‘నా నిర్లక్ష్యం... తెలివి తక్కువతనం’ | David Warner Breaks Silence Accept responsibility Drink Driving case | Sakshi
Sakshi News home page

‘నా నిర్లక్ష్యం... తెలివి తక్కువతనం’

May 8 2026 2:42 PM | Updated on May 8 2026 2:58 PM

David Warner Breaks Silence Accept responsibility Drink Driving case

సిడ్నీలోమద్యం తాగి కారు నడిపిన నేరంపై ఇటీవల పోలీసులకు చిక్కిన  ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ తాను చేసిన పని పట్ల చింతిస్తున్నానని అన్నాడు. తన ప్రవర్తన పూర్తిగా ‘నిర్లక్ష్యపూరితం... తెలివి తక్కువతనం’ అని అతడు వ్యాఖ్యానించాడు. 

పరిమితికి మించి
తన మిత్రుడి ఇంటి వద్ద మద్యం సేవించిన అనంతరం స్వయంగా కారు నడిపిన వార్నర్‌... సిడ్నీ పోలీసుల తనిఖీ సాగుతుండటంతో ఆ స్థలానికి కాస్త ముందే కారు దిగి పరీక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే దీనిని గుర్తించిన పోలీసులు పరీక్ష నిర్వహించగా అతను పరిమితికి మించి మద్యం తీసుకున్నట్లు తేలింది. 

దాంతో కేసు బుక్‌ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ కేసు విషయంలో కోర్టులో వార్నర్‌ తరఫున అతని లాయర్‌ బాబీ హిల్‌ హాజరయ్యాడు. వార్నర్‌ తాను తప్పు చేసినట్లుగా అంగీకరిస్తున్నాడని, ఎలాంటి శిక్షకైనా సిద్ధమని హిల్‌ కోర్టులో వెల్లడించాడు. పరీక్షకు 11 నిమిషాల ముందే వార్నర్‌ 3 గ్లాస్‌ల వైన్‌ తీసుకున్నట్లు లాయర్‌ చెప్పాడు.  

పెద్ద తప్పు
‘చాలా మంది ఎన్నో తప్పులు చేస్తుంటారు. వాటిని అంగీకరించడమై సరైన పని. అసలు మద్యం సేవించాక టాక్సీలో వెళ్లకుండా నేను కారు నడపడం పెద్ద తప్పు. క్రికెటర్‌ అయినా, డాక్టర్‌ అయినా, ఏ వృత్తిలో ఉన్నా ఇలాంటి స్థితిలో ప్రమాదం వెంటాడుతూనే ఉంటుంది’ అని వార్నర్‌ తాను చెప్పదల్చుకున్న విషయాన్ని లాయర్‌ ద్వారా కోర్టు ముందుంచాడు. 

వార్నర్‌లో అపరాధ భావన ఉందని, క్రికెటర్‌ పేరుతో ఎలాంటి సడలింపులు అతడు కోరుకోవడం లేదని, న్యూసౌత్‌వేల్స్‌లోని ఇతర సామాన్య పౌరుల్లాగే తనకు శిక్ష వేయాలని వార్నర్‌ కోరుకుంటున్నట్లు లాయర్‌ స్పష్టం చేశాడు. ఈ కేసు జూన్‌ 24కు వాయిదా పడింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement