ఆమెతో బంధం ఇక చట్టబద్ధం | Shikhar Dhawan Officially Registers Marriage With Sophie Shine Video | Sakshi
Sakshi News home page

ఆమెతో బంధం ఇక చట్టబద్ధం

May 8 2026 3:32 PM | Updated on May 8 2026 3:57 PM

Shikhar Dhawan Officially Registers Marriage With Sophie Shine Video

టీమిండియా మాజీ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ ఇటీవలే తన ప్రేయసి సోఫీ షైన్‌తో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాడు. ఢిల్లీలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ ఏడాది ఫిబ్రవరి 21న వీరి వివాహం జరిగింది. ఇప్పుడు ఈ జంట తమ బంధాన్ని చట్టపరంగా పదిలం చేసుకుంది.

గురుగ్రామ్‌లోని మ్యారేజ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుకు వెళ్లిన శిఖర్‌- సోఫీ తమ పెళ్లిని రిజిస్టర్‌ చేయించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ విషయం గురించి రిజిస్ట్రార్‌ ఆఫీసులో పనిచేసే ఓ అధికారి PTIతో మాట్లాడుతూ..

కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య
‘‘శిఖర్‌ ధావన్‌.. ఆయన భార్య బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మ్యారేజ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుకి వచ్చారు. దాదాపు ఏడుగురు కుటుంబ సభ్యులు, స్నేహితులు వారితో పాటు ఉన్నారు. దాదాపు 35 నిమిషాల్లో మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తైంది. వారికి మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ ఇచ్చి పంపించాము’’ అని సదరు అధికారి పేర్కొన్నారు.

ఆయేషాతో విడాకులు
కాగా టీమిండియా ఓపెనర్‌గా రాణించిన శిఖర్‌ ధావన్‌ గతంలో ఆయేషా ముఖర్జీ అనే ప్రవాస భారతీయురాలిని పెళ్లి చేసుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషాతో ఫేస్‌బుక్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీయగా.. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. డివోర్సీ అయిన ఆయేషాకు అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండగా.. శిఖర్‌ ధావన్‌తో కలిసి ఆమె కుమారుడు జొరావర్‌కు జన్మనిచ్చారు.

అయితే, అభిప్రాయ భేదాల కారణంగా శిఖర్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది ఆయేషా. ఇద్దరూ విడిపోయినట్లు ప్రకటించగా.. 2023లో ఢిల్లీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. ఈ క్రమంలో చాలాకాలం ఒంటరిగా ఉన్న శిఖర్‌ ధావన్‌.. ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్‌తో ప్రేమలో పడ్డాడు.

ఆమెతో బంధం ఇక చట్టబద్ధం
కొన్నాళ్లపాటు డేటింగ్‌ చేసిన ఈ జంట ఇటీవలే అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. తాజాగా తమ బంధాన్ని చట్టబద్ధం చేసుకుంది. కాగా శిఖర్‌ ధావన్‌ టీమిండియా తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 2315, వన్డేల్లో 6793, టీ20లలో 1759 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 222 మ్యాచ్‌లు ఆడిన గబ్బర్‌ రికార్డు స్థాయిలో 6768 పరుగులు సాధించాడు.

చదవండి: ‘నా నిర్లక్ష్యం... తెలివి తక్కువతనం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement