సానియాతో సారా టెండుల్కర్ (PC: X)
ఐపీఎల్-2026లో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. లక్నోలోని ఏకనా స్టేడియంలో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
నిప్పులు చెరిగిన ప్రసిద్ కృష్ణ
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 164 పరుగులు చేయగలిగింది. ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ (30) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ నాలుగు వికెట్లతో చెలరేగి లక్నో బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.
ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్18.4 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. శుబ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (40 బంతుల్లో 56) ఆడగా.. జోస్ బట్లర్ (37 బంతుల్లో 60), వాషింగ్టన్ సుందర్ (13 బంతుల్లో 21 నాటౌట్) ధనాధన్ దంచికొట్టారు. ఫలితంగా గుజరాత్ జయభేరి మోగించింది.

స్టాండ్స్‌లో సచిన్ కుమార్తె, కోడలు
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్, కోడలు సానియా చందోక్ ఏకనా స్టేడియానికి విచ్చేశారు. కాగా ముంబై ఇండియన్స్ ఈ సీజన్ ఆరంభానికి ముందు సచిన్ కుమారుడు అర్జున్ టెండుల్కర్‌ను లక్నోకు ట్రేడ్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే, ఇప్పటికి లక్నో నాలుగు మ్యాచ్‌లు ఆడినా అర్జున్ టెండుల్కర్‌కు ఒక్కసారి కూడా తుదిజట్టులో చోటు దక్కలేదు. గుజరాత్‌తో మ్యాచ్‌లోనూ అతడు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. అయినప్పటికీ అర్జున్ ఉన్న లక్నో జట్టుకు మద్దతు ఇచ్చేందుకు అతడి అక్క సారా, భార్య సానియా స్టేడియానికి రావడం విశేషం.
లక్నో జెర్సీలో సానియా.. సారా మాత్రం
సారా, సానియా పక్క పక్కనే కూర్చుని మ్యాచ్ చూస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. సానియా లక్నో జెర్సీ ధరించి రాగా.. సారా మాత్రం నార్మల్ కుర్తీసెట్ వేసుకుంది. దీంతో సారా ఇప్పటికీ ముంబై ఇండియన్స్‌నే తన ఫేవరెట్ జట్టుగా భావిస్తోందని అందుకే వేరే జెర్సీ వేసుకునేందుకు కూడా ఇష్టపడటం లేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
మరికొందరు మాత్రం తమ్ముడు ఎలాగో తుదిజట్టులో లేడు.. అందుకే ఈసారి ఆమె గుజరాత్ కెప్టెన్ గిల్‌కు మద్దతు ఇచ్చి ఉంటుందని పేర్కొంటున్నారు. కాగా సారా- గిల్ ప్రేమలో ఉన్నారంటూ గతంలో వదంతులు వ్యాపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇటు సారా గానీ.. అటు గిల్ గానీ ఎప్పుడూ స్పందించలేదు.


