బాలాజీచెరువు (కాకినాడ): సీబీఎస్‌ఈ ప్రకటించిన ప్లస్ – 2 ఫలితాల్లో శ్రీ ప్రకాష్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి మంచి ఫలితాలు సాధించారని ఆ విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయ ప్రకాష్ తెలిపారు. ఎంఈఏ గ్రూపులో కె.లాస్య మేఘన 479/500, బైపీసీలో బి.స్పృహ 471/500, ఎంపీసీలో వి.లక్ష్మీనారాయణ 454/500, బీఈఏలో కె.అన్విత 420/500 మార్కులు సాధించి అగ్రస్థానాల్లో నిలిచారన్నారు. నూటికి నూరుశాతం ఉత్తీర్ణతా శాతంతో తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారన్నారు. ఆ విద్యార్థులను విద్యాసంస్థల అధినేత సీహెచ్‌వీకే నరసింహారావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.
15న కాకినాడలో ధర్నా
రాయవరం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దివ్యాంగుల సమస్యలను జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అధికారులు గాలికి వదిలేస్తున్నారని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖండవిల్లి భరత్ కుమార్ విమర్శించారు. ఆయన బుధవారం వెంటూరులో మాట్లాడుతూ వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ సంఘ తరఫున అనేకసార్లు విన్నవించినా ఫిర్యాదులను కార్యాలయ అధికారులు బుట్టదాఖలు చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని దివ్యాంగులు కాకినాడలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయం వద్ద ఈ నెల 15న జరిగే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కె.లాస్య మేఘన
బి.స్పృహ
వి.లక్ష్మీనారాయణ
కె.అన్విత


