స్టేడియంలో కనిపించని ప్రీతిజింటా.. అసలేమైంది? | Why Preity Zinta Not Attending IPL 2026 Matches Reason Is Here | Sakshi
Sakshi News home page

స్టేడియంలో కనిపించని ప్రీతిజింటా.. అసలేమైంది?

Apr 18 2026 5:00 PM | Updated on Apr 18 2026 5:26 PM

Why Preity Zinta Not Attending IPL 2026 Matches Reason Is Here

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ ఓన‌ర్‌ కావ్యా మార‌న్.. పంజాబ్ కింగ్స్ స‌హ య‌జ‌మాని ప్రీతిజింటా.. ముంబై ఇండియ‌న్స్ య‌జ‌మాని నీతా అంబానీ.. కేకేఆర్ స‌హ భాగ‌స్వామి జూహీ చావ్లా, ఆమె కూతురు జాన్వి మెహ‌తా వీరంతా క్యాష్‌రిచ్ లీగ్‌కు అద‌నపు ఆక‌ర్ష‌ణ‌. 

వీరంతా త‌మ జ‌ట్లు ఆడే ప్ర‌తీ మ్యాచ్‌కు హాజ‌ర‌య్యి ఆట‌గాళ్ల‌ను ఉత్సాహ‌ప‌రుస్తూనే త‌మ అందంతో అభిమానుల హృద‌యాల‌ను క‌ట్టిప‌డేస్తుంటారు. అయితే వీరంద‌రిలో పంజాబ్ కింగ్స్ కో-ఓన‌ర్ ప్రీతిజింటాది ప్ర‌త్యేక శైలి.  యువ‌రాజ్ సింగ్‌, మ్యాక్స్‌వెల్ స‌హా చాలా మంది పంజాబ్ ఆట‌గాళ్ల‌కు ఫ్లైయింగ్ కిస్‌లు ఇస్తూ ఉత్సాహ‌ప‌రుస్తుండేది. 

ఇలా ఐపీఎల్ ఆరంభం నుంచి ప్ర‌తీ సీజ‌న్‌లో పంజాబ్‌ను ప్రోత్స‌హిస్తూ మ్యాచ్‌ల‌కు హాజ‌ర‌య్యే ప్రీతి జింటా ఐపీఎల్ 19వ సీజ‌న్‌లో మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. మ‌రోవైపు ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ వ‌రుస విజ‌యాల‌తో టైటిల్ రేసులో దూసుకెళ్తోంది. సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 4 విజ‌యాలు (ఒక మ్యాచ్ ర‌ద్దు) సాదించిన పంజాబ్ 9 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో కూడా కొన‌సాగుతుంది. 

పంజాబ్ కింగ్స్ ఇంత‌లా రెచ్చిపోతున్న స‌మ‌యంలో ప్రీతి జింటా మైదానంలో క‌నబ‌డ‌క‌పోయేస‌రికి పంజాబ్ అభిమానులు చిన్న‌ బోతున్నారు. తాజాగా ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ విజ‌యం సాధించిన అనంత‌రం ప్రీతిజింటా త‌న సామాజిక మాధ్య‌మంలో జ‌ట్టును అభినందిస్తూ పోస్ట్ చేసిందే త‌ప్ప బ‌య‌ట‌కు రాలేదు. మ‌రి ప్రీతిజింటాకు ఏమైన‌ట్లు అని అభిమానులు ఆరా తీస్తున్న స‌మ‌యంలో ఆమెనే స్వ‌యంగా స్ప‌ష్ట‌త ఇచ్చింది. 

‘చాలా కాలంగా నా పిల్లలకు దూరంగా ఉండి షూటింగ్‌లు, ఇతర పనులతో బిజీగా గడిపాను. ప్రస్తుతం వాళ్లకు సెలవులు ఉన్నాయి. అందుకే ఈ విలువైన సమయాన్ని నా పిల్లలతో గడపాలని నిర్ణయించుకున్నాను. తల్లిగా వాళ్లతో ఉండటం నా బాధ్యత, అందుకే మ్యాచ్‌లకు హాజరు కాలేకపోతున్నాను. అయితే పిల్ల‌ల‌తో సెల‌వులు ముగియ‌గానే మ‌ళ్లీ స్టేడియానికి వ‌చ్చి జ‌ట్టుతో పాటు మిమ్మ‌ల్ని ఉత్సాహ‌ప‌రుస్తాను’ అని చెప్పుకొచ్చారు.

పంజాబ్ జట్టు ఈసారి పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండటం, దీనికి తోడు త్వరలోనే ప్రీతి జింటా ఎంట్రీ ఇవ్వనుండటంతో అభిమానుల జోష్‌ డబుల్‌ కానుంది. పంజాబ్‌ కింగ్స్‌ తన తర్వాతి మ్యాచ్‌ ఆదివారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో తలపడనుంది.

చదవండి: చెన్నై జట్టులోకి చిచ్చరపిడుగు!

Advertisement
 
Advertisement
Advertisement