విద్యార్థులకు సహృదయ సేవ
వేసవి సెలవులు వృధా కాకుండా విద్యార్థులకు వివిధ కళల్లో శిక్షణ ఇస్తోంది స్థానిక సహృదయ మిత్ర మండలి. గత 25 ఏళ్లుగా స్థానిక ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ స్కూల్, రాజీవ్‌గాంధీ మున్సిపల్ హైస్కూళ్లలో, ఏడేళ్లుగా శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్, దేశభక్తి గీతాలు, పప్పెట్రీ, దస్తూరి, చిత్ర లేఖనం తదితర అంశాలను బోధిస్తూ వారి వేసవి సెలవులను సద్వినియోగం చేస్తున్నారు. వివిధ పోటీలు నిర్వహించి వారిలో సృజనాత్మకతను వెలికితీస్తూ ఆ సంస్థ ఎంతో కృషి చేస్తోంది. పిఠాపురం


