‘ఒకప్పుడు నేను నీకు దారి చూపించాను.. ఇప్పుడిలా’ | Happy To See Where You Go: Sachin Tendulkar Birthday Wish For Sara | Sakshi
Sakshi News home page

ఒకప్పుడు నేను నీకు దారి చూపించాను.. ఇప్పుడిలా: సచిన్‌

Oct 12 2026 4:06 PM | Updated on Oct 12 2026 4:19 PM

Happy To See Where You Go: Sachin Tendulkar Birthday Wish For Sara

కుమార్తె సారాతో సచిన్‌ (PC: Instagram)

టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌- డాక్టర్‌ అంజలి దంపతుల కుమార్తె సారా టెండుల్కర్‌ పుట్టినరోజు నేడు (అక్టోబరు 12). ముంబైలో 1997లో జన్మించిన సారా తాజాగా 29వ వసంతంలో అడుగుపెట్టింది.

ఒకప్పుడు నేను నీకు దారి చూపించేవాడిని
ఈ సందర్భంగా సచిన్‌ టెండుల్కర్‌ తన గారాలపట్టికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో సారాతో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ.. ‘‘ఒకప్పుడు నేను నీకు దారి చూపించేవాడిని. కానీ.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి, నీ లక్ష్యాలను చూసి ఎంతో సంతోషిస్తున్నా. హ్యాపీ బర్త్‌డే సారా. లవ్‌ యూ’’ అని సచిన్ టెండుల్కర్‌ ఉద్వేగానికి లోనయ్యాడు.

కాగా రెండున్నర  దశాబ్దాలకు పైగా టీమిండియా క్రికెటర్‌గా కొనసాగిన సచిన్‌.. ఎన్నెన్నో రికార్డులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా చెక్కుచెదరని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

న్యూట్రీషనిస్ట్‌, మోడల్‌గా
ఇక వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. తన కంటే వయసులో దాదాపు ఐదేళ్లు పెద్దదైన అంజలిని ప్రేమించిన సచిన్‌.. పెద్దల అంగీకారంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు తొలుత కుమార్తె సారా.. తర్వాత కుమారుడు అర్జున్‌ జన్మించారు. సారా న్యూట్రీషనిస్ట్‌, మోడల్‌గా రాణిస్తూ.. సొంతంగా వెల్‌నెస్‌ సెంటర్‌ కూడా ఏర్పాటు చేసింది.

తండ్రి బాటలో అర్జున్‌
మరోవైపు.. అర్జున్‌ తండ్రి బాటలో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నప్పటికీ పెద్దగా సక్సెస్‌ కాలేకపోతున్నాడు. ఈ ఏడాది అర్జున్‌.. సానియా చందోక్‌ను పెళ్లాడి వివాహ బంధంలో అడుగుపెట్టాడు. అయితే, అర్జున్‌ అక్క సారా మాత్రం ఇంత వరకు పెళ్లి ఊసెత్తడం లేదు. తల్లిదండ్రులు సచిన్‌- అంజలితో కలిసి సచిన్‌ టెండుల్కర్‌ ఫౌండేషన్‌ వ్యవహారాలు చూసుకుంటూ బిజీగా ఉంది.

చదవండి: అప్పుడు ఐదెకరాల భూమి.. ఇప్పుడు 3 అపార్టుమెంట్లు కొన్న విరుష్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement