నడవలేని స్థితిలో!.. మూత్ర విసర్జనపై నియంత్రణ లేక.. | Vinod Kambli’s Love For Cricket Shines Through As He Visits Wankhede Despite Health Struggles, Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

నడవలేని స్థితిలో!.. మూత్ర విసర్జనపై నియంత్రణ లేక..

May 25 2026 4:56 PM | Updated on May 25 2026 5:33 PM

Vinod Kambli Once collapsed Now Struggling to walk spotted at Wankhede

వినోద్‌ కాంబ్లీ (ఫైల్‌ ఫొటో)

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భారత మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ ఆదివారం వాంఖడే స్టేడియానికి వచ్చాడు. ఐపీఎల్‌-2026లో భాగంగా లీగ్‌ దశలో ముంబై ఇండియన్స్‌ ఆఖరి మ్యాచ్‌ను వీక్షించాడు. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

నడవలేని స్థితిలోనూ..
ఇదిలా ఉంటే.. నడవలేని స్థితిలోనూ ముంబైకర్‌ వినోద్‌ కాంబ్లీ తనకెంతో ఇష్టమైన వాంఖడే స్టేడియానికి రావడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గతేడాది వినోద్‌ కాంబ్లీ ఆరోగ్యం క్షీణించిన విషయం విదితమే.

మాజీ క్రికెటర్ల ఆర్థిక సాయం
మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌తో పుణె ఆస్పత్రిలో చేరగా.. మాజీ క్రికెటర్లు అతడికి అండగా నిలబడ్డారు. వన్డే వరల్డ్‌కప్‌-1983 గెలిచిన భారత జట్టులోని సభ్యులు, మరో దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ ఆర్థికంగా సాయం అందించారు. ఈ క్రమంలో మెరుగైన చికిత్స పొందిన వినోద్‌ కాంబ్లీ ప్రస్తుతం కాస్త కోలుకున్నాడు.

యూరిన్‌ సమస్య
ఇదిలా ఉంటే.. తన దుస్థితికి తన చెడు అలవాట్లే కారణమని వినోద్‌ కాంబ్లీ గతంలో వెల్లడించాడు. మద్యం పూర్తిగా మానివేశానని తెలిపాడు. ఇటీవల విక్కీ లల్వాణీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం నేను బాగున్నాను. నా భార్య ఆండ్రియా నన్ను జాగ్రత్తగా చూసుకుంటోంది. మూడు వేర్వేరు ఆస్పత్రులకు తీసుకువెళ్లి నాకు చికిత్స చేయించింది. నేను మళ్లీ ఫిట్‌గా మారాలని చెప్పింది.

మూత్రం అస్సలు ఆగదు
భారత మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా నన్ను చూసేందుకు రావడం ఎంతో సంతోషంగా అనిపించింది. నాకు యూరిన్‌ సమస్య ఉంది. మూత్రం అస్సలు ఆగదు. నా ప్రమేయం లేకుండానే పాస్‌ అయిపోయేది. అప్పుడు నా కుమారుడు జీసస్‌ క్రిస్టియానో నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. పదేళ్ల నా కూతురు కూడా నాకు సాయం చేసేది.

నెల రోజుల క్రితమే ఇది జరిగింది. నా తల తిరిగినట్లు అనిపించేది. అకస్మాత్తుగా కిందపడిపోయాను. డాక్టర్‌ దగ్గరికి వెళ్తే వెంటనే ఆస్పత్రిలో చేరమన్నారు’’ అని 52 ఏళ్ల వినోద్‌ కాంబ్లీ గుర్తు చేసుకున్నాడు.

చదవండి: మెస్సీకి గాయం.. ఫిఫా ప్ర‌పంచ‌కప్‌కు దూరం!

Advertisement
 
Advertisement
Advertisement