మెస్సీకి గాయం.. ఫిఫా ప్ర‌పంచ‌కప్‌కు దూరం! | Lionel Messi Injury Scares-Argentina-Ahead FIFA World Cup 2026 | Sakshi
Sakshi News home page

మెస్సీకి గాయం.. ఫిఫా ప్ర‌పంచ‌కప్‌కు దూరం!

May 25 2026 2:20 PM | Updated on May 25 2026 2:27 PM

Lionel Messi Injury Scares-Argentina-Ahead FIFA World Cup 2026

మ‌రో ప‌దిహేను రోజుల్లో సాక‌ర్ సంగ్రామం (ఫిఫా వ‌రల్డ్‌క‌ప్-2026) మొద‌ల‌వ‌నున్న నేప‌థ్యంలో అర్జెంటీనాకు షాక్ త‌గిలేలా ఉంది. ఆ జ‌ట్టు స్టార్ ఆట‌గాడు లియోన‌ల్ మెస్సీ గాయం బారీన ప‌డ్డాడు. ప్రస్తుతం ఇంట‌ర్ మియామి క్ల‌బ్ త‌ర‌ఫున ఆడుతున్న మెస్సీ మేజ‌ర్ సాక‌ర్ లీగ్‌లో బిజీగా గడుపుతున్నాడు. ఆదివారం రాత్రి ఫిల‌డెల్ఫియా యూనియ‌న్‌తో ఇంట‌ర్ మియామి త‌ల‌ప‌డింది. 

మ్యాచ్‌లో 73వ నిమిషంలో స‌బ్‌స్టిట్యూట్‌గా వ‌చ్చిన మెస్సీ బంతిని కొట్టే క్ర‌మంలో ఎడ‌మ కాలికి గాయ‌మైంది. అయితే మైదానం వీడే స‌మ‌యంలో నార్మ‌ల్‌గానే క‌నిపించిన‌ప్ప‌టికీ, డ‌గౌట్‌లో కూర్చున్న స‌మ‌యంలో తీవ్ర ఇబ్బందిగా మెస్సీ క‌నిపించాడు. మెస్సీ గాయంతో బాధ‌ప‌డుతున్నాడ‌ని, గాయం తీవ్ర‌త కాస్త ఎక్కువ‌గానే ఉంద‌ని ఇంట‌ర్ మియామి కోచ్ గులెరెమో హొయెస్ పేర్కొన్నాడు. 

మ‌రో 15 రోజుల్లో ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ మొద‌లుకానున్న నేప‌థ్యంలో మెస్సీ సాక‌ర్ సంగ్రామంలో ఆడుతాడా లేదా అనేది అనుమానంగా మారింది. మెస్సీ గాయంపై అర్జెంటీనా ఫుట్‌బాల్ జ‌ట్టు స్పందించ‌న‌ప్ప‌టికీ, అత‌డి గాయంపై ఆందోళ‌నతోనే ఉన్న‌ట్లు తెలుస్తోంది. జూన్ 11న మొద‌లుకానున్న ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌కు అమెరికా, మెక్సికో, కెనడాలు సంయుక్తంగా ఆతిథ్య‌మిస్తున్నాయి.

గ్రూప్ జెలో ఉన్న‌ అర్జెంటీనా త‌మ తొలి మ్యాచ్‌ను జూన్ 17న అల్జీరియాతో ఆడ‌నుంది. అర్జెంటీనాతో పాటు అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్‌లు గ్రూప్‌-జెలో ఉన్నాయి. ఇక ఫిలడెల్ఫియాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఇంట‌ర్ మియామి 0-6తో విజ‌యాన్ని అందుకుంది.

చదవండి: కెప్టెన్సీ విమర్శలపై రహానే ఘాటు వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement