అంబాజీపేట: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి రేకుల షెడ్డులో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఇసుకుపూడి మెరకపేటకు చెందిన బాల రమేష్ (50) రాజమహేంద్రవరంలో ఓ ప్రైవేటు సంస్థలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 6వ తేదీన అక్కడి నుంచి మెరకపేటకు వచ్చి ఆర్థిక ఇబ్బందులతో కలత చెందుతూ ఈ నెల 11న తన ఇంటి వెనుక ఉన్న రేకుల షెడ్డులో ఉరి వేసుకున్నాడన్నారు. సమీప బంధువు చూసి రాజమహేంద్రవరంలోని రమేష్ భార్యకు సమాచారం అందించారన్నారు. మృతుడికి భార్య, ఇరువురు కుమార్తెలు ఉన్నారన్నారు. మృతుడి భార్య వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


