టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ సోమవారమే 29వ వసంతంలో అడుగుపెట్టింది. బయో మెడికల్ సైంటిస్టు, న్యూట్రీషనిస్టు, మోడల్, ఇన్ఫ్ల్యూయెన్సర్.. వెల్నెస్ సెంటర్ వ్యవస్థాపకురాలుగా భిన్న పాత్రలు పోషిస్తున్న సారా.. ఆర్థికంగా తన కాళ్ల మీద తాను నిలబడుతోంది.
కోట్లలో ఆస్తి
జాతీయ మీడియా నివేదికల ప్రకారం 2026 నాటికి సారా టెండుల్కర్ నికర ఆస్తుల విలువ రూ. 8- 16 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ఇక వివిధ వేడుకలకు అదిరిపోయే, ఖరీదైన దుస్తుల్లో మెరిసిపోయే సచిన్ గారాలపట్టి.. పుట్టినరోజు మాత్రం అత్యంత సాధారణ డ్రెస్సు ధరించింది.

డ్రెస్సు ధర కేవలం రూ. 2,350
జరా బ్రాండ్ నుంచి జీబ్రా ప్రింట్తో ఉన్న సింపుల్ డ్రెస్సులోనూ సారా అందంగా మెరిసిపోయింది. ఇక ఈ డ్రెస్సు ధర కేవలం రూ. 2,350 మాత్రమేనట. ఇక.. సారా తమ్ముడు అర్జున్ టెండుల్కర్ భార్య సానియా టెండుల్కర్.. వదినమ్మ కోసం బర్త్డే పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
విశ్వానికి రుణపడి ఉంటాను
పూల థీమ్తో ఉన్న కేక్ కట్ చేసిన సారా.. స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘అధ్యాయం 29. నాకు అన్నీ ఇచ్చిన ఈ విశ్వానికి రుణపడి ఉంటాను. నా బెస్టీస్తో సంబరాలు చేసుకున్నా. నాకు నేనంటేనే ఎక్కువగా ఇష్టం. సంతోషంగా ఉంది.

నా కుమారుల కోసం ఆ కేక్
అందరి ప్రేమ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నా కుమారుల (పెంపుడు కుక్కలు) కోసం ప్రత్యేకంగా పప్పీ కేక్స్ చేయించాము’’ అని సారా పేర్కొంది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా సచిన్ సైతం కుమార్తెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు. ‘ఒకప్పుడు నేను నీకు దారి చూపించాను. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న మార్గాన్ని చూసి సంతోషిస్తున్నా. లవ్ యూ సారా’ అని విష్ చేశాడు.
ఇదీ చదవండి: ‘క్రికెటర్లు బాగా సంపాదిస్తారు.. కానీ వాళ్లంతా పిసినిగొట్టోళ్లు’: రోహిత్ శర్మ


