విరాట్ కోహ్లి.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టీమిండియా దిగ్గజ బ్యాటర్, రన్‌మెషీన్‌గా పేరొందిన ఈ ఢిల్లీ స్టార్.. క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లి.. వన్డేల్లో మాత్రం ‘రారాజు’గానే కొనసాగుతున్నాడు.
ప్రస్తుతం ఐపీఎల్-2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కు ఆడుతూ బిజీగా ఉన్నాడు కోహ్లి. అయితే, గత కొంతకాలంగా ఆట కంటే కూడా వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం జర్మన్ ఇన్‌ఫ్లూయెన్సర్ లిజ్‌లాజ్ ఫొటోకు కోహ్లి లైక్ కొట్టినట్లు వార్తలు రాగా.. కాసేపటికే అతడు ఆ ఫొటోను డిస్‌లైక్ చేసినట్లు తెలిసింది.
ఈ విషయంపై లిజ్‌లాజ్ స్పందిస్తూ.. కోహ్లి వల్ల తనకు ప్రచారరం లభించినా అతడు మాత్రం ఇబ్బంది పడాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేసింది. గతంలో అవనీత్ కౌర్ అనే ఇన్‌ఫ్లూయెన్సర్ ఫొటోకు కూడా కోహ్లి లైక్ చేసినట్లు వార్తలు రాగా.. అల్గారిథమ్ పొరపాటు వల్లే ఇలా జరిగిందని అతడు వివరణ ఇచ్చాడు.
అభ్యంతరకర కామెంట్
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో బ్రెజిల్ మోడల్ ఇసబెల్ల లియట్, కోహ్లి భార్య అనుష్క శర్మ, అవనీత్ కౌర్, లిజ్‌లాజ్ ఫొటోలను పోస్ట్ చేస్తూ.. ‘‘మహిళల విషయంలో విరాట్ కోహ్లి అభిరుచి ఎప్పుడూ గొప్పగానే ఉంటుందన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు’’ అని అభ్యంతరకర కామెంట్ పెట్టారు.
ఈ పోస్టుపై ఇసబెల్ల స్పందించింది. ‘‘పన్నెండు ఏళ్ల కాలం గడిచిపోయింది. ఇప్పటికీ మీరెందుకు ఆ విషయం నుంచి బయటకు రావడం లేదు’’ అంటూ ఇసబెల్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కాగా అనుష్క శర్మ పరిచయం కాకముందు కోహ్లి 2012-2104 మధ్య ఇసబెల్లతో డేటింగ్ చేశాడనే వదంతులు ఉన్నాయి.
కాగా 2014లో తన మూవీ ప్రమోషన్లో భాగంగా కోహ్లి- అనుష్క గురించి ప్రశ్న ఎదురు కాగా.. ‘‘నేను ఇక్కడ నా సినిమా గురించి మాట్లాడటానికి మాత్రమే ఉన్నాను. విరాట్ కోహ్లి గురించి నేనింక మాట్లాడటానికి ఏమీ లేదు’’ అని ఇసబెల్ల కౌంటర్ ఇచ్చింది.

ఇదిలా ఉంటే.. ఇసబెల్ల పంజాబీ సినిమాలతో పాటు తెలుగు సినిమాల్లోనూ కనిపించింది. విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో ఆమె తళుక్కుమంది. ఇక 2017లో పెళ్లి బంధంతో ఒక్కటైన కోహ్లి- అనుష్క తమ వైవాహిక జీవితంలో సంతోషంగా ముందుకు సాగుతున్నారు. ఈ జంట ఇటీవలే బృందావన్‌లోని ప్రేమానంద్‌జీ మహరాజ్‌ను దర్శించి ఆశీసులు తీసుకుంది.


