రాజమహేంద్రవరం సిటీ: ద వరల్డ్ ఫేవరెట్ జ్యువెలర్, జోయాలుక్కాస్, తమ రాజమహేంద్రవరం షోరూమ్‌ను తిరిగి ప్రారంభించినట్లు ఆ సంస్థ గ్రూప్ చైర్మన్, ఎండీ డాక్టర్ జోయా లుక్కాస్ ప్రకటించారు. శుక్రవారం ఈ షాపును రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పునః ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బ్రాండ్ ఎంతో ఆదరణ పొందిన, ఎదురుచూస్తున్న బ్రిలియన్స్ డైమండ్ జ్యూవెలరీ షోను నిర్వహించనున్నామన్నారు. ఇది కట్, అన్‌కట్ డైమండ్స్, విలువైన ఆభరణాల ప్రీమియం, ప్రత్యేకమైన కొత్త డిజైన్ల అద్భుతమైన ప్రదర్శన అని తెలిపారు. ఈ సందర్భంగా వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను అందిస్తోందన్నారు. బంగారం, వెండి, విలువైన రాళ్ల ఆభరణాలపై ఫ్లాట్ 40 శాతం తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపారు. రూ.1 లక్ష, అంతకంటే ఎక్కువ విలువైన డైమండ్ ఆభరణాల కొనుగోలుపై ఉచితంగా ఒక బంగారు నాణెం పొందవచ్చునన్నారు. ఈ ఆఫర్లు మే 24 వరకు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి సేకరించిన అద్భుతమైన క్లాసిక్ నగల సమాహారం, సరికొత్త డిజైన్‌న్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.


