పంజాబ్‌ నటితో భారత క్రికెటర్‌ ప్రేమాయణం! | Punjabi actress rumoured to be dating PBKS star Arshdeep Singh | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ నటితో భారత క్రికెటర్‌ ప్రేమాయణం!

Apr 7 2026 1:51 PM | Updated on Apr 7 2026 2:01 PM

Punjabi actress rumoured to be dating PBKS star Arshdeep Singh

టీమిండియా స్టార్ పేసర్‌ అర్షదీప్ సింగ్‌ ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  అర్షదీప్‌ ఇటీవలే తన స్నాప్‌చాట్‌ అకౌంట్లో ఒక అమ్మాయితో చేతులు పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేయడం సోషల్‌మీడియాను ఊపేసింది. ఈ టీమిండియా స్టార్‌ షేర్‌ చేసిన ఫోటోలో అమ్మాయి ముఖం కనిపించకపోయినప్పటికీ, నెట్టిజన్లు ఒక చిన్న క్లూ ద్వారా ఆమె ఎవరో కనిపెట్టేశారు. 

అర్షదీప్‌ పట్టుకున్న ఆ అమ్మాయి చేతిపై ఒక స్పెషల్ టాటూ ఉంది. పంజాబ్‌కు చెందిన మోడల్, నటి అయిన సమ్రీన్ కౌర్ చేతిపై కూడా సరిగ్గా అదే టాటూ ఉండటంతో, ఆమె  అర్షదీప్‌తో లవ్‌లో ఉన్నట్లు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల ముల్లన్‌పూర్‌లో జరిగిన మ్యాచ్ సందర్భంగా సమ్రీన్ పంజాబ్ కింగ్స్ జెర్సీ ధరించి ఉన్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకోవడంతో అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. 

పంజాబ్‌కు చెందిన సమ్రీన్ (26), పూణేలోని సింబయాసిస్ కాలేజీలో చదువుకుంది. ప్రస్తుతం మోడల్, నటిగా రాణిస్తున్న ఆమె 2018 మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. అనేక పంజాబీ మ్యూజిక్ వీడియోలు, ఓటీటీ చిత్రాలలో నటించిన ఆమెకు  ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. 

ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఉన్న సంబంధంపై ఇటు అర్షదీప్ కానీ, అటు సమ్రీన్ కానీ అధికారికంగా స్పందించలేదు. అయినప్పటికీ వీరిద్దరి మధ్య ఏదో విషయం ఉందన్న వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఐపీఎల్‌ 2026 సీజన్‌లో అర్షదీప్‌ పంజాబ్‌ కింగ్స్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే.

చదవండి:  18 కోట్ల క్రికెట‌ర్ ఆగ‌మ‌నం.. కేకేఆర్ భ‌విష్య‌త్తు మారేనా!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement