పాకిస్తాన్‌పై వార్నర్‌ ప్రేమ?.. హిజాబ్‌ ధరించిన కుమార్తెలు! | David Warner Daughters Wear Gharara and Hijab Pic Viral | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌పై వార్నర్‌ ప్రేమ?.. హిజాబ్‌ ధరించిన కుమార్తెలు!

May 2 2026 7:29 PM | Updated on May 2 2026 8:15 PM

David Warner Daughters Wear Gharara and Hijab Pic Viral

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. ఇటీవల అతడు ఐపీఎల్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చాన్నాళ్ల పాటు ఐపీఎల్‌లో ఆడి పేరుకు పేరు.. డబ్బు, అభిమానం దండిగా సంపాదించుకున్నాడు వార్నర్‌.

ఆరెంజ్‌ ఆర్మీకి ఫేవరెట్‌
ముఖ్యంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా 2016లో టైటిల్‌ అందించడంతో.. ఆరెంజ్‌ ఆర్మీకి ఫేవరెట్‌గా మారిపోయాడు వార్నర్‌. ఆ తర్వాత జట్టును వీడినా ఇప్పటికీ ఆరెంజ్‌ ఆర్మీ వార్నర్‌ను తమ వాడిలానే భావిస్తుంది. ఇక 2024లో చివరగా ఐపీఎల్‌ ఆడిన ఈ ఆసీస్‌ బ్యాటర్‌ను ఫ్రాంఛైజీలు పట్టించుకోలేదు.

దీంతో వార్నర్‌ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL)లో చేరాడు. ఈ ఏడాది కరాచీ కింగ్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, ఆరంభంలో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించినా.. ఆ తర్వాత వరుస పరాజయాల నేపథ్యంలో ప్లే ఆఫ్స్‌ చేరుకుండానే కరాచీ నిష్క్రమించింది.

పాక్‌ బోర్డుకు వార్నర్‌ ధన్యవాదాలు
ఈ నేపథ్యంలో కరాచీ కింగ్స్‌తో దిగిన ఫొటోలను షేర్‌ చేస్తూ.. చక్కటి ఆతిథ్యం ఇచ్చారంటూ పాక్‌ బోర్డుకు వార్నర్‌ ధన్యవాదాలు తెలిపాడు. ఇందుకు స్పందిస్తూ భారతీయ నెటిజన్‌ ఒకరు.. ‘‘పీఎస్‌ఎల్‌ను వదిలేసి.. ఐపీఎల్‌కు వచ్చేసెయ్‌’’ అని కామెంట్‌ పెట్టారు. ఇందుకు వార్నర్‌ ఘాటుగా స్పందించాడు. ‘‘ఇప్పుడు ఆ అవసరం ఏమీలేదు’’ అని పేర్కొన్నాడు.

దీంతో వార్నర్‌ పట్ల టీమిండియా, ఐపీఎల్‌ అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా వార్నర్‌ మరోసారి పాకిస్తాన్‌ పట్ల తన ప్రేమను చాటుకున్నాడు. తన కూతుళ్లలో ఇద్దరికి పాకిస్తానీ తరహా డ్రెస్సులు (ఘెరారా) వేసి మురిసిపోయాడు. అంతేకాదు ఇద్దరూ హిజాబ్‌ మాదిరి చున్నీ కూడా ధరించడం విశేషం.

హిజాబ్‌ ధరించిన కుమార్తెలు!
ఈ ఫొటోలను పంచుకుంటూ.. ‘‘పిల్లలకు సంప్రదాయ దుస్తులు ఇచ్చినందుకు హైదర్‌కు థాంక్యూ. తమకు తాముగా పిల్లలు ఇలా రెడీ అయ్యారు. ఫీడ్‌బ్యాక్‌ సూపర్‌గా ఉంది. మీ బెస్ట్‌ అవుట్‌ఫిట్‌ ఏమిటో జత చేయండి’’ అని వార్నర్‌ క్యాప్షన్‌ ఇచ్చాడు. ఈ దుస్తుల్లో తన కుమార్తెలు అత్యంత అందంగా ఉన్నారని కొనియాడాడు.

ఇందుకు బదులుగా... ‘‘పిల్లలు చక్కగా ఉన్నారు వార్నర్‌ భాయ్‌’’ అంటూ కొంతమంది కితాబులిస్తున్నారు. అయితే, మరికొందరు మాత్రం.. ‘‘ఇప్పుడు డ్రెస్సులు.. ఆ తర్వాత సంప్రదాయాలు.. కాస్త ఆలోచించు వార్నర్‌ భయ్యా.. తప్పుగా తీసుకోవద్దు.. కానీ జాగ్రత్తగా ఉండాలి’’ అని హెచ్చరిస్తున్నారు.  

వార్నర్‌పై ద్వేషం తగదు
ఇంకొందరేమో వార్నర్‌పై ద్వేషం తగదని.. ఐపీఎల్‌-2026 ఆరంభానికి ముందు.. సన్‌రైజర్స్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ.. ఆరెంజ్‌ ఆర్మీ పట్ల అతడు ప్రేమను చాటుకున్న తీరును గుర్తుచేస్తున్నారు. ఏదేమైనా వార్నర్‌ షేర్‌ చేసిన ఈ ఫొటో వైరల్‌గా మారింది.

కాగా డేవిడ్‌ వార్నర్‌- కాండిస్‌ దంపతులుకు ఇవీ మే, ఇండీ రే, ఇస్లా రోస్‌ అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. తమ వ్యక్తిగత విషయాలకు సంబంధించిన అప్‌డేట్లను వార్నర్‌, కాండిస్‌ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. 

చదవండి: ‘భారీ’ ధరకు అమ్ముడుపోయిన అర్జున్‌ టెండుల్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement