పాపం.. గర్ల్‌ఫ్రెండ్‌ చేసిన పనికి సిన్నర్‌ ఏమవుతాడో! | Jannik Sinner Girl Friend Watching Alcaraz Match Unexpected Twist | Sakshi
Sakshi News home page

పాపం.. గర్ల్‌ఫ్రెండ్‌ చేసిన పనికి సిన్నర్‌ ఏమవుతాడో!

Apr 8 2026 1:54 PM | Updated on Apr 8 2026 3:23 PM

Jannik Sinner Girl Friend Watching Alcaraz Match Unexpected Twist

ప్ర‌స్తుతం టెన్నిస్‌లో జానిక్ సిన్న‌ర్, కార్లోస్ అల్క‌రాజ్‌లు ఒక‌రితో ఒక‌రు పోటీ ప‌డ‌డం మ‌స్తు మ‌జాను అందిస్తుంది. ఈ ఇద్ద‌రు టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లో కొన‌సాగుతున్నారు. ఒక‌ప్పుడు నాద‌ల్‌, ఫెద‌ర‌ర్‌, జొకోవిచ్ మ‌ధ్య పోటీ ఎంత ర‌స‌వ‌త్తరంగా ఉండేదో అదే త‌ర‌హాలో ఇప్పుడు సిన్న‌ర్‌, అల్క‌రాజ్‌లు ఎక్క‌డ త‌ల‌ప‌డినా ఆ మ్యాచ్‌కు య‌మా క్రేజ్ ఉంటుంది. 

అయితే ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు మాంటే కార్లో మాస్ట‌ర్స్ టెన్నిస్ టోర్నీలో ఆడుతున్నారు. ప్రస్తుతం జానిక్ సిన్న‌ర్ డెన్మార్క్‌కు చెందిన మోడ‌ల్ లైలా హ‌స‌నోవిక్‌తో ల‌వ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. సిన్న‌ర్ ఏ టోర్నీ ఆడినా అక్క‌డ హ‌స‌నోవిక్ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యేది. అయితే తాజాగా మాంటే కార్లో టెన్నిస్ టోర్నీలో మాత్రం ఒక ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది.

హ‌స‌నోవిక్ త‌న ప్రియుడి మ్యాచ్‌కు కాకుండా సిన్న‌ర్ చిర‌కాల ప్ర‌త్య‌ర్థి అల్క‌రాజ్ మ్యాచ్‌కు హాజ‌ర‌వ్వ‌డ‌మే ఇక్క‌డ అతిపెద్ద ట్విస్ట్‌. టోర్నీలో భాగంగా అల్క‌రాజ్ తన తొలి మ్యాచ్‌లో సెబాస్టియ‌న్ బేజ్‌ను 6-1, 6-3తో ఓడించాడు. కేవ‌లం 70 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో హ‌స‌నోవిక్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా నిలిచింది. 

ఎందుకంటే అల్క‌రాజ్ ఆడుతున్నంత సేపు హ‌స‌నోవిక్ అత‌డిని క‌ళ్లార్ప‌కుండా చూసింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అంత‌క‌ముందు రోజు త‌న బాయ్‌ఫ్రెండ్ సిన్న‌ర్ మ్యాచ్‌కు కూడా హ‌స‌నోవిక్ హాజ‌ర‌య్యింది. 

కాగా తొలి రౌండ్ మ్యాచ్‌లో సిన్న‌ర్ 6-3, 6-0తో హ్యూగో హంబ‌ర్ట్‌ను సులువుగా ఓడించి రెండో రౌండ్‌లో అడుగుపెట్టాడు. మ‌రి ఈ ఇద్ద‌రు ఈ టోర్నీలో త‌ల‌ప‌డిన‌ప్పుడు హ‌స‌పనోవిక్ ఎవ‌రి ఆట చూస్తుందో తెలియ‌డానికి కొద్ది రోజులు ఆగాల్సిందే.

చదవండి: జైస్వాల్‌ బ్యాట్‌ వెనుక ఇంత కథ దాగుందా!

Advertisement
 
Advertisement
Advertisement