిండీస్‌లో జరిగిన ఫైనల్లో ఈ రన్‌మెషీన్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.బార్బడోస్‌లో టైటిల్ కోసం సౌతాఫ్రికాతో జరిగిన పోరులో ఈ ఓపెనర్ 59 బంతుల్లో 76 పరుగులు సాధించాడు. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేసిన వేళ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(31 బంతుల్లో 47 రన్స్)తో కలిసి టీమిండియాకు భారీ స్కోరు అందించాడు.ఇక భారత్ విధించిన 177 పరుగుల లక్ష్మాన్ని ఛేదించే క్రమంలో సౌతాఫ్రికా తడబడటంతో ట్రోఫీ రోహిత్ సేన సొంతమైంది. ఏడు పరుగుల స్వల్ప తేడాతో ప్రొటిస్ జట్టుపై గెలిచిన టీమిండియా ఖాతాలో ఐదో ఐసీసీ టైటిల్ చేరింది.ఈ మ్యాచ్ ముగియగానే అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి.. విజయోత్సవాల కోసం జట్టుతో పాటు స్వదేశానికి తిరిగి వచ్చాడు. అనంతరం లండన్ వెళ్లిపోయాడు.కాగా కోహ్లి భార్య అనుష్క శర్మ తమ పిల్లలు వామిక, అకాయ్‌లతో కలిసి అంతకంటే ముందే అక్కడికి వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో కుటుంబాన్ని కలుసుకున్న కోహ్లి ప్రస్తుతం వారితో సరదాగా సమయం గడుపుతున్నాడు.ఈ నేపథ్యంలో కోహ్లి.. చిన్నారి అకాయ్‌ను ఎత్తుకుని ఆడిస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే, ఇందులో అకాయ్ ముఖం మాత్రం కనబడలేదు. కాగా తమ పిల్లల గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు వారిని లైమ్‌లైట్‌కు దూరంగా ఉంచాలని విరుష్క జోడీ నిర్ణయం తీసుకుంది.అందుకే ఇంతవరకు వామిక, అకాయ్‌లకు సంబంధించిన ఫొటోలు బయటకు రాలేదు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో విరాట్- అనుష్క అకాయ్‌కు లండన్‌లో జన్మనిచ్చారు. ఇక ప్రస్తుతం సెలవుల్లో ఉన్న కోహ్లి శ్రీలంకతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Virat Kohli Fan Club 👑 (@trend_vkohli) -
భార్యతో కలిసి ఖరీదైన ఫ్లాట్ కొన్న టీమిండియా స్టార్
ఐపీఎల్-2024 తర్వాత కేఎల్ రాహుల్ టీమిండియాకు దూరమయ్యాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు.. టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటు దక్కలేదు.అయితే, తాజాగా శ్రీలంకతో జరుగనున్న దైప్వాక్షిక సిరీస్‌తో కేఎల్ రాహుల్ పునరాగమనం చేయడం దాదాపుగా ఖాయమైంది. అంతేకాదు.. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ పర్యటనకు దూరమైతే వన్డే జట్టుకు కెప్టెన్‌గానూ ఈ కర్ణాటక బ్యాటర్ వ్యవహరించనున్నాడు.జూలై 27 నుంచి టీమిండియా శ్రీలంక టూర్ మొదలుకానుండగా.. తొలుత మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది భారత్. అనంతరం ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగనుంది. ఇదిలా ఉంటే కేఎల్ రాహుల్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.ఈ టీమిండియా స్టార్ క్రికెటర్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడు. తన భార్య అతియా శెట్టితో కలిసి ముంబైలోని వెస్ట్ బాంద్రాలో విలాసంతమైన ఫ్లాట్‌ను సొంతం చేసుకున్నాడు.ఇందుకోసం రాహుల్- అతియా జంట రూ. 20 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. వెస్ట్ బాంద్రాలోని 3350 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ ఫ్లాట్ కోసం రూ. 1.20 కోట్ల స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించినట్లు తెలుస్తోంది.ఇక ఇదే అపార్ట్మెంట్లో ఇప్పటికే బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ సైతం ఫ్లాట్ కలిగి ఉన్నట్లు సమాచారం. అదే విధంగా షారుఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, సల్మాన్ ఖాన్, జాన్వీ కపూర్, త్రిప్తి డిమ్రి కూడా ఇక్కడ నివాసాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్ తన కథనంలో వివరాలను వెల్లడించింది. కాగా భారత క్రికెట్ జట్టులో కీలక సభ్యుల్లో ఒకడైన కేఎల్ రాహుల్.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో గ్రేడ్-ఏ జాబితాలో ఉన్నాడు.తద్వారా ఏడాదికి ఐదు కోట్ల రూపాయల వేతనం అందుకుంటున్నాడు. మ్యాచ్ ఫీజులు ఇందుకు అదనం. అదే విధంగా.. ఐపీఎల్‌లోనూ కేఎల్ రాహుల్‌కు భారీ మొత్తమే సంపాదిస్తున్నాడు.లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా సీజన్‌కు రూ. 17 కోట్ల మేర అందుకుంటున్నట్లు సమాచారం. ఇక అతియా శెట్టి.. బాలీవుడ్ సీనియర్ నటుడు సునిల్ శెట్టి కుమార్తె అన్న విషయం తెలిసిందే. నటిగానూ ఆమె తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. -
భారత బౌలింగ్ కోచ్ రేసులో జహీర్ ఖాన్? (ఫొటోలు)
-
సచిన్ టెండుల్కర్ కుటుంబం.. కొత్త ఫొటోలు చూశారా?
-
భార్యతో సూర్య హ్యాపీ మూమెంట్స్.. స్మైల్ ప్లీజ్ (ఫొటోలు)
-
ధోనిని ఆత్మీయంగా హత్తుకున్న రాధిక.. తలా ఎమోషనల్ నోట్
టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సోషల్ మీడియాకు కాస్త దూరంగానే ఉంటాడు. ప్రత్యేక సందర్భాల్లో తప్ప మహీ ఫొటోలు పోస్ట్ చేయడు.ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మిస్టర్ కూల్‌కు 49.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. కానీ, ఇప్పటి వరకు అతడు పెట్టిన పోస్టులు కేవలం 111. అయితే, తాజాగా ధోని ఓ అద్భుతమైన ఫొటోను షేర్ చేస్తూ అందమైన క్యాప్షన్ జతచేశాడు.గ్రాండ్ వెడ్డింగ్ప్రస్తుతం అతడి పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అదేంటంటే.. భారత కుబేరుడు ముఖేశ్ అంబానీ- నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్- శైలా మర్చంట్ల కుమార్తె రాధికా మర్చంట్‌తో అనంత్ పెళ్లి జరిగింది. ముంబైలో జూలై 12న జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు ప్రపంచ నలుమూలల నుంచి క్రీడా, సినీ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు.మహేంద్ర సింగ్ ధోని సైతం తన సతీమణి సాక్షి, కుమార్తె జివా ధోనితో కలిసి అనంత్- రాధికల పెళ్లికి వెళ్లాడు. బారాత్‌లో డాన్స్ చేస్తూ సందడి చేశాడు కూడా!ఇక వివాహ తంతు ముగిసిన అనంతరం ధోని దంపతులు ప్రత్యేకంగా కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నవ వధువు రాధికా మర్చంట్ నవ్వులు చిందిస్తూ ధోనిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకోగా.. అనంత్ చిరునవ్వుతో మహీ చేతిని పట్టుకున్నాడు.రాధికా.. అనంత్ అంటూ ధోని ఎమోషనల్ నోట్ఇందుకు సంబంధించిన ఫొటోను మహేంద్ర సింగ్ ధోని ఇన్‌స్టాలో షేర్ చేశాడు. అంబానీల నూతన జంటను ఉద్దేశించి.. ‘‘రాధికా.. నీ ప్రకాశవంతమైన చిరునవ్వు ఎప్పటికీ ఇలాగే వెలిగిపోతూ ఉండాలి.అనంత్.. మేమందరం చుట్టూ ఉన్నపుడు ఎలాగైతే నువ్వు రాధిక పట్ల ప్రేమను కురిపించావో.. ఎల్లప్పుడూ అలాగే ఉండు ప్లీజ్.మీ వైవాహిక జీవితం సంతోషాలతో నిండిపోవాలి. త్వరలోనే మిమ్మల్ని మళ్లీ కలుస్తాను. వీరేన్ అంకుల్ కోసం ఓ పాట’’ అంటూ ధోని ఉద్వేగపూరిత నోట్ పంచుకున్నాడు. ఈ ఫొటోకు ఇప్పటికే 8 మిలియన్లకు పైగా లైకులు రావడం విశేషం.కాగా భారత్‌కు టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013 అందించిన జార్ఖండ్ ‘డైనమైట్’ ధోని.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు విజేతగా నిలిపాడు.ఇక ఈ ఏడాది చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకొని రుతురాజ్ గైక్వాడ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించిన 43 ఏళ్ల ధోని.. ఆటగాడిగా కొనసాగుతున్నాడు.చదవండి: Copa America 2024: కోపా అమెరికా కప్ విజేతగా అర్జెంటీనా.. మెస్సీకి గిఫ్ట్ View this post on Instagram A post shared by M S Dhoni (@mahi7781) -
ఐపీఎల్ సృష్టికర్త కుమార్తె.. వేల కోట్లకు వారసురాలు! ఆమె ప్రత్యేకత ఇదే!
ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన టీ20 లీగ్‌గా పేరొందింది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఈ క్యాష్ రిచ్ లీగ్ సృష్టికర్త లలిత్ కుమార్ మోదీ. సినీ సెలబ్రిటీలు, కార్పొరేట్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించి.. ప్రపంచ క్రికెటర్లందినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చిన ఘనత సొంతం చేసుకున్నాడు ఈ బిజినెస్‌మేన్.అప్పటి వరకు ఎన్ని వ్యాపారాలు ఉన్నా ఐపీఎల్‌తోనే పాపులర్ అయిన లలిత్ మోదీ.. క్రికెట్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగాడు. అయితే, ఆర్థిక లావాదేవీల విషయంలో అవకతవలకు పాల్పడి అదే స్థాయిలో అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. దేశం నుంచి పారిపోయి ఆర్థిక నేరగాడిగా ముద్రవేసుకున్నాడు.ఆ మధ్య సుస్మితా సేన్‌తో ప్రేమాయణంతో మళ్లీ వార్తల్లోకి వచ్చిన లలిత్ మోదీ.. ఇటీవల టీ20 ప్రపంచకప్-2024లో ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ రేట్ల విషయమై ఐసీసీని విమర్శిస్తూ తెరమీదకు వచ్చాడు.ఈ నేపథ్యంలో లలిత్ మోదీ వ్యక్తిగత జీవితం, నెట్‌వర్త్, ఆయన వారసుల గురించి తాజాగా నెటిజన్లలో చర్చ మొదలైంది. తనకంటే వయసులో తొమ్మిదేళ్లు పెద్దదైన మినాల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న లలిత్ మోదీకి కుమార్తె అలియా, కుమారుడు రుచిర్ ఉన్నారు.DNA ఇండియా నివేదిక ప్రకారం.. జూలై 2022 నాటికి లలిత్ మోదీ నికర ఆస్తుల విలువ 4,555 కోట్ల రూపాయలు. ఇక ఆయనకు సంబంధించిన మోది ఎంటర్ప్రైజెస్ విలువ రూ. 23,450 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.అలియా మోదీ.. ఆసక్తికర నేపథ్యంలలిత్ మోదీ ఆస్తులకు వారసురాలైన అలియాకు తన తమ్ముడు రుచిర్తో మంచి అనుబంధం ఉంది. తోబుట్టువులిద్దరు ఒకరికి ఒకరు అండగా ఉంటూ.. వ్యాపారంలో రాణిస్తున్నారు.అలియా మోదీ ఇంటీరియర్ డిజైనర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె సొంతంగా రూ. 41 కోట్ల మేర ఆస్తి కలిగి ఉన్నట్లు సమాచారం. ఇక అలియా వ్యక్తిగత జీవితానికొస్తే.. 2022 మేలో ఆమె బ్రెట్ కార్ల్‌సన్‌ను పెళ్లి చేసుకున్నారు.ఇటలీలోని వెనిస్ నగరంలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో కూతురు- అల్లుడి ఫొటోలను షేర్ చేస్తూ లలిత్ మోదీ మురిసిపోయాడు. ఇక సెలబ్రిటీల జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న నెటిజన్లు ఈ ఫొటోలను తవ్వితీసి.. అలియా మోదీని హైలైట్ చేస్తున్నారు. అదీ.. ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ కుటుంబం సంగతి! -
కోహ్లికి ప్రపోజ్ చేసిన క్రికెటర్.. ప్రేయసితో ఘనంగా పెళ్లి (ఫొటోలు)
-
కోహ్లికి ప్రపోజ్ చేసిన క్రికెటర్.. ప్రేయసితో ఘనంగా పెళ్లి
ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియెల్ వ్యాట్ పెళ్లి బంధంలో అడుగుపెట్టింది. తన చిరకాల ప్రేయసి జార్జీ హోడ్జ్‌ను వివాహమాడింది. ఓల్డ్ టౌన్ హాల్ వీరి పెళ్లి వేడుకకు వేదికైంది.కాగా జార్జీ వ్యాట్ దగ్గర స్పోర్ట్స్ ఏజెంట్‌గా పనిచేసింది. ఈ క్రమంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. చాలా కాలం పాటు డేటింగ్ చేసిన ఈ జంట.. సౌతాఫ్రికాలో ఎంగేజ్మెంట్ చేసుకుంది.గతేడాది మార్చిలో ఈ విషయాన్ని బహిర్గతం చేసింది డానియెల్ వ్యాట్. తాను జార్జీకి ప్రపోజ్ చేయగా అందుకు తను సానుకూలంగా స్పందించిందంటూ హర్షం వ్యక్తం చేసింది. ‘‘తను ఎల్లప్పుడూ నాకే సొంతం’’ అంటూ ప్రియురాలిని ముద్దాడిన ఫొటోను షేర్ చేసింది.ఈ క్రమంలో పెళ్లికి సిద్ధమైన వ్యాట్- జార్జీ చెల్సియా ఓల్డ్ టౌన్ హాల్లో ఉంగరాలు మార్చుకుని తమ బంధాన్ని అధికారికం చేసుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఇరువురూ సోషల్ మీడియాలో షేర్ చేశారు.కాగా ఇంగ్లండ్‌కు చెందిన ఆల్‌రౌండర్ డానియెల్ వ్యాట్ 2014లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లికి ప్రపోజ్ చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. వ్యాట్ క్రికెటర్‌గా బిజీగా ఉండగా.. జార్జీ వుమెన్ ఫుట్‌బాల్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది.ఇక ఇంగ్లండ్ తరఫున డానియెల్ వ్యాట్ రెండు టెస్టులు, 110 వన్డేలు, 156 టీ20 మ్యాచ్‌లు ఆడింది. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన ఆమె రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ కూడా! View this post on Instagram A post shared by Georgie Hodge (@georgiehodge) -
MS Dhoni: ప్యారిస్ టూర్లో జీవాతో పాటు ధోని- సాక్షి (ఫొటోలు)
-
కుల్దీప్ యాదవ్‌కు ఊహించని షాక్!
టీమిండియా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాలతో అమెరికా బిజీగా గడుపుతోంది. న్యూయార్క్‌లో ప్రాక్టీస్ సెషన్లో చెమటోడుస్తున్న క్రికెటర్లు.. తాజాగా కొత్త జెర్సీలతో ఫొటోలకు ఫోజులిచ్చారు.అదే విధంగా.. ఐసీసీ అందించే ‘‘టీమ్ ఆఫ్ ది ఇయర్’’ అవార్డులు కూడా అందుకున్న టీమిండియా స్టార్స్.. క్యాపులు ధరించి ఫొటోలు దిగారు. ఇదిలా ఉంటే.. ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ జట్టులో భాగమైన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా గురువారం క్యాప్ స్వీకరించాడు.టీమిండియాకు విలువైన ఆస్తిటీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అతడికి క్యాప్ అందజేశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. క్యాప్ అందిస్తున్న సమయంలో.. ‘‘టీమిండియాకు విలువైన ఆస్తి.. అద్భుతమైన అథ్లెట్‌కు క్యాప్ అందించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్: కుల్దీప్ యాదవ్’’ అని రోహిత్ పేర్కొన్నాడు.ఇందుకు బదులుగా.. ‘‘థాంక్యూ రోహిత్ భాయ్’’ అని కుల్దీప్ సమాధానమిచ్చాడు. ఇందుకు స్పందిస్తూ.. ‘‘నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా?’’ అని రోహిత్ కుల్దీప్ను అడిగాడు. ఏమీ లేదంటూ అతడు బదులివ్వగా.. ‘‘లేదు లేదు నువ్వు మాట్లాడాల్సిందే’’ అని రోహిత్ శర్మ పట్టుబట్టాడు.‘‘బ్యాట్‌తోనా? అదెప్పుడు?’’ఈ క్రమంలో.. ‘‘పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. అయితే, గతేడాది నేను బంతితో, బ్యాట్‌తో బాగా రాణించాను’’ అని చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెప్పుకొచ్చాడు. వెంటనే స్పందించిన రోహిత్.. ‘‘బ్యాట్‌తోనా? అదెప్పుడు?’’ అని సరదాగా కౌంటర్ వేశాడు.ఈ జట్టుకు నేనే కెప్టెన్‌ను!దీంతో కంగుతిన్న కుల్దీప్ టెస్టుల్లో బ్యాటింగ్ చేశానని గుర్తుచేయగా.. రోహిత్ బదులిస్తూ.. ‘‘ మనం వన్డేల గురించి మాట్లాడుతున్నాం. ఈ జట్టుకు నేనే కెప్టెన్‌ను. అయినా నువ్వు బ్యాటింగ్ చేయడం నేనెప్పుడూ చూడలేదు.కాబట్టి నువ్వేం మాట్లాడుతున్నావో నాకైతే అర్థం కావడం లేదు’’ అంటూ రోహిత్ కుల్దీప్ను ఆటపట్టించాడు. దీంతో బిక్కమొఖం వేయడం అతడి వంతైంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. కాగా జూన్ 1 బంగ్లాదేశ్‌తో టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడనుంది. జూన్ 5న ఐర్లాండ్‌తో న్యూయార్క్ వేదికగా తమ వరల్డ్‌కప్ ప్రయాణం మొదలుపెట్టనుంది.చదవండి: ఎవరు పడితే వాళ్లు కోచ్ కాలేరు?.. గంగూలీ పోస్ట్ వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc) -
టీ20 వరల్డ్‌కప్-2024 అంబాసిడర్‌గా ఆఫ్రిది.. దిమ్మతిరిగేలా రైనా కౌంటర్
టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన సురేశ్ రైనా ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్‌లో తనదైన శైలిలో మ్యాచ్‌లు, ప్లేయర్ల ఆట తీరును విశ్లేషిస్తూ వ్యాఖ్యాతగా ఆకట్టుకుంటున్నాడు.ఇక ఇటీవల ఐపీఎల్-2024 క్వాలిఫయర్-1 మ్యాచ్ సందర్భంగా సురేశ్ రైనా.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిపై సెటైర్లు వేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్- సన్‌రైజర్స్ హైదారబాద్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌కు టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రాతో కలిసి హిందీలో కామెంట్రీ చేశాడు రైనా.ఈ సందర్భంగా ఆకాశ్ చోప్రా.. రైనాను ఉద్దేశించి.. ‘‘రిటైర్మెంట్పై యూటర్న్ తీసుకుంటావా?’’ అని ప్రశ్నించాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘నేనేమీ షాహిద్ ఆఫ్రిదిని కాదు’’ అని రైనా పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి షాహిద్ ఆఫ్రిదిని అంబాసిడర్‌గా నియమిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటన విడుదల చేసింది. టీమిండియా స్టార్ యువరాజ్ సింగ్, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్, జమైకా అథ్లెట్ ఉసేన్ బోల్ట్‌లతో పాటు ఆఫ్రిది కూడా ఈ మెగా ఈవెంట్‌కు రాయబారిగా ఉంటాడని పేర్కొంది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు చెందిన స్పోర్ట్స్ కంటెంట్ రైటర్ రైనాను ఉద్దేశించి సెటైర్లు వేశాడు. ‘‘ఐసీసీ టీ20 వరల్డ్‌కప్-2024 అంబాసిడర్‌గా షాహిద్ ఆఫ్రిది పేరును ఐసీసీ ప్రకటించింది. హలో సురేశ్ రైనా’’ అని ట్రోల్ చేశాడు.I’m not an ICC ambassador, but I have the 2011 World Cup at my house. Remember the game at Mohali? Hope it brings back some unforgettable memories for you. https://t.co/5H3zIGmS33— Suresh Raina🇮🇳 (@ImRaina) May 24, 2024 ఇందుకు రైనా కూడా అంతే ఘాటుగా బదులిచ్చాడు. ‘‘నేను ఐసీసీ అంబాసిడర్‌ను కాదు గానీ.. 2011 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడిని. మొహాలీలో గేమ్ గుర్తుందా?నాకు తెలిసి ఆ మ్యాచ్ నీకు కొన్ని మర్చిపోలేని జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేస్తుందనుకుంటా’’ అని కౌంటర్ ఇచ్చాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2011లో మొహాలీ వేదికగా టీమిండియా- పాకిస్తాన్ సెమీ ఫైనల్లో తలపడ్డాయి.ఈ మ్యాచ్‌లో టీమిండియా 29 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. నాటి మ్యాచ్‌లో సురేశ్ రైనా జట్టుకు అవసరమైన సమయంలో పట్టుదలగా నిలబడి 36 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ధోని సేన షాహిద్ ఆఫ్రిది బృందాన్ని ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తూ తనను ట్రోల్ చేసిన వ్యక్తికి రివర్స్ సెటైర్ వేశాడు.💥Suresh Raina played one of the most important knocks of his career "OTD in 2011" - India were 205/6 against Pakistan in Semi-Final & he scored 36* runs from 39 balls in tough situation.pic.twitter.com/gGzL5wUm0p— मैं हूँ Sanatani 🇮🇳 🚩🚩 (@DesiSanatani) May 24, 2024 -
కేఎల్ రాహుల్‌ను ఇంటికి పిలిచిన గోయెంక: అతియా శెట్టి పోస్ట్ వైరల్
లక్నో సూపర్ జెయింట్స్ యజమాని, బడా వ్యాపారవేత్త సంజీవ్ గోయెంక నష్ట నివారణ చర్యలు చేపట్టారు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను తన ఇంటికి ఆహ్వానించి.. తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రాహుల్‌ను ఆయన ఆత్మీయంగా హత్తుకున్న ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.ఐపీఎల్-2022లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అడుగుపెట్టిన లక్నో ఫ్రాంఛైజీ తమ సారథిగా టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్‌ను నియమించింది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కెప్టెన్సీలో లక్నో అరంగేట్రంలోనే ప్లే ఆఫ్స్ చేరింది. గతేడాది సైతం టాప్-4తో ముగించింది.ఈ క్రమంలో పదిహేడో ఎడిషన్‌లోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. అయితే, ప్లే ఆఫ్స్ రేసులో ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలంటే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో ఓడిపోయింది.అందరూ చూస్తుండగానే చీవాట్లుఈ మ్యాచ్‌లో ప్యాట్ కమిన్స్ టీమ్ కేఎల్ రాహుల్ సేనను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి.. బ్యాటింగ్ విధ్వంసంతో పలు రికార్డులు ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో లక్నో యజమాని సంజీవ్ గోయెంక కెప్టెన్ రాహుల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.మైదానంలో అందరూ చూస్తుండగానే చీవాట్లు పెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో సంజీవ్ గోయెంక తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. కెప్టెన్ పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అంటూ మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్ వంటి వాళ్లు గోయెంక వ్యవహారశైలిని తప్పుబట్టారు.డిన్నర్ కోసం తన ఇంటికి ఆహ్వానించిఇక ఫ్యాన్స్ అయితే, రాహుల్ ఆత్మగౌరవం నిలబడాలంటే వెంటనే లక్నోకు గుడ్‌బై చెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తాజా ఫొటో తెర మీదకు వచ్చింది. కేఎల్ రాహుల్‌ను డిన్నర్ కోసం తన ఇంటికి ఆహ్వానించిన సంజీవ్ గోయెంక అతడిని ఆలింగనం చేసుకున్నాడు. Sanjiv Goenka invited KL Rahul for dinner at his home last night and both hugged each other.- Everything is okay now in LSG. ❤️ pic.twitter.com/RY9KsiNre3— Tanuj Singh (@ImTanujSingh) May 14, 2024తుపాన్ వెలిసిన తర్వాతఈ నేపథ్యంలో గోయెంక- రాహుల్ మధ్య సఖ్యత కుదిరిందని.. జట్టులో ప్రస్తుతం అంతా బాగానే ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కేఎల్ రాహుల్ భార్య, నటి అతియా శెట్టి చేసిన పోస్ట్ ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. తుపాన్ వెలిసిన తర్వాత ప్రశాంతంగా ఇలా అంటూ ఆమె మబ్బులు వీడిన సూర్యుడి ఫొటో పంచుకుంది.కాగా ఐపీఎల్-2024లో భాగంగా లక్నో మంగళవారం ఢిల్లీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే లక్నో ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. అయితే, మిగిలి ఉన్న మరో మ్యాచ్ గెలవడంతో పాటు ఇందుకోసం ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. Athiya Shetty Instagram story.Cryptic post 🤔🤔 pic.twitter.com/HTKdJ95G9d— DREAM11s STATS (@fantasy1Cricket) May 14, 2024 -
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఐపీఎల్ ఫ్రాంఛైజీ పంజాబ్ కింగ్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఇటీవల సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. తమ జట్టుకు సంబంధించి అభిమానులు వేస్తున్న ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇస్తూ వారిని ఖుషీ చేస్తున్నారు.ఈ క్రమంలో ఓ నెటిజన్.. ‘‘పంజాబ్ కింగ్స్‌లో మీకిష్టమైన ఆటగాడు ఎవరు?’’ అని ప్రశ్నించారు. ఇందుకు సమాధానంగా.. ప్రీతి జింటా వీరేంద్ర సెహ్వాగ్, ఆడం గిల్‌క్రిస్ట్ పేర్లను చెప్పారు.ఈ మేరకు.. ‘‘డేంజరస్ వీరూగా ఉన్నందుకు వీరేంద్ర సెహ్వాగ్’’ అంటూ హార్ట్ సింబల్ జత చేసిన ప్రీతి జింటా.. ఆడం గిల్‌క్రిస్ట్ అంటే కూడా తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. నాయకుడిగా, ఆటగాడిగా అతడు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.కాగా 2014, 2015 సీజన్లలో పంజాబ్ జట్టు తరఫున టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ దుమ్ములేపాడు. 30 మ్యాచ్‌లలో కలిపి 660 పరుగులు సాధించాడు. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్‌తో క్వాలిఫయర్ మ్యాచ్‌లో అతడు 122 పరుగులు సాధించడం హైలైట్‌గా నిలిచింది.ఇక ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఆడం గిల్‌క్రిస్ట్ సైతం 2011- 2103 మధ్య పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 34 మ్యాచ్‌లలో కలిపి 849 రన్స్ చేశాడు. నిలకడైన ఫామ్‌తో జట్టుకు విజయాలు అందించాడు. కెప్టెన్‌గానూ రాణించాడు.గిల్‌క్రిస్ట్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ 2011లో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. 2012, 2013లో ఆరో స్థానం సంపాదించింది.ఇక ఫేవరెట్ ప్లేయర్ ప్రశ్న తర్వాత.. ‘‘పంజాబ్ కింగ్స్ జట్టు కోసం మీరింకా ఆలూ పరాఠాలు చేస్తున్నారా?’’ అని ఓ నెటిజన్ అడిగారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘లేదు.. అప్పట్లో సౌతాఫ్రికాలో ఓసారి మా జట్టు గెలిచిన తర్వాత పరాఠాలు చేసిచ్చాను. ఆ తర్వాత అలాంటివేమీ చేయలేదు’’ అని ప్రీతి జింటా పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ మరోసారి పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరుస్తోంది. ఇప్పటి వరకు ఆడిన పదకొండు మ్యాచ్‌లలో కేవలం నాలుగు గెలిచి పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో తాను జట్టు ప్రదర్శన పట్ల సంతోషంగా లేనంటూ ప్రీతి జింటా ఇటీవల పేర్కొన్నారు. ఇక పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదన్న విషయం తెలిసిందే. కాగా టీమిండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ గతంలో పంజాబ్ జట్టుకు ఆడాడు. అదే విధంగా.. శిఖర్ ధావన్ ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే, గాయం కారణంగా అతడు మ్యాచ్‌లకు దూరం కాగా సామ్ కరన్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. -
Saina Nehwal: రాజస్తాన్ రాయల్స్ జట్టుతో సైనా నెహ్వాల్.. ఫొటోలు వైరల్
-
Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
-
HBD Rohit Sharma: హిట్‌మ్యాన్ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్ ఇదే!
-
టీమిండియా క్రికెటర్ భార్య.. మోడల్ కూడా! ఇటీవలే రెండో బిడ్డకు జన్మ(ఫొటోలు)
-
ఆమె అసలు ఓనర్లా ఉండదు.. ఓడినా కూడా..
‘‘ఆమె ఒక అద్భుతమైన మహిళ. జట్టుతో మమేకమై పోతుంది. టీమ్ ఓడిపోయినపుడు నిరాశకు గురైనా.. తన భావోద్వేగాలను నియంత్రించుకోగల శక్తి ఆమెకు ఉంది. ఆమె గొప్ప నటి. ఎంతో అనుభవం ఉన్న, విజయవంతమైన ఆర్టిస్ట్.ప్రతి సినిమా హిట్ కాదనే విషయం ఆమెకు తెలుసు. అలాగే.. ప్రతి మ్యాచ్‌లోనూ గెలవలేమనే విషయాన్ని అర్థం చేసుకోగలుగుతుంది. మ్యాచ్‌లో ఓటమిపాలైన తర్వాత మాతో మాట్లాడుతున్నపుడు చాలా వరకు ప్రశాంతంగానే ఉంటుంది. నేను ఆ జట్టుకు మూడేళ్ల పాటు ఆడాను. నలభై కంటే ఎక్కువ మ్యాచ్‌లలో భాగమయ్యాను.అయినా.. ఓడిన సందర్భాల్లో కేవలం రెండు- మూడుసార్లు మాత్రమే ఆమె మా మీద కోపం చూపించింది. మిగతా సందర్బాల్లో అసలు ఏమీ అనలేదు’’ అని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఇర్ఫాన్ పఠాన్ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.పంజాబ్ ఫ్రాంఛైజీ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ అంటే ఆమెకు ఎంతో ఇష్టమని.. ఓటమిపాలైనప్పుడు కూడా జట్టుకు ఆమె మద్దతుగానే ఉంటుందని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.తన చేత్తో పరాఠాలు చేసి పెట్టిందిఅదే విధంగా కీలక మ్యాచ్‌లో గెలిస్తే గనుక ప్రీతి సంతోషానికి అవధులు ఉండవని.. అలాంటి సమయంలో తానే స్వయంగా వంట చేసి అందరికీ వడ్డిస్తుందని పేర్కొన్నాడు. సౌతాఫ్రికాలో తాము చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించినపుడు ప్రీతి జింటా స్వయంగా తన చేత్తో 40 పరాఠాలు చేసి తమకు అందించిందని ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు.ఫ్రాంఛైజీ జట్ల యజమానుల్లో ప్రీతి జింటా వేరే లెవల్ అంటూ ప్రశంసించాడు. ఐపీఎల్-2024లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ దుమ్ములేపిన విషయం తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ విధించిన 261 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి చరిత్ర సృష్టించింది.దుమ్ములేపిన బెయిర్‌స్టో, శశాంక్జానీ బెయిర్‌స్టో విధ్వంసకర శతకానికి తోడు శశాంక్ సింగ్ కూడా దంచి కొట్టడంతో ఎనిమిది వికెట్ల తేడాతో కేకేఆర్‌ను చిత్తు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ శిబిరంలో ఆనందాలు వెల్లివిరిశాయి. ఈ నేపథ్యంలో ప్రీతి జింటా గురించి గుర్తు చేసుకుంటూ ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.🎥 Ruthless Hitting 💥Will #PBKS get this over the line? 🤔83 runs required from 42 deliveries‼️Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvPBKS pic.twitter.com/MvCvQQxmoe— IndianPremierLeague (@IPL) April 26, 2024చదవండి: రోహిత్, స్కై కాదు!.. వరల్డ్‌కప్‌లో ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టేది ఇతడే: యువీ -
ఆ బాధ ఎప్పటికీ...
ఆఫ్ ద ఫీల్డ్ న్యూఢిల్లీ: ఫేర్వెల్ మ్యాచ్ ఆడే అవకాశం రాకపోవడం అనేది తనని జీవితకాలం బాధిస్తూనే ఉంటుందని ఇటీవల రిటైరైన డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ చెప్పాడు. జట్టుకు తన సేవలు అవసరం లేదని ఒక్క మాట చెప్పి ఉంటే, ఢిల్లీలో చివరిసారి టెస్టు ఆడి వీడ్కోలు పలికేవాడినని... కానీ నాటి సెలక్టర్లు తనకు అలాంటి అవకాశం ఇవ్వలేదని మరోసారి బాధపడ్డాడు. ‘దేశం తరఫున 12 సంవత్సరాలు ఆడిన క్రికెటర్‌కు కనీసం వీడ్కోలు మ్యాచ్ ఆడే అర్హత ఉండదా’ అని వీరూ ప్రశ్నించాడు. తన విషయంలోనే కాదని, దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఏ క్రికెటర్‌కైనా ఒక వీడ్కోలు మ్యాచ్ ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఢిల్లీలో జరిగే చివరి టెస్టు సందర్భంగా సెహ్వాగ్‌ను బీసీసీఐ సన్మానిస్తుందనే వార్త వినిపిస్తోంది. ‘అలా జరిగితే మంచిదే. ఒకవేళ బీసీసీఐ పట్టించుకోకపోతే ఢిల్లీ క్రికెట్ సంఘమైనా ఆ పని చేస్తుందని భవిస్తున్నాను’ అని వీరూ అన్నాడు. అలాగే జట్టును ఎంపిక చేసే సమయంలో సీనియర్, జూనియర్ అనే బేధం లేకుండా వరసగా ఐదు మ్యాచ్‌లలో విఫలమైన వారిని జట్టులోంచి తీసేయాలని అభిప్రాయపడ్డాడు. మిగిలిన జట్లతో పోలిస్తే పాకిస్తాన్‌పై తాను ఎక్కువ నిలకడగా ఆడేవాడినని, ఆ జట్టుతో మరో రెండు సిరీస్‌లు ఆడి ఉంటే తన కెరీర్ పరుగులు 10 వేలు (వీరూ చేసింది 8,586) దాటేవని అన్నాడు.