టిప్పర్‌ దగ్ధం | - | Sakshi
Sakshi News home page

టిప్పర్‌ దగ్ధం

May 10 2026 8:16 AM | Updated on May 10 2026 8:16 AM

గోకవరం: గుమ్మళ్లదొడ్డి సమీపంలో 516ఈ జాతీయ ప్రధాన రహదారిపై శనివారం రాత్రి కంకరలోడుతో వెళుతున్న టిప్పర్‌ దగ్ధమైంది. పోలవరం జిల్లా రంపచోడవరం మండలం నరసాపురంలోని ఓ క్రషర్‌ నుంచి కోనసీమ జిల్లా పి.గన్నవరానికి కంకరలోడుతో ఈ లారీ వెళుతోంది. గుమ్మళ్లదొడ్డికి వచ్చేసరికి వెనుక టైరు నుంచి మంటలు రావడాన్ని డ్రైవర్‌ గుర్తించి లారీ నిలిపివేశాడు. అనంతరం మంటలు విపరీతంగా వ్యాపించాయి. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న కోరుకొండ అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు. అనంతరం ఎస్సై పవన్‌కుమార్‌ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement