క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిత | - | Sakshi
Sakshi News home page

క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిత

May 11 2026 7:56 AM | Updated on May 11 2026 7:56 AM

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కాకినాడ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వి.సతీష్‌ కుమార్‌ తెలిపారు. ఆదివారం కాకినాడ శ్రీనగర్‌ స్కూల్‌లో తైక్వాండో క్రీడాకారులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్‌డీఓ సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో జరిగిన 5వ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచారన్నారు. తైక్వాండో సంఘ కార్యదర్శి బి.అర్జునరావు మాట్లాడుతూ ఈ పోటీల్లో 10 బంగారు, 12 రజత, 18 కాంస్య పతకాలు సాధించి ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌లో మూడో స్థానం అందుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో తైక్వాండో సంఘ ప్రతినిధులు సత్యనారాయణ, అన్నవరం కేవీ సత్యనారాయణ, పి.త్రిమూర్తులు, అరుణ, దుర్గా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement