కాకినాడ రూరల్: కాకినాడ ఏటిమొగ వద్ద రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ (ఎస్‌ఐఎఫ్‌టీ)లో పడవ (బోటు) యజమానులు, సిబ్బందికి మరమ్మతులు, నిర్వహణపై మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ తరగతులు శనివారంతో ముగిశాయి. తీర ప్రాంత జిల్లాలకు చెందిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ జిల్లాలకు చెందిన 23 మంది శిక్షణలో పాల్గొన్నట్టు ఎస్‌ఐఎఫ్‌టీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.అంజలి తెలిపారు. ఇంజిన్ల మరమ్మతులు, నిర్వహణ, సముద్ర భద్రతా చర్యలు, యంత్రాల పనితీరు మెరుగుదలపై శిక్షణ పొందారన్నారు. అనంతరం శిక్షణలో పాల్గొన్న వారందరికి సర్టిఫికెట్లను అందజేశారు.


