ప్రభుత్వ అరాచకం ఎంతోకాలం సాగదు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ అరాచకం ఎంతోకాలం సాగదు

May 14 2026 12:31 AM | Updated on May 14 2026 12:31 AM

పెరవలి (కొవ్వూరు): రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని కొవ్వూరు వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పేర్కొన్నారు. వైఎస్సార్‌ సీపీ కర్నూలు పట్టణ యువజన విభాగం కన్వీనర్‌ బాలును పోలీసులు స్టేషన్‌కు రావాలని బలవంతం చేయటం దారుణమని అన్నారు. ఆ ఘటనఫై కొవ్వూరులోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బుధవారం నిరసన తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బాలుపై గతంలో బనాయించిన అక్రమ కేసు గురించి కోర్టుకు వస్తే అక్కడ పోలీసులు స్టేషన్‌కు రావాలని బలవంతం చేయటం ఏమిటని ప్రశ్నించారు. వైఎస్సార్‌ సీపీ శ్రేణులు అడ్డగించకపోతే బాలుపై మరో కేసు పెట్టటానికి సిద్ధపడేవారని ఈ అరాచకం ఎంత కాలమన్నారు. రెండేళ్లుగా మా పార్టీ శ్రేణులపై అనేక కేసులు బనాయించారని వీటికి భయపడబోమని, కోర్టు ద్వారా ఎదుర్కొంటామన్నారు. కక్ష సాధింపు చర్యలు మానుకొని, ఎన్నికల హామీలను ఎలా అమలు చేయాలో చూసుకోవాలని హితవు చెప్పారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా యూత్‌ ప్రెసిడెంట్‌ కంఠమని రమేష్‌, వాడపల్లి సురేష్‌, చాగల్లు యూత్‌ ప్రెసిడెంట్‌ మద్దిపాటి సురేష్‌, విద్యా విభాగ అధ్యక్షుడు మజ్జి వంశీ పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు

Advertisement
 
Advertisement
Advertisement