హార్దిక్‌తో విభేదాలు.. స్పందించిన కృనాల్ | IPL 2026:Krunal Pandya Announces Fresh Detail On Hardik Pandya After RCB Crush MI | Sakshi
Sakshi News home page

హార్దిక్‌తో విభేదాలు.. స్పందించిన కృనాల్

Apr 13 2026 1:17 PM | Updated on Apr 13 2026 1:37 PM

IPL 2026:Krunal Pandya Announces Fresh Detail On Hardik Pandya After RCB Crush MI

టీమిండియా స్టార్‌ సోదర ద్వయం కృనాల్‌-హార్దిక్‌ పాండ్యాల మధ్య గొడవలు జరుగుతున్నాయని గత కొంతకాలంగా సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ అంశం మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 12) రాత్రి జరిగిన ఆర్సీబీ-ఎంఐ మ్యాచ్‌లో అన్నదమ్ములిద్దరూ ఎడముఖం​ పెడముఖంగా వ్యవహరించారు. పైగా హార్దిక్‌ ఔటయ్యాక కృనాల్‌ దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు.

దీంతో పాండ్యా సోదరుల మధ్య విభేదాల ప్రచారానికి బలం చేకూరింది. అన్నదమ్ముల మధ్య గతంలో ఉన్న సఖ్యత లేదని స్పష్టమైంది. మ్యాచ్‌ అనంతరం అన్న కృనాల్‌ చేసిన వ్యాఖ్యలు ఈ ‍ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నాయి. బరిలో ఇద్దరు పాండ్యాలు ఉన్నా, గెలవాల్సింది ఒక పాండ్యానే అంటూ కృనాల్‌ చేసిన వ్యాఖ్యలు హార్దిక్‌పై అతని వ్యతిరేకతకు అద్దం పడుతున్నాయి. ఈ వ్యాఖ్యలను కృనాల్‌ వేరే ఉద్దేశంతో చేసినా, ఇందులో డబుల్‌ మీనింగ్‌ ఉన్నట్లు స్పష్టంగా తెలిసింది. అన్నదమ్ముల వివాదంపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ ఎందుకు అన్నదమ్ముల మధ్య విభేదాలు..?
కృనాల్-హార్దిక్‌ మధ్య విభేదాలు ఓ అమ్మాయి విషయంలో ఉన్నట్లు తెలుస్తుంది. హార్దిక్‌ తన మొదటి భార్య నటాషా స్టాంకోవిచ్‌కు విడాకులు ఇచ్చి  మహీకా శర్మ అనే అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. ఇది కృనాల్‌కు నచ్చలేదని సమాచారం. అలాగే మరో సోదరుడు (సవితి సోదరుడు వైభవ్‌) విషయంలోనూ వీరిద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని ప్రచారం జరుగుతుంది.

ఏదిఏమైనా రామలక్ష్మనుల్లా కలిసుండే కృనాల్‌-హార్దిక్‌ వేర్వేరుగా ఉండటాన్ని క్రికెట్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఐపీఎల్‌లో హార్దిక్‌ ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా.. కృనాల్‌ ఆర్సీబీలో కీలక ఆల్‌రౌండర్‌గా చలామణి అవుతున్న విషయం తెలిసిందే. 

నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ముంబై ఇండియన్స్‌ను వారి సొంత ఇలాకాలో మట్టి కరిపించి సంబరాలు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ (4-0-39-1, 40), కృనాల్‌ (4-0-26-1) ఇద్దరూ రాణించినప్పటికీ.. అన్న కృనాల్‌ జట్టే అంతిమంగా పైచేయి సాధించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement