ఫార్ములా వన్ రేసులో రారాజులే ఎక్కువగా కనిపిస్తారు. మైకెల్ షుమాకర్, లూయిస్ హామిల్టన్, వెర్‌స్టాపెన్ వంటి ఎందరో దిగ్గజాలను ఫార్ములా వన్ రేస్ ప్రపంచానికి పరిచయం చేసింది. భారత్‌లో కూడా ఫార్ములా వన్ రేసుపై మక్కువ ఇటీవలే కాలంలో పెరిగిపోయింది. ఫార్ములా వన్ అబ్బాయిలే ఎక్కువగా ఇష్టపడతారనేది ఎక్కువగా వినిపిస్తుంది.
కానీ భారత్‌లో మాత్రం 11 ఏళ్ల అతికా మిర్ మాత్రం అబ్బాయిలకు ధీటుగా ఫార్ముల్ వన్‌లో దూసుకెళ్తోంది. యూరోపియన్ సర్క్యూట్‌లో అతికా మిర్ తన తొలి ప్రయత్నంలో (12 నుంచి 14 ఏళ్ల మధ్య) నిర్వహించే రేస్ కార్టింగ్‌లో అంచనాలకు మించి రాణించింది. అయితే రేసింగ్ ఇప్పటికీ పురుషాధిక్య క్రీడగానే ఉండడంతో తరచూ అబ్బాయిల చేతిలో బెదిరింపులకు గురయ్యేదానినని అతికా మిర్ చెప్పు కొచ్చింది.
అతికా మిర్ కేవలం తన ప్రతిభ ఆధారంగానే మినీ (8 నుంచి 12 ఏళ్లు) విభాగం నుంచి జూనియర్ (12 నుంచి 14 ఏళ్లు) వేగంగా పదోన్నతి పొందడమే గాక తన అద్భుతమైన రేసింగ్ నైపుణ్యంతో చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం భారత్ తరఫున అతికా మిర్ ప్రపంచ వేదికపై అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న భారతీయ కార్టర్‌గా మాత్రమే గాక, 40 వరకు ఉండే కార్ట్‌లు ఉండే రద్దీగా ఉండే గ్రిడ్‌లపై కూడా అతికా చాలా మంది పురుష రేసర్లను వెనక్కి నెట్టేయడం విశేషం.
జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి చెందిన అతికా మిర్ ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తోంది. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన మాక్స్ వెర్‌స్టాపెన్‌ను అతికా తన ఆరాధ్య దైవంగా భావిస్తోంది. అతికా మిర్ రేసింగ్ కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తండ్రి ఆసిర్ మిర్ భారత మొట్టమొదటి జాతీయ కార్టింగ్ చాంపియన్.
2021లో అబుదాబిలో జరిగిన ఫార్ములా వన్ సీజన్ ఫైనల్లో లూయిస్ హామిల్టన్, వెర్‌స్టాపెన్‌ల మధ్య జరిగిన అద్భుతమైన టైటిల్ పోరును చూసినత తర్వాత అతికా మిర్ రేసింగ్‌పై ఇష్టాన్ని పెంచుకుంది. మోటార్ రేసింగ్‌లో పురుషాధిక్యం మామూలే. అందుకే ఫార్ములా వన్‌లో మహిళలు కనిపించరు. కానీ నమ్మకం, ఆత్మవిశ్వాసం ఇవాళ నన్ను రేసింగ్‌ను కెరీర్‌గా ఎంచుకునేలా చేశాయి.
ట్రాక్‌పై అబ్బాయిలు వేధింపులకు గురైనప్పుడల్లా నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతూ పోయింది. 2021లో ఫార్ములా వన్ రేసు ఫైనల్ వీక్షించే వరకు నాకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. టీవీలో అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ ద్వారా రేసింగ్‌పై మక్కువ పెంచుకున్నా అని అతికా చెప్పుకొచ్చింది.
చదవండి: పంజాబ్ కింగ్స్‌లో లుకలుకలు!


